Tuesday, September 11, 2018

గురువు జ్యోతిషం

గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి.ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి. ఆది వారంతో మొదలయ్యే వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు, వయసు ముప్పై, ప్రకృతి కఫ ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి, తత్వం ఆకాశ తత్వం, దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడు. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచిస్తాడు. గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు. గురువుకు మిత్రులు రవి, చంద్ర, కుజులు. శత్రువులు బుధ, శుక్రులు. సముడు శని. గురుదశ పదహారు సంవత్సరాలు. స్వభావం మృదు స్వభావం, సత్వగుణం, శుభ గ్రహం, జీవులు ద్విపాదులు, స్థానం ధనాగారం, అత్మాధికారత్వం జ్ఞానం, ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులు పుత్రుడు, గృహ స్థానం పూజ గది, ధన స్థానము, కాల బలం పగలు, స్థాన బలం లగ్నం, కాల ఆధిపత్యం మాసము, దిక్బలం తూర్పు, వర్ణం పసుపు వర్ణం, రాశిలో ఉండే కాలం ఒక సంవత్సరం, సమిధ రావి, మూలిక రావి అరటి వేరు, గోత్రము అంగీరస, వేదము ఋగ్వేదము, అవతారం వామనుడు.

రూపం
గురువుది స్థూల శరీరం, కపిల వర్ణ కనూలు, కపిల వర్ణ వెండ్రుకలు, పీతవర్ణ శరీర కాంతి కలవాడు. నాలుగు భుజములు కలిగి చేతులలో దండము, కమండలం, రుద్రాక్షమాల ధరించి ఉంటాడు. గురువు పీతాంబర ధారి, వాహనము సింహము. గురువు భార్య తార, తండ్రి అంగీరసుడు, తల్లి ప్రజాపతి మారీచి పుత్రిక అయిన సురూప.

గురువు కారకత్వం
ధనం,విద్య,పుత్రులు,జ్యేష్ట భ్రాత,దేహపుష్టి,బుద్ధి,అర్ధసంపద,యజ్ఞం,కీర్తి,గృహం,బంగారం,శస్త్రం,అశ్వం,మెదడు,జ్యోతిషం,వేదశాస్త్రం,శబ్ధశాస్త్రం, వాహనశాస్త్రం,ఆందోళికం,గంజం,యజ్ఞయాగాధి క్రతువులు,కర్మ,ఆచారం,ఛాందసం,సుజనత్వం,శాంతం,మంత్రిత్వం,ఐశ్వర్యం,బంధివృద్ధి,దయ, దాక్షిణ్యం,ధర్మం,దైవభక్తి,వస్త్రం,సత్యం,తర్కం,మీమాంస,సింహాసనం,వాగ్దోరిణి,పసుపురంగు,నృపసన్మానం,ధర్మం,వెండి,బ్రాహ్మణులు,జ్ఞానం, కోశాగారం,నవీనగృహం,బంధుసమూహం,సుబుద్ధి,ఉత్తరదిశ,కావ్యజ్ఞానం,నిక్షేపం,వైడూర్యం,ఊరువులు,అగ్నిమాంద్యం,దంతములు,వేదాంతజ్ఞానం, బ్రాహ్మణభక్తి,శ్రద్ధ,పాండిత్యం,బ్రాహ్మణవృత్తి,ఉపాద్యాయవృత్తి,ముద్రాధికారం,భాతృశుఖం,సంపత్తి,బహువిధ విద్వత్తు,వ్యాకరణం,రక్తం,పిత్తాశయం, రక్తనాళములు,ఉన్నత విద్యపై అధికారం,వాణిజ్య విషయములు,ధన విషయములు మొదలైనవి గురుగ్రహ కారకత్వాలు. ఆహార పదార్ధాలు నెయ్యి, నూనె, పాలు, వెన్నలకు కారకత్వం వహిస్తాడు. శనగలు, పనస కాయలు, దబ్బకాయలకు కారకత్వం వహిస్తాడు. పక్షులలూ పావురం, హంసలు జంతువులలో గుర్రములు, ఏనుగులకు, సింహములు వృక్షములలో వట వృక్షం కారకత్వం వహిస్తాడు. పుస్తకములు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, పూజారులు, ఫాదర్లు, బిషప్పులు, చర్చి మసీదు వంటి మత సంస్థలు, కరుణ, సంతోషం, పెట్టుబడులు, అభివృద్ధి, ఐశ్వర్యం, ఉపాసన, వీదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, నిజాయితీలను సూచిస్తాడు.

