మిధునలగ్నమునకు శుక్రుడొక్కడే యెాగకారుడు.అట్టి శుక్రునితో బుధుడు కలిసి కేంద్రకోణములందున్న యెడల రెండు దశలును సంపూర్ణముగా యెాగించురు.
శుక్రబుధులు లగ్నమందుగాని పంచమమందుగాని సప్తమమందుగాని నవమమందుగాని గలిసియున్న యెడల ఈ రెండు దశలలో సంపూర్ణమైన వాహన ముద్రాధికారములు కలుగును.
బుధుడు శుక్రులతో పూర్ణచంద్రుడు కలిసియున్న యెడల యెప్పుడును వేలకొలది ధనము నిలువయుండును.
ఈ లగ్నమునకు గురుడు ఉభయ కేంద్రాధిపతియైనను గురుడు శుభగ్రహములతో గలిసి సప్తమస్థానమందు గాని తక్కిన కేంద్రకోణములయందెక్కడ కలిసియున్నను పూర్తిగా రాజయెాగము గలుగును.
మిధున లగ్నమునకు నాలుగు శుభగ్రహములలోను జంటగా యేశుభ గ్రహములు గలిసియున్నను యెాగించును.
శుక్రుడుగాక తక్కిన మాడు శుభగ్రహములలో యే శుభగ్రహమైనను విడిగానున్న యెడల యెాగించదు.మెుత్తముమీద ఈ నాలుగుశుభగ్రహములును యెాగము నిచ్చు గ్రహములగును.ఈ నాలుగు శుభగ్రహములలో పాపగ్రహములు ఏవినైనను కలిసియున్న యెడల ఆ పాప గ్రహములు యెాగించును.
రవిచంద్రులు కలిసినయెడల యెాగించును.చంద్రదశ యెాగించదు కష్టములనుభవించును.
రవి కుజులుషష్ఠాషమ వ్యయస్థానములయందెక్కడ కలిసియున్నను విపరీత రాజయెాగము గలుగును ఈ రవి కుజులుయితర స్థానములయందెక్కడ కలిసినను అది వరకున్న యెాగము చెడిపోవును.
రవి బుధులు కలిసిన సంపూర్ణయెాగము గలుగును.బుధ సామాన్యముగా యెాగించును.
రవిగురులుగలిసిన యెాగించును.గురుదశయెాగించదు.
రవిశుక్రులు గలిసిన రవిదశలో విశేషముగా భూమి ధనము సంపాదించును.రవిశనులు కలిసిన యెాగభంగము గలుగునమ.చంద్రకుజులు కలిసిన చంద్రదశ కంటే కుజదశ బాగుగా యెాగించును.చంద్రబుధులు కలిసిన రెండు దశలును పూర్తిగా యెాగించును.
చ ద్ర గురలు కోణములయందు గలిపిన రెండుదశలును పూర్తిగా యెాగించును.చంద్రశుక్రులు గలిసిన మిక్కిలి ధనవంతుడగును.చంద్రశనులుగలిసిన శనిదశ పూర్తిగా యెాగించును.చంద్రదశలో సామాన్య యెాగము గలుగును.కుజ బుధలు కలిసిన కుజదశ బాగుగా యెాగించును.
బుధదశలో శత్రురోగ ఋణాలు అభివృద్ధిగా నుండును,కుజగురులు గలిసిన కుజదశలో భూమి విశేషముగా ఋణము పెరుగును.కుజ శుక్రులు కలిసిన కుజదశలో భూధనలాభులు గలుగును.శుక్రుదశలో కళత్ర శరీరపీడ ధనవ్యయము మెుదలగునవి గలుగును.కుజశనులు గలిసిన రెండుదశలలో యెాగభంగముగల్గును.
బుధగురులు గలిసిన పూర్తిగా రాజయెాగము కలుగును.కోణముల యందుండుట మిక్కిలి మంచిది.బుధశుక్రులుగలిసిన రెండు దశలలోయెగభంగము గల్గును.
