Monday, October 29, 2018

మీ పేరును బట్టి ఇంటి సింహ ద్వారమును ఎంచుకోవటం లేక ఏదిక్కు ఇల్లు మీకు అదృష్టాన్ని ఇస్తుందో తెలుసు కోవటం ఎలా ?

ఓం శ్రీ మహా గణపతయే నమః
House facing according to Name
ఉపోత్ఘాతం:- 

అతి ప్రాచీన మైన భారత దేశము శిల్ప కళలకు, వాస్తు వైభవం నకు ప్రఖ్యాతి వహించింది .
భారత దేశ నాగరికత అద్భుతమైన వాస్తు వైభవమునకు అద్దం పడుతుంది . భారత దేశం లోని
అన్ని గ్రామాలు , పట్టణాలు , మహా నగరాలు మహా సౌధాలు శిల్పకళలతో నిండి వాస్తు శాస్త్ర
విజ్ఞానాన్ని , మన పూర్వికుల శిల్పకళా మరియు నిర్మాణ సామర్ద్యాన్ని ప్రపంచానికి
చాటిచెబుతూ అందరిని అబ్బుర పరుస్తున్నాయి .

ఇలా పురములు,దివ్య సౌదములు మరియు సాధారణ గృహములు ఎన్నో కట్టడాలు
వస్తువులుగా తనయందు కలిగి వున్నది కావునే “ భూమికి “ దేవనాగరి యందు “ వాస్తు “
అని కూడా పేరుగలదు. అలాంటి ఎన్నో విషయములను తెలియజేయు విజ్ఞానమే “
వాస్తుశాస్త్రము “ అని పిలవబడినది.

“దిశ కుదిరి దశ కుదురు“ నను సామెత తెలిసిందే ! దిశ అనగా “ తాను నివసించు దిక్కు,
స్థలము,గృహము” అని అర్ధము! దశ అనగా జాతక రీత్యా ప్రాప్తించు అభివ్రుది, శుభ
యోగములు ! కనుక గృహనిర్మాణము తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహం
నిర్మించుకోవాలి . నివసించే గ్రహము సొంతమైన కాక పోయిన అందు వసతులు నివసించు
వారు అనుబవించు నట్లు , అందలి దోషములను కూడా యజమానితో పంచుకోనవలసిందే.
అలాగే మంచిని కూడా నివాసము వుండే వారు యజమాని అనుభవిస్తారు .

ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము , కాని కొన్ని సందర్భాలలో వేరొక
ఇంటిలో నివసించ వలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది .
అలాంటి సందర్భములలో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా ?
కదా ? అని తెలుసుకోనటాన్ని “ వాస్తుశాస్త్రం” లో అర్వణము అని అంటారు .


అర్వణము రెండు రకములుగా లెక్కించ వచ్చు 1. జన్మనక్షత్రము రీత్యా 2. నమనక్షత్రము రీత్యా .
నామ నక్షత్రమును బట్టి గృహము యొక్క సింహద్వారము ఎదిక్కున ఉండాలో నిర్ణయించటం
ఎక్కువగా వాడుకలో వున్నా శ్రేష్టమైన విడనంగా చెప్పవచ్చు. తెలుగు తమియ మలయాళ
కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి మరియు రాశిని బట్టి కూడా
తెలుసుకుంటారు. కానీ ఈవిధానాలు అంత ఎక్కువ వాడుకలో లేక పోవటం గమనించ
వచ్చు. ముందుగా తన పేరునకు గల మొదటి అక్షరం ప్రకారం “దిశావర్గ” నిర్ణయం
చేసుకోవాలి. సాధారణం గా దంపతులు అనగా భార్య భర్తలు గృహ నిర్మాణం తలపెడితే
సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి.
భార్య భర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన అవసరం లేదు అని గమనించ వచ్చు . భూమి భార్య
పేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహ ద్వారం
నిర్ణయించాలి.

