Wednesday, September 5, 2018

విశ్వకర్మ వాస్తు శాస్త్రం - పురాతన వాస్తు శాస్త్రం

విశ్వకర్మ వాస్తు శాస్త్రం  -  పురాతన వాస్తు శాస్త్రం .

 * తేనెపట్టు పట్టు పెట్టిన చెట్లు , దేవతల పేరున ఉన్న మ్రానులు, పదిమంది క్రింద కూర్చొని వ్యవహారాలూ చేయు చెట్లు, మునులకు ఆవాసాలగు వృక్షములు , ఒకదానికొకటి ఒరుసుకుంటున్న చెట్లు , పైన మూలికలు మొలచియున్న చెట్లు , ఏనుగులు కట్టియున్న చెట్లు , క్రింద వీరుల ప్రతిమలు నిలిపియున్న చెట్లు గృహ నిర్మాణముకు పనికిరావు.

 * నక్షత్ర పరంగా శత్రు వృక్షముల యెక్క కలప గృహ నిర్మాణం నందు ఉపయోగించరాదు.

 * నరికిన చెట్లు దక్షినముకు గాని , పడమటికి గాని ధ్వని చేయుచూ పడిన చెరుపు కలుగును. తూర్పునకు గాని , ఉత్తరముకు గాని వ్రాలిన యెడల మేలు కలుగును.

 * చండ్ర , బట్టకడిమి , రుద్ర గణము , చందనము, ఇనుమద్ది, వేప, వెలమ, టేకు, వెదురు, వడిస , కొడిస, కోడిది , కడిమి, మ్రోక్కము ఈ మానులు ఇండ్లు కట్టుటకు పనికి వచ్చును.

 శంఖు స్థాపనము  -

 * శంఖువు స్థాపించుటకు శుక్ల పక్షము మంచిది. కృష్ణ పక్షము మంచిది కాదు.

 * నంద తిధులు అయిన పాడ్యమి, షష్టి, ఏకాదశి,  రిక్త తిధులు అయిన చవితి, నవమి, చతుర్ధశి ఈ ఆరు తిధుల యందు , అమావాస్య నందు శంఖువు స్థాపించ కూడదు . బుధ, గురు, శుక్రు వారములు సౌఖ్యకరములు.

 * శతబిషం , శ్రవణము , ఉత్తరాషాడ, హస్త, రేవతి, స్వాతి, రోహిణి, మృగ శిర, అశ్విని, చిత్ర, పుష్యమి, ఉత్తర, పునర్వసు, అనురాధ, ధనిష్ఠ, ఈ 15 నక్షత్రముల యందు శంఖుస్థాపన శుభకరము.

 శంఖుస్థాపన , స్థంభ ప్రతిష్ట చేయుటకు సమయములు  -

 * శంఖుస్థాపన , స్తంభప్రతిష్ట చేయుటకు మొదటిజాము శ్రేష్టము, రెండొవ యామము సంతోషం గూర్చును, మూడోవ యామము మధ్యమం, నాలుగొవ యామమున, సంధ్యాకాలం నందు,రాత్రుల యందు శంఖుస్థాపన , స్తంభప్రతిష్ట చేయకూడదు.

 శంఖువు తయారు చేయుటకు కలప  -

 * చందనము, మద్ది, కానుగ , శ్రీచందనము, అగరు,
దేవకాంచనము , టేకు, కొడిస, వెదురు, వేప , మారెడు, అత్తి , చండ్ర అనునవి శంఖువు తయారీకి మంచివి.

 శంఖువు తయారీకి కలప ప్రమాణము  -

 6 అంగుళముల వలయము, 24 అంగుళముల పొడవు గల దారువు బ్రాహ్మణులకు , 23 అంగుళముల పొడవుగల దారువు క్షత్రియులకు శ్రేష్టము , 14 అంగుళముల దారువు వైశ్యులకు మంచిది. 12 అంగుళముల దారువు శూద్రులకు తగినది. 12 అంగుళముల దారువు యెల్లరికి శ్రేష్టము.

 శంఖు నిర్మాణము  -

 మునుపు చెప్పిన దారువులలో దోషము లేనిదానిని తెచ్చి మూడు భాగములుగా గుర్తించి మొదటి బాగమును చౌకముగాను , రెండొవ బాగమును 8 ఇంచులు గలదిగాను, మూడోవ బాగమును లింగాకారము గాను చెక్కవలెను .

 శంఖుస్థాపన విధి  -

 యజమాని స్నానము చేసి , వస్త్ర భరణము లు ధరించి శంఖమునకు పసుపు పూసి గంధ, పుష్ప అక్షింతలతో అలంకరించి దానిని ధాన్యపు రాసిపైన ఉంచవలెను. తరువాత పుణ్య వచనం చేసి , మంగళ వాయిద్యాలు మ్రోగిస్తూ , షోడశోపచారములు తో వాస్తు పురుషున్ని పూజించ వలెను.

విశ్వకర్మ వాస్తు శాస్త్రం  - ప్రాచీన వాస్తు శాస్త్రం 2

గృహము నిర్మించుటకు అనుకూలమైన భూమి నిర్ణయం  -

 గట్టియయిన, ఉత్తర దిశను , తూర్పు దిశను పల్లముగా ఉన్నటువంటి భూమి శ్రేష్టమైనది. గంభీరమైన భూమి బ్రాహ్మణులకు , క్షత్రీయులకు ఉన్నతమైన భూమి , వైశ్యులకు సమమైన భూమి , శూద్రులకు వికటాకారం గల భూమి శ్రేష్టములు అయినవి. సర్వ వర్ణములు గల వారికి సమమగు భూమి శ్రేష్టమైనది.
               