బుధగురులు గలిసిన పూర్తిగా రాజయెాగము కలుగును.కోణములు యందుండుట మిక్కిలి మంచిది.బుధ శుక్రులు గలసిన రెండు దశలును సంపూర్ణముగా యెాగించును.బుధశును కలిసిన యెాగము హెచ్చుట తగ్గుట కలుగును.గురుశుక్రులు గలసిన సంపూర్ణమైన భాగ్యము అనుభమించును.
గురుశనులు గలిసిన భాగ్యరాజ్యాధిపతులైనను యెాగభంగము గలుగును.కాని గురుదశకంటే శనిదశ బాగుగా యెాగించును.శుక్రశనులు గలిసిన యెడల శనిదశ పూర్తిగా యెాగించును.శుక్రదశలో మధ్యమధ్యను యెాగభంగము గలుగును.కళత్రవిచారము ధననష్టము గలుగును.
*మిధునాది రవి ఫలము*
మిధునము లగ్నమై లగ్నమందు రవియున్న శరీరపీడచేయును శత్రువృద్థి.ఋణవృద్థికలుగును.ద్వితీయమందు రవియున్న విశేషముగా నలతజేయును.
తృతీయమందు రవియున్నచో మిక్కిలి పేరు ప్రతిష్ఠలు గల సోదరుడొక్క డుండును.
చతుర్థమందు రవియున్న యెడల మాతృసౌఖ్యము తక్కువగానుండును.పిత్రర్జిత సంబంధమైన భూమి కొంత ఖర్చు పెట్టును.విద్యావిఘ్నము గలుగును.ఈ రవిదశ యెాగించదు.
పంచమమందమ రవియున్న యెడల ఈ దశలో సోదరీ నష్టము గలుగును.లాభవ్యయములు సమానముగా నుండును.
షష్ఠమమందు రవియున్న యెడల యిాదశలోశత్రువుల వలన బాధ గలుగును.మధ్యమధ్యను యెాగము చేయును.
కళత్రస్థానమందు రవియున్న యెడల స్వల్పముగా కళత్రమునకు నలత జేయును.
అష్టమమందు రవియున్న యెడల వ్యవహారపు చిక్కులు గలుగును.విశేషధన వ్యయము గలుగును.
నవమమందు రవియున్న కొంచెము బాగుగా నుండును.పితృసౌఖ్యము తక్కువగా నుండును.పితృభాగ్యము కొంత తగ్గి తిరిగి స్వార్జితము వలన కొంచెమభివృద్ధి యగును.
దశమమందు రవియున్న బాగుగా యెాగించి మిక్కిలి గౌరవజీవనము చేయును.మంచితీర్థయాత్రలు చేయును.
ఏకాదశమందు రవియున్న పూర్తిగా యెాగించును.సోదరునివలన మిక్కిలి భాగ్యవంతుడగును.
ద్వాదశమందు రవియున్న యెాగించక శత్రుబాధ గలుగును.ఋణము హెచ్చుగా నుండును.
వ్యవహారపు చిక్కులు హెచ్చుగానుండును.దుర్జన సాంగత్యము వలన విశేష ద్రవ్యనష్టము గలుగును.
*మిధునాది చంద్ర ఫలము*
మిధునములగ్నమై యందు పూర్ణచంద్రుడపన్న యెడల అట్టి జాతకుడు సుందరమైన శరీరము గలవాడు అగును ఈ చంద్రకళ బాగుగా యెాగించును.
ద్వితీయమందు చంద్రుడున్న యెడల పూర్ణచంద్రుడైనచో మిక్కిలి ధనము నిలవయుండును.క్షీణచంద్రుడైనస్వల్పముగా నుండును.