“దిశావర్గ” నిర్ణయం :- 

తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 51 వున్నవి. వీటిని 8 భాగాలుగా విభజించినారు. వీటినే
“అష్టవర్గులు” అని పిలుస్తారు. ఈ విధానాన్ని సులువుగా అర్ధం చేసుకోవటానికి పైన
ఇవ్వబడిన పట్టికను గమనించ గలరు.

మొదటది “అ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ, ౠ,ఎ, ఏ, ఐ, ఒ,
ఓ,ఔ,అం,అః” అనే 16 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా
అట్టివారు “అ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “తూర్పు దిక్కు” స్వదిశ
అవుతుంది.

రెండవది “క” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “క, ఖ, గ, ఘ, ఙ ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “క వర్గు” నకు చెందిన వారుగా
పరిగణింప బడతారు. వీరికి “ఆగ్నేయ దిక్కు” స్వదిశ అవుతుంది.

మూడవది “చ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “చ, ఛ, జ, ఝ, ఞ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “చ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “దక్షిణదిక్కు” స్వదిశ అవుతుంది.

నాల్గవది “ట” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ట, ఠ, డ, ఢ, ణ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ట వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ నైరుతి దిక్కు” స్వదిశ అవుతుంది.

ఐదవది “త” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “త, థ, ద, ధ, న” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “త వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ పడమర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఆరవది “ప” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ప, ఫ, బ, భ, మ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ప వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ వాయవ్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఏడవది “య” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “య, ర, ల, వ” అనే 4 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “య వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఉత్తర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఎనిమిదవది “శ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “శ, ష, స, హ, ళ, క్ష” అనే 6 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “శ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఈశాన్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందిన వారో తెలుసు కోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించు కోవాలి.

“దిశావర్గ ఫలితములు”

ప్రతి వారికి వారి జన్మ గృహము శుభము , తన జన్మ గృహము కాక మరియే ఇతర కారణముల వల్లనైన ఇంకో గృహమున నివసించ వలసివచ్చిన తప్పక “ సింహద్వారం దిశను” శాస్త్రరిత్య నిర్ణయించు కొనినివసించుట అత్యంత శుభము!

తన స్వదిశ లో సింహద్వారము ఉండుట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1,3,7 దిశలు కూడాఅత్యంత శుభములే. 2,4,6 దిశలు మద్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5,8 దిశలు ఎంచు కొనిన బాధలు, ఇబ్బందులు, చింతలు, ధనవ్యయం,అనారోగ్యం అధికమగును! తద్వారా దరిద్రమును అనుబవించ వలసి వచ్చును.ఫలితములు వరుసగా

స్వదిశ అనగా 1)పుష్టి 2) సమం 3) మిత్ర 4)సమం 5)శత్రు 6)సౌఖ్యం 7)భోగం 8)వ్యయం. 

వీలైనంత వరకు విదిక్కులు లైన “ ఆగ్నేయం,నైరుతి,వాయవ్యం,ఈశాన్యం” లకు సింహద్వారము ఉండకుండా చూచుట శుభము . గృహమునకు “గేహము” అని పేరు వున్నది! వాస్తు పురుషుని స్వరూపము మనవ దేహము లాంటిది. అందుకు వాస్తుపురుషుని పూజ అంటే తనచే కట్టబడిన గృహమునకు పూజ అని అర్ధము .

 “ సర్వాంగే నయనం ప్రధానం “ అనగా అన్ని దేహ అంగములలో కళ్ళు ప్రధానమైనవి అదే విధంగ “ గేహన్గే సింహ ద్వారం ప్రధానం” అంటే ఇంటికి సింహద్వారం చాలా ప్రధానంఅని అర్ధం.

“ గృహస్తస్య సర్వ క్రియాన సిద్యంతి గృహం వినా” అని శాస్త్ర వాక్యము. అనగా స్వగృహము లేకుండాపరుల గృహములలో ఎన్నాళ్ళు ఎన్ని సత్కర్మలు ఆచరించిన పరిపూర్ణముగా సిద్ధిoచవు. ఆ సత్కర్మల ఫలితమును సంపూర్ణముగా పొందుట కష్టసాద్యము . అందుకే చిన్నదో పెద్దదో తమది అనే ఒక గృహము చాలా అవసరము !

