Friday, December 19, 2014

అద్భుత శక్తీ సంపన్నుడు,ఆగ్రహమే కాదు అనుగ్రహించే శనీశ్వరుడు గురించి తెలుసుకో ...! about lord saneeswara In Telugu ..!

అద్భుత శక్తీ సంపన్నుడు,ఆగ్రహమే కాదు అనుగ్రహించే శనీశ్వరుడు గురించి తెలుసుకో ...!
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు
చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
జనన వృత్తాంతము :
అదితి , కస్యపు ముని కుమారుడైన సుర్యభావానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని .
లోకాలన్నితికి వెలుగునిచ్చే సుర్యాడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నుండే సూర్యకాంతిని , తేజస్సును భారిచలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము జప్పెను . అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు  -మొదటివాడు వైవాస్తవ . రెండేవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను, కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా .. గోప్యం గా ఉన్న ఛాయా రహస్యము బయట పడ కూడదనే సదుద్దేశముతో అడవికి పోయి తపస్సు చేయసాగెను . తన అందము , యవ్వనము చూసి ఇతరులబారినుంది తప్పించుకొనుటకు గుఱ్ఱము రూపములో మారిపోయి ఈశ్వరునికి తప్పస్సు చేయసాగెను . సూర్యునికి .. ఛాయాదేవికి "మను (సావర్ణుడు) , శని , తపతి (కూతురు) జన్మిచారు . శని గర్భము లో ఉండగా చాయ ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను . ఉపవాసదీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని , తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని , శని చూపే వినాశకరం గా మారినదని పండితులు అంటారు . సూర్య తేజస్సు లేని ఈబిడ్డ తనబిడ్డ కాదని చాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు . అది విన్న శని తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని , సూర్యగమనం ఆగిపోవాలని , సూర్య రధం నల్ల రంగు గా అయిపోవాలని శపిస్తాడు . అప్పుడు తన తప్పును తెలుసు కున్న సూర్యుడు ఈశ్వరుని వేడగా ... జరిగిన విషయమంతా సూర్యునకు తెలిజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యున్ని శాపవిముక్తి గావించెను . అంతా సుఖము గా ఉన్నా ... శని సూర్యుని పై పగబూని ఈశ్వరుని తపస్సు జేసి ఎన్నో వరాలు పొందెను .
శని జన్మ నక్షత్రము : శని విభావనామ సంవత్సరము , మాఘమాసము ,కృష్ణపక్షము ,చతుర్దశి నాడు , ధనిష్టా నక్షము న జన్మించాడని కొందరంటే .. మార్గశిర మాసము -బహుళ నవమి ,రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరు అంటారు . . శనీశ్వరుడు కుడి చేతిలో దండము , ఎడమ చేతిలో కమండలము , sword (ఖడ్గము) arrows and two daggers దరించి ఉంటాడు .
శని పెళ్ళి : లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట., యమధర్మరాజు కి సోదరుడు , గ్రహాలకు యువరాజు .
హరిచ్శంద్రుడు , నలుడు , పురుకుత్సుడు , పురూరవుడు , సగరుడు , కార్తవీర్యార్జునుడు , శని మహిమ వల్ల అనేక కస్టాలు పొంది చివరకి శని కృప వల్లే సర్వ సుఖాలు పొందేరు .
శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.
శనీశ్వరుడు మరియు హనుమంతుడు
హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైనా హనుమంతుని ప్రార్ధించినచో, ముఖ్యముగా శనివారాలలో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.
శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయునిగా అవతరించగా, శని హనుమంతుడు భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుడును తనను విడిచిపెట్టమని వేడుకుంటూ, ఎవరైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన(శని) యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్ములింపబడునట్లుగా చేసెదెనని శనిభగవానుడు మాట యిచ్చాడు. ఆ తరువాత హనుమంతుడు శనిని విడిచిపెట్టెను.
శనీశ్వరుడు - శివుడు :
పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... ప్రమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను . పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .
నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను . " శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం అలోచించాడు . ఆ ఆడవిలోతూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావిచెట్టు తొర్ర లొ ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ " పరమశివుదంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం , చల్ల్ని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు శని నెమ్మదిగా వినయం గా . శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు తనను(శనిని) శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .
శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది :
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆహా! శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .
శనీశ్వరుడు మరియు రోమపాద మహారాజు
తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.
శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6. ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.
ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :-
1 మయూరి నీఎలం ధరించుట
2 శని జపం ప్రతి రోజు జపించుట
3 శని కి తిలభిషేకం చేఇంచుట
4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట
5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట
6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన
7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన
8 హనుమంతుని పూజ వలన
9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన
10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన
11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన
12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన
13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన
14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన
15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన
16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన
17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం
18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన
19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును
న్యాయాధికారి
మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మందపల్లి మందుడు
తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో వెురపెట్టుకున్నారట. వారి వెురను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణమాసంలోనూ శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.
ఇంకా... మహారాష్ట్రలోని శనిసింగణాపూర్‌ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.
శని తీర్థయాత్రలు
* మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరి శ్రీ శనైశ్చర దేవాలయం, మంగళూరు, కర్ణాటక.
* శ్రీ శని మహాత్మ దేవాలయం పావగడ, తుంకూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
* శనిదేవుని ఆలయం, గ్వాలియర్ కోకిలవనం, వ్రిందావనం.
* శ్రీ శని దేవాలయం బీధ్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర నస్తన్పూర్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర నమూనా తీర్థ్ నందూర్ బార్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర రామేశ్వర తీర్థం.
* శ్రీ శని తీర్థం తిరునలరు పుదుచేరి.
* శ్రీ శని మందిర్ తీర్థం, ఉజ్జయిని.
* శ్రీ శని శింగనాపూర్, మహారాష్ట్ర.
* శ్రీ శని తీర్థ క్షేత్ర, అసోల, ఫతేపూర్ బేరి, మెహ్రులి, ఢిల్లీ.
* శ్రీ సిధ్ శక్తి పీట్ట్ శనిధాం.
* శ్రీ శని దేవాలయం, మడివాల, బెంగుళూరు
* శనైశ్కర దేవాలయం, హస్సన్
* శ్రీ శనిమహాత్మ దేవాలయం, సయ్యాజిరావు మార్గం, మైసూరు.
* శ్రీ శనీశ్వర దేవాలయం, నందివడ్డేమను, నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శనీశ్వర ఆలయం, శ్రీ కాళహస్తి ఆలయం కాంప్లెక్స్, శ్రీ కాళహస్తి, తిరుపతికి 35 కి.మీ. ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శని దేవాలయం, హత్ల, జామ్నగర్ జిల్లా, గుజరాత్
* శ్రీ శనీశ్వరాలయం వీరన్నపాలెం, పర్చూర్ మండలం, ప్రకాశం (జిల్లా) ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శనీశ్వరాలయం, మందపల్లి, రావులపాలెం కి 5 కిలోమీటర్లు దూరం. తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.(ఇది పురాతన ఆలయము)
* శ్రీ శనీశ్వర దేవాలయం, గుంజూరు, వర్తూర్ అనంతరం, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, కన్నన్మంగల, బెల్తూర్ అనంతరం, శ్రీ సత్య సాయి ఆశ్రమం, వైట్ఫీల్డ్, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, చిక్క తిరుపతికి వెళ్ళే మార్గంలో, బెంగుళూరు, సమేతహళ్లి, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, తిరుపతి, తిరుపతి బస్సు స్టాండ్ దగ్గర, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, కంగ్ర, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, హోసూర్ మెయిన్ రోడ్, హొస రోడ్, బసపుర, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, వైట్ఫీల్డ్, సవన హోటల్ దగ్గర, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ అభయ శనీశ్వర దేవాలయం(1956) రామ్మూర్తినగర్, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - రామ్మూర్తినగర్, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - హేబ్బాల్, హేబ్బాల్ ఫ్లైఓవర్ క్రింద, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - అడంబక్కం, చెన్నై, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - డెల్ దగ్గర (నెక్స్ట్ సిగ్నల్ వద్దగల వైట్ గోపుర)కోరమంగల ఇంటర్మీడియట్ రింగ్ రోడ్
* శ్రీ శనైశ్కర దేవాలయం - నతున్గుంజ్, బంకుర, పశ్చిమ బెంగాల్, సంప్ర-ప్రసేన్జిట్ దరిప,S/O లేట్ దేవదాస్ దరిప.
* శ్రీ శనీశ్వర దేవాలయం, అనేకల్, బెంగుళూరు దగ్గర, కర్ణాటక, భారతదేశం.

Tuesday, December 2, 2014

ప్రపంచం లో అతిపెద్ద విగ్రహం ఎక్కడ వుంది ? అది ఎవరిది ? ఏ దేశం లో వుంది ? world biggest statue ?