తృతీయమందమ చంద్రున్న యెడల సోదరీ వృద్ధి విశేషముగా నుండును.ఈ దశలో లాభవ్యయములు సమానముగా నుండును.
చతుర్థమందమ చంద్రుడున్న యెడల పూర్ణచంద్రుడైనచో విద్యావంతుడగును.మాతృసౌఖ్యము చిరకాలముండును.గృహనిర్మాణము చేయును.ఈ చంద్రుడు ఈ స్థానమందు బుధునితోగాని గురునితో గాని గలిసియున్న యెడల ఆ ప్రసాద సౌఖ్యము గలుగును.శుక్రునితో గలిసి యున్న వాహన ముద్రాధికార సౌఖ్యములు గలుగును.
పంచమమందు పూర్ణచంద్రుడున్న యెడల మిక్కిలి ధనము సంపాదించి నిలువ జేయును.స్త్రిసంతానము విశేషముగా నుండును.
షష్ఠమమందు చంద్రుడున్న యెడల ఈ చంద్రదశ యెాగించదు.పిత్రార్జిత ధనముగూడా ఖర్చు పెట్టును.సంతాన విచారము గలుగును.
సప్తమమందు చంద్రుడున్న యెడల పూర్ణచంద్రుడైనచో ఈదశ యెాగించును గాని శరీరమునకు విశేషముగా నలత చేయును.పాపగ్రహసంబంధమున్న యెడల మారకము చేయును.
అష్టమమందు చంద్రున్న యెడల బాలారిష్టము గలుగును.
నవమమందు చంద్రుడున్న యెడల పూర్ణచంద్రుడైనచో సంపూర్ణభాగ్యమను భవించును.విశేషధన మార్జించును.
దశమమందు చంద్రుడున్న సమస్త తీర్థ యాత్రలు చేయును.
ఏకాదశమందు పూర్ణచంద్రుడున్న విశేషముగా ధనము సంపాదించి నిల్వ చేయును.
ద్వాదశమందు చంద్రుడున్న చంద్రదశ యందు విశేషముగా ధనమార్జించును గాని సంపాదించిన ధనమంతుయు సత్కార్యములకు వినియెాగించును.
*మిధునాది కుజ ఫలము*
మిధునము లగ్నమై లగ్నమందు కుజుడున్న సర్వదా రోగ శరీరము గలవాడు కపట స్వభావము గలవాడు దయదాక్షిణ్యములు లేనివాడు అగును.
ద్వితీయమందు కుజుడున్న దశలో గర్భదరిద్రమనుభవించును.
కుజ దశ బొంతిగా యెాగించదు.కళత్రనష్టము గలుగును.
తృతీయమందు కుజుడున్న కుజదశ కొంచెము బాగుగా యెాగించును గాన సోదరనష్టము గలుగును.
చతుర్ఠమందు కుజడున్న విద్యావిఘ్నము మాతృవిచారము గలుగును.తండ్రి సంపాదించిన భూమి యంతయుఖర్చు పెట్టును.వాహనసౌఖ్యముండదు.
పంచమమందు కుజుడున్న సంతాననష్టము గలుగును పుత్రశోకమను భవించును.
షష్ఠమమందు కుజుడున్న యెాగించును.ఋణముచే యైనను భూమి సంపాదించును.
కళత్రస్థానమందు కుజుడున్న యెడల కళత్రనష్టము గలుగును.జాతకునకు విశేషముగా నలతజేయును.
అష్ఠమమందు కుజుడున్న వ్యవహారపు చిక్కు,పాణభయము,ధననష్టములు స్థానచలనము గలుగును.కానియా కుజుడు ఉచ్చయందుండుట వలన ఋణము చేసి భూమి సంపాదించును.కళత్రమునకు నలతజేయును.
మెుత్తముమీద యిా కుజదశ మెుదట యెగించి చివరక యెాగభంగము గలుగ జేయును.
