తులాలగ్నమునకు బుధచంద్రులు లిరువురును గలసినను లేక ఒకరియింట మరియెుకరున్నను లేక ఒకరినొకరు చూచినను రెండుదశలను గూడ పూర్తిగా యెాగించును.
రవిచంద్రులు గలిసినయెడల రవిదశపూర్తిగా యెాగించును.చంద్రదశ స్వల్పముగా యెగించును.
రవికుజులు కలిసిన మిక్కిలి ధనము సంపాదించినిలువ జేయును.ఆరవికుజులలో చంద్రుడు గలిసిన వేలకొలది ధనము నిలువయుండును.
రవిబుధులు గలిసిన రవిదశలో విశేష భాగ్యమనుభవించును.బుధదశలో మధ్యమధ్య యెాగములు గలుగును.
రవిగురులు గలిసిన గురుదశ స్వల్పముగా యెాగించును.రవిదశలో ఋణములు పెరిగి పిత్రార్జితము స్వార్జితము గూడ ఖర్చు పెట్టును.
రవిశుక్రులు గలిసిన రెండుదశలలో యెాగభంగము గలుగును.
రవిశనులు గలిసిన దశ సామాన్యముగా యెాగించును రవిదశ పూర్తిగా యెాగించును.
చంద్రకుజులు కలిసినయెడల రెండుదశలలోను గూడ విశేషముగా భూమి సంపాదించును.
చంద్రు బుధులు గలిసిన యెడల వాహన ముద్రాధికార సౌఖ్యము అనుభవించును.
చంద్రగురులు గలిసిన యెడల చంద్రదశయెాగించును.గురుదశలో మంచి ఉద్యోగము చేసి విశేశఖ్యాతి సంపాదించును.
చంద్ర శుక్రులు కలిసిన శుక్రదశలో పూర్ణయెాగము గలుగును.చంద్రదశ యెాగించదు.
చంద్రశనులు గలిసినయెడల రెండుదశలలోను అఖండ రాజయెాగము పట్టును.
కుజబుధులు గలిసిన రెండుదశలలోను మిక్కిలి భాగ్యమనుభవించును.
కుజగురులు కలిసిన ఋణముచే విశేష ముగా భూమి సంపాదించును.
కుజశుక్రులు గలిసిన శుక్రదశ యెాగించును.కుజదశ యెాగించదు.
కుజశనులు గలిసిన యెడల రెండుదశలోను గూడ విశేషముగా భూమి సంపాదించును.
బుధగురులు గలిసిన బుధదశలో యెాగభంగము గలుగును.గురుదశలో వారసత్త్వపు ఆస్తి గలిసి విశేష భాగ్యమనుభవించును.
బుధశుక్రులు గలిసిన శుక్రదశ బాగుగాయెాగించును.బుధదశలో మధ్యమధ్య యెాగభంగము గలుగును.
బుధ శనులు గలిసిన రెండుదశలలోను విశేషభాగ్యము కలుగును.
గురుశుక్రులు కలిసిన యెడల శత్రరోగ ఋణములు హెచ్చుగా నుండును.
గురుశనులు గలిసిన శనిదశ యెాగించదు.గురుదశలో విశేష భూమి సంపాదించును.
శుక్ర శలును కలిసిన శనిదశయెాగించదు.శుక్రదశలో విశేషముగా భూమిసంపాదించును.
తులాలగ్న మందు గురుడు.శుక్రుడు యిా మూడుగ్రహములను ఒకరినొకరు జంటగా నున్నను విడిగా నున్నను పాపఫలమునే యిచ్చెదరు.తక్కిన చంద్ర,బుధ,కుజ,శనులు జంటగా నున్నను విడిగా నున్నను శుభఫలమును యిచ్చెదరు.
*తులాది రవిఫలమ*
తులాలగ్నమై లగ్నమందు రవియున్న ఈ రవికి నీచభంగము గలిగినచో రాజయెాగము నిచ్చును.లేనియెడల యిా రవిదశలో అనేక కష్టము లనుభవించును.
ద్వితీయమందు రవియున్న ధనము నిలువక పోయినను సంపాదన విశేషముగా నుండును.
తృతీయమందు రవియెుక్క రవిదశలో మిక్కిలి భాగ్యమనుభవించును.
చతుర్థమందు రవియున్న మాతృసౌఖ్యము తక్కువగానుండును.గాని రవిదశ స్వల్పముగా యెాగించును.