ఇహ పరములకు సాధనము గృహము. చెడు పాత్రలో కాచిన పాలు విరిగి పోయిన విధముగా, చవిటి నెలలో వేసిన పంట పండ నట్లు , వాస్తు సరిలేని గృహమునందు నివాసము నిష్ప్రయోజనం . గృహమునకు సింహద్వారము యెంత ప్రధానమో , గృహము శల్య వాస్తు మరియు ఇంటి లోపల వున్న గదుల నిర్మాణము వాటి స్థితి కూడా అంతే ప్రధానము. కావున తామందరూ శాస్త్రపరిజ్ఞాన సహాయతతో అందమైన,శుభ వాస్తు పరమైన గృహములను నిర్మించుకొని ఉత్తమ ఫలితాలను పొందాలని ఈశ్వరుని ప్రార్ధిస్తూ ..

మీ
భువనగిరి మురళీ కృష్ణ శర్మ ( శర్మాజీ )
నార్త్ కరోలిన, అమెరికా.

73 comments:

  1. ఇంటికి పేర్లు ఎం పెట్టాలో తెలియచేయగలరు

    ReplyDelete
    Replies
    1. దానికి శాస్త్ర సంబంధం అక్కరలేదు. మీకు నచ్చిన మంచి పేరు పెట్టవచ్చు. ,
      హరి ఓమ్.
      https://www.youtube.com/user/sarmaaji
      This is my Official Youtube Chanal where I am going to post my Vedic Astrology Videos. Please Subscribe and Support . 🙏

      Delete
    2. స్వామి నా పేరు దుర్గా ప్రసాద్ రోహిణి నక్షత్రము వృషభ రాశి నా జాతకం గురించి తెలియజేయండి

      Delete
    3. Srinivasa Rao Peru ku ya dikku manchidhi sir

      Delete
  2. Namaste swami
    Memu oka house teesukovali anukuntunnam. Dani Sinha dwaram south facing.
    venkata ramesh-arudra
    Vasavi-rohini
    Akshaya jyothi-krithika (daughter)
    Chenna mallukarjun- aswini (sun)
    Evari Peru meeda bagundi konchem choodandi



    ReplyDelete
    Replies
    1. Head of the family I.e. yours-it is useful all of your's future generations.

      Delete
  3. good evening sir
    my name is venkata phaneendra vijaya kasyapa
    but people call me kasyapa. could you please suggest me which direction house is good for me?
    thank you
    kasyapa

    ReplyDelete
    Replies
    1. మీరు వెంకట అనే పేరుతోనే చూసుకోవాలి . ఉత్తరం మీ స్వదిక్కు. Hari Om,

      https://www.youtube.com/user/sarmaaji

      This is my Official Youtube Channel where I am going to post my Vedic Astrology Videos. Please Subscribe and Support . 🙏

      Delete
    2. My name is santosh gupta. Please send suitable main entrance sir

      Delete
  4. Hi Sir, Good Morning. My name Satish. Could you please suggest me which direction flat is good for my family? Can I choose West facing flat? For the apartments, do we need to consider flat or apartment facing?

    ReplyDelete
  5. My son h Rama Krishna Rao mrugasira second padam is purchasing West facing house is it good swamiji

    ReplyDelete
  6. Mrugasira second padam which facing house is best

    ReplyDelete
  7. Good evening Swamy, my name is SURENDRA, which direction is for me.

    ReplyDelete
  8. Nameste Swamy-

    Plan to buy a house in Brisbane, Australia. Please suggeset suitable direction for us to choose.