నవమమందు కుజుడున్న పిత్రార్జితము గలుగును.పితృభాగ్యము తగ్గును.కొంచెము బాగుగా యెాగించును.
దశమమందు కుజుడున్న యెడల ఆచారహీనుడుగును ఈ దశలో భూమి,ధనము కొంచెము సంపాదించును.ఉదోగస్థుడైన యెడల దయాదాక్షిణ్యములు లేక తాను చేయు ఉదోగము నందు ప్రజలను మిక్కిలి బాధించును.
ఏకాదశమందు కుజుడున్న విశేషముగా భూమి,ధనము సంపాదించును,పూర్తిగా యెాగించును.
ద్వాదశమందు కుజుడున్న కుజదశ యెాగించును.పాపగ్రహ సంబంధంమున్న వ్యవహారపు చిక్కులు గలిగి కారాగృహప్రాప్తి కలుగును.శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.కళత్రనష్టము గులుగును.అవయవలోపము గూడ గలుగును.
మెుత్తముమీద మిధునలగ్నమునకు కుజుడుషష్ఠలాభాధి పతి యగుట చేత మిక్కిలి పాపిగనుక యేస్థానము నందున్నను యెాగము నీయడు.
*మిధునాది రాహు ఫలము*
మిధునము లగ్నమై లగ్నమందు రాహూవున్న యెడల యెప్పుడును మేహ రోగము వసన బాధపడు చుండును శరీరదారుఢ్యము స్వభావముగూడ మంచివి కావు గాని అప్పుడప్పుడు యిారాహువు యెాగము నుచ్చును.
ద్వితీయమందు రాహువున్న యెడల యిారాహుదశ యెాగించదు,విశేష ధననష్టము గలుగును.పాపగ్రహ సంబధమున్న యెడల మారకముగూడ చేయును.
తృతీయమందు రాహువున్న యిారాహువు పూర్తిదా యెగించును.సోదర వృద్ధి బాగుగానుండును.విశేషధనలాభము ఉద్యోగాభివృద్ధి గలుగును.
చతుర్ఠ మందు రాహువున్న మాతృసౌఖ్యము విద్య భూమి వాహనము యివి స్వల్పముగా నుండును ఈ దశమశ్రమ ఫలమునిచ్చుని
పంచమమందు రాహువున్న రాహుదశ యెాగించు గాని సంతానముగలిగి నష్టమగుటయు సంభవింటును.
షష్ఠమందు రాహువున్న యెడల ఈదశ యెాగించును గాని నీచవృత్తివలన విశేషధన మార్జించును.
సప్తమమందు రాహువున్న పూర్వసువాసినీ సంగమము చేయును.భార్య భర్తలకు అన్యోన్యప్రేమ తక్కువగా నుండును.ఈదశ యెాగించదు.మధ్యమధ్య నలత జేయును.
అష్టమమందు రాహువున్న యెడల అపసవ్యమైన కర్మలు చేయును.ఈ రాహుదశ అంతయు పాడుచేయును వ్యవహారపు చిక్కులు ధననష్టము శత్రుబాధయు విశేషముగా నుండును.
నవమందు రాహున్న ఈ దశస్వల్పంగా యెాగించును బాల్యమందు రాహుదశ వచ్చిన యడల బాలారిష్టము గాని పిత్రారిష్టముగాని గలుగును.
దశమమందు రాహువున్న గొప్ప తీర్థయాత్రలు చేయును.మధ్యమధ్య యెాగము గూడ గలుగును.
ఏకాదశమందు రాహువున్న దశ పూర్తిగా యెాగించును గాని తాను సంపాదించిన ధనమంతయు మిక్కిలి అన్యాయముగా నుండును.
వ్యయమందు రాహువున్న యెడల ఈ రాహుదశలో ఎంత ధనమార్జించినను నిలువదు.ఆదాయముకంటె ఖర్చు విశేషముగా నుండును.దుర్జనసవాసము హెచ్చుగానుండును.