                 నాల్గు వీధుల మొగయు , గొప్ప వృక్షములు కలదియు, దేవతలు , మంత్రులు నివసించినది, గ్రామమునకు , పట్టనముకు దూరము ఉన్నది , భుగార్తములు తో కుడిదియనగు భూమి లొ గృహనిర్మాణం చేయరాదు .

 భూమి ఆకారం  -

 చతురస్రాకార భూమి మిగుల ధన్యమైనది, ఏనుగు వంటి ఆకారం గల భూమి ఐశ్వర్య ప్రధమైనధి. సింహాకారం గల భూమి గునవంతులగు పుత్రులను వ్రుషభాకారం గల భూమి పశు సమృద్ధిని కలిగించును. గుండ్రని భూమి ధనమోసుగును. భద్ర పీటాకారపు భూమి అట్లే భద్రమైనది. త్రిశులాకారపు భూమి ధన , సుఖములు వోసుగుట యే కాక శౌర్యవంతులగు పుత్రులను వోసుగును.లింగాకారం గల భూమి లింగాదారులకు శ్రేష్టమైనది. ప్రాసాద ద్వాజాకారములు గల భూమి ఉన్నత పదవిని వోసుంగును . కుమ్బాకరం గల భూమి ధనవ్రుద్ధిని కలిగించును. త్రికోణ, బండి , బాట,ఆకారములు గల భూమి క్రమముగా సుతహాని, సౌఖ్యహాని, ధన హాని, ధర్మహాని వాటిని కలిగించును.

 భూ పరీక్షా విధానం -

 స్థల పరీక్షకు గృహ నిర్మాణము చేయదలచిన భూమిలో ఒక హస్తము పొడువు అంతే వెడల్పు , అంతే లోతుగల ఒక గోతిని త్రవ్వి , ఆ మన్నుతోనే తిరిగి ఆ గొతిని నింపగా మన్ను మిగిలిన యెడల శ్రేష్టము, సరిగా సరిపడిన యెడల మధ్యమము, తక్కువు అయిన యెడల అధమఫలం నోసుగును.

             ఆ గోతిలో జలము పోసి నింపి, నూరడుగులు వడిగా నడిచిపోయి , వెనకకు వచ్చి గొతిని పరీక్షిమ్పగా జలము తగ్గక యున్దినచో శుభప్రదమని తెలుసుకొనవలెను.

 గృహము కట్టబోవు స్థలములో పరీక్షించుట

 నేతిని బోసి నాల్గుదిక్కులకును నాలుగు వత్తులు వేసి వానిని వెలిగించగా అన్ని దిక్కులకు సమముగా వెలిగించినచో సంపూర్ణ ఫలం వొసుగును.

       తూర్పు ముఖముగా ఉన్న భూమి వైపు అధికముగా వెలిగినచో బ్రాహ్మణులకు అనుకూలం అయిన భూమిగా , దక్షినాభి ముఖం కలిగిన వత్తి అధికముగా వెలిగినచొ క్షత్రీయులకు వాస యోగ్యమైన భూమి అనియు, పశ్చిమాభి ముఖం కలిగిన వత్తి అధికం గా వెలిగిన వైశ్యులకు అనుకులమైన భూమి , ఉత్తరాభి ముఖం కలిగిన వత్తి అధికముగా వెలిగిన శూద్రులకు శ్రేయస్కరం .

          గృహనిర్మాణం చేయదలచిన వారు భూమిని నాగలిచే సమానం గా దున్నవలెను . తరువాత సర్వ భీజములు నాటవలెను . ఆ బీజములు మూడు రాత్రులలో మొలకెత్తిన ఉత్తమ భూమి అనియు, ఐదు రాత్రులలో మొలకెత్తిన అధమ ఫలప్రధమం అయిన భూమి అని నిర్దారించవలెను. భూపరీక్ష కోసం తిలలు, యావలు వాడవలెను. సర్వ ధాన్యములు కుడా చల్లవచ్చును. ఎచ్చట బీజములు మొలకేత్తవో అట్టి భూమి వాసయోగ్యం గానిదని తెలుసుకుని అందు గృహనిర్మాణం విడువ వలెను. సర్వ ధాన్యములు అనగా వడ్లు, శాలి , పెసలు, తిల, యవలు , గోధుమ , సర్ఫష అను ఏడు విధాలు అగు ధాన్య విశేషాలు .

 గృహ నిర్మాణమునకు శుభకాలము  -

 చైత్రమున గృహము నిర్మించినచో వ్యాదిభయం , వైశాఖమున ధనము, రత్నములు లభించును. జైష్టమాసమున మరణము సంభవించును. ఆషాడ మాసమున భ్రుత్యులు, రత్నములు సిద్ధించును కాని పశులాభం కలగనేరదు. శ్రావణ మాసం నందు మిత్రలాభం, భాద్రపదం న హానియు , ఆశ్వీయజమున యుద్ధభయం, కార్తీకమున ధనధాన్యాలు, మార్గాశీరమున ధనవ్రుద్ధియు , పుష్యమున దొంగల భయం, మాఘమాసం నందు అగ్ని భయం , ఫాల్గుణ మాసం నందు లక్ష్మీ వ్రద్ధియు కలుగును.

No comments:

Post a Comment