పంచమమందు రవియున్న యిాదశలో విశేషముగా ధనముసంపాదించి వడ్డివ్యాపారము చేయును.
షష్ఠమమందు రవియున్న స్వల్పముగా యెాగించును.
సప్తమమందు రవియున్న పూర్తిగాయెాగించి మిక్కిలి యెాగజాతకమగును.
అష్టమమందు రవియున్న యెాగించదు.మధ్యమధ్య ధనములేక మిక్కిలి కష్టపడును.
నవమమందు రవియున్న మిక్కిలి భాగ్యమనుభవించును.
దశమమందు రవియున్న ఆసేతు హిమాచల పర్యంతము తీర్ధయాత్రలు చేయును.
ఏకాదశమందు రవియున్న ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
ద్వాదశమందు రవియున్న బాల్యమందు యిా రవిదశలో బాలారిష్టము గలుగును.తక్కిన సమయములయందు పిత్రార్జిత మంతయు ఖర్చుపెట్టును.
మెుత్తము మీదనీరవిదశలో జాతకునకు స్వల్పముగా నలతచేయును గాని యెాగివిషయములో మంచిదనియే చెప్పవలెను.
*తులాది చంద్ర ఫలము*
తులలగ్నమై లగ్నమందు చంద్రుడున్న యెడల ఈ చంద్రమహాదశలో అఖండ రాజయెాగము గలుగును.జాతతుడు గొప్పవాడును పేరు ప్రతిష్ఠలు గలవాడును అగును.
ద్వితీయమందు చంద్రుడున్న చంద్రదశ యెాగించదు.
తృతీయమందు చంద్రుడున్న చంద్రదశ సామాన్యముగా యెాగించును.
చతుర్థమందు చంద్రుడున్న విద్యావంతుడు భూసంపాదన పరుడు మాతృసౌఖ్యము గలవాడు అగును.
పంచమమందు చంద్రుడున్న మంచి సంతానము గలుగును.ఆ చంద్రదశలో విశేష రాజయెాగము గలుగును.
షష్ఠమమందు చంద్రుడున్న చంద్రదశలో ఋణము హెచ్చుగానుండును.
సప్తమమందు చంద్రుడున్న మిక్కిలి యెాగ్యమైన కళత్రము లభించును.కళత్రరీత్యా కొంత ఆస్తికలియును.
అష్టమమందు చంద్రుడున్న బాల్యమందు బాలరిష్టము గలుగును గాని చంద్రదశ అఖండముగా యెాగించును.
నవమమందు చంద్రుడున్న తీర్థయాత్రలుచేయును గంగాస్నాన ఫలము లభించును.
ఏకాదశమందు చంద్రుడున్న చంద్రదశ యెాగించదు.
వ్యయమందు చంద్రుడున్నచో శుభకార్య సంబధమయిన వ్యయము విశేషముగా నుండును.
మెుత్తమీద తులాలగ్నమునకు చంద్రు కేంద్రకోణముల యందుండిన ఆ చంద్రదశ అఖండముగా యెాగించును.క్షీణచంద్రుడున్నచో సామాన్య యెాగము గలుగును.
*తులాది కుజ ఫలము*
తులాలగ్నమయి లగ్నమందు కుజుడున్న కుజదశ యెాగించునుగాని జాతకుడు సౌఖ్యము లేనివాడు మేహతత్వము గలవాడు అగును.
ద్వితీయమందు కుజుడున్న తప్పకద్వికళత్ర యెాగమనుభవించును.లేదా ఉత్తరాయుర్దాయము నందు నిర్దారయెాగము (భార్యావియెాగము)గలుగును.
తృతీయమందు కుజుడున్న కుజదశ సామాన్యముగా యెాగించును.
చతుర్థమందు కుజుడున్న కుజదశ అఖండముగా యెాగించును.విశేషముగా భూ ధనములు సంపాదించును.
పంచమమందు కుజున్న సంతానము గలిగి నష్టమగును.గాని కుజదశ అఖండముగా యెాగించును.
షష్ఠమమందు కుజుడున్న కుజదశలో సామాన్యముగా యెాగము కలుగును.
సప్తమమందు కుజుడున్న కళత్రవిచారము గల్గును.గాని మిక్కిలి భూజాతకమగును.
అష్టమమందు కుజుడున్న సంతానవిచారము గలవాడును.కళత్ర విచారము గలవాడును అగును.
