Wednesday, September 5, 2018

ముహూర్తము పెట్టవలసిన పద్దతి. How to Calculate Muhurtham ?

ముహూర్త చక్రము లో ఏవైనా దోషములు ఉన్నవేమో చూడవలెను .నాల్గవ లగ్నము పనికి రాదు భద్రవాకరణము వర్జ్యము , దుర్ముహూర్తములు లగ్నమునకు తగలరాదు .తిధి,వార,నక్షత్ర,యోగ,కరణములు అను పంచాంగం శుద్ది కలిగి ముహూర్తములకు మహర్షులచే చెప్పబడివై ఉండవలెను.లగ్నము శుభ గ్రహములతో కూడి యుండవలెను చంద్రబలము,తారాబలము ఉండవలెను.పంచకరహితము కావలెను అట్టి ముహూర్తములలో స్వల్పదోషమున్నను శుభకార్యాలు చేయవచ్చు

     లగ్నబలము

శుభముహూర్తము నిర్ణయించుటలో లగ్నబలము ,గ్రహబలం, ఈ రెండూముఖ్యము మరలా గ్రహబలం కంటే లగ్నబలము చాలాముఖ్యం.గ్రహబలమనగాపాపులు అయిన రవి,కుజ,శని,రాహు, కేతువులు 3,6,11, స్తానంలో ఉండి శుభ గ్రహములైన చంద్ర,బుధ, గురు, శుక్రులు  కేంద్రకోణములలో అనగా లగ్నమునకు 1,4,5,7,9,10 స్థానములలో ఉండవలెను లేదా 2,11 స్థానములలో ఉండవలెను అష్టమ స్థానమునందు పాప ,శుభ గ్రహాలు గానీ ఉండరాదు అష్టమమున ఏగ్రహములేక పోవడమే అష్టమ శుద్ధి ఆ విధంగానే లగ్నమున ఏగ్రహము లేకుండా ఉండడమే లగ్న శుద్ధి కానీ లగ్నమున శుభ గ్రహములు ఉండుట దోషములేదని లగ్నమున శుభ గ్రహములు ఉండుట గానీ లగ్నము శుభ గ్రహాలు వీక్షించడం లగ్నమునకు బలమని కొందరు అంటున్నారు ఈ పద్దతి ఆచారం లో ఉన్నది లగ్నమందు గురువు ఉండుట అత్యంత శుభప్రదము లేదా లగ్నమును గురువు చూచుట కూడా మంచిదే లగ్నమందు గురువు ఉండుట లక్ష దోషములు హరింప చేయునని శాస్త్రం. గర్భాదాన ముహూర్తమునకు కాక ఇతర ముహూర్తాలకు లగ్నము నందు ఎన్ని శుభ గ్రహములు ఉన్న లగ్నమునకు అంత బలము కానీ లగ్నమున చంద్రుడు ఉండుట మాత్రం కూడదు ముహూర్తాలు పెట్టుటలో పష్కరాంశలను చూచియే పెట్టుచున్నారు కానీ పుష్కరాంశ ఎంత ముఖ్యమో వర్గోత్తమాంశ అంతే ముఖ్యం

 లగ్నము మిత్ర ,వర్గోత్తమ స్వక్షేత్ర, ఉచ్చ స్థానము లందున్న మూడు శుభ గ్రహములతో కూడి ఉన్నను 3,6,11 లో పాపులు కేంద్రకోణాల్లో శుభులున్నా ఏకవింశతి మహాదోషాల్లో ఏఒక్కటి అయినా పట్టినా ఆ ముహూర్తం మృత్యు పదము లగ్నమందు చంద్రుడుండుట మహాదోషముగా కొందరు ఋషులు చెప్పిరి కానీ కొందరు ఉపనయనమునకు మాత్రమే లగ్నమందు చంద్రుడుండుట దోషమని ఇతర శుభముహూర్తాలకు దోషం కాదని చెప్పారు వివాహానికి కూడా లగ్నం చంద్రుడు దోషప్రదుడే కొందరు లగ్నానికి సప్తమమున శుక్రుడు ఉండరాదని చెప్పారు సప్తమమున శుక్రుడు ఆచారం లో తీసుకోవటం లేదు సూర్యోదయానికి రెండు ఘడియలు సూర్యాస్తమయము తర్వాత రెండు ఘడియలు ముహూర్తం పెట్టరాదు

No comments:

Post a Comment