ప్రపంచం లో అతిపెద్ద విగ్రహం ఎక్కడ వుంది ? అది ఎవరిది ? ఏ దేశం లో వుంది ? ఎపుడు నిర్మించారు ? ఇలా మనం చాల సార్లు ఆలోచించి వుంటాం . అలంటి వారందరికి ఈ నా వ్యాసం కొంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను .
ప్రపంచం లో అతిపెద్ద విగ్రహం " బుద్ద విగ్రహం " . ఈ విగ్రహం స్ప్రింగ్ టెంపుల్ అఫ్ బుద్ద అనే పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది . దీని నిర్మాణం 1997 నుండి  2008 వరకు పూర్తీ అయ్యింది . అవును పూర్తిగా 11 సంవత్సరాలు పట్టింది .
ఈ విగ్రహం మొత్తం పొడవు 128 మీటర్లు అంటే 420 అడుగుల ఎత్తు అన్న మాట .
మొత్తం ఈ విగ్రహం తయారీ ఖర్చు దాదాపు $55 మిలియన్లు . మరియు ఈ మొత్తం విగ్రహం రాగి తో చేయబడింది . కేవలం విగ్రహం బరువు దాదాపు 1,000 టన్నులు . మొత్తం క్రింద వున్నా పద్మం , మరియు పీఠం కలుపుకొన ఇంకా ఎక్కువే మరి .
ఈ విగ్రహం ను డ్రాగన్ హెడ్ పార్క్ నందు వుంచటం జరిగింది . ఇది బౌద్ద మతస్తులకు చాల ప్రాధాన్యత కలిగిన పుణ్య ప్రదేశం . ఈ పార్కు ప్రాంగణం లోనే 116 టన్నుల బరువు కలిగిన " పెద్ద గంట " కూడా వున్నది . దీనినే " బెల్ అఫ్ గుడ్ లక్ " అని అంటారు .

ఈ విగ్రహం చైనా నగరం లో Fodushan Scenic Area, Lushan County, Henan, China . అనే ప్రదేశం లో వున్నది .
ప్రపంచం లో అతి పెద్ద వైన 100 మీటర్లకు మించిన దాదాపు మొదటి 5 విగ్రహాలు చైనాలో నే వుండటం విశేషం .



Monday, November 17, 2014

జన్మ నామాలకు నక్షత్రాలను తెలుసుకోవటం ఎలా ? How to Find Birth Star With Name ?

అశ్విని - చు, చే, చో, లా
భరణి - లీ, లూ, లే, లో
కృత్తిక - ఆ, ఈ, ఊ, ఏ
రోహిణి - ఓ, వా, వీ, వు
మృగశిర - వే, వో, కా, కీ
ఆరుద్ర - కూ, ఘ, జ్ఞ, ఛ
పునర్వసు - కే, కో, హా, హీ
పుష్యమి - హూ, హే, హో, డ
ఆశ్రేషా - డీ, డూ, డే, డో
మఖ - మా, మీ, మూ, మే
పుబ్బ - మో, టా, టీ, టూ
ఉత్తర - టే, టో, పా, పీ
హస్త - పూ, షం , ణా, ఠా
చిత్త - పే, పో, రా, రీ
స్వాతి - రూ, రే, రో, తా
విశాఖ - తీ, తూ, తే, తో,
అనురాధ - నా, నీ, నూ, నే
జ్యేష్ఠ - నో, యా, యీ, యూ
మూల - యే, యో, బా, బీ
పూర్వాషాఢ - బూ, ధా, ఫా, ఢ
ఉత్తరాషాఢ - బే, బో, జా, జీ
శ్రవణం - జూ, జే, జో, ఖ
ధనిష్టా - గా, గీ, గూ, గే
శతభిషం - గో, సా, సీ, సూ
పూర్వాభాద్ర - సే, సో, దా, దీ
ఉత్తరాభాద్ర - దూ, శ్యం , ఝ, థ
రేవతి - దే, దో, చా, చీ
ఉదాహరణకు మీరు చిత్త నక్షత్రం రెండవ పాదములో జన్మించారనుకోండి చిత్తా నక్షత్రానికి ఇవ్వబడిన అక్షరాలు పే, పో, రా, రీ మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం పే అక్షరముతో ప్రారంభమవుతుంది. పేరయ్య, పేరమ్మ చిత్తా నక్షత్రము మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం అవుతుంది. అలాగే రెండో పాదములో పుట్టిన వారి జన్మనామం పోతన, పోచమ్మ అవుతుంది. ఈ విధంగా ఆయా నక్షత్ర పాదాలలో జన్మించిన వారికి ఆయా జన్మనామాలు ఏర్పడతాయి.పేరు మొదట్లో ద్వంద్వాక్షరం వచ్చినట్లయితే మొదటి అక్షరమును విడిచి రెండవదానినే జన్మనామాక్షరముగా గ్రహించ వలెను.ఉదా: చ్యవన అనే పేరులో చ తర్వాత వచ్చే యాను జన్మ నామాక్షరముగా తీసుకోవాలి.కృష్ణుడు - మృగశిర మూడవ పాదము, హృష్ణుడు స్వాతి మొదటి పాదము, శ్రీధరుడు చిత్తా నాలుగవ పాదము, క్షేత్ర పాలుడు హస్తా రెండవ పాదము, ఈ విధముగా జన్మ నామాలకు నక్షత్రాలను తెలుసుకోవాలి.

ధ్వజస్థంభం పుట్టుక ? dwajasthambam significance Story ?

ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ .
‘ధ్వజస్థంభం’ కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం
ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగాపేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ,అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు,”రాజా! మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో ” మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని ” శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఇతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు “తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు”. అందుకు మయూరధ్వజుడు, “మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది.” అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి “మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను” అంటాడు. “పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి” అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు “తథాస్తు” అని పలికి, “మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది” అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

Thursday, September 18, 2014

అన్న ప్రాశన ముహూర్తము నకు ఉండవలసిన లక్షణాలు శుభ నక్షత్రముల వివరణ ? How to Find Best Muhurtham for Annaprasana ?

అన్న ప్రాశన ముహూర్తము :-
శ్లో ॥ అన్నాదనం మాసి రసైరభిన్నే సూనొస్తదా సన్నగ మాసయుగ్మే ।
       పుత్ర్యా భవేచ్చాత్ర విదర్శ పూర్ణా భద్రాజయాపక్షతయః ప్రదిష్టాః ॥ 

తాత్పర్యము :- పుత్రుని యొక్క అన్నప్రాసనము జన్మాదిగా 6వ మాసమునందును పుత్రిక యొక్క అన్నప్రాసనము 6వ మాసమునకు దగ్గర వుండు 2 మాసములు అనగా 5 లేక 7వ మసముల యందును అమావాస్య విడచి పూర్ణ తిధుల యందును 5, 10 , 15 భద్రా ( 2,7,12) జయా (3,8,13) ప్రతిపత్తు తిధుల యందును చేయవలయును ( నవీన ముహూర్త శాస్త్ర కర్త అయిన రామ దైవజ్ఞుడు రిక్తా తిధుల యందును నందా తిధుల యందును అష్టమి యందును ద్వాదశి యందును అమావాస్య నందును అన్నప్రాసన చేయరాదు అని చెప్పెను . నవీనుల విధానము కంటే భిన్నముగా ఉండుట వలన కుడా కాళిదాసు ప్రాచీనత తెలియ చున్నది) .

అన్నప్రాసన నక్షత్రములు :-
శ్లో ॥ సంతోర్భకాన్నాశన కర్మణీoదు జ్ఞదేవ వంద్యో శన సామహాని ।
      విమిత్రమైత్రాఖ్య లఘుధృవాణి శ్రవః శవిష్టాదితిభానిచహుః ॥
 తాత్పర్యం :- బాలకులకు అన్నప్రాశనకు సోమ,బుధ,గురు,శుక్రవారము అనురాధను విడిచిపెట్టి శేషించిన మైత్ర నక్షత్రములు ( మృగశిర , రేవతి , చిత్ర ) లఘుసంజ్ఞక నక్షత్రములు ( హస్త ,అశ్విని , పుష్య ) ధ్రువ సంజ్ఞక  నక్షత్రములు ఉత్తరాత్రయం రోహిణి , శ్రవణం , ధనిష్ఠ , పునర్వసు , నక్షత్రములు శుభదాయకములు అని దైవజ్ఞులు చెప్పిరి .
అన్నప్రాసనకు లగ్న బలము :- 
శ్లో ॥ ప్రేక్షాంత్యపుణ్యాత్యయ కేంద్రగో రవిః , తనోతి చిత్రం పృధుకే రసాత్మజః । 
       పిత్తం చ మందస్తనుతే ప్రభంజనం , కృశః కిల గ్లౌర్హి తధా దరిద్రతాం ॥ 
 తాత్పర్యం :- అన్నప్రాసన కాలమున లగ్నము నుండి 5 ఇంటను 12 ఇంటను 9 ఇంటను 8 ఇంటను కేంద్రముల యందును ( 1,4,7,10 ) సూర్యుడున్నచో బాలకునికి తీవ్ర రోగములు వచ్చును . అదే స్థానముల యందు కుజుడున్నచో పిత్త జన్య వికారములు వచ్చును . శని ఉన్నచో వాత రోగములు వచ్చును . క్షీణ చంద్రుడు ఉన్నచో ఆ శిశువు దరిద్రమును అనుభవిన్చును అని శాస్త్ర వచనం .

 మరియొక అంశంతో మళ్ళి కలుద్దాం . సర్వేజన సుఖినో భవంతు . దయచేసి మీ సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు . మీ అమూల్య మయన సమయాన్ని వెచ్చించి నా పోస్ట్లు చదివి ,కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదములు ,
సదా ఆద్యాత్మిక సేవలో ,
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి ,
నార్త్ కరోలినా , USA .

సెల్ : (001)-336-517-6268 . 

