Friday, December 28, 2018

ప్రయాణములకు అనుకూల సమయాలు తెలుసుకుందాం..!

మానవుడు తన నిత్యజీవితంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు... ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో శాస్త్రాలు వివరించాయి.

సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. అలాగే, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది.

అలాగే శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణమే పెట్టుకోరాదు.

విదియ, తదియరోజులల్లోకార్యసిద్ధి, పంచమినాడు శుభం. సప్తమినాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు జరుగుతాయి. దశమిరోజు ధనలాభం. ఏకాదశి కన్యలాభమంత సౌఖ్యం. త్రయోదశి శుభాలను తెస్తుంది.

ఇక శుక్ల పాడ్యమి దుఃఖాన్ని కలిగిస్తుంది. చవితినాడు ఆపదలు వచ్చే అవకాశం. షష్ఠీనాడు అకాల వైరాలు. అష్టమినాడు అష్టకష్టాలు. నవమినాడు నష్టాలు. వ్యధలు కలుగుతాయి. ద్వాదశి నాడు మహానష్టాలు. బహుళ చతుర్ధీనాడు ప్రయాణం చేస్తే చెడును కలిగిస్తుంది. శుక్ల చతుర్దశినాడు ఏ పని కాదు.

ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాఢ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదు.

అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది.

పౌర్ణమి, అమావాస్యనాడు ప్రయాణాలు

మానవుడి మనసుపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. చంద్ర గ్రహ ప్రభావం మనసుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు ఉంటాయి కదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు. మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం. అందుకే, ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చేయవద్దని చెబుతారు. మొత్తానికి పూర్ణిమి రోజు పనులు ఏవి కావు.

ఇక అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు. దీంతో రాత్రి పూట వెలుతురు చాలా తక్కువగా వుంటుంది. అందుకే అమావాస్యనాడు అర్ధరాత్రి ప్రయాణాలు చేయకూడదంటారు. వెలుతురు తక్కువగా ఉండటం మూలంగా దారి సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు, చీకట్లో దొంగల భయం కూడా ఉండవచ్చు. మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనన్నా ఆగినా ఇబ్బంది పడవచ్చు. రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చేయవద్దు. మొత్తానికి అమావాస్యనాడు ప్రయాణం చేస్తే ఆపదలు వస్తాయని శాస్త్రం చెబుతోంది....

పంచ భూతాలతోనే మంచి ఫలితాలు

మానవుని జీవనాన్ని శాసించేవి, సృష్టికి మూలమైనవి పంచ భూతాలు. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి.. వీటిని సక్రమంగా ఉపయోగించటం ద్వారానే మానవుడు తన ఆరోగ్యకరమైన జీవితానికి బంగారు బాటలు వేసుకుంటాడు. అలానే మనం ఒక స్ధలం కొన్నా, ఒక ఇల్లు కొన్నా సుఖమైన జీవితాన్ని ఆ ఇంట్లో సాగించాలంటే అవే పంచభూతాలు కొన్న ఆ ప్రదేశాలలో వాస్తు పరంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే ఆ ప్రదేశాన్ని కచ్చితమైన వాస్తుతో ఉన్న స్థలం లేదా ఇల్లు అంటాం. అలాంటి చోట శుభకరమైన ఫలితాలు ఉంటాయి.

నిజానికి వాస్తుశాస్త్రం పంచభూతాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వాస్తు ప్రకారం గృహ నిర్మాణాన్ని చేపట్టేవారు ప్రకృతికి సంబంధించిన పంచభూతాలకు కూడా తప్పక ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. అదేసమయంలో పంచ భూతాలకు హిందూ శాస్త్రంలో మంచి ప్రాధాన్యత ఉండటం అందరికీ తెలిసిన విషయమే. ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారని వాస్తుశాస్త్రం చెబుతోంది. పంచభూతాలకు అధిదేవతలైనవారి ప్రాముఖ్యాన్ని బట్టి గృహనిర్మాణం జరగడం ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లైతే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయి.

ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంట గదిని అమర్చటం చేస్తే మంచి ఫలితాలను లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్‌మెంట్‌ను నిర్మించుకోవాలి. దీనిప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది.

సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్నీ ప్రాంతాలకు వ్యాపించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచటంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ది సూచనలు కూడా అధికంగా కానవస్తాయి.

ఒక్కో ప్రదేశాన్ని బట్టి ఈ పంచభూతాలు అన్నీ సరిగా లేకపోవచ్చు. ఆ ప్రభావం కారణంగా వాటిలో నివసించే వారికి రకరకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాంటపుడు వాస్తు నిపుణులని కలిసి ఆయా ప్రదేశాలనిగాని, ఇళ్లనుగాని చూపించుకొని ఏవైతే సరిగాలేవో వాటిని శాస్త్ర ప్రకారం సమతుల్యంగా చేయంచుకొని సుఖమైన జీవితాన్ని గడపవచ్చు. ఉదాహరణకి కొన్న స్థలంలోగాని, ఇంటిలోగాని ఏదైనా భాగం కోత ఏర్పడితే ఒక విధంగా, నీటి సమస్య అయతే మరో విధంగా, ఇంటి కప్పు దోషం అయతే ఇంకో విధంగా, వంటగదుల్లో ఫ్లాట్ ఫాంల అమరికలో దోషాలుంటే వేరే విధంగా, స్థలంలో గాలి, వెలుతురు సరిగా లేకుంటే ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. ఏవైనా దోషాలుంటే వాటిని చక్కగా వాస్తు ప్రకారం సరిచేయవచ్చు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూస్తే..

తూర్పు -  ఆరోగ్యం, ఆనందం, గృహంలో శాంతి, సంపద చేకూరటం,
పడమర -  సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
ఉత్తరం -  వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
దక్షిణం -  అదృష్టం, వినోదం, కీర్తి,
వాయువ్యం -  తండ్రికి మంచి అభివృద్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
నైఋతి -  తల్లికి సౌఖ్యం, వివాహ సఫలం,
ఈశాన్యం -  వృత్తి పరమైన అభివృద్ధి,
ఆగ్నేయం  -  అదృష్టం

భూమి పూజ
గృహ నిర్మాణం సమయంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి భూమి పూజ. దీనిని శంకుస్థాపన అని కూడా అంటారు. మన పంచభూతాల సమన్వయంతో నిర్మించ తలపెట్టిన గృహ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చిరకాలం ఈ భూమిపై నిలవాలనే ఆకాంక్షతో భూదేవిని ప్రార్థిస్తూ చేసే పూజే భూమి పూజ..

కుజదోష ఫలములు వివరణ ..

కుటుంబేచ వ్యయే సౌఖ్యే । సప్తమే చాష్టమే కుజే ।
నరాణాం స్త్రీ వధం కుర్యాత్ । స్త్రీణాం భర్తృవధం తథా ॥
2,12,4,7,8 ఈ రాశులందు కుజుడున్నచో పురుషులకు భార్యా వియోగము, స్త్రీలకు భర్తృ వియోగము గలదు.

"కించ" అర్కేందు క్షేత్రజాతానాం కుజదోషో న విద్యతే ।
అర్కుడనగా సూర్యుడు, ఇందు అనగా చంద్రుడు. సూర్యుని రాశి సింహము. చంద్రుని రాశి కర్కాటకము. సింహ కర్కాటక రాశి జాతకులకు కుజదోషం రాదు.

"కించ" స్వౌచ్చ మిత్ర భ జాతానాం పీడకో న భవఎత్కుజః ।
అంగారకునికి స్వక్షేత్రములగు మేష వృశ్చిక రాశులలోను ఉచ్ఛ అయిన మకరము నందు, కుజునికి మిత్రులగు గురు, రవి రాశులైన ధనుః , మీన, సింహ రాశులలో జన్మించు వారికి కుజదోషం లేదు.

కించ దేవకేరళే ॥ ద్వితీయే భౌమదోషస్తు యుగ్మకన్యకయోర్వినా ।
మిధున, కన్య రాశులందు పుట్టిన వారికి రెండవ యింటయందున్న కుజదోషము లేదు.

ద్వాదశే భౌమదోషస్తు వృషతౌళిక యోర్వినా ।
తుల, వృషభ రాశులందు పుట్టినవారికి పండ్రెండింటనున్న కుజదోషము లేదు.