    Name : Konakanchi Satheeshwara Prasad
    Star : Ashwini
    Rasi : Mesha

    Name : Cherukupalli Sandha Lakshmi (Wife)
    Star : Revathi
    Rasi : Meena

    Place of Living - Brisbane, Austalia


    Thanks

    Prasad Konakanchi

    ReplyDelete
  9. Hi swamiji,na peru sai sandeep and na janma nakshatram kritika .Janma nakshatram prakaram chuste east facing first choice and north facing second choice ani undi,but as per my name,eesanyam swa dikku and north suit avvadu ani undi,denini consider cheyyali konchem clarify cheyyagalaru
    Thanks

    ReplyDelete
  10. గురువు గారు నాది వృచ్చికరాశి, జ్యేష్ట నక్షత్రం, నాపేరు లక్ష్మీపతిరాజు. నాకు సింహద్వారం ఏదీ సరిపోతుందో దయచేసి తెలువులగలరు

    ReplyDelete
  11. Guruvugaru namaskaram, na peru Narayana Rao, west facing flat addeki teesukovachha?

    ReplyDelete
  12. namaskaram guruvu gaaru..
    na peru maadhav.. alaaga chusthe vaayuvyam lo simha dwaaram undaali ani ardham indhi..
    nakshatram purva aashada(makara rasi). daani lo west facing house last choice annaaru..
    naku west facing illu teeskovalani undhi.. simha dwaaram atu uncha vachaa?

    ReplyDelete
  13. Sir aslesha 13-02-1987 star adhishaku illu మారాలి mariyu వీరికి shimha dwaram స్వంత intilonchi adde ఇంటికీ మారాలి eppudu date fix cheyandi.

    ReplyDelete
  14. Hi sir
    My name jaya lakshmi can you please tell me which facing house good for me.
    My raasi karkataka

    ReplyDelete
  15. Namaskaram,
    My name is Hemanth Kumar Pilli. Please tell me which facing house good for me.

    ReplyDelete
  16. Sir namaste maa son nakshatram uttarashada name lo first Naga please sir e facing napputundi

    ReplyDelete
  17. గురువు గారు నమస్కారం....నా పేరు కల్యాణ్ పై విధంగా నాకు స్వదిశ ఆగ్నేయం మరి ఆ దిక్కులు పెట్టకుండుట మంచిది అన్నారు మరి ఏ దిశ మంచిది తెలుపగలరు.

    ReplyDelete
    Replies
    1. Guruji...please reply to this post. I have similar issue. My swadisha is north-east.

      Delete
  18. Guru ji na neme base chesukoni e dikku house baguntadi.

    ReplyDelete
  19. నమస్తే సార్ నా పేరు ఫణీంద్ర అందరూ నన్ను ఫణి అని పిలుస్తారు. నాకు ఏ దిక్కు ఉపయోగం చెప్పగలరు

    ReplyDelete
  20. గురువు గారు నమస్కారం.మా అల్లుడి పేరు రామ కృష్ణ.దనిష్ఠ 3వ పాదం.ఏ దిక్కు సింహ ద్వారం ఉపయోగించాలి,దాయవుంచి చెప్పగలరు.

    ReplyDelete
  21. నమస్తే గురువు గారు. నా పేరు సుజాత, శతభిషం నక్షత్రం. ఏయే సింహద్వారం వుండే ఇళ్ళు మాకు శుభ ఫలితాలు ఇస్తుందో తెలియచేయండి guruvu గారు. మా husband పేరు అప్పారావు గారు.

    ReplyDelete
    Replies
    1. Sir meru cheppenattu chesthe chat lo ee sanyam and west manchidi kadhu, kani meru south bad annaru yela

      Delete
  22. నా పేరు భాను దుర్గా ప్రసాద్ నేను వెస్ట్ ఫేసింగ్ సైట్ తీసుకుని ఇల్లు కట్టుకో వచ్చా

    ReplyDelete
  23. Guruvu garu ...na Husband Peru Srinivasa Rao...dhanishta ,kumbarasi,na name swarnalatha.tularasi,visakha ...Maku a face baguntundi Guruvu garu...dhayachesi cheppagalaru..swami




    ReplyDelete
  24. Sir, my name is Sreekrishna. I would like to know, which direction of House and plot is suitable for me. My Nakshatra is Bharani 4 Padam.

    ReplyDelete
  25. Namaste sir.. memu north south facing lo sight theesukovalani anukuntunnam ma husband name ganesh Revathi nakshtram aayana peru meeda manchidokaado cheppagalaru..