*మిధునాది గురు ఫలము*
మిధునము లగ్నమైనలగ్నమందు గురమడున్న యెడల ఈగురుదశ బాగుగా యెగించును.ఈ జాతకుడు మిక్కిలి పేరు ప్రతిష్ఠలుగలవాడును వంశోద్ధారకుడు,ఆయుర్భాగ్యములుగలవాడు మిక్కిలి రూపసియు,దేహదారుఢ్యముగలవాడు,మిక్కిలి యెాగ్యుడు పరోపకారి అగును.
ద్వితీయమందు గురుడున్న విశేషముగా ధనము సంపాదించి నిలువచేయును గాని ఈ గురుదశలో పాపభుక్తులయందు మారకము చేయును.ఈ స్థానమందు గురుడును శుభగ్రహముతో గలిసియున్న వేలకొలది ధనము నిలువచేయును.
తృతియమందు గురుడున్న యెాగించదు.బాల్యమందు వచ్చిన యెడల బాలారిష్టము గలుగును.
చతుర్ధమందు గురుడున్న యెడల మాతృ సౌఖ్యము విద్య,వాహనము భూమి మెుదలగునవి మిక్కిలి హెచ్చుగా నుండును ఈ బుధుడు గురునితో గాని చంద్రునితో గాని కలసి యున్న యెడల గొప్ప పండితుడగును. ప్రాసాదసౌఖ్యమను భవించును.తటాకారమ నిర్మాణము చేయును యే వంశమందు జన్మించినను పూర్తి రాజయెాగమనుభవించును.
పంచమమందు గురుడున్న పూర్తిగా యెాగించును.విశేష భూజాతకుడు ధనజాతకుడు అగును.పుత్రసంతాన సౌఖ్యమనుభవించును.
షష్ఠమమందు గురుడున్న యెాగించును గాని శత్రురోగ ఋణములు హెచ్చుగానుండును.కళత్రమునకు మధ్యమధ్య నలతచేయునమ.
కళత్రస్థానమందు గురుడున్న యెాగించును గానీ మధ్యమధ్య శరీరపీడవచ్చును.మిక్కిలి పతిభక్తిగలది స్థూలకాయము గలదియగు కళత్రము లభించును.పాపగ్రహసంబంధమున్న ఈ జాతకునకు మారకము జేయును.
అష్టమమందు గురుడున్న యెడల ఈ గురుదశ యెాగించదు.దారా పుత్రాదిపీడ గలుగును.ఉద్యోగస్థుడైన యెడల మధ్యమధ్యను యెాగభంగము గలుగును.
నవమమందు గురుడున్న మిక్కిలి భాగ్యవంతుడగును పూర్తిగా యెాగించును.తండ్రి చిరకాలము జీవించును.పిత్రార్జితము హెచ్చుగా నుండును.
దశమమందు గురుడున్న మిక్కిలి ఆచారవంతుడై యజ్ఞయాగాది క్రతువులు చేయును.ఉద్యోగస్థుడైన వాహన ముద్రాదికార సౌఖ్యములనుభవించును.
ఏకాదశమమందు గురుడున్న యెడల ఈ గురుదశ యెాగించదు.ఖర్చు విశేషముగా నుండును గాని యెప్పుడును సద్వ్యయమే చేయుచుండును.
*మిధునాది శనిఫలము*
మిధునమయి లగ్నము అందు శనియున్న యెడల ఆజాతకునకు శరీర సౌఖ్యముండదు వికృతరూపము గలవాడును దుర్జనసాంగత్యము గలవాడును కఠినహృదయము గలవాడును అగును.ఈ శనిదశ యెాగించును.
ద్వితీయమందు శనియున్న ప్రితార్జితము స్వార్జితముగూడా నష్టమగును.ఈ శనిదశలో జాతకునకు విశేషముగా నలతజేయును.ఒకప్పుడు మారకము గూడాజేయును.
