Wednesday, September 5, 2018

దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది? what is Durmuhurtha in Vedic Astrology ?

దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది?

మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.

నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు. గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.

దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58కు మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50కు, బుధ వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-54కు, శుక్రవారం మధ్యాహ్నం 12-28కు శనివారం ఉదయం 2-40కు దుర్మహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చను.

2 comments:

  1. తెలుగువారికి రాహుకాలాన్ని పాటించటం అనే సంప్రదాయం లేదు. ఇటీవలి పంచాంగకర్తల అత్యుత్సాహం అనండీ, తమిళప్రాంతానికి దగ్గరగా ఉన్నప్రాంతాలకి సోకిన కారణంగా అనండీ, ఈ రాహుకాలాన్ని పాటించటం తెలుగువారికీ ప్రాకింది. అనవసరమైన విషయం అది. ఇంకా దారుణం ఏమిటంటే దినప్రమాణంతో సరిచేయకుండా (ఉదా. ఆదివారమూ సా, 4ః30 అన్నట్లుగా) స్థిరమైన సమయాలతో ప్రచారం చేస్తున్నారు ఇటీవల. ఇది ఏమీ బాగులేదు.

    ReplyDelete
  2. What is "Gulika Kalam" ....What things to do and not do in this time frame.Please clarify.

    ReplyDelete