    ReplyDelete
  26. Sir maa abbayi di visakha nakstram birth time 1.20 pm saturday site purchase chedam anukuntnam e facing manchidi

    ReplyDelete
  27. Swamiji Garu Good Morning Naa Peru DEVARAI surname YADAGIRI full name so present East face house lo vunnanu...Naa Peru prakaram Jyesta Nakshathram...So Naaku ye dikku yekkuvaga kalasi vastundi cheppagalaru Swamiji please...

    ReplyDelete
    Replies
    1. mee peru kanna mee janma nakshatram prakaaram choosukonte phalitaalu khachitangaa untaayi

      Delete
  28. Guruji, My name is Hemantha Kumar. As per your chart "North east" is my swa disa. But you have mentioned that avoid placing simha dwaram in "Vidikkulu" such as North-East, South-East,south-west and north-west. Can you please help which direction i should place simha dwaram for my house.

    ReplyDelete
  29. Guruvu garu, na name:Govind, Arudra nakshatra, nennu kothaga home thisukoli ani anukutuunanu, naku a face kalisi vasthudi guruvugaru

    ReplyDelete
  30. గురువుగారు నమస్కారం
    నా పేరు వెంకట ముత్యాల సాగర్
    నాకు ఏ దిశ అయితే బాగుంటుందో తెలుపగలరు
    9491068026

    ReplyDelete
  31. lvijayakumar8417@gmail.com. Lvjayakumar

    ReplyDelete
  32. గురువు గారు మా భార్య పేరు అరుణా దేవి.నేను ఉత్తరం దిక్కు స్థలం తీసుకున్నాను మంచిదేనా.

    ReplyDelete
  33. గురూజీ నా పేరు భాస్కరరాజు నాకు ఏ దిశ గృహము ఉత్తమం
    ఇపుడు మేము అద్దెకు ఉండే ఇళ్లు పడమార దిశ

    ReplyDelete
  34. నమస్తే గురువుగారు నాపేరు Haribabu naku west facing site vundhi. Me chart ni study cheste naku eesanyam, agneyam and vayuvyam sitable nakunna site lo house katukovacha vere site thisukovala thelupagalaru

    ReplyDelete
  35. Date of Barth 08-11-1991 time Evening 4.30pm

    ReplyDelete
  36. గురువు గారికి నమస్కారం నా పేరు వెంకట సుబ్రమణ్య ప్రసన్న ఆంజనేయులు.నాకు ఉత్తరం వైపు రోడ్డు కల్గిన స్థలం ఉంది.ఇక్కడ నేను ఇల్లు నిర్మించుకోవచ్చా తెలుపగలరు.నా స్థలానికి తూర్పు, పడమర,దక్షిణం వైపు ఇళ్ళు, ఉత్తరం వైపు రోడ్డు కలవు.ఇది ఏ సింహద్వారం అగునో దయచేసి తెలుపగలరు.

    ReplyDelete
  37. My name is Bhadkar Rao
    Pl suggest
    My wife name is Rajamani changed to chandrika after marriage
    Pl suggest guru ji

    ReplyDelete
  38. My name is Bhaskar Rao
    Pl suggest
    My wife name is Rajamani changed to chandrika after marriage
    Pl suggest guru ji

    ReplyDelete
  39. Naa pru ramanaiah patamara face land lo house katti ko na vacha

    ReplyDelete
  40. SIR,
    Which facing is suitable for name Sri

    ReplyDelete
  41. గురువు గారూ నమస్కారములు పెట్టిన పేరు,పిలిచే పేరు వేరుగా ఉన్నప్పుడు ఏ పేరుతో సింహద్వారము నిర్ణయము చేసుకోవాలి తెలియజేయగలరు.