తృతీయమందు శనియున్న కొంతకాలము యెాగించును.సోదరనష్టము గలుగును.
చతుర్థమందు శనియున్న విద్యా విహీనుడగును.పిత్రార్జితభూమి ఖర్చు పెట్టును జీర్ణగృహముండును మాతృసౌఖ్యము తక్కువగా యుండును.
పంచమమందుశనియున్న మధ్య విశేషయెాగమునిచ్చును.పూర్ణాయుర్దాయముగలుగును గాని పుత్రశోకము గలుగును.బాగుగా నెదిగిన సంతానము నష్టమగును.
షష్ఠమందు శనియున్న ఈ దశలో మధ్యమధ్యను స్వల్పముగా యెాగించి చివరకు యెాగభంగము గల్గును.
సప్తమమందు శనియున్న ద్వికళత్రయెాగముగలుగును.లేనియెడల ప్రధమ కళత్రము స్థూలకాయముగలదియై వికృతరూపము గలిగియుండును.
అష్టమమందు శనియున్న యెడల పితృభాగ్యము హరించును ఈ శనిదశ యెాగించదు.గాన ఆయుఃకారకుడైన శని స్వక్షేత్రమందుడుటవలన యిట్టి జాతకునకు పూర్ణయుర్దాయము గలుగును.
నవమమందు శనియున్న యెడల ఈ దశ బాగుగా యెాగించును.గాని పితృ సౌఖ్యము తక్కువగా నుండును.పిత్రార్జితము కొంత ఖర్చుపెట్టి తిరిగి సంపాదించును.
దశమమందు శనియున్న ఈ శనిదశ బాగుగాయెాగించును ఈ జాతకునకు ఆచారము స్వల్పముగా నుండును.
ఏకాదశమందు శనియున్న ఈ శనికి నీచస్థానము గనుక పిత్రార్జిత మంతయు ఖర్చగుటయేగాక స్వర్జితము గూడ స్వల్పముగా ఖర్చుపెట్టును.ఏకాదశమందున్నను ఈ శని యెాగించదు.అన్యాయముగా ధనమార్జించుటకు తగిన ప్రయత్నము చేయుచుండును గాని ఒక్కటియు నెరవేరదు.
వ్యయమందు శనియున్న యెడల దుస్సహవాసము గలిగి విశేషధనము వ్యయముచేయును.కుజసంబంధమున్న యెడల కారాగృహప్రాప్తిగలిగి కఠినమైన శిక్ష,యనుభవించును.లగ్నమునకు శనియేస్థానమందున్నను యెాగించడు. *మిధునాది బుధ ఫలము*
మిధునములగ్నమైలగ్నమందు బుధుడున్న యితర పాపగ్రహ సంబంధము లేనిచో యిా దశ పూర్తిగా యెాగించును అట్టిజాతకుడు సుందరమైన వాడు దేహద్యారుఢ్య గలవాడు.పారమార్థికచింత గలవాడు పాండిత్యము గలవాడు విద్యావినయ సంపన్నుడు అగును.
ద్వితీయమందు బుధుడున్న మిక్కిలి ధనము సంపాదించి నిలువజేయును.యుక్తిప్రయుక్తులుగలవాడై సభాపూజ్యుడగును.
తృతీయమందు బుధుడున్న యెడల యెాగించదు.విశేషధనవ్యయమగును.అదాయముకంటె వ్వయము హెచ్చుగా నుండును.
చతుర్థమందు బుధుడున్న బుధదశ పూర్తిగా యెాగించును.చిరకాలము తల్లిజీవించును.విద్యావంతుడగును.గురు సంబధమున్న యెడల రెండుమూడు శాస్త్రములందు పండితుడగును.విశేషభూజాతకుడగును.చంద్రునితోగాని గురునితోగాని సంబంధమున్న గొప్ప మేధావియై అశ్వాందోళికాది వాహన సౌఖ్యములను భవించును.
