Wednesday, September 5, 2018

గుళికుని (మాంది)ఫలము

గుళికుని (మాంది)ఫలము

గుళిక లగ్నమున ఉన్న జాతకుడు - రోగార్తుడు,కాముకుడు,పాపాత్ముడు శఠుడు,దుష్టస్వభావుడు,దుఃఖితుడు అగును.ద్వితీయమున ఉన్న - వికృతుడు,దుఃఖితుడు,క్షుద్రుడు,వ్యసనము కలవాడు,సిగ్గులేనివాడు,నిర్ధనుడు అగును.తృతీయమున ఉన్న - సుందరుడు,గ్రామాధికారి,పూణ్యకర్మలు చేయువాడు,సజ్జనప్రియుడు,రాజపూజితుడు అగును; చతుర్ధమున ఉన్న - రోగి సుఖము లేనివాడు,ఎప్పుడును చెడుపనులు చేయువాడు,వాతపిత్తము లేక్కువ కలవాడగును.పంచమమున ఉన్న - పరనిందకుడు,దరిద్రుడు,అల్పయుష్కుడు,ద్వేషి,క్షుద్రుడు,నపుంసకుడు,స్త్రీజితుడు,నాస్తికుడు నగును.షష్ఠమందున్న - శత్రువులు లేనివాడు,పుష్టియైన శరీరము కలవాడు,ప్రకాశించువాడు,స్త్రీకిష్టుడు,ఉత్సాహవంతుడు,దృఢమైనవాడు,హితుడు నగును.సప్తమమందున్న - స్త్రీజితుడు,చెడుపనులు చేయువాడు,జారుడు,బక్కవాడు,స్నేహము లేనివాడు,స్త్రీధనముతో బ్రతుకువాడు అగును.అష్టమమందున్న - ఆకలిగోన్నవాడు,దుఃఖితుడు,క్రూరుడు,తీక్షరోగుడు,దయలేనివాడు,దరిద్రుడు,గుణరహితుడు,నగును.నవమమందున్న - ఎక్కువ కష్టములు కలవాడు,బక్కవాడు,దుష్టకర్ముడు,దయలేనివాడు,లోభి,గుణహీనుడు,దశమమందున్న - పుత్రులు కలవాడు,సుఖి,భోగి,దేవతాపూజులు,అగ్నిహెూత్రము చేసికొనువాడు,యెాగమును ధర్మమును అశ్రయించినవాడగును.ఏకాదశమందున్న - సుఖి,భోగి,ప్రజాధ్యక్షుడు,బంధువులకు హితము చేయువాడు,బక్కవాడు,జనమాన్యుడు అగును.వ్యయమున ఉన్న - నీచకర్మలు చేయువాడు పాపుడు,సన్నని శరీరము కలవాడు,కురూపి,బద్ధకస్తుడు,నీచులన్న నిష్టము కలవాడు అగును.
 ప్రాణపద ఫలములు,
ప్రాణపదగ్రహము లగ్నమున ఉండగా పుట్టిన జాతకుడు - మూగవాడు,ఉన్మత్తుడు,బక్కవాడు,దుఃఖితుడు,చిక్కినవాడు,క్షీణుడు,రోగి,అగును.ద్వితీయమందున్న - ఎక్కువగా ధనము ధాన్యము సేవకుడు,సంతానముకలవాడు,సుందరుడు అగును.తృతీయమందున్న - హింస చేయువాడు గర్వి,నిష్ఠురుడు,దుర్జనుడు,గురుభక్తి లేనివాడు అగును.చతుర్థమందున్న - సుఖి,సుందరుడు,మిత్రుడు,స్త్రీకిష్టుడు,గురుభక్తి కలవాడు,సత్యతత్పరుడు,సాధువైన వాడగు
ను.పంచమమందున్న - సుఖము కలవాడు,మంచిపనులు చేయువాడు,దయకలవాడు,కోరికలు కలవాడగును. షష్టమందున్న - బంధువులకు శత్రువులకు వశుడు,తీక్ష్ణుడు,అజీర్ణము కలవాడు,నిర్దయుడు,దుష్టుడు,రోగి,ధని,అల్పాయుష్కుడు.సప్తమమందున్న - ఈర్షపడువాడు,కాముకుడు,తీవ్రమైన భయంకరమైన శరీరము కలవాడు,సేవించుటకు ఇష్టమైనవాడు,దుర్బద్ధి కలవాడు అగును.అష్టమమందున్న - రోగము కలవాడు,రాజులు,బంధువులు,సేవకులు,పుత్రులు పెట్టు కష్టములకు బాధపడువాడు.నవమమందున్న - పుత్రులు కలవాడు. ధనసంపన్నుడు,రూపసి,చూడముచ్చటైనవాడు,సేవకుడు,మంచివాడు,పండితుడు,(అన్నియు తెలిసినవాడు).దశమమందున్న - వీర్యవంతుడు,బుద్ధిమంతుడు,నేర్పరి,రాజకార్యకోవిదుడు,దేవార్చన పరాయణుడు.లాభమందున్న - పసిద్ధుడు,గుణవంతుడు,ప్రాజ్ఞుడు,భోగి,ధనవంతుడు,తెల్లని శరీరము కలవాడు,అభిమానము కలవాడు.వ్యయమందున్న - నీచుడు,దుష్టుడు,బక్కవాడు,బ్రాహ్మణులను బంధువులను ద్వేషించువాడు,నేత్రరోగి కావచ్చును.లేదా కాయకంటివాడగును. 

No comments:

Post a Comment