నవమమందు కుజుడున్న పితృసౌఖ్యము తక్కువగా నుండును.ఈ కుజుదశ స్వల్పముగా యెాగించును.
దశమమందు కుజుడున్న నీచవృత్తి వలన జీవనము చేయువాడును వ్యవసాయము వలన నష్టము బొందువాడును అగును.
ఏకాదశమందు కుజుడున్న పూర్తిగా యెాగించును.భూమియు ధనమును సంపాదించును.
ద్వాదశమందు కుజుడున్న కళత్రవిచారము మెుదలగు నష్టములు గలుగును.ఈ కుజదశ యెాగించదు.
మెుత్తమీద కుజదశలో మంచియెాగము కల్గును.
*తులాది రాహు ఫలము*
తులాలగ్నమై లగ్నమందు రాహువున్న రాహుదశ యెాగించక శరీర పీడచెయును.
ద్వితీయమందు రాహువున్న ధననష్టము విశేషముగా గలుగును.సంతాన విచారము కళత్ర పీడగలుగును.
తృతీయమందు రాహువున్న పూర్తిగా యెాగించును.భూమి ధనము సంపాదించును.
చతుర్థమందు రాహువున్న దశ యెాగించదు విద్యావిఘ్నములు గలుగును.పిత్రార్జితము కొంత ఖర్చుపెట్టును.
పంచమమందు రాహువున్న సంతానము కలిగి నష్టమగును గాని రాహుదశ యెాగించును.
షష్ఠమమందు రాహువున్న దశలో శత్రువులను జయించి భూమి సంపాదించును.
సప్తమమందు రాహువున్న యెాగించదు మధ్యమశరీరపీడ కళత్రపీడ చేయును.
అష్టమమందు రాహువున్న యెాగించదు.అనేక కష్టములనుభవించి దరిద్రుడగును.
నవమమందు రాహువున్న యెాగించునుగాని పితృసౌఖ్యము తక్కువగానుండును.
దశమమందు రాహువున్న తీర్థయాత్రలు విశేషముగా జేయును.ఈ రాహుదశ యెాగించును.
ఏకాదశమందు రాహువున్న అఖండముగా యెాగించును మిక్కిలి భూమి సంపాదించును.
ద్వాదశమందు రాహువున్న యెాగించదు.దుర్జన సహవాసముచే విశేషముగా ధనవ్యయము జేయును.
మెుత్తమీద తులాలగ్నమును రాహువు తృతీయ షష్ఠలాభములందున్న బాగుగా యెాగించదు.
*తులాది గురు ఫలము*
తులాలగ్నమై లగ్నమందు గురుడున్న మిక్కిలి రూపవంతుడును.మధ్యమధ్య రోగముచే బాధపడువాడు శత్రువృద్ధిగలవాడు అగును.ఈ గురుదశ మంచిదికాదు
ద్వితీయమందు గురుడున్న యెాగించదు.మధ్యమధ్య శరీరపీడచేయును.అప్పుజేసి వడ్డీవ్యాపారమును జేయుచుండును.
తృతీయమందు గురుడున్న సోదర సోదరీ సౌఖ్యము గలుగ జేయును.ఈ గురుడు మెుదట యెాగించి చివరకు యెాగభంగము గలుగజేయును.
చతుర్థమందు గురుడున్న గురుదశ స్వల్పముగా యెాగించును.విశేషముగా శత్రువృద్థికలిగి చివరకు జయముగలుగును.స్వల్పముగా భూమి సంపాదించును.
పంచమమందు గురుడున్న శత్రు,రోగ ఋణములు మూడును హెచ్చుగా నుండును.
సప్తమమందు గురుడున్న కళత్రము రోగపీడితురాలగును ఈ జాతకునకు మధ్యమధ్య విశేషముగా నలతజేయును.
అష్టమమందు గురుడున్న కుటుంబము విశేషముగా నుండి మిక్కిలి దారిద్ర్యమనుభవించును.
నవమమందు గురుడున్న గురుదశ స్వల్పముగా యెాగించును.శత్రుసంబంధమైనదిగాని వారసత్త్వసంబంధమైన ఆస్తికాని కొంతకలియును.
దశమమందు గురుడున్న యెడల డాంబికమయిన ఆచారముగలవాడు తీర్థయాత్రలుచేయువాడును.శత్రురోగ ఋణములు గలవాడు అగును.
