Friday, September 5, 2014

చాంద్రమాన, సౌరమానములు అంటే ఏమిటి ? శూన్య,అధిక,క్షయమాసములు ఎలా ఏర్పడతాయి ? What is Adhikha masa, Sunya masa , Skheya Masa ?

చాంద్రమాన ,సౌరమానములు అంటే ఏమిటి ? శూన్య ,అధిక ,క్షయ మాసములు ఎలా ఏర్పడతాయి ?
What is Chandramana and Sowra manam ? 
What is Adhikha masa , Sunya masa , Skheya Masa ?


ప్రకృతి సిద్దంగా మూడు రకాల కాలమానాలు కనిపిస్తున్నాయ్ . అవి 1) రోజు 2) నెల 3) సంవత్సరం,
వీటికి కారకులు సూర్యుడు , చంద్రుడు .రోజు ప్రమాణం సరాసరిగా 24 గంటలు అనేది అందరికి తెలిసిందే . అంటే సూర్యోదయం నుండి సూర్యోదయం . అమావాస్యకి ,అమావాస్యకి  మద్య సరాసరి వ్యవధి 29.530 రోజులు ఇది చంద్రమానం . అలాగే సౌరమానం లో 30 రోజులు మాసము .
రెండు వసంత విషవత్తులు మద్య కాలం ఒక సాయన సంవత్సరము అంటే 365.242199 రోజులు . ఇవన్నీ పూర్ణ సంఖ్యలు కాకుండ భిన్నములు అవడంతో వీటి మద్య పొత్తు చాల కష్టసాద్యం .
1 సంవత్సరం అంటే 12 మాసాలు వుంటాయి . అలాకాక 12 చాంద్రమాసాలు అనుకుంటే మొత్తం లెక్కలన్నీ తేడా వస్తున్నాయ్ . వీటిని లెక్కించటానికి మూడు మార్గములు లేక పద్దతులు వున్నాయి.అవి :
1) చాంద్రమాన పద్ధతి  2) సౌరమానం 3) చాంద్ర , సౌర మన విధానం .

1) చాంద్రమాన పధ్ధతి : ప్రపంచమంతా అన్ని జాతుల వారు మొట్ట మొదట ఉపయోగించిన పధ్ధతి చాంద్రమానం . ఎందుకంటె చంద్ర కళలలో కనిపించినంత బేధము సూర్యునిలో కనిపించక పోవటమే .
ఈ విధంగా 12 చాంద్రమాన మాసాలు సంవత్సరం అనుకుంటే 12x 29.530 = 354 రోజులు . సౌర సంవత్సరం 365.2421 ( 6 1/4 గంటలు ) . దీనికి తేడా 11 1/4 రోజులు అంటే ఏడాదికి 11 1/4 రోజులు చంద్రుడు వెనుక పడిపోయాడు . ఋతువులు అన్ని సూర్యుడుని బట్టి ఏర్పడినవే . మానవుడి జీవన సరళి అంతా ఋతుచక్రం పైనే ఆధారపడి వుంది . అందువల్ల కేవలం చంద్రమానం మాత్రమే అనుసరించలేము .
2) సౌర పంచాంగం : చంద్ర కళల తో సంభంధం లేకుండా సౌరమానము అనుసరించడమే . సంవత్సరం పొడవును నిర్ణయించి దాని ఆధారంగా 12 మాసాలను నిర్ణయించు కోవటం . ఇందులో చంద్రునికి ఏ సంభంధం లేదు . ఇలా  చేయటం వల్ల  కొన్ని ప్రత్యెక దినాల్లో చేయవలసిన కార్యక్రమాలు,నియమాలు , పూర్వకాలంలో యజ్ఞయాగాది క్రతువులు జరగవు . ఎందుకంటె చంద్రునితో సంభంధం పెట్టుకోలేదు కనుక . కనుకనే దీనికి పూర్తి ప్రాధాన్యత లభించలేదు .
3) చాంద్ర , సౌర పంచాంగం : పై రెండు ఇబ్బందులను అధిగమించటానికి గాను చాంద్ర , సౌరమానాలను సమన్వయ పరచి తాయారు చేసినది ఇపుడు మనము ఉపయోగిస్తున్నది ఈ పంచాంగమే .
ఇందులో చంద్ర కళలను అనుసరించి మాసాలు (నెలలు) వుంటాయి . సూర్య గమనం ఆధారంగా సంవత్సరం వుంటుంది . వీటి మద్య సమన్వయ పరచటానికి అవసరం అయనప్పుడు అధిక మాసాలను , ఒక్కో సారి క్షయ మాసాలు ఏర్పరిచారు . 
ఈ క్రింది వివరణతో మీకు సులువుగా అర్ధమవుతుంది :
 చాంద్ర సంవత్సరానికి సౌర సంవత్సరానికి గల 11 1/4 రోజుల భేదమును 3 సంవత్సరాలలో 33 3/4 రోజులు అవుతుంది . అందువల్ల ప్రతి 3 సంవత్సరాలకు 1 నెల అధిక మాసం ఏర్పరిచారు . మిగిలిన 3/4 రోజులను 24 సంవత్సరాలు అయ్యేటప్పుటికి 1 నెల అవుతుంది . అపుడు మరొక అధికమాసం ప్రవేశపెడితే అది పూర్తవుతుంది. అధిక మాసం వచ్చిన నేలను అధిక మాసం అని తర్వాత వచ్చిన నేలను నిజ మాసం అని అంటారు . 
క్షయ మాసం
ఇలా అధిక మాసాలు చేర్చుకుంటూ వెళితే కొంత కాలానికి ఒక మాసంలో రెండు సంక్రాంతులు వస్తాయి . అప్పుడు ఆ మాసాన్ని తొలగిస్తారు . దీనినే క్షయ మాసం లేదా లుప్తమాసం అంటారు . ఆ లుప్త మాసాలు కార్తీక , మార్గశిర , పుష్యమాసాలలో వస్తాయి . ఎందుకంటే ఈ మాసాలలో భూమి అండవృత్తపు సమీపబిందువు వద్ద వుండి వేగంగా నడవడంతో సూర్యుడు ఒక్కొక రాశిని త్వరత్వరగా దాటేస్తాడు . కనుక ఈ రెండు నెలలలోనే సంక్రాంతులు వస్తాయి . క్షయ మాసానికి రెండువైపులా చెరో అధిక మాసం వస్తాయి . ఈలుప్త మాసాలు 141 సం.కు ఒక్కొకసారి 19 సంవత్సరాలకు , 122 ఏళ్ళకు వస్తాయి అని భాస్కరాచార్యులు అన్నారు .
ఇది చాంద్ర , సౌర మానాలు మరియు అధిక మాస , లుప్త మాస , క్షయ మాసాల గురించి వివరణ . మరియొక అంశంతో మళ్ళి కలుద్దాం . సర్వేజన సుఖినో భవంతు . దయచేసి మీ సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు .
మీ అమూల్య మయన సమయాన్ని వెచ్చించి నా పోస్ట్లు చదివి ,కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదములు ,
సదా ఆద్యాత్మిక సేవలో
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి ,
నార్త్ కరోలిన , USA .

4 comments:

  1. You Nailed It Sir ! Huge Information just with few lines.

    ReplyDelete
    Replies
    1. Thank you so much for your kind words. please keep explore the astrology.

      Delete
  2. tq sir ippativaraku py vishayalu maku teliyavu.

    ReplyDelete