Friday, February 9, 2018

*మీన లగ్నము*

మీనలగ్నమునకు కుజగురులు రాజయెాగకారకులగుదురు గురుడు ఉభయకేంద్రాధిపతియైనను లగ్నాధిపతియు దశమకేంద్రాధిపతియు నగుటచే అట్టిగురుడు విశేషముగా యెాగించును.ఈ గురుడు కుజునితో గలిసి కేంద్రకోణములయందున్న గొప్పజాతకమగును.లేనచో వాహన ముద్రాధికారముగల యుద్యోగము చేయును.చంద్రుడు పంచమకోణధిపతి యగుటచేత కుజగురులవలె అఖండయెాగము నిచ్చును.గనుక మీనలగ్నమునకు కుజగురుచంద్రులలో ఎవరు కలిసియున్నను  మిక్కిలి రాజయెాగము గలుగును.
బుధుడు ఉభయకేంద్రాధి పతియగుట వలన లగ్నముగాక తక్కిన కేంద్రకోణములయందు ఫలించును.తక్కిన రవి శుక్రశనులు ఏస్థానమందున్నను ఫలించవు.
రవిచంద్రులు కలిసిన  రవిదశ యెాగించునుగాని చంద్రదశ యెాగించదు.రవికుజులు గలిసిన యెడల రవిదశ యెాగించును.కుజదశ యెాగించును.కుజదశలో  ఋణగ్రస్తుడై భూమినంతయు ఖర్చుపెట్టును.
రవిబుధులు గలిసిన రవిదశ స్వల్పముగా యెాగించును.బుధదశ యెాగించదు.బుధదశలో శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.
రవిగురులు గలిసిన రవిదశ యెాగించును.గురుదశ ఫలించదు.గురుదశ ఉద్యోగభంగము శరీరపీడ ధనవ్యయము కలుగును.
రవిశుక్రులు కలిసియున్న రెండుదశలు యెాగించవు.శత్రురోగ ఋణములు హెచ్చుగానుండును అనేక కష్టములు గలుగును.
రవిశనులు కలిసిన దరిద్రుడగును.వ్యవహారపు చిక్కులు వలన విశేష వ్యయమగును.అప్పులు గూడ దొరుకుట దుర్లభము.
చంద్రకుజులు గలిసిన విశేష ధనజాతకమగును.రెండుదశలు అఖండముగా యెాగించును.చంద్రదశలో సంతాననష్టము గలుగును.కుజదశలో ఫలించును.
చంద్రబుధులు కలిసిన రెండుదశలును గూడ బాగుగా ఫలించును.స్త్రీ సంతానముండును.
చంద్ర గురులు గలిసిన యెడల రెండుదశలు గూడ అఖండగా ఫలించును.మిక్కిలి అదృష్టవంతులయిన సంతానము బడసి వారివలన సౌఖ్యమును బొందును.
చంద్రశుక్రులు గలిసిన యెడల శుక్రదశ ఫలించును.గాని చంద్రదశ ఫలించదు.చంద్రదశలో వ్యవహార చిక్కులును,సంతాన విచారమును గలుగును.
చంద్ర శనులు గలిసిన యెడల శనిదశ కొంత వరకు యెాగించును.చంద్రదశ యెాగించదు.సంతానము నిలుచుట కష్టము.
కుజు బుధులు గలిసిన యెడల రెండు దశలు ఫలించును.స్త్రీ సంబంధమైన భూమి కొంక కలియును.కళత్రము రోగపీడితురాలగును.లేనితో మశూచికాది బాధలు కలుగును.
కుజశనులు గలిసిన శనిదశ స్వల్పముగా ఫలించును.గాని కుజదశ ఫలించదు.సంతాన విచారము గలుగును.
బుధగురులు గలిసిన రెండు దశలుగూడ ఫలించును.గాని పంచమ నవమ కోణములయందు బుధగురులు గలిసిన అఖండ ఫలము గలుగును.
బుధశుక్రులు గలిసిన యెడల శక్రదశ స్వల్పముగా యెాగించును.బుధదశ యెాగించదు
బుధశనులు గలిసిన శనిదశ స్వల్పముగా యెాగించును.బుధదశలో శరీరపీడ కళత్ర విచారము మెుదలగునవి గలుగును.రెండు దశలును మారకలక్షణములు గలిసియుండును.
గురుశుక్రులు గలిసిన యెడల శుక్రదశ యెాగించును.కాని గురుదశ యెాగించదు.గురుదశలో వ్యవహారపు చిక్కులు శరీరపీడ ధనవ్యయము మెుదలగునవి గలుగును.
గురుశనులు గలిసిన శనిదశ యెాగించును.గురుదశ యెాగించదు.గురుదశలో శరీరపీడ ధనవ్యయము శతృవృద్ధి మెుదలగునవి గలుగును.
శుక్రశనులు గలిసిన రెండు దశలు ఫలించవు కళత్రవిచారము,ధనవ్యయము,వ్యవహారపు చిక్కులు కలుగును.
*మీనాది రవి ఫలము*