ఏకాదశమందు గురుడున్న అన్యాయముగా ధనమార్జించును అప్పుచేసి వడ్డివ్యపారము గాని,భూమిగాని సంపాదించును.
ద్వాదశమందు గురుడున్న ఈ గురుదశ యెాగించదు.డాంబికముగా విశేషధనము ఖర్చుపెట్టును.
మెుత్తముమీద ఈ తులాలగ్నమునకు గురుడు ఎక్కడనున్నను యెాగించును
అనేక కష్టములు గలుగును.
*తులాది శని ఫలము*
తులాలగ్నమై లగ్నమందు శనియున్న ఈ జాతకుడు యెాగ్యుడు పేరుప్రతిష్ఠలు గలవాడును అగును.గాని తెలివితేటలు తక్కువగా నుండును.
ద్వితీయమందు శనియున్న ధనసంపాదనజేయును గాని ఎంత ధనమార్జించినను నిలువయుండదు.
తృతీయమందు శనియున్న శనిదశ సామాన్యముగా యెాగించును.కనిష్ఠ సోదర నష్టము గలుగును.
చతుర్థమందు శనియున్న విశేష భూజాతకుడగును.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
పంచమమందు శనియున్న అఖండముగా యెాగించును.స్త్రీ సంతానము విశేషముగా నుండును.
షష్ఠమందు శనియున్న విశేషముగా యెాగించును.తాను సంపాదించిన ధనమంతయు తీర్థయాత్రలక్రింద వినియెాగపఱచును.
సప్తమమందు శనియున్న సామాన్యముగా యెాగించును.సంతానవిచారము కళత్రవిచారము మెుదలగునవి గలుగును.
అష్టమమందు శనియున్న యెాగించదు.పిత్రార్జితము గూడ ఖర్చుపెట్టును.
నవమమందు శనియున్న యెాగించును.గాని పితృసౌఖ్యము తక్కువగానుండును.
దశమమందు శనియున్న సంపూర్ణముగా యెాగించును.వాహనముద్రాధికారము లనుభవించును.
ఏకాదశమందు శనియున్న శనిదశలో విశేషధనము సంపాదించి నిలువ చేయును.ఈ శనిదశ అఖండముగా యెాగిమచును.
ద్వాదశమందు శనియున్న అన్యాయముగా ధనము సంపాదించి విశేష వ్యయము చేయును .ఈ శనిదశ యెాగించదు.
మెుత్తమీద తులాలగ్నమునకు శనిపూర్తిగా రాజయెాగ కారకుడగును.
*తులాది బుధ ఫలము*
తులాలగ్నమయి లగ్నమందు బుధుడున్న యెడల ఈ బుధదశలో విశేషభాగ్యమనుభవించును.
ద్వితీయమందు బుధుడున్న బుధదశలో విశేషధనము సంపాదించి నిలవ జేయును.
తృతీయమందు బుధుడున్న ఈ బుధదశ సామాన్యముగా యెాగించును.పిత్రార్జితములో కొంతఖర్చు పెట్టును.
చతర్థమందు బుధుడున్న ప్రాసాదసౌఖ్య మనుభవించును.విశేష భాగ్యవంతుడగును.
పంచమమందు బుధుడున్న మిక్కిలి యెాగ్యమైన సంతానము కలుగును.ఈ బుధదశలో అఖండ యెాగము గలుగును.
షష్ఠమమందు బుధుడున్న బుధదశ యెాగించదు.తన పిత్రార్జితమంతయు శత్రువుల పాలగును.
సప్తమమందు బుధుడున్న మిక్కిలి పతివ్రతయగు భార్యలభించును.కళత్రసంబంధమైన ఆస్తి కొంతకలియునుఈ బుధదశ పూర్తిగా యెాగించును.
అష్టమమందు బుధుడున్న ఈ బుధదశ యెాగించదు.పిత్రార్జితము స్వర్జితముగూడ ఖర్చు పెట్టును.దరిద్రమనుభవించును.నవమందు బుధుడున్న బుధదశలో విశేషభాగ్య మనుభవించును.
దశమమందు బుధుడున్న యజ్ఞయాగాధి క్రతువులు చేయువాడును ఈ బుధదశలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించును.
ఏకాదశమందు బుధుడున్న ఈ బుధదశ విశేషధనము మిక్కిలి న్యాయముగా సంపాదించును.
ద్వాదశమందు బుధుడున్న ఈ బుధుదశయెాగించదు మిక్కిలి సత్కార్యములు చేసి విశేషముగా ధనము ఖర్చు పెట్టును.
మెుత్తమీద తులాలగ్నమునకు బుధుడుయే స్థానమందున్నను సామాన్యముగా యెాగించును.
*తులాది కేతు ఫలము*
తులాలగ్నమయి లగ్నమందు కేతువున్న యెడల బాల్యమందు బాలారిష్టము గలుగును.ఈ కేతుదశ యెాగించదు.
ద్వితీయమందు కేతువున్న యెాగించదు.ధనము లేనివాడును.సంతానము లేని వాడును అగును.
తృతీయమందు కేతువున్న భూమి ధనము విశేషముగా సంపాదించును.
చతుర్థమందు కేతువున్న ఈ కేతుదశలో మాతృవిచారము గలవాడును స్వల్పభూమి గలవాడు విద్యవిఘ్నము గలవాడును అగును.
పంచమందు కేతువున్న స్త్రీసంతానము గలిగి నష్టమగును.
షష్టమందు కేతువున్న కేతుదశపూర్తిగా యెాగించును.శత్రువులవలన కొంత ఆస్తిగలియును.విశేషముగా ధనము సంపాదించును.
సప్తమమందు కేతువున్న దశ యెాగించదు జాతకునకు కళత్రమునకు శరీరపీడ చేయును.
అష్టమమందు కేతువున్న కేతుదశ యెాగించదు.మిక్కిలి కష్టము అనుభవించును.
నవమమందు కేతువున్న పితృసౌఖ్యము తక్కువగా నుండును ఈ కేతుదశ యెాగించును.
దశమమందు కేతువున్న ఈ కేతువు సానాన్యముగా యెాగించును మంచి తీర్థయాత్రలు వగైరా చేయును.
ఏకాదశమందు కేతువున్న దశపూర్తిగా యెాగించును.మిక్కిలి ధనము సంపాదించును.
ద్వాదశమందు కేతువున్న యెడల మిక్కిలి పారమార్ధిక చింతగలవాడయి సద్వ్యయము చేయుచుండును.
మెుత్తమీద కేతువు 3,6 స్థానములయందు బాగుగా యెాగించును.
*తులాది శుక్ర ఫలము*
తులాలగ్నమయి లగ్నమందు శుక్రుడున్న శుక్రదశ స్వల్పముగా యెగించును.జాతకుడు పేరు ప్రతిష్ఠలు గలవాడును యెాగ్యుడును అగును.
ద్వితీయమందమ శుక్రుడున్న ధనము సంపాదించును గానినిలువదు.
తృతీయమందు శుక్రుడున్న ఈ దశయెాగించదు. విశేషముగా ధనవ్యయము గలుగును.రాబడి గూడ తక్కువగును.
చతుర్థమందు శుక్రుడున్న స్వల్ప విద్యగలవాడగును,సామాన్యమైన భూవసతి గలవాడను అగును.
పంచమమందు శుక్రుడున్న ఈ శుక్రదశలో పూర్వఖండము విశేషముగా యెాగించును.ఉత్తరఖండము సామాన్యముగా యెాగించును.
షష్ఠమమందు శుక్రుడున్న బాల్యమందు ఈ దశవచ్చినయెడల బాలారిష్టము గలుగును.
సప్తమమందు శుక్రుడున్న దశలో జాతకునకు విశేషముగా నలతజేయును.ఈ దశ సామాన్యముగా యెాగించును.
అష్టమమందు శుక్రుడున్న యెాగించదు.శుభకార్య సంబంధమయిన ఖర్చువిశేషముగా జేయును.
నవమమందు శుక్రుడున్న ఈ శుక్రదశ మిశ్రమఫలమునిచ్చును.
దశమమందు శుక్రుడున్న వ్యవసాయమువలన జీవనము చేసి మిక్కిలి ఖ్యాతి సంపాదించును.
ఏకాదశమందు శుక్రుడున్న శుక్రదశలో విశేష ధనమార్జించును గాని మిక్కిలి అన్యాయముగానుండును.
ద్వాదశమందు శుక్రుడున్న శుక్రదశ సామాన్యముగా యెాగించును శుభకార్యసంబంధమైన ఖర్చు విశేషముగా జేయును.
మెుత్తముమీద తులాలగ్నమునకు శుక్రుడు మిశ్రమ ఫలమునిచ్చును.
This is very good comment for astrology, It may helpful to who needs changes in life problems. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru.
ReplyDelete