Tuesday, September 16, 2014

యజ్ఞోపవీతం పరమం పవిత్రం . Significance of Yagnopaveetham and details

Significance of Yagnopaveetham and details :- 

ప్రస్తుతం కలియుగ కాలమానంలో,ఈ నవయుగంలో ఎంతమంది యజ్ఞోపవీతం నిత్యంధరించి ఉంటున్నారు . అనగా యజ్ఞోపవీతము ధరించే ఆచారం వున్న  బ్రాహ్మణ , క్షత్రీయ , వైశ్యులు ఈ పరమ పవిత్ర యజ్ఞోపవీత ఆవశ్యకతను మరచి సంచరించటం ఈతరం వారికే కాకుండా వర్తమాన భవిష్య తరాలకి కూడా ఏమాత్రం శ్రేయెూదాయకం కాదు .
ఇచ్చట మనం ముందుగా యజ్ఞోపవీత మంత్రార్ధం క్లుప్తంగా తెలుసుకుందాం !!
మంత్రః 
"యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యథ్సహజంపురస్తాత్ 
 ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచశ్శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః " 

అనగా యజ్ఞోపవీతమనే సూత్రం పరమపవిత్రమైనది. 
 " ప్రజాపతెః యథ్సహజం పురస్తాత్ "
బ్రహ్మదేవునకి పుట్టుకతోనే ఉన్నది అని ఆయుష్యు , తేజస్సును ఇచ్చునది అని మంత్రార్ధం .  చాలమందికి ఈమంత్రార్థం ఇంచుమించుగా తెలిసినా "ప్రజాపతెః యథ్సహజం పురస్తాత్" అన్నవాక్యం బ్రహ్మ దేవునికి జన్మతః వున్నది అన్న అర్ధం తెలియకపోవచ్చు అలాగే ఉపనయన కాలమందు
" శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్ఠాన యెూగ్యతా సిథ్యర్థం పరమపవిత్ర యజ్ఞపవీత ధారణం కరిష్యే
అని సంకల్పిస్తారు అనగా శ్రౌత స్మార్త నిత్యకర్మలని చేయుటకు యజ్ఞోపవీతం ధరించి వుండాలి అని లేనిచో వారు అనర్హులని వేద శాస్త్రాలు చెప్పాయి .

 బ్రహ్మచారి మూడు ప్రోగులు కలిగిన యజ్ఞోపవీతమును ధరించి విధ్యను అభ్యసించవలెనని శాస్త్రం . ఇది వారి బ్రహ్మచర్య వ్రతమునకు , విద్యాభ్యాసమునకు వారధి . ఇక రెండవది వివాహకాలమున 
" శ్వశుర దత్త యజ్ఞోపవీతము "  మామగారు ధరింపచేయునది ఉద్వాంహాంగభూత శ్వశుర దత్త పరమపవిత్ర ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పిస్తారు . అనగా గృహస్థాశ్రమ ధర్మమును ఆచరించుటకు ధర్మ సంతానము పొందుటకు ,  శ్రౌత స్మార్త కర్మలకు రెండవది వారధి . శాస్త్రంలో రెండు యజ్ఞోపవీతములే ధరించమని ఉన్నది .
మరి కొందరు మూడు లేక ఐదు ధరించుట వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం !! 
ముందర చెప్పినట్టు రెండుతర్వాత మూడవది ఉత్తరీయార్ధం  భావమునకు అనగా శాస్త్రంలో 

శ్లో॥హోమదేవార్చనా ద్యాసు క్రియాసు పఠనే తథా । 
      నైకవస్త్రః ప్రవర్తేత ద్విజోనాచమనే జపేత్ ॥ 

హోమము,దేవతార్చనము,వేదపఠనము,ఆచమనం,జపము మెుదలగు వానిని సలుపునపుడు ఏక వస్త్రము ధరించరాదు అని శాస్త్రం .  మూడవది ఉత్తరీయానికి కనుక మూడువది ఉన్నవారు ఉత్తరీయము లేకున్ననూ పైక్రియలన్నీ సలుపవచ్చును . నాలుగవది మరియు ఐదవది బ్రహ్మచారులకి కానీ గృహస్థులకి కానీ ఎపుడైననూ యజ్ఞోపవీతం ఒక పోగు పెరిగినను (తెగిననూ) లేదా తెలియకుండా నష్ఠమైననూ అపుడు బ్రహ్మచారులకి ఒకటీ గృహస్థులకి రెండూ ఆపద్దర్మంగా వారికి కొత్తది మరలా మార్చుకొనే వరకు ఈనాల్గవది ఐదవదీ ఇవ్వవచ్చు. 
 
శ్లో॥  వినా యజ్ఞోపవీతేన దినమేకమపిద్విజః । 
    స్థితః శూద్రత్వమాప్నోతి మృతశ్చ శ్వోపజాయతే ॥ 

బ్రాహ్మణ , క్షత్రీయ , వైశ్యులు ఎవరైననూ యజ్ఞోపవీతము లేకుండా ఒకరోజు ఉన్నచొ  వారికి వారి జననము వలన కలిగిన మరియు జనన ప్రభ్రుతి సంపాదించుకున్న పుణ్యము నశించి మరుజన్మలో విధి శునకము గా పుడతారు అని భావ అర్ధం ॥ 

ఈ వ్యాసం వ్రాసి పోస్ట్ చేయటానికి సహకారాన్ని అందించిన నా ముఖ పుస్తక మిత్రులు శ్రీ ములగాలేటి రామశాస్త్రి గారికి ధన్యవాదములు .
 మరియొక అంశంతో మళ్ళి కలుద్దాం . సర్వేజన సుఖినో భవంతు . దయచేసి మీ సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు . మీ అమూల్య మయన సమయాన్ని వెచ్చించి నా పోస్ట్లు చదివి ,కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదములు ,
సదా ఆద్యాత్మిక సేవలో ,
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి ,
నార్త్ కరోలినా , USA . 

శ్రీ దుర్గా సప్తశతీ (చండీ) హోమానికి కావలసిన పదార్దముల జాబితా.List of Pooja Material for Chandi homam .

List of Pooja Material for Chandi homam .
పసుపు = 1/4 కిలో
కుంకుమ = 1/4 కిలో
తమలపాకులు = 250
వక్కలు = 100
ఎండు ఖర్జురములు  =100
పసుపు కొమ్ములు =100
కర్పూరం = 1 ప్యాకెట్
అగరవత్తులు = 1 ప్యాకెట్
కొబ్బరికాయలు = 5
నల్ల నువ్వులు = 200 గ్రాములు
తెల్లనువ్వులు = 200 గ్రాములు
తేన = చిన్నసీస
పంచదార = 1/4 కిలో
మిరియాలు = 100 గ్రాములు
పచ్చకర్పూరం = 100 గ్రాములు
పచ్చి వక్కలు = 100 గ్రాములు
ఆవునెయ్యి = 4 కిలోలు
దారపు బంతి = 1
మట్టి మూకుళ్ళు = 3
మినపపప్పు =1/2 కిలో
గంధపు పొడి = 1 డబ్బా
వరి పేలాలు = 1 కిలో
సమిధలు
బియ్యం = 5 కిలో
బియ్యపిండి = 1/2 కిలో
పూర్ణాహుతి సామగ్రి = 1 ప్యాకెట్
పెసలు = 1 కిలో
గాజులు , కాటుక ,తిలకం ,అద్దం ,చెక్క దువ్వెన , అత్తరు
గుగ్గిలం పొడి = 100 గ్రాములు
అష్ట సుగంధ ద్రవ్యాలు
జాజికాయ , జాపత్రి , యాలకులు ,లవంగం ,జవాదు ,పునుగు ,కుంకుమ పువ్వు .
తెల్ల ఆవాలు = 100 గ్రాములు
కొబ్బరి కురిడిలు = 5
ఇప్ప పువ్వు = 100 గ్రాములు
మాతులుంగ ఫలం = 5
మారేడు ఫలం = 3
వెలగ పండు = 3
జామపండు = 3
దానిమ్మ పండు = 2
దుర్వంకురం = 100 గ్రాములు
మంచి గుమ్మడి కాయలు = 1
తెల్ల గుమ్మడికాయ = 1
మారేడు దళములు = 108
అరటి పండ్లు = 12
గులాబీ పూలు =100
తామర పూలు = 108
మోదుగ పూలు = 200 గ్రాములు
విడిపూలు =
పూల దండలు
చెరకు ముక్కలు = 10
గారికే =
కొబ్బరిబొండం = 2
బత్తాయి , ద్రాక్ష , ఆపిల్ , మొ॥ నవి
ఆవుపాలు =1 లీటర్
మామిడి ఆకులు
చిన్న చేటలు
కలశానికి చెంబు = 3
అమ్మవారి పటాలు
రవిక బట్టలు = 18
పూర్ణాహుతి పట్టు గుడ్డ
మండప ఆరాధనకు పంచ
దంపతి పూజకి వస్త్రాలు
కుమారి పూజకి వస్త్రాలు
చిల్లర నాణెములు = 51
జీడిపప్పు
బాదాం పప్పు 
ఎండు ద్రాక్ష
సర్వేజన సుఖినో భవంతు . దయచేసి మీ సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు . మీ అమూల్య మయన సమయాన్ని వెచ్చించి నా పోస్ట్లు చదివి ,కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదములు ,
సదా ఆద్యాత్మిక సేవలో
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి ,
నార్త్ కరోలినా , USA .

Tuesday, September 9, 2014

మహాలయ పితృ పక్ష హిరణ్య శ్రాద్ధం చేయు విధానము వివరణ Mahalaya Amavasya Hiranya Sraaddha Vidhi Vidhanam .

Mahalaya Amavasya  Hiranya Sraaddha Vidhi Vidhanam :-

పితృ తర్పణము -- విధానము : శ్రీమతే వేద పురుషాయ నమః
పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు
పితృ తర్పణము చేయవచ్చును .
ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..

కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు ..
తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము
అంటారు. ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది..
దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం :-
పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |
ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |
ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్ప్య || శ్రీగోవింద గోవింద......దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ | ప్రాచీనావీతి |
అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం ... ----- గోత్రాణాం. .. ------ , -------- , ------ శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం
అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం , ------- , --------- ,-------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------ గోత్రాణాం , --------, ---------- , --------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం
అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,
--------, ------------ , --------------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |
దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |
హిరణ్య శ్రాద్ధం | :-
అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )
తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||
|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |
అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||
అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | -------- గోత్రాణాం. .. -------- , --------- , --------- శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం
అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... --------- గోత్రాణాం , --------- , ---------, --------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------- గోత్రాణాం , ---------, -------- , ---------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం
అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,
-------- , ---- , --------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |  ఉపవీతి | ప్రదక్షిణం |
|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |
నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||
| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
నమస్కారః :-
ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |
( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )
తర్పణమ్ :-
దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు ...దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..

ముఖ్య గమనిక :
ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..
తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.
అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే , సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది... వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..
మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.
తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.
తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః ... పితుః... మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య.... ఇలా ) చెప్పి వదలవలెను..
ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.
మాతృ , పితామహి , ప్రపితామహి...ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..
మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి...
ఇతర నియమాలు
తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.
తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి
తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..
అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు
గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు...
ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి,
అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.
దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..
గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..
చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.
సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..
విధానము
ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి... వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)
కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,
ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి
సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,
వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,
అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ------నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , -----ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ........ఋతౌ ( ఋతువు పేరు ) , ..... మాసే ( మాసపు పేరు ) , .....పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,....తిథౌ ( ఆనాటి తిథి పేరు )..... వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ....
విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ
ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)
అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే...
( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే .....
ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )
శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే...
( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)
మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.
ప్రథమ కూర్చే ..
|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||
ఓం భూర్భువస్సువరోమ్
అస్మిన్ కూర్చే....--------- గోత్రాన్. .. ---------( తండ్రి పేరు ) , .........తాతయ్య పేరు , ........ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,
-------- గోత్రాః , -------- , -----------, ---------దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |
|| సకృదాఛ్చిన్నం బర్హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||
పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |
( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )
ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )
|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||
ఓం భూర్భువస్సువరోమ్
అస్మిన్ కూర్చే..------ గోత్రాన్ .........( తల్లి యొక్క తండ్రి ) , ..........( తల్లి తాత ), .........( తల్లి ముత్తాత ) శర్మాణః ...వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,
-------- గోత్రాః ,........( తల్లి యొక్క తల్లి ) , .........( తల్లి యొక్క అవ్వ ) , ...........( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||
|| సకృదాఛ్చిన్నం బర్హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||
సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )
పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.
ప్రథమ కూర్చే.. ...పితృ వర్గ తర్పణం |
౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి ... అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )
౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |
అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||
-------- గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||
౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |
తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||
------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||
౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||
------- గోత్రాన్. .. ----------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||
౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)
౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||
--------గోత్రాన్. .. --------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||
------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||
--------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )
౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||
-------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||
------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||
------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )
------ గోత్రాః , --------- దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౫.. పితామహీ తర్పణం
-------- గోత్రాః , ---------దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౬. ప్రపితామహీ తర్పణం
--------- గోత్రాః , ----------- దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )
మాతా మహ తర్పణం ( మూడు సార్లు )
౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |
అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||
--------గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |
తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||
---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||
౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||
---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||
౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )
౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||
--------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||
----------గోత్రాన్. .. ------------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||
---------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )
౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||
--------గోత్రాన్. .. ----------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||
--------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||
-------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )
--------- గోత్రాః , ------ దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౧౧. మాతుః పితామహీ తర్పణం
--------గోత్రాః , ------- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం
------- గోత్రాః , -------దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి...
జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||
|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |
సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..
ఆత్మ పత్నీం( భార్య ) ------దేవీదామ్-----గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పెద్దమ్మ ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పిన్ని ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ మాతులం ( మేనమామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు....ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)
అస్మద్దుహితరం ( కూతురు )-----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ పితృ భగినీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జామాతరం ( అల్లుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భావుకం ( బావ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ స్నుషాం ( కోడలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి
అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మద్గురుం ( గురువు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మదాచార్యం ( ఆచార్యుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.
ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )
|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |
నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం||
తనచుట్టూ తాను ప్రదక్షిణం
| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..
|| చతుస్సాగర పర్యంతం ... .... .... అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |
ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి
|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||
|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||
అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |
ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |
| కూర్చ ద్వయం విస్రస్య |
నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..
యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |
ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..
|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః
తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||

దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )
తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||
అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||
అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.
మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |
అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )
అచ్యుతానంత
గోవిందాయ నమః || 

మరియొక అంశంతో మళ్ళి కలుద్దాం . సర్వేజన సుఖినో భవంతు . దయచేసి మీ సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు . మీ అమూల్య మయన సమయాన్ని వెచ్చించి నా పోస్ట్లు చదివి ,కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదములు ,
సదా ఆద్యాత్మిక సేవలో
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి ,
నార్త్ కరోలినా , USA .

Friday, September 5, 2014

చాంద్రమాన, సౌరమానములు అంటే ఏమిటి ? శూన్య,అధిక,క్షయమాసములు ఎలా ఏర్పడతాయి ? What is Adhikha masa, Sunya masa , Skheya Masa ?

చాంద్రమాన ,సౌరమానములు అంటే ఏమిటి ? శూన్య ,అధిక ,క్షయ మాసములు ఎలా ఏర్పడతాయి ?
What is Chandramana and Sowra manam ? 
What is Adhikha masa , Sunya masa , Skheya Masa ?


ప్రకృతి సిద్దంగా మూడు రకాల కాలమానాలు కనిపిస్తున్నాయ్ . అవి 1) రోజు 2) నెల 3) సంవత్సరం,
వీటికి కారకులు సూర్యుడు , చంద్రుడు .రోజు ప్రమాణం సరాసరిగా 24 గంటలు అనేది అందరికి తెలిసిందే . అంటే సూర్యోదయం నుండి సూర్యోదయం . అమావాస్యకి ,అమావాస్యకి  మద్య సరాసరి వ్యవధి 29.530 రోజులు ఇది చంద్రమానం . అలాగే సౌరమానం లో 30 రోజులు మాసము .
రెండు వసంత విషవత్తులు మద్య కాలం ఒక సాయన సంవత్సరము అంటే 365.242199 రోజులు . ఇవన్నీ పూర్ణ సంఖ్యలు కాకుండ భిన్నములు అవడంతో వీటి మద్య పొత్తు చాల కష్టసాద్యం .
1 సంవత్సరం అంటే 12 మాసాలు వుంటాయి . అలాకాక 12 చాంద్రమాసాలు అనుకుంటే మొత్తం లెక్కలన్నీ తేడా వస్తున్నాయ్ . వీటిని లెక్కించటానికి మూడు మార్గములు లేక పద్దతులు వున్నాయి.అవి :
1) చాంద్రమాన పద్ధతి  2) సౌరమానం 3) చాంద్ర , సౌర మన విధానం .

1) చాంద్రమాన పధ్ధతి : ప్రపంచమంతా అన్ని జాతుల వారు మొట్ట మొదట ఉపయోగించిన పధ్ధతి చాంద్రమానం . ఎందుకంటె చంద్ర కళలలో కనిపించినంత బేధము సూర్యునిలో కనిపించక పోవటమే .
ఈ విధంగా 12 చాంద్రమాన మాసాలు సంవత్సరం అనుకుంటే 12x 29.530 = 354 రోజులు . సౌర సంవత్సరం 365.2421 ( 6 1/4 గంటలు ) . దీనికి తేడా 11 1/4 రోజులు అంటే ఏడాదికి 11 1/4 రోజులు చంద్రుడు వెనుక పడిపోయాడు . ఋతువులు అన్ని సూర్యుడుని బట్టి ఏర్పడినవే . మానవుడి జీవన సరళి అంతా ఋతుచక్రం పైనే ఆధారపడి వుంది . అందువల్ల కేవలం చంద్రమానం మాత్రమే అనుసరించలేము .
2) సౌర పంచాంగం : చంద్ర కళల తో సంభంధం లేకుండా సౌరమానము అనుసరించడమే . సంవత్సరం పొడవును నిర్ణయించి దాని ఆధారంగా 12 మాసాలను నిర్ణయించు కోవటం . ఇందులో చంద్రునికి ఏ సంభంధం లేదు . ఇలా  చేయటం వల్ల  కొన్ని ప్రత్యెక దినాల్లో చేయవలసిన కార్యక్రమాలు,నియమాలు , పూర్వకాలంలో యజ్ఞయాగాది క్రతువులు జరగవు . ఎందుకంటె చంద్రునితో సంభంధం పెట్టుకోలేదు కనుక . కనుకనే దీనికి పూర్తి ప్రాధాన్యత లభించలేదు .
3) చాంద్ర , సౌర పంచాంగం : పై రెండు ఇబ్బందులను అధిగమించటానికి గాను చాంద్ర , సౌరమానాలను సమన్వయ పరచి తాయారు చేసినది ఇపుడు మనము ఉపయోగిస్తున్నది ఈ పంచాంగమే .
ఇందులో చంద్ర కళలను అనుసరించి మాసాలు (నెలలు) వుంటాయి . సూర్య గమనం ఆధారంగా సంవత్సరం వుంటుంది . వీటి మద్య సమన్వయ పరచటానికి అవసరం అయనప్పుడు అధిక మాసాలను , ఒక్కో సారి క్షయ మాసాలు ఏర్పరిచారు . 
ఈ క్రింది వివరణతో మీకు సులువుగా అర్ధమవుతుంది :
 చాంద్ర సంవత్సరానికి సౌర సంవత్సరానికి గల 11 1/4 రోజుల భేదమును 3 సంవత్సరాలలో 33 3/4 రోజులు అవుతుంది . అందువల్ల ప్రతి 3 సంవత్సరాలకు 1 నెల అధిక మాసం ఏర్పరిచారు . మిగిలిన 3/4 రోజులను 24 సంవత్సరాలు అయ్యేటప్పుటికి 1 నెల అవుతుంది . అపుడు మరొక అధికమాసం ప్రవేశపెడితే అది పూర్తవుతుంది. అధిక మాసం వచ్చిన నేలను అధిక మాసం అని తర్వాత వచ్చిన నేలను నిజ మాసం అని అంటారు . 
క్షయ మాసం
ఇలా అధిక మాసాలు చేర్చుకుంటూ వెళితే కొంత కాలానికి ఒక మాసంలో రెండు సంక్రాంతులు వస్తాయి . అప్పుడు ఆ మాసాన్ని తొలగిస్తారు . దీనినే క్షయ మాసం లేదా లుప్తమాసం అంటారు . ఆ లుప్త మాసాలు కార్తీక , మార్గశిర , పుష్యమాసాలలో వస్తాయి . ఎందుకంటే ఈ మాసాలలో భూమి అండవృత్తపు సమీపబిందువు వద్ద వుండి వేగంగా నడవడంతో సూర్యుడు ఒక్కొక రాశిని త్వరత్వరగా దాటేస్తాడు . కనుక ఈ రెండు నెలలలోనే సంక్రాంతులు వస్తాయి . క్షయ మాసానికి రెండువైపులా చెరో అధిక మాసం వస్తాయి . ఈలుప్త మాసాలు 141 సం.కు ఒక్కొకసారి 19 సంవత్సరాలకు , 122 ఏళ్ళకు వస్తాయి అని భాస్కరాచార్యులు అన్నారు .
ఇది చాంద్ర , సౌర మానాలు మరియు అధిక మాస , లుప్త మాస , క్షయ మాసాల గురించి వివరణ . మరియొక అంశంతో మళ్ళి కలుద్దాం . సర్వేజన సుఖినో భవంతు . దయచేసి మీ సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు .
మీ అమూల్య మయన సమయాన్ని వెచ్చించి నా పోస్ట్లు చదివి ,కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదములు ,
సదా ఆద్యాత్మిక సేవలో
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి ,
నార్త్ కరోలిన , USA .