గురు ప్రభావం
గురు ప్రభావితులు స్థూలకాయం కలిగి మంచి ఆకారం కలిగి ఉంటారు. గురుగ్రహ ప్రభావితులకు ఆహారం, వస్త్రం వంటి జీవిత సౌఖ్యములు పుష్కలంగా ఉంటాయి. సంప్రదాయాల పట్ల గౌరవం, దైవభక్తి, పాండిత్యం, న్యాయ బుద్ధి, ధర్మనితరి, జ్ఞానం కలిగి ఉంటారు. చక్కని కంఠధ్వని, విశాల నేత్రాలు కలిగి ఉంటారు. విద్యావంతులై విద్యా సంస్థలతో సంబంధం కలిగి ఉంటారు. న్యాయశాస్త్ర అధ్యయనం, దేవాలయ వ్యవస్థ, విద్యా సంబదిత పదవులలో రాణిస్తారు.

పూజా విధానం
గురువుని పూజించుటకు బంగారు ప్రతిమను వాడాలి. దధ్యోజనం, శనగలు నైవేద్యం చేయాలి. శివ సహస్ర నామావళి, గురువుకుఆధిదేవత బ్రహ్మ, ప్రత్యధి దేవత ఇంద్రుడు కనుక వీరిని ఆరాధించాలి. దోష నివారణకు పసుపు వర్ణ వస్త్రములను దక్షిణ తాంబూలముతో దానం చెయ్యాలి. గురు అష్టోత్తర నామావళి, దత్త చరిత్ర, బ్రహ్మంగారి చరిత్ర వంటి గురు చరిత్రలను పారాయణం చెయ్యాలి. గురువుకు ఇష్టమైన వ్రతం అనఘా వ్రతం. గురువుకు ప్రీతికరమైన రోజు అషాఢ పూర్ణిమ. ధరించ వలసిన మాలలు చందన మాల, పుష్యరాగ మాలలు. పంచ ముఖ రుద్రాక్షను ధరించ వచ్చు. బంగారం, పసుపు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు దానం చెయ్యాలి. పసుపు రంగు పండ్లు, పసుపు రంగు పూలను పూజకు ఉపయోగించాలి. గ్రహశాంతికి చేయవలసిన జపం పదహారు వేలు. హోమముకు రావి చెట్టు పుల్లలను వాడాలి. గురువులను ఆరాధించుట, గురువు ఆలయాలను దర్శించుట, గురుదీక్షలను స్వీకరించుట వలన దోష నివారణ చేయవచ్చు.