పంచమమందు బుధుడున్న పూర్తిగా యెాగించును.స్త్రీ సంతానవృద్ధియగును.
షష్ఠమందు బుధుడున్న పారమార్థికచింత గలవాడును,పండిత సాంగత్యము గలవాడుగు అగును.
సప్తమమందు బుధుడున్న రూపలక్షణములు గలది పతిభక్తిగలదియగు కళత్రము లభించును.ఈ బుధదశ యెాగించునుగాని పాపగ్రహ భుక్తుగలదియందు విశేషముగా నలతజేయును.
అష్టమమందు బుధుడున్న యెడల ఈ బుధదశయెాగించదు.పిత్రార్జిత మంతయు ఖర్చుపెట్టును.సర్వదాదేశ సంచారము జేయును.
నవమమందు బుధుడున్న యెడల సంపూర్ణమైన భాగ్యమనుభవించును.పితృ భాగ్యముకూడా విశేషముగా నుండును.ఉద్యోగస్థుడైన యెడల ఈ బుధ దశలో వాహనముద్రాది కారముగల యెాగము గలుగును.
దశమమందు బుధుడున్న యెడల యిా బుధునకు ఈస్థానము నీచమగుట చేతను విశేషముగా ధనము సంపాదించినప్పటికి సత్కార్యములు తీర్థయాత్రలు మెుదలగునవిచేసి విశేషగా ధనము ఖర్చు పెట్టునన.
ఏకాదశమందు బుధుడున్న విశేషముగా ధనమార్జించునుతాను సంపాదించిన
ధనమంతయు మిక్కిలి న్యాయముగా నుండును.సోదరీ భాగ్యమను భవించును.
వ్యయమందు బుధుడున్న యెాగించదు గాని విశేషముగా దాతయగును.ఎప్పుడును మంచికార్యములు జేయుచు సత్క ధాకలక్షేపము చేయుచుండును.
*మిధునది కేతు ఫలము*
మిధునము వగ్నమై లగ్నమందు కేతువున్న యెడల దేహదారుఢ్యము తక్కువగా నుండును.కపట స్వభావము గలడాడై యుండును.ఈ కేతుదశ యెాగించదు బాలారిష్టము గలుగును.
ద్వితీయమందు కేతువున్న విశేషముగా ధనముఖర్చుపెట్టును.మధ్యమధ్యను నలతజేయును.గాని సర్వదా పారమార్ధిక చింతగలవాడయి యుండును.
తృతీయమందు కేతువున్న దశ పూర్తిగా యెాగించును.విశేష భూలాభము ధనలాభము గలుగును.
చతుర్ధమందు కేతువున్న మాతృసౌఖ్యము తక్కువగా నుండును.పిత్రార్జితమైన భూమి ఖర్చుపెట్టును.
పంచమమందు కేతువున్న సంతానమువలన సుఖముండును.కొంత సంతానముకూడ నష్టమగును లాభవ్యయములు సమానముగా నుండును.
షష్ఠమందు కేతువున్న ఈ దశ బాగుగా యెాగించును.శత్రునష్టము గలుగును.జ్ఞాతులవలన కొంత ధనలాభము గలుగును.
సప్తమమందు కేతువున్న కళత్రసౌఖ్యము తక్కువగా నుండును.ఈ దశలో జాతకునకు కూడ మధ్యమధ్య నలత జేయును.
అష్టమమందు కేతువున్న వ్యవహారపు చిక్కులు వలన మిక్కిలి శరీరా యాసము శత్రువృద్ధి ధనవ్యయము ఋణవృద్ధి గలుగును.
నవమమందు కేతువున్న పితృసౌఖ్యము తక్కువగా నుండును.ఈ కేతుదశ స్వల్పముగా యెాగించును.