Tuesday, August 12, 2014

Surya Kavacham in Telugu

శ్రీభైరవ ఉవాచ
యో దేవదేవో భగవాన్ భాస్కరో మహసాం నిధిః |
గయత్రీనాయకో భాస్వాన్ సవితేతి ప్రగీయతే || 1 ||
తస్యాహం కవచం దివ్యం వజ్రపంజరకాభిధమ్ |
సర్వమంత్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్ || 2 ||
సర్వపాపాపహం దేవి దుఃఖదారిద్ర్యనాశనమ్ |
మహాకుష్ఠహరం పుణ్యం సర్వరోగనివర్హణమ్ || 3 ||
సర్వశత్రుసమూహఘ్నం సమ్గ్రామే విజయప్రదమ్ |
సర్వతేజోమయం సర్వదేవదానవపూజితమ్ || 4 ||
రణే రాజభయే ఘోరే సర్వోపద్రవనాశనమ్ |
మాతృకావేష్టితం వర్మ భైరవానననిర్గతమ్ || 5 ||
గ్రహపీడాహరం దేవి సర్వసంకటనాశనమ్ |
ధారణాదస్య దేవేశి బ్రహ్మా లోకపితామహః || 6 ||
విష్ణుర్నారాయణో దేవి రణే దైత్యాంజిష్యతి |
శంకరః సర్వలోకేశో వాసవో‌உపి దివస్పతిః || 7 ||
ఓషధీశః శశీ దేవి శివో‌உహం భైరవేశ్వరః |
మంత్రాత్మకం పరం వర్మ సవితుః సారముత్తమమ్ || 8 ||
యో ధారయేద్ భుజే మూర్ధ్ని రవివారే మహేశ్వరి |
స రాజవల్లభో లోకే తేజస్వీ వైరిమర్దనః || 9 ||
బహునోక్తేన కిం దేవి కవచస్యాస్య ధారణాత్ |
ఇహ లక్ష్మీధనారోగ్య-వృద్ధిర్భవతి నాన్యథా || 10 ||
పరత్ర పరమా ముక్తిర్దేవానామపి దుర్లభా |
కవచస్యాస్య దేవేశి మూలవిద్యామయస్య చ || 11 ||
వజ్రపంజరకాఖ్యస్య మునిర్బ్రహ్మా సమీరితః |
గాయత్ర్యం ఛంద ఇత్యుక్తం దేవతా సవితా స్మృతః || 12 ||
మాయా బీజం శరత్ శక్తిర్నమః కీలకమీశ్వరి |
సర్వార్థసాధనే దేవి వినియోగః ప్రకీర్తితః || 13 ||
అథ సూర్య కవచం
ఓం అమ్ ఆమ్ ఇమ్ ఈం శిరః పాతు ఓం సూర్యో మంత్రవిగ్రహః |
ఉమ్ ఊం ఋం ౠం లలాటం మే హ్రాం రవిః పాతు చిన్మయః || 14 ||
~ళుం ~ళూమ్ ఏమ్ ఐం పాతు నేత్రే హ్రీం మమారుణసారథిః |
ఓం ఔమ్ అమ్ అః శ్రుతీ పాతు సః సర్వజగదీశ్వరః || 15 ||
కం ఖం గం ఘం పాతు గండౌ సూం సూరః సురపూజితః |
చం ఛం జం ఝం చ నాసాం మే పాతు యార్మ్ అర్యమా ప్రభుః || 16 ||
టం ఠం డం ఢం ముఖం పాయాద్ యం యోగీశ్వరపూజితః |
తం థం దం ధం గలం పాతు నం నారాయణవల్లభః || 17 ||
పం ఫం బం భం మమ స్కంధౌ పాతు మం మహసాం నిధిః |
యం రం లం వం భుజౌ పాతు మూలం సకనాయకః || 18 ||
శం షం సం హం పాతు వక్షో మూలమంత్రమయో ధ్రువః |
ళం క్షః కుక్ష్సిం సదా పాతు గ్రహాథో దినేశ్వరః || 19 ||
ఙం ఞం ణం నం మం మే పాతు పృష్ఠం దివసనాయకః |
అమ్ ఆమ్ ఇమ్ ఈమ్ ఉమ్ ఊం ఋం ౠం నాభిం పాతు తమోపహః || 20 ||
~ళుం ~ళూమ్ ఏమ్ ఐమ్ ఓం ఔమ్ అమ్ అః లింగం మే‌உవ్యాద్ గ్రహేశ్వరః |
కం ఖం గం ఘం చం ఛం జం ఝం కటిం భానుర్మమావతు || 21 ||
టం ఠం డం ఢం తం థం దం ధం జానూ భాస్వాన్ మమావతు |
పం ఫం బం భం యం రం లం వం జంఘే మే‌உవ్యాద్ విభాకరః || 22 ||
శం షం సం హం ళం క్షః పాతు మూలం పాదౌ త్రయితనుః |
ఙం ఞం ణం నం మం మే పాతు సవితా సకలం వపుః || 23 ||
సోమః పూర్వే చ మాం పాతు భౌమో‌உగ్నౌ మాం సదావతు |
బుధో మాం దక్షిణే పాతు నైఋత్యా గురరేవ మామ్ || 24 ||
పశ్చిమే మాం సితః పాతు వాయవ్యాం మాం శనైశ్చరః |
ఉత్తరే మాం తమః పాయాదైశాన్యాం మాం శిఖీ తథా || 25 ||
ఊర్ధ్వం మాం పాతు మిహిరో మామధస్తాంజగత్పతిః |
ప్రభాతే భాస్కరః పాతు మధ్యాహ్నే మాం దినేశ్వరః || 26 ||
సాయం వేదప్రియః పాతు నిశీథే విస్ఫురాపతిః |
సర్వత్ర సర్వదా సూర్యః పాతు మాం చక్రనాయకః || 27 ||
రణే రాజకులే ద్యూతే విదాదే శత్రుసంకటే |
సంగామే చ జ్వరే రోగే పాతు మాం సవితా ప్రభుః || 28 ||
ఓం ఓం ఓం ఉత ఓంఉఔమ్ హ స మ యః సూరో‌உవతాన్మాం భయాద్
హ్రాం హ్రీం హ్రుం హహహా హసౌః హసహసౌః హంసో‌உవతాత్ సర్వతః |
సః సః సః సససా నృపాద్వనచరాచ్చౌరాద్రణాత్ సంకటాత్
పాయాన్మాం కులనాయకో‌உపి సవితా ఓం హ్రీం హ సౌః సర్వదా || 29 ||
ద్రాం ద్రీం ద్రూం దధనం తథా చ తరణిర్భాంభైర్భయాద్ భాస్కరో
రాం రీం రూం రురురూం రవిర్జ్వరభయాత్ కుష్ఠాచ్చ శూలామయాత్ |
అమ్ అమ్ ఆం వివివీం మహామయభయం మాం పాతు మార్తండకో
మూలవ్యాప్తతనుః సదావతు పరం హంసః సహస్రాంశుమాన్ || 30||
అథ ఫలశృతిః
ఇతి శ్రీకవచం దివ్యం వజ్రపంజరకాభిధమ్ |
సర్వదేవరహస్యం చ మాతృకామంత్రవేష్టితమ్ || 31 ||
మహారోగభయఘ్నం చ పాపఘ్నం మన్ముఖోదితమ్ |
గుహ్యం యశస్కరం పుణ్యం సర్వశ్రేయస్కరం శివే || 32 ||
లిఖిత్వా రవివారే తు తిష్యే వా జన్మభే ప్రియే |
అష్టగంధేన దివ్యేన సుధాక్షీరేణ పార్వతి || 33 ||
అర్కక్షీరేణ పుణ్యేన భూర్జత్వచి మహేశ్వరి |
కనకీకాష్ఠలేఖన్యా కవచం భాస్కరోదయే || 34 ||
శ్వేతసూత్రేణ రక్తేన శ్యామేనావేష్టయేద్ గుటీమ్ |
సౌవర్ణేనాథ సంవేష్ఠ్య ధారయేన్మూర్ధ్ని వా భుజే || 35 ||
రణే రిపూంజయేద్ దేవి వాదే సదసి జేష్యతి |
రాజమాన్యో భవేన్నిత్యం సర్వతేజోమయో భవేత్ || 36 ||
కంఠస్థా పుత్రదా దేవి కుక్షిస్థా రోగనాశినీ |
శిరఃస్థా గుటికా దివ్యా రాకలోకవశంకరీ || 37 ||
భుజస్థా ధనదా నిత్యం తేజోబుద్ధివివర్ధినీ |
వంధ్యా వా కాకవంధ్యా వా మృతవత్సా చ యాంగనా || 38 ||
కంఠే సా ధారయేన్నిత్యం బహుపుత్రా ప్రజాయయే |
యస్య దేహే భవేన్నిత్యం గుటికైషా మహేశ్వరి || 39 ||
మహాస్త్రాణీంద్రముక్తాని బ్రహ్మాస్త్రాదీని పార్వతి |
తద్దేహం ప్రాప్య వ్యర్థాని భవిష్యంతి న సంశయః || 40 ||
త్రికాలం యః పఠేన్నిత్యం కవచం వజ్రపంజరమ్ |
తస్య సద్యో మహాదేవి సవితా వరదో భవేత్ || 41 ||
అఙ్ఞాత్వా కవచం దేవి పూజయేద్ యస్త్రయీతనుమ్ |
తస్య పూజార్జితం పుణ్యం జన్మకోటిషు నిష్ఫలమ్ || 42 ||
శతావర్తం పఠేద్వర్మ సప్తమ్యాం రవివాసరే |
మహాకుష్ఠార్దితో దేవి ముచ్యతే నాత్ర సంశయః || 43 ||
నిరోగో యః పఠేద్వర్మ దరిద్రో వజ్రపంజరమ్ |
లక్ష్మీవాంజాయతే దేవి సద్యః సూర్యప్రసాదతః || 44 ||
భక్త్యా యః ప్రపఠేద్ దేవి కవచం ప్రత్యహం ప్రియే |
ఇహ లోకే శ్రియం భుక్త్వా దేహాంతే ముక్తిమాప్నుయాత్ || 45 ||
ఇతి శ్రీరుద్రయామలే తంత్రే శ్రీదేవిరహస్యే
వజ్రపంజరాఖ్యసూర్యకవచనిరూపణం త్రయస్త్రింశః పటలః ||