మీనలగ్నమునకు రవిషష్ఠాధిపతి యగుటచేత ఏస్థానమందున్నను ఫలించదు.
మీనలగ్నమై లగ్నమందు రవియున్న శరీర పీడ ధనవ్యయము మెుదలగునవి గలుగును.ఈ రవిదశ  ఫలించదు.కాని రూపవంతుడు ఖ్యాతిగల పురుషుడు అగును.
ద్వితీయమందు రవియున్న యెడల యెంత ధనమార్జించినను నిలువదు.ఈ రవిదశలో స్వల్పముగా శరీరమునకు నలత జేయును.
చతుర్థమందు రవియున్న విద్య,భూమి,వాహనము స్వల్పముగా నుండును.ఈ రవిదశ స్వల్పముగా ఫలించును.
పంచమమందు రవియున్న సంతానసౌఖ్యముండదు గాని.రవిదశ బాగుగా యెాగించును.
షష్ఠమమందు రవియున్న రవిదశ యెాగించదు గాని మెుత్తము మీద జాతకునకు ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
సప్తమమందు రవియున్న యెడల ఆరోగ్యభంగము కళత్రమూలక విచారములు,నష్టప్రాప్తి.స్వజనవిరోధము.రవిదశ  మిశ్రమ ఫలితాలనిచ్చును.
అష్టమమందు రవియున్న  ఈ రవిదశ యెాగించదు.అనేక కష్టములు గలుగును.
నవమమందు రవియున్న రవిదశ బాగుగా యెాగించును.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
దశమమందు రవియున్న యెడల ఈ రవిదశ బాగుగా యెాగించును.ధనము స్వల్పముగాను,ఖ్యాతివిశేషము గాను నుండును.
ఏకాదశమందు రవియున్న యెడల స్వల్పముగా యెాగించును.శత్రువులవలన కొంతబాధ కలిగి జయమును బొందును.
ద్వాదశమందు రవియున్న రవిదశ యెాగించదు.శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.
*మీనాది చంద్ర ఫలము*