*గోచారములోగురువు*

*కొన్ని విశేషములు*
*కారకత్వములు*:-
వృత్తులు :- గురువు న్యాయవాదులు, న్యాయ మూర్తులు, బోధకులు, ఉపాద్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, మత ప్రచారకులు, ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు. గురువు రవి చంద్రులతో కలిసిన బ్యాంకులు, అధ్యక్షులు, మేయర్, కౌన్సిలర్లు, పార్లమెంటు సభ్యులు, మేనేజరు, మేనేజింగు డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. గురు బుధులు కలిసిన విదేశీ భాషలు, ఎగుమతులు దిగుమతులు, సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులను సూచించును.
వ్యాధులు :- మధుమేహం, కాలేయము, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, బోధకాలు, చెమట, నీరు చేరటం, నిస్సంతానం, కాన్సర్ వంటి వ్యాధులు.గురువు చంద్రుడితో కలిసిన గర్భాశయ వ్యాధులు, శుక్రుడితో కలిసిన మధుమేహం, విచిత్రమైన కోరికలు, రవితో కలిసిన కొలెస్ట్రాల్, మూత్ర పిండ వ్యాధులు, అతిమూత్ర వ్యాధి, పసికర్లు కామెర్లు వంటి వ్యాదులను సూచించును.
గురువు అంగీరస నామ సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశీ గురు వారం ఉత్తర ఫల్గుణీ నక్షత్రం నాడు అంగీరస సురూపలకు పుత్రుడుగా జన్మించాడు.
క్షేత్రము.
స్వక్షేత్రము :- ధనసు మీనము.
ఉచ్ఛ క్షేత్రము :- కర్కాటకము.
శత్రుక్షేత్రము :- మిధునము, కన్య,
మిత్రక్షేత్రము :- మేషము, వృషభము, సింహము.
సమక్క్షేత్రము :- వృషభము, తుల.
నీచక్షేత్రము :- మకరము.
మూలత్రికోణ క్షేత్రము :- ధనసు.
గోచార రీత్యా శుభస్థానాలు :- 2,5,7,9,11.
గోచారరీత్యా అశుభస్థానములు:-1,3,4,6,8,12.
గ్రహాలు
మిత్ర గ్రహాలు :- సూర్యుడు, కుజుడు.
శత్రు గ్రహాలు :- బుధుడు.
సమ గ్రహాలు :- శని, శుక్రుడు.
వ్యధా గ్రహము :- చంద్రుడు.
నైసర్గిక బలగ్రహము :- శుక్రుడు.
గృహ స్వభావము.
స్వభావము :- శుభుడు.
ఇతరనామాలు :- శుభుడు, జీవ, అంగీరాస, వాచస్పతి, దేవేజ్యుడు.
లింగము :- పురుష.
జాతి :- బ్రాహ్మణ.
వర్ణము : - లేత పసుపు పచ్చ.
తత్వము :- ఆకాశతత్వము.
గుణము :- సత్వగుణము.
రుచి :- తీయన.
గ్రహోదయము :- ఉభయ.
జీవులు :- ద్విపాద.
గ్రహస్థానము ధనాగారము.
ఆధిపత్య దిక్కు :- ఈశాన్యము.
జలభాగము :- జల.
ఆత్మాధికారము :- జ్ఞానము.
పాలనాశక్తులు :- మంత్రి.
శరీరధాతువు :- కొవ్వు.
లోహము :- బంగారము.
కాలము.
కాలబలము :- పగలు, లగ్నము.
ఆధిపత్యకాలము :- మాసము.
దిన చలనము :- 4 నుండి 5 నిముషాలు.
రాశి సంచార కాలము :- 1 సంవంవత్సర కాలము.
రాశిలో ఫలము ఇచ్చు భాగము మధ్య భాగము.
ఋతువు :- హేమంతము
దిగ్బలము :- తూర్పు.
రూపము.
సూచించు ఎత్తు :- పొడుగు.
వయసు :- ముప్పై సంవత్సరాలు.
ప్రాంతము :- గోదావరి నుండి వింద్య పర్వత ప్రాంతాలు.
కారకత్వము.
కుటుంబసభ్యులు :- పుత్రులు.
గ్రహ వర్గము :- గురువు, పుజగది.
గ్రుహ భాగము :- ధనము దాచు ప్రదేశము.
అవయవములు:- కాలేయము, చిన్న ప్రేవులు.
సూచించు వ్యాధులు :- కాన్సర్లు, వ్రణములు, కామెర్లు, కాలెయముకు సంబంధిమ్చిన అవయవములు.
గ్రహదశకాలము :- 16 సంవత్సరాలు.
జీవనకారకత్వము :- భాగ్యకారకుడు.
సంబంధిత నక్షత్రములు :- పునర్వసు, విశాఖ, పుర్వాభద్ర.
వృక్షము:- వట వృక్షము.
ధాన్యము :- శనగలు.
పండ్లు :- పనస, తీయగుమ్మడి.
పక్షులు:- హంస, పావురము.
జంతువులు :- సింహము, ఏనుగు.
ద్రవ్యములు :- పసుపు.
ములిక :- అరటి, రావి వేరు.
వస్త్రము :- వాడిన వస్త్రము.
దైవీకము
దేవవర్గము :- వై ష్ణవ.