    ReplyDelete
  42. Good morning guru raru
    My name is -koteswara rao
    Place which facing place is good house also
    This is my whatsapp no -9490807323
    Please teleme guru garu

    ReplyDelete
  43. గృనిర్మాణానికి పురుషుని పేరా, భార్యాభర్తల పేర్ల పై ఏది పరిగణలోకి తీసుకొవలి

    ReplyDelete
  44. గురువుగారు నా పేరు మధుసుధన్ నేను బావిషత్తు లో ఎదగాలి అంటే aa దిక్కు లో వుండాలి
    9666663658

    ReplyDelete
  45. Guruvu garu namaskaram na peru raviraju na పరిస్థితి enti own house na jatakamu lo ఉందా nenu 13th april 1981 lo putta naaku e graamam.and e facing house kalisi vastundni

    ReplyDelete
  46. Namaskaram guruvu garu,

    We lve in virginia. New house kattukuntunnamu. North east main door vostundi. But name prakaram only south, west, east 1st option vundi. Emi cheyali andi.please suggest
    Names: Jithender Reddy Vummadi
    Laxmi

    ReplyDelete
  47. My name is Mahendra intiki simha dwaram etu petikovali guruvu garu

    ReplyDelete
  48. Swamy namaskaram naperu KAMALAKAR veparamulo Edhiku kurchoni nadapavale dhanyavadhamulu

    ReplyDelete
  49. Guruji Namaste, My name Mohan Murali Krishna , pubba nakshatra & Simha Raasi on which direction I have to take home or site.

    ReplyDelete
  50. Sir my Dadi Uma Maheswara rao, Bharani nakshtram, naku which facing house is better.

    ReplyDelete
  51. Namaste Swamy, Naa Peru Gopi Krishna, pubba nakshatram, naaku which facing suit avutundi

    ReplyDelete
  52. My name ramesh anuradha nakshatram which face suit for me

    ReplyDelete
  53. Namaste swami
    My husband name is gangadhar.which facing house is suitable for my husband which facing dwaram is good.
    Please tell me

    ReplyDelete
  54. This comment has been removed by the author.

    ReplyDelete
  55. Namaste guruvugaru��,my husband name satya,star sathabisham 3rd padam,e dikku simhadwaramoo teliyacheyagalaru please

    ReplyDelete
  56. Namaste guruji .we decided to buy home so we want to know is west face direction house ( simha dwaram )is good for us .My husband name is praveen kumar & we r staying on USA

    ReplyDelete
  57. Namaste guruvu Garu...we are planning to buy house in USA(New Jersey)..Which face house(Simha dwaram) is best on my husband name...
    My husband name is - Tulasi Rao Yamala(Pusvashada Nakshtram)
    My name - Rajeswari(Pubba Nakshtram)

    ReplyDelete
  58. Namasthe Swamiji.
    4 విదిక్కులలో సింహద్వారం లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు గదా స్వామీ,
    అయితే 4 వర్గుల వారికి 1,4,7 స్థానాలు కూడా విదిక్కులే కదా వారు ఏ దిక్కుకు సింహద్వారం ఉండా
    లో సూచించగలరు. ముఖ్యంగా శ వర్గుకు.
    ధన్యవాదాలు స్వామి.

    ReplyDelete
  59. నమస్తే గురువు గారు నా పేరు శ్రీధర్, నా నక్షత్రం రేవతి 2వ పాదం, నాకు ఏ దిక్కు సింహద్వారం బాగుంటుందో తెలియజేయగలరు.

    ReplyDelete
  60. Sir, నా పేరు శ్రీనివాసరావు. ఏ దిక్కు మెయిన్ ఎంట్రన్స్ బాగుంటుంది. తెలుపగలరు.

    ReplyDelete
  61. శర్మ జి గారు, 🙏, జన్మ నామము అంటే పుట్టినప్పుడు పంతులు గారు జన్మనామం అనే బుక్ లో రాసిన పేరా లేదా రెగ్యులర్ గా వాడుకునే పేరా అంటే as per స్టడీ అండ్ సర్టిఫికెట్ లో వుండే పేరా .

    నా పేరు జన్మనామం లో అయితే పీతాంబర్ అని వుంది కానీ మా అమ్మ నాన్న లు పెట్టిన పేరు రఘు as per certificate and all are calling with Raghu

    మరి ఎప్పుడు ఏది పరిగణలోకి తీసుకోవాలి.

    ReplyDelete