మీన లగ్నమునకు చంద్రుడు పంచమ కోణాధిపతి యగుటచేత యే స్థానమందున్ననూ యెాగించును.పూర్ణచంద్రుడైన అఖండయెాగము గలుగును.
మీనము లగ్నమై లగ్నమందు పూర్ణచంద్రుడున్న చంద్రదశలో అఖండయెాగము గలుగును. మెుత్తమీద ఈ జాతకుడు మిక్కిలి పేరు ప్రతిష్ఠలు గలవాడు యెాగ్యుడు అగును. క్షీణచంద్రుడున్న ఈ చంద్రదశ స్వల్పముగా యెాగించును.స్వల్పముగా సంతాన విచారము గలుగును.
ద్వితీయమందు పూర్ణచంద్రుడున్న యెడల విశేషధనవంతుడై మిక్కిలి ఖ్యాతిగల పురుషుడగును.క్షీణచంద్రుడైన స్వల్పముగా ధనము నిలువయుండును.ఈ చంద్రదశ సామాన్యముగా యెాగించును.
తృతీయమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి ప్రఖ్యాతి గల సంతానముండును.ఈ చంద్రదశ విశేషముగా యెాగించును.మిక్కిలి భాగ్యవంతుడగును.క్షీణచంద్రుడైన స్వల్పముగా యెాగించును.
చతుర్థమందు పూర్ణచందుడున్న విద్యభివృద్ధి భూలాభము,వాహనసౌఖ్యము మాతృసౌఖ్యము మెుదలగునవి గలుగును.ఈ చంద్రదశ పూర్తిగా యెాగించును.క్షీణచంద్రుడున్న యెడల స్వల్పముగా యెాగించును.విద్యాభివృద్ధి మెుదలగునవి స్వల్పముగా నుండును.
పంచమమందు పూర్ణచంద్రుడున్న ఈ దశబాగుగా యెాగించును.మంచి సంతానముండును.క్షీణచంద్రుడున్న యెడల సంతాన నష్టముండును చంద్రదశ స్వల్పముగా యెాగించును.
షష్ఠమమందు చంద్రుడున్న చంద్రదశ స్వల్పముగా యెాగించును.క్షీణచంద్రుడున్న చంద్రదశ యెాగించదు.శత్రురోగఋణములు సామాన్యము.
సప్తమమందు పూర్ణచంద్రుడున్న యెడల ఈ చంద్రదశ బాగుగా యెాగించును.కళత్రము రూపవంతురాలగును.క్షీణచంద్రుడున్న యెడల ఈ చంద్రదశ స్వల్పముగా యెాగించును.
అష్టమమందు పూర్ణచంద్రుడున్న చంద్రదశ స్వల్పముగా యెాగించును.క్షీణచంద్రుడున్న యెాగించదు.
నవమమందు పూర్ణచంద్రుడున్న చంద్రదశ  యెాగించదు.సంతాన విచారము గలుగును.క్షీణచంద్రుడున్న చొత్తిగా యెాగించదు.
దశమమందు పూర్ణచంద్రుడున్న  మిక్కిలి ఆచారవంతుడై తీర్థయాత్ర వగైరాలు చేయును.ఈ చంద్రదశ  అఖండముగా యెాగించును.క్షీణచంద్రుడున్న ఆచారము స్వల్పముగా నుండును.ఈ చంద్రదశ  స్వల్పముగా యెాగించును.
లాభమందు పూర్ణచంద్రుడున్న విశేష ధనమార్జించును.తీర్థయాత్రలు చేయును.క్షీణచంద్రుడున్న స్వల్పముగా యెాగించును.అన్యాయముగా ధనమార్జించును.
ద్వాదశమందు పూర్ణచంద్రుడున్న  ధర్మకార్యములు విశేషముగా చేయును.కొంత నలతజేయును.క్షీణచంద్రుడైనచో ఈచందదశ యెాగించదు సంతాన విచారము గలుగును.
*మీనాది కుజ ఫలము*

మీనలగ్నమునకు కుజుడు ధనభాగ్యధి పతియగుటచే ఏస్థానమందున్నను.మిక్కిలి యెాగము నిచ్చును.
మీనలగ్నమై లగ్నమందు కుజుడున్న ఈ కుజుదశ  బాగుగా యెాగించును.శరీర సౌఖ్యము స్వల్పముగా నుండును.
ద్వితీయమందు కుజుడున్న కుజదశ యెాగించును.గాని కుటుంబసౌఖ్యము స్వల్పముగా నుండును.
తృతీయమందు కుజుడున్న కుజదశ యెాగించదు.అధికారములేని స్వల్పఉద్యోగముండును.
చతుర్థమందు కుజుడున్న  యెాగించును.శత్రువుల వలన వారసుల వలన భూలాభముగలుగును.విద్యభూమి వాహనము మాతృసౌఖ్యము స్వల్పముగా నుండును.
పంచమమందు కుజుడున్న కుజదశ అఖండముగా యెాగించును గాని సంతానము కొంచెము నష్టమగును.
షష్టమందు కుజుడున్న వ్యవహారపు చిక్కులు గలిగి ఈ కుజదశలో యెాగభంగము గలుగును.
సప్తమమందు కుజుడున్న కుజదశ యెాగించును.గాని కళత్రమునకు  స్వల్పముగా నష్టము గలుగును.
అష్టమమందు కుజుడున్న పితృభాగ్యమంతయూ నశించును.కళత్రసౌఖ్యముండదు.
నవమమందు కుజుడున్న గొప్పవుద్యోగము చేయు జాతకముగాని,విశేష భూజాతకము గాని అగును.ఈ కుజదశ అఖంజడముగా యెాగించును.
దశమమందు కుజుడున్న కుజదశ అఖండముగా యెాగించును ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును విశేష భూజాతకమగును.
ఏకాదశమందు కుజుడున్న యెడల ఈ కుజదశ విశేషముగా యెాగించును.విశేషభూజాతకమగును.
వ్యయమందు కుజుడున్న కుజదశ యెాగించదు.కళత్ర విచారము ధనవ్యయము మెుదలగునవి కలుగును.
*మీనాది రాహు ఫలము*