గోత్రము:-అంగీరస.
వేదము :- ఋగ్వేదము.
అవతారము :- వామనావతారము.
రూపము :- రాగి జుట్టు, గచ్చ కళ్ళు, రుద్రాక్షమాలాధారణ, కమండల ధారణ.
గ్రహారూఢ వాహనము :- సింహము.
పూజలు ఆరాధనలు.
గ్రహపూజకు వాడవలసిన లోహము :- బంగారము.
నైవేద్యము :- ధధ్యోదనము.
అధిష్టాన దేవత :- బ్రహ్మ.
అధిదేవత :- బ్రహ్మ.
ప్రత్యధిదేవత :- ఇంద్రుడు.
పండూగలు:- గురుపౌర్ణిమ, బ్రహ్మంగారి ఆరాధన.
ప్రసాదములు:- శనగలు, లడ్లు.
దక్షిణ :- వస్త్రములు.
ప్రీతికరమైన తిథి :- (అషాధ)గురుపౌర్ణిమ.
వ్రతము :- అనఘావ్రతము.
పారాయణ గ్రంథము:- బ్రహ్మంగారి చరిత్ర.
అష్టోత్తరము :- గురుగ్రహ అష్టోత్తరము.
సహస్రనామము :- శివ సహస్రము.
జపసంఖ్య:- 16000.
దీక్ష:- బ్రహ్మంగారి దీక్ష.
ధరించవలసిన మాల:- చందన మాల.
సమిధ :- రావి.
గ్రహశాంతికి చేయవలసినది.
రత్నము:- పుష్యరాగము.
రుద్రాక్ష:- పంచముఖి
దానము చేయవలసిన ద్రవ్యములు: పసుపు వర్న వస్త్రములు, పసుపు, బంగారము.
గ్రహాసనము:- దీర్ఘచతురస్రము.
గ్రహ సంఖ్య:- 3.
గ్రహదృష్టి:- 5,7,9.
వారము:- గురువారము.
గ్రహబల ఫలితము :- సమాజములో గౌరవము, ధనలాభము.
గ్రహ బలహీన ఫలితము:- ధననష్టము, పరువు నష్టము.
తండ్రి :- అంగీరసుడు.
తల్లి:- సురూప.
భ్రార్య:- తార.
చంధస్సు:- త్రిష్తుఫ్.
ద్వాదశస్థానాలలో గురువు సవరించు
లగ్నంలో గురువు ఉన్న జాతకుడు అదృష్టవంతుడు, సౌందర్యవంతుడు, నిర్భయుడు, సంతానవంతుడు, చీరంజీవి ఔతాడు.
ద్వితీయ స్థానమున గురువు ఉన్న జాతకుడు స్వచ్ఛమైన వాక్కులు కలవాడు, భోజనప్రియుడు, సుందరవదనుడు, ధనవంతుడు, విద్యావంతుడు ఔతాడు.
తృతీయ స్థానమున గురువు ఉన్న జాతకుడు కష్టజీవి, అమర్యాదస్తుడు, ఖ్యాతి కలిగిన సోదరవర్గం ఉన్నవాడు, పాపకార్యములు చేయువాడు మాయావి ఔతాడు.
చతుర్ధ స్థానమున గురువు ఉన్న జాతకుడు సుఖజీవి, తల్లి, సేవకులు, భార్యా పుత్రులు, బంధువులతో కలిసి జీవించు వాడు, సంపద్వైభవం కలవాడు ఔతాడు.
పంచమస్థానమున గురువు ఉన్న జాతకుడు పుత్రుల వలన క్లేశములు అనుభవిస్తాడు. మేధావి, మంత్రి పదవిని అలంకరించు వాడు ఔతాడు.
షష్టమ స్థానమున గురువు ఉన్న జాతకుడు నిరుత్సాహి, అగౌరవములు పొందువాడు, శతృనాశకుడు, మంత్రభినివేశనం కలవాడు ఔతాడు.
సప్తమమున గురువు ఉన్న జాతకుడుఊతి ఉదారుడు, మంచి కళత్రం కలవాడు, మంచి పుత్రులను కలిగినవాడు, వినయసంపన్నుడు ఔతాడు.
అష్టమ స్థానమున గురువు ఉన్న జాతకుడు కడుబీదవాడు, అతి తక్కువ సంపాదనా పరుడు, పాపి, చిరంజీవి ఔతాడు.
నవమస్థానమున గురువు ఉన్న జాతకుడు ఖ్యాతి వహించిన మంత్రిగానూ, సంతతి కలవాడు, ఐశ్వర్యం కలవాడు, పవిత్రకార్యములందు అనురక్తుడై ఉంటాడు. ఉంటాడు.
దశమ స్థానమున గురువు ఉన్న జాతకుడు రుజువర్తనుడు, పవిత్రకార్యములు చేసి ప్రఖ్యాతి చెందు వాడు, బహుధనవంతుడు, రాజమిత్రుడు ఔతాడు.
ఏకాదశ స్థానమున గురువు ఉన్న జాతకుడు ధనవంతుడు, నిర్భయుడు, వాహనములు కలవాడు, చిరంజీవి, అల్పసంతానవంతుడు ఔతాడు.
దశమస్థానమున గురువు ఉన్న జాతకుడు ఇతరులచేత అసహ్యించుకొనబడువాడు, అసంగతములు పలుకువాడు, అప్రమత్తుడు, పాపము చేయువాడు, అలసట పొందువాడు ఔతాడు.                లాభస్ధానమున గురువు ఉన్న సర్వవిధ లాభములు కలవాడు.మంచి శుభములు కలవాడు.మంచి కీర్తి ప్రతిష్టలు కలవాడు. ఐశ్వర్యవంతుడు అగును.                                   వ్యయస్థానమున గురువు ఉన్న శుభమూలక ధనవ్యయములు కలవాడు.మోక్షాపేక్ష గలవాడు.కొలదిగా దేహ అనారోగ్యం కలవాడు ఔతాడు.

No comments:

Post a Comment