Monday, July 14, 2014

మీ నక్షత్రము ప్రకారము మీ అదృష్ట సంఖ్య మీకు తెలుసా ? lucky numbers based on birth star ?

అశ్వని - మఖ - మూల : - 7
భరణి - పుబ్బ -పుర్వషాడ :- 6
కృత్తిక - ఉత్తర - ఉత్తరాషాడ :- 1
రోహిణి -హస్త -శ్రవణం :- 2
మృగశిర - చిత్త - ధనిష్ఠ :- 9
ఆర్ద్ర - స్వాతి - శతభిష :- 4
పునర్వసు -విశాఖ - పూర్వాభాద్ర :- 3
పుష్యమి - అనూరాధ - ఉత్తరాభాద్ర :- 8
ఆశ్లేష - జ్యేష్ఠ - రేవతి :- 5
" జన్మ మరియు నామ " తారలు అయిన వారికి .

Wednesday, June 11, 2014

మన యొక్క అంతిమ లక్ష్యం సత్యమును తెలుసుకొనుటమే

మన వైదిక సంస్కృతి మానవాళికి సాంప్రదాయాలను తెలియజేస్తూ సాధించవలసిన అంతిమ లక్ష్యం కోసం విధానాలను ఏర్పరిచాయి. మన యొక్క అంతిమ లక్ష్యం సత్యమును తెలుసుకొనుటమే. ఆ సత్యమును తెలుసుకొనుటకు వ్రతము యొక్క ఆవశ్యకతను గురించి ఈ శ్లోకంలో తెలియజేయబడినది.
శ్లోకం:
వ్రతేన దీక్షా మాప్నోతి దీక్షామాప్నోతి దక్షిణాం
దక్షిణాం శ్రద్ధా మాప్నోతి శ్రద్దయా సత్య మాప్యతే


వ్రతము వలన దీక్ష, దీక్ష వలన దక్షిణ, దక్షిణ వలన శ్రద్ధ, శ్రద్ధ వలన సత్యం లభిస్తుంది. కనుక మనము విధిగా వ్రతాలను ఆచరించాలి
వ్రతమనగా నియమిత సమయంలో నిర్దేశించిన కార్యమును ఆచరించుట

Thursday, May 8, 2014

ఉపచారములు ఆధ్యాత్మికంగా వాటి ఉపయోగం ? Who many Vupacharas there in Hindu Dharma ?

What is Panchopachara Pooja  ?  Who many Vupacharas there in Hindu Dharma ?

ఉపచారము అనగా భగవంతునికి పూజ నందు చేయు సేవలు లేదా కైంకర్యము లు అని చెప్పవచ్చు. సనాతన ధర్మము  నందు ఎన్నో రకముల సంప్రదాయములు , ఆచార వ్యవహారములు కలవు కావున వారి వారి పద్ధతి ని ఆచరించి ఈ ఉప చారములు  వున్నవి . అందు కొన్ని వివరించు కొను ప్రయత్నం చేయుచున్నాను .

ఈ ఉపచారముల యందు ఏకోపచారము , త్రయోపచారము ,పంచోపచారము ,నవోపచారము , షోడశోపచారము ,అష్టాదసోపచారము ,ఎకవింశత్యుపచారం , ఎకత్రింశత్యుపచారములు మున్నగు భేదములు అనేకము కలవు .

 కేవలం నైవేద్యము ను మాత్రమే చెల్లించుట ఏకోపచారము అనబడును . స్నాన , పుష్ప ,నైవేద్యము
లు త్రయోపచారము లేక త్రివిదోపచారము అగును . గంధ ,పుష్ప ,ధూప ,దీప,నైవేద్యం పంచోపచారము అనబడును .

 ఆవాహన , పాద్య , ఆచమన , స్నాన , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యములు ,నవోపచారములు అని చెప్ప బడినది .

 ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన , స్నాన ,వస్త్ర , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు ,గావించుట షోడశోపచారము .


 ధ్యాన , ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన ,మధుపర్క , స్నాన ,వస్త్ర , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు అష్టాదసోపచారము .


 ధ్యాన , ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన ,మధుపర్క , స్నాన ,వస్త్ర ,యజ్ఞోపవీత ,  గంధ ,ఆభరణ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు ఎకవింశత్యుపచారములు అగును .

శైవ ధర్మమున శరీరస్తంబులగు ముప్పదియారు తత్వముల కార్య సమర్పనాత్మకముగ ముప్పదియారు ఉపచారములు శివ పూజ యందు గావింపబడుచుండెది . దేవి పూజలందు అరవైనాలుగు ఉపచారములు  ఉపయోగించటం జరుగు చున్నది .

షోడశోపచారము  ప్రసిద్ధములు , మంత్ర శాస్త్ర పరముగ పంచోపచారములు ప్రసిద్ధములు . జప , తప , స్తోత్ర , కవచాదుల యందు , దీని వినియోగం అధికం . దీనిని లమితి పంచ పూజ యని యును వ్యవహరించు చుందురు .








Saturday, March 1, 2014

సభ్య సమాజం సాక్షిగా వాస్తు శాస్త్రం కోన ఊపిరితో కొట్టుకుంటుంది .

వాస్తు , జ్యోతిష్యము అనునవి వేరు వేరు శాస్త్రాలు కాదు.  రెండు ఒకే శాస్త్రము నుండి వచ్చినవి మరియు వేదాంగములు కూడాను . ఈ రెండిటి లో ఎ ఓక్కదాన్ని విడచి మరి ఒక దానితో ఏ విషయం గణించ లేము . ఇందులో జ్యోతిష్యం అను నది కొంచం ఆధునిక పండితులకు నూతన విధానాలకి అన్వయించి చెప్పటం సులువుగాను , మరియు ఇతరత్రా కారణాలు కూడా ...! 
కానీ వాస్తు శాస్త్రం అలా కాదు . అసలు నిజానికి మన సనాతన వాస్తు శాస్త్రం లో ఇప్పుడు మన ఆధునిక వాస్తు పండితులు తెలుసుకున్నది 50 % అందులోను వడగలుగు తున్నది 10 % మాత్రమే . ఈ ఆకాశానికి అంటేలా 50 ,100 బహుళ అంతస్తు భావనలు ,కాంక్రీటు అరణ్యము లు  వాస్తు నందు లేవు  . 
 