మీనము లగ్నమే లగ్నమందు రాహువున్న యెడల ఈ రాహుదశ యెాగించదు.శత్రు రోగ ఋణములు హెచ్చుగా నుండును.
ద్వితీయమందు రాహువున్న యెడల ఈ రాహుదశలో శరీర పీడ చేయును.ధనము నిలువకపోయినను అర్జన విశేషముగా నుండును.ఈ రాహుదశ బాగుగా యెాగించును.
తృతీయమందు రాహువున్న యెడల ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.ఈ రాహుదశ అఖండముగా యెాగించును.
చతర్థమందు రాహువున్న యెడల ఈ రాహుదశ యెాగించును.గాని మాతృసౌఖ్యము విద్యభూమి వాహనము యివి స్వల్పముగా నుండును.
పంచమమందు రాహువున్న రాహుదశ యెాగించును.
షష్టమమందు రాహువున్న రాహుదశ యెాగించదు.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
సప్తమమందు రాహువున్న రాహుదశ స్వల్పముగా యెాగించును గాని కళత్ర విచారము శరీరపీడ  స్వల్పముగా నుండును.
అష్టమమందు రాహువున్న దశయెాగించదు.శత్రురోగఋణములు హెచ్చు.
నవమమందు రాహువున్న రాహుదశ యెాగించదు.కుటుంబసంబంధమైన వ్యవహార చిక్కులు గలుగును.
దశమమందు రాహువున్న రాహుదశ యెాగించదు.స్వల్పముగా తీర్థయాత్రలు చేయును.
ఏకాదశమందు రాహుదశ స్వల్పముగా యెాగించును.కాని అన్యాయముగా ధనమార్జించును.
ద్వాదశమందు రాహువున్న రాహుదశ యెాగించదు.దుర్జనసహవాసము దుర్వ్యయము చేయును,వ్యవహారపు చిక్కులు గలిగి అమానుషము గలుగును.
*మీనాది గురు ఫలము*

మీనలగ్నమునకు గురుడులగ్న రాజ్యాధిపతి యగుట చేత ఉభయకేంద్రాధిపతియైనప్పటికి కేంద్రకోణములు యందున్న విశేషయెాగము నిచ్చును.సప్తమకేంద్రమందున్న మారకము నిచ్చును.ద్వితీయషష్టావ్యయముల యందున్న సామాన్యయెాగము నిచ్చును.లగ్న,పంచమ,నవమ కోణములయందు విశేషయెాగము గలుగును.
మీనము లగ్నమై లగ్నమందు గురుడున్న ఖ్యాతిగల పురుషుడు.దేహదారుఢ్యము గలవాడు,విద్యవినయ సంపన్నుడు అగును.ఈ గురుదశ విశేషయెాగము నిచ్చును.
ధనస్థానమందు గురుడున్న గురుదశలో స్వల్పముగా శరీరపీడ జేయును.కాని మిక్కిలి ధనము సంపాదించి నిలవజేయును.
తృతీయమందు గురుడున్న యెాగించదు.శత్రురోగ ఋణములు హెచ్చు సోదరీవృద్ధి బాగుగా నుండును.
చతుర్థమందు గురుడున్న పండితుడు మాతృదీర్ఘాయుర్దాయము గలుగును.భూజాతకుడు అగును ఈ గురుదశ బాగుగా యెాగించును.
పంచమమందు గురుడున్న గురుదశ అఖండముగా యెాగించును.మిక్కిలి మేధావి పండితుడు అగును.విశేష ప్రఖ్యాతిగల పురుషుడును అగును.
షష్ఠమమందు గురుడున్న యెాగించదు శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.
సప్తమమందు గురుడున్న మిక్కిలి పతివ్రతయగు భార్యకలవాడగును.ఈ గురుదశ స్వల్పముగా యెాగించును.గాని శరీరమునకు స్వల్పముగా నలత జేయును.
అష్టమమందు గురుడున్న మిక్కిలి దరిద్రుడగును.ఈ గురుదశ యెాాగించదు.
నవమమందు గురుడున్న మిక్కిలి భాగ్యవంతుడగును.భూములు విశేషముగా నుండును.పిత్రార్జితము స్వర్జితము హెచ్చు.ఈగురుదశ అఖండముగా  యెాగించును.
దశమమందు గురుడున్న శిష్టాచారము గలవాడు గౌరవమైన వృత్తి వలన జీవించువాడు,రాజసన్మానము గలవాడు అగును.ఈ గురుదశ విశేష యెాగ్యము నిచ్చును.
లాభమందు గురుడున్న గురుదశ యెాగించదు.సుఖములేని జాతకమగును.
వ్యయమందు గురుడున్న అనేక తీర్థయాత్రలు చేయును.ధర్మకార్యములకై ధనవ్యయమగును.
*మీనాది శని ఫలము*