చతుర్థే భౌమదోషస్తు మేష వృశ్చిక యోర్వినా ।
మేష, వృశ్చిక రాశులందు పుట్టినవారికి నాల్గవయింటవున్న  కుజదోషము లేదు.

సప్తమే భౌమదోషస్తు నక్ర కర్కట యోర్వినా ।
మకరము, కర్కాటకములందు జన్మించు వారికి సప్తమ స్థానమందున్న కుజదోషము లేదు.

అష్టమే భౌమదోషస్తు ధనుర్మీన ద్వయోర్వినా ।
ధనూరాశి, మీనా రాశి జాతకులకు అష్టమ స్థానమునందున్న కుజదోషము లేదు.

కుంభే, సింహే నదోష స్స్యాత్ ।

కుంభ, సింహ రాశి జాతకులకు కుజదోష ప్రసక్తి లేదు.

గురు మంగళ సంయోగే భౌమదోషే న విద్యతే ।
కుజుడు, గురువుతో కలసియున్ననూ, గురుదృష్టి కుజుని పైనున్ననూ ఆ జాతకులకు కుజదోషము లేదు.

ద్విరతీయే ద్యూన గే పుంసాం స్త్రీణాం  చత్వారి రి వృగే ।
పురుషులకు సప్తమ, ద్వితీయ స్థానాల్లో కుజుడు మిక్కిలి దోషకారి. స్త్రీలకు చతుర్థ, అష్టమ స్థానములో ఉన్న కుజుడు మిక్కిలి అపాయకారి.

ఉభయోరష్టమం రోషం భౌమదోషం వదెద్బుధః ।
స్త్రీపురుషులకు అష్టమ స్థానంలో చాలా ప్రమాదకారి.

దంపత్యోర్జన్మకాలే వ్యయ ధన హి ఋతే సప్తమే రంధ్ర లగ్నే ।
లగ్నా చంద్రాచ్చ శుక్రాదపి ఖలు నివసన్ భూమి పుత్రా స్తయోశ్చ ॥

భార్యాభర్తల జన్మ రాశికి ద్వాదశ, ద్వితీయ, చతుర్థ, అష్టమ లగ్నములలో ఎక్కడ కుజుడున్ననూ దోషకారి. ఈ దోషము జన్మలగ్నమునుండి గాని, చంద్రుడున్న రాశినుండి గాని, శుక్రుడున్న రాశినుండి గాని, కుజదోషమును చూచుకోవలయును. దంపతులకు జన్మరాశి, చంద్రరాశి, శుక్రరాశుల నుండి ఎక్కడ కుజదోషమున్ననూ అది పరిహార శక్యము.

దాంపత్యం దీర్ఘకాలం నుత ధనబహుళం పుత్రలాభం చ సౌఖ్యం ।
దద్యాదేకత్ర హీనో మృతిరఖిలభయం పుత్రనాశం కరోతి ॥

పైన చెప్పిన రీతిలో నున్న కుజదోషము పరిహారమైనచో దంపతులకు సుఖదాంపత్యం, సంతానం, ధనవృద్ధి, సౌఖ్యం సిద్దించును. ఇరువురిలొ ఏ ఒక్కరికి కుజదోషమున్ననూ మరణము, భయము, గర్భశోకము కలుగును...

Tuesday, December 25, 2018

దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది?

మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.

నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు. గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.

దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58కు మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50కు, బుధ వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-54కు, శుక్రవారం మధ్యాహ్నం 12-28కు శనివారం ఉదయం 2-40కు దుర్మహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును.

పంచకరహితము
ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి. 1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగపంచకం ఇవి దోషకరమైనవి.

శూన్యమాసము
శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు.

మూఢము లేక మౌఢ్యమి
రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు.

కర్తరి - ఏయే కార్యములయందు జరిగించరాదు ?
కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, నుయ్యి త్రవ్వట, దేవతా ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు.

త్రిజ్యేష్ట విచారణ
తొలుచూలు వరుడు, తొలిచూలు కన్యక జ్యోష్ట మాసం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీనిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు జ్యేష్టములు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే..