కుటుంబేచ వ్యయే సౌఖ్యే । సప్తమే చాష్టమే కుజే ।
నరాణాం స్త్రీ వధం కుర్యాత్ । స్త్రీణాం భర్తృవధం తథా ॥
2,12,4,7,8 ఈ రాశులందు కుజుడున్నచో పురుషులకు భార్యా వియోగము, స్త్రీలకు భర్తృ వియోగము గలదు.
"కించ" అర్కేందు క్షేత్రజాతానాం కుజదోషో న విద్యతే ।
అర్కుడనగా సూర్యుడు, ఇందు అనగా చంద్రుడు. సూర్యుని రాశి సింహము. చంద్రుని రాశి కర్కాటకము. సింహ కర్కాటక రాశి జాతకులకు కుజదోషం రాదు.
"కించ" స్వౌచ్చ మిత్ర భ జాతానాం పీడకో న భవఎత్కుజః ।
అంగారకునికి స్వక్షేత్రములగు మేష వృశ్చిక రాశులలోను ఉచ్ఛ అయిన మకరము నందు, కుజునికి మిత్రులగు గురు, రవి రాశులైన ధనుః , మీన, సింహ రాశులలో జన్మించు వారికి కుజదోషం లేదు.
కించ దేవకేరళే ॥ ద్వితీయే భౌమదోషస్తు యుగ్మకన్యకయోర్వినా ।
మిధున, కన్య రాశులందు పుట్టిన వారికి రెండవ యింటయందున్న కుజదోషము లేదు.
ద్వాదశే భౌమదోషస్తు వృషతౌళిక యోర్వినా ।
తుల, వృషభ రాశులందు పుట్టినవారికి పండ్రెండింటనున్న కుజదోషము లేదు.
చతుర్థే భౌమదోషస్తు మేష వృశ్చిక యోర్వినా ।
మేష, వృశ్చిక రాశులందు పుట్టినవారికి నాల్గవయింటవున్న కుజదోషము లేదు.
సప్తమే భౌమదోషస్తు నక్ర కర్కట యోర్వినా ।
మకరము, కర్కాటకములందు జన్మించు వారికి సప్తమ స్థానమందున్న కుజదోషము లేదు.
అష్టమే భౌమదోషస్తు ధనుర్మీన ద్వయోర్వినా ।
ధనూరాశి, మీనా రాశి జాతకులకు అష్టమ స్థానమునందున్న కుజదోషము లేదు.
కుంభే, సింహే నదోష స్స్యాత్ ।
కుంభ, సింహ రాశి జాతకులకు కుజదోష ప్రసక్తి లేదు.
గురు మంగళ సంయోగే భౌమదోషే న విద్యతే ।
కుజుడు, గురువుతో కలసియున్ననూ, గురుదృష్టి కుజుని పైనున్ననూ ఆ జాతకులకు కుజదోషము లేదు.
ద్విరతీయే ద్యూన గే పుంసాం స్త్రీణాం చత్వారి రి వృగే ।
పురుషులకు సప్తమ, ద్వితీయ స్థానాల్లో కుజుడు మిక్కిలి దోషకారి. స్త్రీలకు చతుర్థ, అష్టమ స్థానములో ఉన్న కుజుడు మిక్కిలి అపాయకారి.
ఉభయోరష్టమం రోషం భౌమదోషం వదెద్బుధః ।
స్త్రీపురుషులకు అష్టమ స్థానంలో చాలా ప్రమాదకారి.
దంపత్యోర్జన్మకాలే వ్యయ ధన హి ఋతే సప్తమే రంధ్ర లగ్నే ।
లగ్నా చంద్రాచ్చ శుక్రాదపి ఖలు నివసన్ భూమి పుత్రా స్తయోశ్చ ॥
భార్యాభర్తల జన్మ రాశికి ద్వాదశ, ద్వితీయ, చతుర్థ, అష్టమ లగ్నములలో ఎక్కడ కుజుడున్ననూ దోషకారి. ఈ దోషము జన్మలగ్నమునుండి గాని, చంద్రుడున్న రాశినుండి గాని, శుక్రుడున్న రాశినుండి గాని, కుజదోషమును చూచుకోవలయును. దంపతులకు జన్మరాశి, చంద్రరాశి, శుక్రరాశుల నుండి ఎక్కడ కుజదోషమున్ననూ అది పరిహార శక్యము.
దాంపత్యం దీర్ఘకాలం నుత ధనబహుళం పుత్రలాభం చ సౌఖ్యం ।
దద్యాదేకత్ర హీనో మృతిరఖిలభయం పుత్రనాశం కరోతి ॥
పైన చెప్పిన రీతిలో నున్న కుజదోషము పరిహారమైనచో దంపతులకు సుఖదాంపత్యం, సంతానం, ధనవృద్ధి, సౌఖ్యం సిద్దించును. ఇరువురిలొ ఏ ఒక్కరికి కుజదోషమున్ననూ మరణము, భయము, గర్భశోకము కలుగును...
No comments:
Post a Comment