మీనలగ్నమునకు శనిలాభవ్యయాధిపతి యగుట చేత యేస్థానమందున్నను యెాగించదు.
మీనలగ్నమై లగ్నమందు శనియున్న సౌఖ్యము లేనివాడు లోభి అగును.ఈ శనిదశ స్వల్పముగా యెాగిమచును.
ద్వితీయమందు శనియున్న బాగుగా యెాగించును.ధనము నిలవకపోయినను సంపాదన విశేషముగా నుండును.
తృతీయమందు శనియున్న ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.శనిదశ అఖండముగా యెాగించును.
చతుర్థమందు శనియున్న శనిదశ యెాగించును గాని మాతృసౌఖ్యము,విద్య,వాహనము తక్కువగా నుండును.
పంచమమందు శనియున్న యెడల ఈ శనిదశ స్వల్పముగా యెాగించును.గాని సంతాన విచారము గలుగును.
షష్ఠమమందు శనియున్న యెడల ఈ శనిదశ యెాగించదు.శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.
సప్తమమందు శనియున్న యెడల ఈ శనిదశలో కళత్రమునకు గాని జాతకునకుగాని మారకము గలుగును.
అష్టమమందు శనియున్న యెడల ఈ శనిదశ యెాగించును గాని లాభవ్యయములు సమానముగా నుండును.
భాగ్యమందు శనియున్న యెడల పితృసౌఖ్యముండదుగాని శనిదశ స్వల్పముగా యెాగించును.
దశమమందు శనియున్న యెడల జాతకుడు లోభియగును,విశేషధనము సంపాదించును ఈ శనిదశ యెాగించును.
ఏకాదశమందు శనియున్న యెడల ఈ జాతకుడు లోభియగును.విశేష యెాగము నిచ్చును.
వ్యయమందు శనియున్న యెడల తీర్థయాత్రలు విశేషముగా జేయును.అనవసరముగా ధనవ్యయము చేయును.ఈ శనిదశ యెాగించదు .   *మీనాది బుధ ఫలము*

మీనలగ్నమునకు బుధుడు ఉభయకేంద్రాధిపతి యగుటచేత మారకస్థానములయందున్న స్వల్పముగా యెాగించును.పంచమ నవమ కోణములయందున్న బుధదశలో నష్టములు గలుగుటయేకాక విశేషముగా శరీరపీడ జేయును.
మీనలగ్నమై లగ్నమందు బుధుడున్న యెగించదు.కళత్రసౌఖ్యముండదు.సామాన్య విద్యావంతుడగును.
ద్వితీయమందు బుధుడున్న యెడల యితర గ్రహములు లేకుండిన ఈ బుధదశలో మారకము జరుగును.
తృతీయమందు బుధుడున్న యెడల ఈ బుధదశ యెాగించదు పిరికి స్వభావము గలవాడును.
చతుర్థమందు బుధుడున్న మాతృసౌఖ్యము విద్య,భూవి సంపూర్తిగానుండును.ఈ బుధదశ యెాగించును.
పంచమమందు బుధుడున్న ఈ బుధదశ బాగుగా యెాగించును.స్త్రీ దేవత ఉపాసన గలవాడగును.
షష్టమమందు బుధుడున్న  కళత్రము రోగపీడితురాలగును.ఈ బుధదశ  యెాగించదు.
సప్తమమందు బుధుడున్న కళత్రము యెాగ్యురాలగునుగాని,జాతకునకు బుధదశలో ఉత్తరఖండ మందు మారకము జరుగవచ్చును.
అష్టమమందు బుధుడున్న బుధదశ యెాగించదు.కళత్ర సౌఖ్యము తక్కువగా నుండును.సామాన్య యెాగజాతకమగును.
నవమమందు బుధుడున్న యెడల యెాగించును.మిక్కిలి భూజాతకముగును.
దశమమందు బుధుడున్న ఈ బుధదశ యెాగించును.స్వతంత్రవృత్తవలన జీవించును.
ఏకాదశమందు బుధుడున్న బుధదశ పూర్తిగా యెాగించును.వాణిజ్యము వలన విశేషధన మార్జించును.
ద్వాదశమందు బుధుడున్న బుధదశ యెాగించదు.జ్ఞాతులతో విరోధము వ్యవహారపు చిక్కులు వానివలన ధనవ్యయము కలుగును కళత్రసౌఖ్యము తక్కువ.
*మీనాది కేతు ఫలము*

మీనలగ్నమై లగ్నమందు కేతువున్న పారమార్జిక చింతకలవాడు,బట్టతలగలవాడ అగును.ఈ కేతుదశ స్వల్పముగా యెాగించును
ద్వితీయమందు కేతువున్న కేతుదశ యెాగించదు.శరీరపీడ చేయును.ఎంతధనమార్జించినను నిలువదు.
తృతీయమందు కేతువున్న స్వల్పముగా యెాగించును.వితంతు సోదరి వలన భాగ్యవృద్ధి గలుగును.
చతుర్థమందు కేతువున్న కేతుదశ యెాగించదు విద్యావిఘ్నము,మాతృవిచారము,ధనవ్యయము గలుగును.
పంచమమందు కేతువున్న కేతుదశ యెాగించును.సంతాన విషయంగా చింత ఉండును.
షష్ఠమమందు కేతువున్న శత్రువు రోగఋణములు అధికముగా ఉండును.
సప్తమమందు కేతువున్న శరీరపీడ కళత్రవిచారము గలుగును.ఈ కేతుదశ యెాగించదు.
అష్టమమందు కేతువున్న కేతుదశ యెాగించదు.జాతకుడు మిక్కిలి దరిద్రమును,కష్టములను అనుభవించును.
నవమమందు కేతువున్న యెడల ఈ కేతుదశ విశేషయెాగమిచ్చును.ఆయుర్భగ్యములు సంపూర్ణముగా నుండును.
దశమమందు కేతువున్న కేతుదశ స్వల్పముగా యెాగించును.పరమార్ధిక చింత గలవాడగును.
ఏకాదశమందు కేతువున్న కేతుదశలో అన్యాయముగా ధనమార్జన చేయును.
ద్వాదశమందు కేతువున్న తీర్థయాత్రలు విశేషముగా జేయును.విశేషవ్యయమగును.పారమార్థిక చింత గలవాడగును.
*మీనాది శుక్ర ఫలము*

మీనలగ్నమునకు శుక్రుడున్న తృతీయాష్టమాధిపతియగుటచే యేస్థానముదున్నను యెాగించదు.
మీనలగ్నమై లగ్నమందు శుక్రుడున్న ఈ శుక్రదశ యెాగించును.జాతకుడు మిక్కిలి పేరు ప్రతిష్ఠలు గలవాడగును.విద్యావినయ సంపన్నుడును నగును.
ద్వితీయమందు శుక్రుడున్న యెంత ధనమార్జించిన నిలువదు.ధనమార్జించును.గాని కుటుంబవృద్ధి ఖర్చు యెక్కువగును.
తృతీయమందు శుక్రుడున్న శుక్రదశ యెాగించును.సోదరీ భాగ్యము హెచ్చుగా నుండును.
చతుర్థమందు శుక్రుడున్న మాతృసౌఖ్యము,విద్య,భూమి వాహనము బాగుగా నుండును.ఈ శుక్రదశ కొంత యెాగించును.
పంచమందు శుక్రుడున్న సంతాన నష్టమగును.ఈ శుక్రదశ స్వల్పముగా మధ్య మధ్య యెాగించును.
షష్ఠమందు శుక్రుడున్న శుక్రదశ యెాగించదు సోదర సోదరీలతో వైరము గలుగును.
సప్తమమందు శుక్రుడున్న సోదరనష్టము గలుగును స్వల్పముగా శరీరమునకు నలత జేయును.ఈ శుక్రదశ యెాగించదు.
అష్టమమందు శుక్రుడున్న ఆయుర్వృద్ధి విశేషముగా నుండును.ఈ శుక్రదశ యెాగించును.
భాగ్యమందు శుక్రుడున్న శుక్రదశ బాగుగా యెాగించును.కళత్రము దుష్టస్వభావము గలదగును.
దశమమందు శుక్రుడున్న డాంబికమైన ఆచారము గలవాడును.ఈ శుక్రదశలో రాజసన్మానము గలుగును.
ఏకాదశమందు శుక్రుడున్న శుక్రదశ యెాగించును విశేషధనము సంపాదించును.
వ్యయమందు శుక్రుడున్న తీర్థయాత్రలు ధర్మకార్యములు విశేషముగా చేయును.

1 comment:

  1. Nice blog thanks for sharing with us... It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.

    ReplyDelete