Thursday, September 7, 2017

యజ్ఞోపవీత మహిమ significance of Yagnopaveetham Telugu

 యజ్ఞోపవీత మహిమ (జంద్యము)

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యము’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతో వారి వారి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ని బట్టి ఉపనయన సంస్కారం లో  వేయడం జరుగుతుంది

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

" సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్ "

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -

" ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః "

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

" తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్ "

ఈ శ్లోకంలో తాతపర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

" చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్ "

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.

" పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్ "

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి. అలాగే శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకోవాలి

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. ఇదే యజ్ఞోపవీత మహిమ ..

Tuesday, January 31, 2017

ఓం అస్య శ్రీసరస్వతీస్తోత్రమంత్రస్య , Vasanta Panchami Saraswathi Devi Stotram .

ఓం అస్య శ్రీసరస్వతీస్తోత్రమంత్రస్య | బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | శ్రీసరస్వతీ దేవతా |
 ధర్మార్థకామమోక్షార్థే జపే వినియోగః |
ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణే చాక్షసూత్రం
వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగమ్యా |
సా వీణాం వాదయంతీ స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః
క్రీడంతీ దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా || ౧ ||
శ్వేతపద్మాసనా దేవీ శ్వేతగంధానులేపనా |
అర్చితా మునిభిః సర్వైః ఋషిభిః స్తూయతే సదా |
ఏవం ధ్యాత్వా సదా దేవీం వాంఛితం లభతే నరః || ౨ ||

శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్ |
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ || ౩ ||
యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || ౪ ||
హ్రీం హ్రీం హృద్యైకబీజే శశిరుచికమలే కల్పవిస్పష్టశోభే
భవ్యే భవ్యానుకూలే కుమతివనదవే విశ్వవంద్యాంఘ్రిపద్మే |
పద్మే పద్మోపవిష్టే ప్రణతజనమనోమోదసమ్పాదయిత్రి
ప్రోత్ఫుల్లజ్ఞానకూటే హరినిజదయితే దేవి సంసారసారే || ౫ ||
ఐం ఐం ఐం దృష్టమంత్రే కమలభవముఖాంభోజభూతస్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే |
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిభవే నాపి విజ్ఞానతత్వే
విశ్వే విశ్వాంతరాత్మే సురవరనమితే నిష్కలే నిత్యశుద్ధే || ౬ ||
హ్రీం హ్రీం హ్రీం జాప్యతుష్టే హిమరుచిముకుటే వల్లకీవ్యగ్రహస్తే
మాతర్మాతర్నమస్తే దహ దహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తామ్ |
విద్యే వేదాంతవేద్యే పరిణతపఠితే మోక్షదే ముక్తిమార్గే |
మార్గాతీతస్వరూపే భవ మమ వరదా శారదే శుభ్రహారే || ౭ ||
ధీం ధీం ధీం ధారణాఖ్యే ధృతిమతినతిభిర్నామభిః కీర్తనీయే
నిత్యేఽనిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే |
పుణ్యే పుణ్యప్రవాహే హరిహరనమితే నిత్యశుద్ధే సువర్ణే
మాతర్మాత్రార్ధతత్వే మతిమతి మతిదే మాధవప్రీతిమోదే || ౮ ||
హ్రూం హ్రూం హ్రూం స్వస్వరూపే దహ దహ దురితం పుస్తకవ్యగ్రహస్తే
సంతుష్టాకారచిత్తే స్మితముఖి సుభగే జృంభిణి స్తంభవిద్యే |
మోహే ముగ్ధప్రవాహే కురు మమ విమతిధ్వాంతవిధ్వంసమీడే
గీర్గౌర్వాగ్భారతి త్వం కవివరరసనాసిద్ధిదే సిద్ధిసాధ్యే || ౯ ||
స్తౌమి త్వాం త్వాం చ వందే మమ ఖలు రసనాం నో కదాచిత్త్యజేథా
మా మే బుద్ధిర్విరుద్ధా భవతు న చ మనో దేవి మే యాతు పాపమ్ |
మా మే దుఃఖం కదాచిత్క్వచిదపి విషయేఽప్యస్తు మే నాకులత్వం
శాస్త్రే వాదే కవిత్వే ప్రసరతు మమ ధీర్మాస్తు కుంఠా కదాపి || ౧౦ ||
ఇత్యేతైః శ్లోకముఖ్యైః ప్రతిదినముషసి స్తౌతి యో భక్తినమ్రో
వాణీ వాచస్పతేరప్యవిదితవిభవో వాక్పటుర్మృష్టకంఠః |
సః స్యాదిష్టాద్యర్థలాభైః సుతమివ సతతం పాతితం సా చ దేవీ
సౌభాగ్యం తస్య లోకే ప్రభవతి కవితా విఘ్నమస్తం వ్రయాతి || ౧౧ ||
నిర్విఘ్నం తస్య విద్యా ప్రభవతి సతతం చాశ్రుతగ్రంథబోధః
కీర్తిస్రైలోక్యమధ్యే నివసతి వదనే శారదా తస్య సాక్షాత్ |
దీర్ఘాయుర్లోకపూజ్యః సకలగుణనిధిః సంతతం రాజమాన్యో
వాగ్దేవ్యాః సమ్ప్రసాదాత్త్రిజగతి విజయీ జాయతే సత్సభాసు || ౧౨ ||
బ్రహ్మచారీ వ్రతీ మౌనీ త్రయోదశ్యాం నిరామిషః |
సారస్వతో జనః పాఠాత్సకృదిష్టార్థలాభవాన్ || ౧౩ ||
పక్షద్వయే త్రయోదశ్యామేకవింశతిసంఖ్యయా |
అవిచ్ఛిన్నః పఠేద్ధీమాంధ్యాత్వా దేవీం సరస్వతీమ్ || ౧౪ ||
సర్వపాపవినిర్ముక్తః సుభగో లోకవిశ్రుతః |
వాంఛితం ఫలమాప్నోతి లోకేఽస్మిన్నాత్ర సంశయః || ౧౫ ||
బ్రహ్మణేతి స్వయం ప్రోక్తం సరస్వత్యాః స్తవం శుభమ్ |
ప్రయత్నేన పఠేన్నిత్యం సోఽమృతత్వాయ కల్పతే || ౧౬ ||