దశమమందు కేతువున్న పుణ్యకార్యములు తీర్థయాత్రలు చేయును.
ఏకాదశమందు కేతువున్న యెడల ఈ కేతుదశ పూర్తిగా యెాగించును.అనాయముగా విశేష ధనమార్జించును.
వ్యయమందు కేతువున్న యెడలయెప్పుడును సత్కధాకాలక్షేపము చేయును.ఈ కేతుదశ యెాగించదు.విశేషముగా ధనము ఖర్చుపెట్టును.
*మిధునాది శుక్ర ఫలము*
మిధునలగ్నమందు శుక్రుడున్న యెడల పూర్తిగా యెాగించును.ఈ జాతకుడు రూపలక్షణములు గలవాడు చురుకైన బుద్దిగలవాడు యెాగ్యుడు కవిత్వమందు ప్రవేశము గలవాడు ఆయుర్బాగ్యములు గలవాడు అగును.
ద్వితీయమందు శుక్రుడున్న విశేషముగా ధనము సంపాదించును.మృదువైన వాక్కులుగలవాడును సంగీత సాహిత్యములందు సమర్థుడగును.
తృతీయమందు శుక్రుడున్న యెాగించడు. మధ్యమధ్యను యెాగించినను ఆ యెాగముదశ ఆఖరువరకు సరిగా నిలబడదు.
చతుర్థమందు శుక్రుడున్న యెడల ఈ స్థానము శుక్రునకు నీచమగుటచే యెాగించదు ఒకవేళ పూర్తిగా యెాగించినచో కళత్రమునకు నష్టము జేయును సంతానవిచారము గలుగును.
పంచమమందు శుక్రుడున్న అయిదారుగురు వరకు స్త్రీ సంతానముండును.వారు మిక్కిలి అదృష్టవంతులగుదురు.ఈ శుక్రదశ పూర్తిగా యెాగించును.
షష్ఠమమందు శుక్రుడున్నయిా శుక్రదశలో మధ్యమధ్యను విశేష మార్జించును గాని సంపాదించిన ధనమంతయు వెంటనే ఖర్చు పెట్టును.
సప్తమమందు శుక్రుడున్న యిాదశ పూర్తిగా యెాగించును యెాగ్యమైన కళత్రము లభించును.ఈ జాతకుడు విశేషకామము గలవాడై చపల చిత్తుడగును.
అష్టమమందు శుక్రుడున్న యిా శుక్రదశ యెాగించదు.దారా పుత్రాది సౌఖ్యము తక్కువగానుండును అదాయము స్వల్పమును వ్యయము హెచ్చుగా నుండును.
నవమమందు శుక్రుడున్న పరిపూర్ణమైన భాగ్యము ననుభవించును పిత్రార్జితము స్వార్జితముగూడా హెచ్చుగానుండును.
దశమమందు శుక్రుడున్న మిక్కిలి ఆయుర్భాగ్యములుగల సంతానముండును.యిా శుక్రదశలో యెటువంటి దరిద్రుడైనను యెాగమనుభవించును.ఉద్యోగస్థుడైన యెడల రాజసన్మానము గలవాడై వాహన ముద్రాధికారములు సంపూర్ణముగా ననుభవించును.
ఏకాదశమందు శుక్రుడున్న యిా శుక్రదశలో విశేషధనము సంపాదించి నిల్వ జేయును.ధనసంపాదన మిక్కిలి న్యాయముగా నుండును.
వ్యయమందు శుక్రుడున్న పిత్రార్జితము సత్కార్యముల క్రింద వినియెాగించును.మిక్కిలి పారమార్థికచింత గలవాడై పరోపకారి యగును.
మెుత్తమువీద యిా మిధునలగ్నమునకు పాపగ్రహసంబంధము లేక యే స్థానమందున్నను ఈ శుక్రదశ యెాగించును.
Thanks to share the astrological information with us. It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.
ReplyDelete