కేవలం ,ద్వార నిర్ణయం , ఈశాన్యంలో బోరు ,ఆగ్నేయం లో వంటిల్లు ,నైరుతిలో పడకగది . దేవుడి గది ఈశాన్యంలో వుండాలి అని తెలుసుకొని వాస్తు పండితులం అని చెప్పు కునే వారికి తెలిసింది వాస్తు శాస్త్రం కాదు అది  వాస్తు శాస్త్ర సముద్రములో ఒక నీటి బొట్టు మాత్రమె . అర్వణము , భూమి పరీక్షా , శల్యములు , ప్రహరి నిర్ణయం ,వర్గు నిర్ణయం,ఆయము,ఇంటి వాతములు ,భూమిలో జల కనుగోనటం , గర్భ పరిశీలనా , ఇంతే కాక ప్రహరి నుండి మొదలుకొన్ని కప్పు ( ఈ రోజులలో స్లాప్ ) దాక ,కొలతలు,యోగ్య మైన ముహూర్తాలు ఇలా ఎన్నో విషయాలు వాస్తు శాస్త్రం చెపుతుంది . అసలు ఇంటికి ఎన్ని దూలాలు వుండాలి ,అడ్డు వరసలు ,నిలువు వరుసలు వాటి లెక్క ఇవన్ని ఎంతో గణించి నిర్ణయించే వారు పూర్వం పండితులు . అసలు ఈ రోజుల్లో భావి తవ్వించి వరలు దించే వారే కరువయ్యారు .. 
 
అపార్టుమెంట్ సంప్రదాయం . ఇరుకైన రోడ్లు ,ఆధునికతకు పెద్దపీట వేసిన, హంగు,ఆర్భాటాలతో కట్టిన భవంతులు , మహానగరం అని చెప్పుకుని కనీసం మురికి కాలవలు సరిలేని పట్టణాలు , అగ్గిపేట్ట అంత  ఇళ్ళ కట్టడాలు అర్ధం పర్ధం లేని దిక్కులలో నిర్మాణాలు , వీటి అన్నిటి కింద పడి ఏనాడో వాస్తు శాస్త్రం నలిగి కోన ఊపిరితో కొట్టుకుంటుంది . ఇది చాలక , అన్ని తెలుసని అనుకునే మేస్త్రీలు , అవసరాలను కొనే బలహీనత వలన - ఉపేక్షా భావము వహించే యజమానులు . అది బాగోలేదు , ఇది బాగోలేదు , అని తెలిసి తెలియక,ధనార్జనకు , భుక్తి కోసం శాస్త్రాన్ని నమ్ముకో పొగ అమ్ముకునే వారు వాస్తు శాస్త్రాన్ని ఈ సభ్య సమాజం సాక్షిగా ప్రతి రోజు దిగజారుస్తు మిగిలిన ఊపిరి తీస్తున్నారు . 
అలా అని వాస్తు శాస్త్రం ఈ సమాజానికి పనికిరాదని కానీ తెలిసిన పండితులు లేరు అని నేను అనటం లేదు . ఎంతో మంది మహాను భావులు "ఆధునిక వాస్తు శాస్త్రం " పై అధ్యయనం చేసి అపురుప మైన గ్రంధాలను సమాజానికి ఇచ్చారు . వాటిని అనుసరించుకొని మనకు కుదిరినంత వరకు పాటించటానికి ప్రజలు , మిడి మిడి జ్ఞానంతో కాకుండా అభ్యసించి ,అనుభవాన్ని గణించిన తర్వాతే ,వాస్తు శాస్త్ర పండితులుగా వారి సేవలు అందిస్తే కొంచమైన శాస్త్రాలకు విలువ మిగులుతుంది .
సమాజం బాగుపడుతుంది . భారత వేద జ్యోతిష  విజ్ఞాన ఫలాలు భావి తరాల వారికి అందుతాయి .
ఎందరో మహాను భావులు అందరికి వందనాలు .

Friday, February 28, 2014

"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ " house facing according to name in telugu

అతి ప్రాచీనమైన మన భారత దేశము శిల్ప కళలకు వాస్తు వైభవమునకు ప్రఖ్యాతి వహించి వున్నది . ఈ ఉపఖండము నిర్మాణము కూడా ఎన్నో  వాస్తు విశేషాలతో అలరారుచున్నది . ఇందు చాలా పట్టణ ,పుర ,నగర ,గ్రామాలు వున్నాయి . ఇలాంటి పురములు ,దివ్య సౌధములు ,సాధారణ గృహములు కలిగి వున్న" వస్తువు " కనుకనే భూమికి వాస్తు అనే పేరు వాచ్చినది . ఈ భుమియన్దోనర్చు అన్ని విషయాలను తెలియ జేయు విజ్ఞాన శాస్త్రమే ఈ " వాస్తు శాస్త్రము ". 


అర్వణము :
 " దిస కుదిరితే దశ కుదురు " అన్న సమేతలగా .. ! " దిశ " అనగా " తాను నివసించు దిక్కు , స్థలము , గృహము " అని అర్ధము ." దశ "అనగా "జాతక రీత్యా ప్రాప్తించగల అభివృద్ది కరమైన శుభ యోగములు " కనుక ప్రతి వారును తాము నివసించే ఉనికిని , శాస్త్ర సమ్మతముగా రూపొందించు కొనవలసి యున్నది .
                           నివసించే గృహము సొంతము ఐనా -కా కపోయినా కుడా , కొన్ని అతి ముఖ్యమైన విషయాలను ఉపేక్షింప కూడదు !గృహమేవరిది ఐనను అందలి సౌకర్యములు నివసించు వారనుభవించు నట్లు ... దోషములను కూడా అనుభవించ వలసి వుంటుంది . ఈ ప్రకారము మంచి  కూడా అందుగల వారె పొందుచుండేదరు .

              "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ "అని పెద్దలు చెప్పారు . రామాయణ కలం లో కుడా.బంగరు మయమై , నవరత్న సౌధములతో తులతూగుతున్న కాంచన లంకను చూసి మొహపడుతున్న లక్ష్మణుకి ,అన్నగారయన శ్రీ రామ చoద్రుడంతటి  అవతార మూర్తి ఈ విధముగా చెప్పారు .
శ్లో ॥ అపి స్వర్ణమయీ లంకానమే లక్ష్మణ రోచతె । 
       జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥ 

" ఓ లక్ష్మణ ! లంకానగరము యావత్తు - స్వర్ణ మయమే ఐనను ,అనేక రత్న ,వజ్ర ,మణి మయమై నను ,నాకు దానియందు ఇష్టము లేదు . భ్రాంతి కలుగుట లేదు . ఎమందు వేని -ప్రతి వారికీ కూడా "కన్నతల్లి"  , "జన్మ భూమి" అను రెండూ కూడా స్వర్గము కన్నా శ్రేష్టములై యున్నవి ! [ రామాయణం ]


                           ఎవరు జన్మించిన దేశము ,గ్రామము ,ప్రాంతము ,వారికి అత్యంత సౌఖ్య పదమై యుండగలదు . కొన్ని కారణాంతరాల వలన పర గ్రామ మందు నివసించ వలసి వచ్చినా .. ఆ గ్రామము శాస్త్ర రీత్యా తనకు మంచిదా కదా ?? అని పరిశీలించాలి . దీనికే " గ్రామ అర్వణము " గా పెద్దలు చెబుతుంటారు .
                           అర్వణము చూచే పద్దతులు అనేకము వున్నవి . అన్నీ మంచి పద్దతులే ఐనా .. అనుభవము నందు ఎక్కువగా సరిపోవుచున్న విధానము ను ఉపయోగించుకోనుట . చాలా మంచిది . వాస్తు శాస్త్ర ప్రకారము ఏ పని చేయాలన్నా .. "జన్మ నక్షత్రం " కంటే "నామ నక్షత్రం" శ్రేష్టం ! తన పేరుకు గల మొదటి అక్షరము ప్రకారము నక్షత్ర ,దిశా వర్గ నిర్ణయాలను చేసుకోవాలి .
                         తెలుగు భాషలో అక్షరాలు మొత్తం 51 వున్నవి . వీటిని 8 భాగాలుగా విభజించి - " అష్టవర్గులు " అని పేరు పెట్టారు .  

వీటిలో మొదటి దానికి "అ" వర్గు అని పేరు ! అనగా .. ఈ వర్గం లో " అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ  ఏ ఐ ఓ ఔ అం అః  " పదహారు అక్షరాలు ఉండగలవు . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "అ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి " తూర్పు దిక్కు " స్వదిశ అవుతుంది .

 రెండవది " క " వర్గు ! ఈ వర్గు నందు " క ఖ గ ఘ ఙ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "క  వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఆగ్నేయ దిక్కు " స్వదిశ అవుతుంది .

 మూడవది " చ వర్గు " ! ఈ వర్గు నందు " చ ఛ జ ఝ ఞ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " చ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "దక్షిణ దిక్కు " స్వదిశ అవుతుంది .

నాల్గవది " ట వర్గు " ఈ వర్గు నందు " ట ఠ డ ఢ ణ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "ట  వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "నైరుతి  దిక్కు " స్వదిశ అవుతుంది .

ఐదవది "త వర్గు " ఈ వర్గు నందు " త థ ద ధ న " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "త  వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి " పడమర దిక్కు " స్వదిశ అవుతుంది .

ఆరవది " ప వర్గు " ఈ వర్గు నందు " ప ఫ బ భ మ" అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " ప వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "వాయవ్య దిక్కు " స్వదిశ అవుతుంది .

ఏడవది " య వర్గు " ఈ వర్గు నందు " య ర ల వ " అను నాలుగు  అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " య  వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఉత్తర దిక్కు " స్వదిశ అవుతుంది .

ఎనిమిదవది  "శ వర్గు " ఈ వర్గు నందు " శ ష స హ ళ క్ష  " అను ఆరు  అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "శ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఈశాన్య దిక్కు " స్వదిశ అవుతుంది .

ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వా రే వర్గు నకు చెందిన వారో మొదట తెలుసుకోవాలి . ఆ తర్వాత "ఇంటి దిశ" ,  "సింహద్వార " మరియు " గ్రామ అర్వణము" ల గురించి సులువుగా తెలుసు కోన వచ్చును .

గమనిక : ప్రతి వారికి వారి జన్మస్థలము మరియు స్వగ్రామము చాలా మంచివి . స్వగ్రామము నాకు స్వదిశ యందున్న గ్రామము లేక దిశ అత్యంత  శుభము ! స్వ దిశ మొదలు కొని 1-3-7 దిశ మరియు గ్రామాలూ కూడా శుభాములే ! 2-4-6-8 దిశల యందున్న గ్రామములు మద్యమ ఫలితాన్ని ఇవ్వ గలదు . 5 శత్రు దిశగా పరిగనించ వచ్చు . ఇందు బాధలు , దరిద్రము ,చిక్కులు , అధికము అని చెప్పవచ్చు .

సింహ ద్వారా నిర్ణయ విశేషాలను నా తదుపరి వ్యాసంలో తెలుసు కుందాం ...!
ధన్యవాదములు ...
భువనగిరి మురళి కృష్ణ శర్మ
నార్త్ కరోలినా . ఉత్తర అమెరికా . 

Thursday, February 27, 2014

అసలు జ్యోతిష్యం శాస్త్రం అంటే ఏమిటి ? what is indian vedic astrology ?

జ్యోతిష్యం మానవుడికి అవసరమా ? ఇది లేక పొతే జీవించలేమ ? కేవలం జాతకము ను నమ్ముకొని జీవించటం
ఎంతవరకు సమంజసం ? దీని పరిధి యెంత ఏమిటి ? అసలు నమ్మాలా  వద్ద ? ఇలాంటి వాటి గురించి ఆలోచించే ముందు మనం అసలు మనకు జ్యోతిష్యం గురించి ఎంతవరకు తెలుసు అనేది చాల ముఖ్యం . అసలు ఈ శాస్త్రం ఏమిటి ? ఇందులో ఏయే విషయాలు మనకు తెలుస్తాయి ? ఇవ్వని తెలిస్తే నే గదా ! మనం దానిగురించి మాట్లాడ గలిగేది ? అందుకనే ఈ వ్యాసం లో జ్యోతిష్య శాస్త్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ముందుగా వివరిస్తున్నాను .
మనవ జాతి అవతరించిన తర్వాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి . మన ఋషులు ప్రజా శ్రేయసు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీన మైనది ఈ జ్యోతిష్యం .

జ్యోతి అన్న పదానికి సంస్కృతం లో వెలుగు ,నక్షత్రం ,కన్ను ,సూర్యుడు అనే అర్ధాలు వున్నాయి . మనకు అనంత విశ్వంలో కంటికి ఆకాశం లో కనపడే సూర్యుడు ,చంద్రుడు ,నక్షత్రాలు ,కొన్ని గ్రహాలు , తోకచుక్కలు ,గ్రహణాలు ఇవన్నీ ఆకాశం లో చూసి ఆనందించటం తో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది మరియు ఎంతో ఉత్సాహంగా కూడా వుండేది . ఈ నాడు ఆధునిక సమాజం లో టెలిస్కోప్  మరియు ఇంటర్నెట్ లో అన్ని విషయాలు చాల సులువుగా తెలుసు కుంటున్నాం కాబట్టి మనకు చాల విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు . కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా , విశేషం గా వారిని ఆకర్షించి ,తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచేవి . ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా , ప్రాణుల పై వాటి ప్రభావం వాతావరణం లో క్రమబద్ధమైన మార్పులు , వాటికీ మనవ జీవితంతో వున్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి .
హేతు రహిత మయన విజ్ఞానాన్ని ఎవరు విశ్వసించరు . అలాగే సరి అయిన హేతువు లేక పొతే అది అసలు విజ్ఞానమే కాదు . శాస్త్రము అని పించు కోదు . ఒక వ్యక్తి జీవితాన్ని ఈ జ్యోతిష్య శాస్త్రం శాసిస్తోంది . ఆటను చేసే కర్మను ప్రోచ్చహిస్తోంది. నిత్య జీవితం లో ఎలా మెలగాలో తెలియ చేస్తుంది . కాని ఇవన్నీ మనం తెలుసు కొని ఆచరించి నపుడే ప్రయోజనం . ఒక ప్రాంతపు నక్ష దారిచుపుతుంది , ఎన్ని మార్గాలు వున్నాయో తెలుపు తుంది . మార్గంలో ప్రమాద కరమైన ప్రదేశాలు తెలిపి ఏది సులువైన మార్గం కూడా తెలపవచ్చు కానీ ప్రయాణం జాగ్రతగా మనమే చేయాలి కదా ! ఈ విదంగా మనవ జీవనం గురించి తెలియ జేయటం లో జ్యోతిష్య శాస్త్రం ప్రభావం ఎంతో వుంది . సమానమైన కృషి కలిగిన ఇద్దరు వ్యక్తుల జీవిత ఫలితాలలో తేడాను నిరూపించటం లో భౌతిక శాస్త్రము విఫల మైన సందర్భములో జ్యోతిష్యం ఒక్కటే కారణాలను విశ్లేషించి చూపుతుంది అనేది నిజం !
                           మనకు రోజు అనుభవం లోకి వచ్చే ఒక ముఖ్య విషయాన్నీ పరిశీలిధామ్ ......
రాత్రి వేళల్లో రోగ తీవ్రత అధికంగా వుంటుంది అది అందరికి తెలిసిందే . సూర్య కాంతి  రావటం తోటే మనిషి లో చైతన్యం వస్తుంది . సూర్య కాంతిలో ఎన్నో ఔషదములు వున్నాయని ఆనాటి  నుండి ఈనాటికి అనుభవం లో వున్నా విషయమే . A మరియు D విటమిన్లు సూర్య కంటి నుండే లభ్యమవుతాయి . సూర్య కాంతి లో అంతర్గత తీవ్రత కలిగిన కిరణాలు ఎన్నో మనచుట్టూ వున్నాయి . వాటిలో ముఖ్యమైనవి పరారుణ కిరణాలూ ( infrared) అతినీలలోహిత కిరణాలు (ultra violet ) వున్నాయి . వీటి ప్రభావం మానవుని ఆరోగ్యం పై చాల వుంటుంది .
అందుకనే " ఆరోగ్యం భాస్కరాధిఛ్చెత్ " అని శాస్త్రాలు చెబుతున్నాయి .
                     జీవ కోటి బతక డానికి సూర్యకాంతి చాల అవసరం . సూర్య కాంతి వల్లనే భూమి కి దెగ్గరగా వుండి అతి ప్రభావం చూపే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు . ఒక క్రమపద్ధతిలో సూర్య చంద్రులు పరిభ్రమిస్తుంటారు . చంద్రుడు జలకారకుడు . కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వం చంద్రుడు భూమిలో ఒక భాగమని తర్వాత జరిగిన మార్పుల వాల్ల భూమి నుండి విడి పడింది అనేది ఉహ ! ఆ భాగమే పసిఫిక్ ప్రాంతమని చెబుతుంటారు . చంద్రుడు భూమికి దెగ్గరగా వచినపుడు అంటే పౌర్ణమి నాడు సముద్రం అటు పోట్లు ఎక్కువగా వుంటాయి . ఇక మానవ శరీరంలో మూడింట రెండో వంతు నీరే కదా అందుకనే చంద్రుని ప్రభావం మానవుని పైన ఎక్కువగా వుంటుంది . ద్రవ రూపంలోని రక్తం , ప్లాస్మ చంద్రుని ఆకర్షణ వలన అధికంగా ప్రవహిస్తాయి . అందువలన మనస్సు ,ఆలోచనలో ఎన్నో మార్పులు వస్తాయి . అందుకనే పౌర్ణమి నాటి చంద్రుడు ని చుస్తే ఆనందం కలుగుతుంది , మానసిక ఉద్రేకాలు అవి అమావాస్య , పౌర్ణమి రోజులలో ఎక్కువ అని వైద్య శాస్త్రం చెపుతోంది . అందుకనే " చంద్రమ మనసో జాతః " అని వేదాలలో చెప్ప బడింది . ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వేదాలలో చెప్పా బడింది . ఈ విధంగా గ్రహాలు , నక్షత్రాలు ,రాసులు , వీటి ప్రభావం అధికంగా వున్నట్లు తెలుసుకున్నారు . ఈ శాస్త్రాభివృధి భారత దేశం లో ఏ ఏ కాలాలలో ఎలా జరిగిందో తదుపరి వ్యాసంలో తెలుసు కుందాం ...!

Wednesday, February 26, 2014

మంగళ శ్లోక:



 గణేశ స్తోత్రం

శ్లో ॥  శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
         ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||


శ్లో ॥    అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
        అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||


  
శ్రీరామ స్తోత్రం

శ్లో ॥  శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
        సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

శ్లో ॥  శ్రీ రాఘవం దసరధాత్మజ మప్రమేయం ।
         సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ।
         ఆజానబాహు మరవింద దళాయతాక్షం ।
         రామం నిశాచర వినాశకరం నమామి ॥


గురు శ్లోకం

శ్లో ॥ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
       గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

సరస్వతీ శ్లోకం

శ్లో ॥ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
       విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

వేంకటేశ్వర శ్లోకం

శ్లో ॥ శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌உర్థినామ్ |
        శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

దేవీ శ్లోకం

శ్లో ॥ సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
       శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||

దక్షిణామూర్తి శ్లోకం

శ్లో ॥ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
       నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

నవగ్రహ ధ్యానశ్లోకమ్

శ్లో ॥ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
       గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

శ్లో ॥ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |
       సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ||