Friday, February 28, 2014

"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ " house facing according to name in telugu

అతి ప్రాచీనమైన మన భారత దేశము శిల్ప కళలకు వాస్తు వైభవమునకు ప్రఖ్యాతి వహించి వున్నది . ఈ ఉపఖండము నిర్మాణము కూడా ఎన్నో  వాస్తు విశేషాలతో అలరారుచున్నది . ఇందు చాలా పట్టణ ,పుర ,నగర ,గ్రామాలు వున్నాయి . ఇలాంటి పురములు ,దివ్య సౌధములు ,సాధారణ గృహములు కలిగి వున్న" వస్తువు " కనుకనే భూమికి వాస్తు అనే పేరు వాచ్చినది . ఈ భుమియన్దోనర్చు అన్ని విషయాలను తెలియ జేయు విజ్ఞాన శాస్త్రమే ఈ " వాస్తు శాస్త్రము ". 


అర్వణము :
 " దిస కుదిరితే దశ కుదురు " అన్న సమేతలగా .. ! " దిశ " అనగా " తాను నివసించు దిక్కు , స్థలము , గృహము " అని అర్ధము ." దశ "అనగా "జాతక రీత్యా ప్రాప్తించగల అభివృద్ది కరమైన శుభ యోగములు " కనుక ప్రతి వారును తాము నివసించే ఉనికిని , శాస్త్ర సమ్మతముగా రూపొందించు కొనవలసి యున్నది .
                           నివసించే గృహము సొంతము ఐనా -కా కపోయినా కుడా , కొన్ని అతి ముఖ్యమైన విషయాలను ఉపేక్షింప కూడదు !గృహమేవరిది ఐనను అందలి సౌకర్యములు నివసించు వారనుభవించు నట్లు ... దోషములను కూడా అనుభవించ వలసి వుంటుంది . ఈ ప్రకారము మంచి  కూడా అందుగల వారె పొందుచుండేదరు .

              "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ "అని పెద్దలు చెప్పారు . రామాయణ కలం లో కుడా.బంగరు మయమై , నవరత్న సౌధములతో తులతూగుతున్న కాంచన లంకను చూసి మొహపడుతున్న లక్ష్మణుకి ,అన్నగారయన శ్రీ రామ చoద్రుడంతటి  అవతార మూర్తి ఈ విధముగా చెప్పారు .
శ్లో ॥ అపి స్వర్ణమయీ లంకానమే లక్ష్మణ రోచతె । 
       జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥ 

" ఓ లక్ష్మణ ! లంకానగరము యావత్తు - స్వర్ణ మయమే ఐనను ,అనేక రత్న ,వజ్ర ,మణి మయమై నను ,నాకు దానియందు ఇష్టము లేదు . భ్రాంతి కలుగుట లేదు . ఎమందు వేని -ప్రతి వారికీ కూడా "కన్నతల్లి"  , "జన్మ భూమి" అను రెండూ కూడా స్వర్గము కన్నా శ్రేష్టములై యున్నవి ! [ రామాయణం ]


                           ఎవరు జన్మించిన దేశము ,గ్రామము ,ప్రాంతము ,వారికి అత్యంత సౌఖ్య పదమై యుండగలదు . కొన్ని కారణాంతరాల వలన పర గ్రామ మందు నివసించ వలసి వచ్చినా .. ఆ గ్రామము శాస్త్ర రీత్యా తనకు మంచిదా కదా ?? అని పరిశీలించాలి . దీనికే " గ్రామ అర్వణము " గా పెద్దలు చెబుతుంటారు .
                           అర్వణము చూచే పద్దతులు అనేకము వున్నవి . అన్నీ మంచి పద్దతులే ఐనా .. అనుభవము నందు ఎక్కువగా సరిపోవుచున్న విధానము ను ఉపయోగించుకోనుట . చాలా మంచిది . వాస్తు శాస్త్ర ప్రకారము ఏ పని చేయాలన్నా .. "జన్మ నక్షత్రం " కంటే "నామ నక్షత్రం" శ్రేష్టం ! తన పేరుకు గల మొదటి అక్షరము ప్రకారము నక్షత్ర ,దిశా వర్గ నిర్ణయాలను చేసుకోవాలి .
                         తెలుగు భాషలో అక్షరాలు మొత్తం 51 వున్నవి . వీటిని 8 భాగాలుగా విభజించి - " అష్టవర్గులు " అని పేరు పెట్టారు .  

వీటిలో మొదటి దానికి "అ" వర్గు అని పేరు ! అనగా .. ఈ వర్గం లో " అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ  ఏ ఐ ఓ ఔ అం అః  " పదహారు అక్షరాలు ఉండగలవు . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "అ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి " తూర్పు దిక్కు " స్వదిశ అవుతుంది .

 రెండవది " క " వర్గు ! ఈ వర్గు నందు " క ఖ గ ఘ ఙ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "క  వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఆగ్నేయ దిక్కు " స్వదిశ అవుతుంది .

 మూడవది " చ వర్గు " ! ఈ వర్గు నందు " చ ఛ జ ఝ ఞ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " చ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "దక్షిణ దిక్కు " స్వదిశ అవుతుంది .

నాల్గవది " ట వర్గు " ఈ వర్గు నందు " ట ఠ డ ఢ ణ " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "ట  వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "నైరుతి  దిక్కు " స్వదిశ అవుతుంది .

ఐదవది "త వర్గు " ఈ వర్గు నందు " త థ ద ధ న " అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "త  వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి " పడమర దిక్కు " స్వదిశ అవుతుంది .

ఆరవది " ప వర్గు " ఈ వర్గు నందు " ప ఫ బ భ మ" అను ఐదు అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " ప వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "వాయవ్య దిక్కు " స్వదిశ అవుతుంది .

ఏడవది " య వర్గు " ఈ వర్గు నందు " య ర ల వ " అను నాలుగు  అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు " య  వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఉత్తర దిక్కు " స్వదిశ అవుతుంది .

ఎనిమిదవది  "శ వర్గు " ఈ వర్గు నందు " శ ష స హ ళ క్ష  " అను ఆరు  అక్షరములు వుంటాయి . వీటిలో ఏ అక్షరము తమ పేరు నకు మొదట వున్నా .. అట్టి వారు "శ వర్గు " నకు చెందిన వారుగా పరిగణింప బడతారు . వీరికి "ఈశాన్య దిక్కు " స్వదిశ అవుతుంది .

ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వా రే వర్గు నకు చెందిన వారో మొదట తెలుసుకోవాలి . ఆ తర్వాత "ఇంటి దిశ" ,  "సింహద్వార " మరియు " గ్రామ అర్వణము" ల గురించి సులువుగా తెలుసు కోన వచ్చును .

గమనిక : ప్రతి వారికి వారి జన్మస్థలము మరియు స్వగ్రామము చాలా మంచివి . స్వగ్రామము నాకు స్వదిశ యందున్న గ్రామము లేక దిశ అత్యంత  శుభము ! స్వ దిశ మొదలు కొని 1-3-7 దిశ మరియు గ్రామాలూ కూడా శుభాములే ! 2-4-6-8 దిశల యందున్న గ్రామములు మద్యమ ఫలితాన్ని ఇవ్వ గలదు . 5 శత్రు దిశగా పరిగనించ వచ్చు . ఇందు బాధలు , దరిద్రము ,చిక్కులు , అధికము అని చెప్పవచ్చు .

సింహ ద్వారా నిర్ణయ విశేషాలను నా తదుపరి వ్యాసంలో తెలుసు కుందాం ...!
ధన్యవాదములు ...
భువనగిరి మురళి కృష్ణ శర్మ
నార్త్ కరోలినా . ఉత్తర అమెరికా . 

Thursday, February 27, 2014

అసలు జ్యోతిష్యం శాస్త్రం అంటే ఏమిటి ? what is indian vedic astrology ?

జ్యోతిష్యం మానవుడికి అవసరమా ? ఇది లేక పొతే జీవించలేమ ? కేవలం జాతకము ను నమ్ముకొని జీవించటం
ఎంతవరకు సమంజసం ? దీని పరిధి యెంత ఏమిటి ? అసలు నమ్మాలా  వద్ద ? ఇలాంటి వాటి గురించి ఆలోచించే ముందు మనం అసలు మనకు జ్యోతిష్యం గురించి ఎంతవరకు తెలుసు అనేది చాల ముఖ్యం . అసలు ఈ శాస్త్రం ఏమిటి ? ఇందులో ఏయే విషయాలు మనకు తెలుస్తాయి ? ఇవ్వని తెలిస్తే నే గదా ! మనం దానిగురించి మాట్లాడ గలిగేది ? అందుకనే ఈ వ్యాసం లో జ్యోతిష్య శాస్త్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ముందుగా వివరిస్తున్నాను .
మనవ జాతి అవతరించిన తర్వాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి . మన ఋషులు ప్రజా శ్రేయసు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీన మైనది ఈ జ్యోతిష్యం .

జ్యోతి అన్న పదానికి సంస్కృతం లో వెలుగు ,నక్షత్రం ,కన్ను ,సూర్యుడు అనే అర్ధాలు వున్నాయి . మనకు అనంత విశ్వంలో కంటికి ఆకాశం లో కనపడే సూర్యుడు ,చంద్రుడు ,నక్షత్రాలు ,కొన్ని గ్రహాలు , తోకచుక్కలు ,గ్రహణాలు ఇవన్నీ ఆకాశం లో చూసి ఆనందించటం తో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది మరియు ఎంతో ఉత్సాహంగా కూడా వుండేది . ఈ నాడు ఆధునిక సమాజం లో టెలిస్కోప్  మరియు ఇంటర్నెట్ లో అన్ని విషయాలు చాల సులువుగా తెలుసు కుంటున్నాం కాబట్టి మనకు చాల విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు . కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా , విశేషం గా వారిని ఆకర్షించి ,తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచేవి . ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా , ప్రాణుల పై వాటి ప్రభావం వాతావరణం లో క్రమబద్ధమైన మార్పులు , వాటికీ మనవ జీవితంతో వున్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి .
హేతు రహిత మయన విజ్ఞానాన్ని ఎవరు విశ్వసించరు . అలాగే సరి అయిన హేతువు లేక పొతే అది అసలు విజ్ఞానమే కాదు . శాస్త్రము అని పించు కోదు . ఒక వ్యక్తి జీవితాన్ని ఈ జ్యోతిష్య శాస్త్రం శాసిస్తోంది . ఆటను చేసే కర్మను ప్రోచ్చహిస్తోంది. నిత్య జీవితం లో ఎలా మెలగాలో తెలియ చేస్తుంది . కాని ఇవన్నీ మనం తెలుసు కొని ఆచరించి నపుడే ప్రయోజనం . ఒక ప్రాంతపు నక్ష దారిచుపుతుంది , ఎన్ని మార్గాలు వున్నాయో తెలుపు తుంది . మార్గంలో ప్రమాద కరమైన ప్రదేశాలు తెలిపి ఏది సులువైన మార్గం కూడా తెలపవచ్చు కానీ ప్రయాణం జాగ్రతగా మనమే చేయాలి కదా ! ఈ విదంగా మనవ జీవనం గురించి తెలియ జేయటం లో జ్యోతిష్య శాస్త్రం ప్రభావం ఎంతో వుంది . సమానమైన కృషి కలిగిన ఇద్దరు వ్యక్తుల జీవిత ఫలితాలలో తేడాను నిరూపించటం లో భౌతిక శాస్త్రము విఫల మైన సందర్భములో జ్యోతిష్యం ఒక్కటే కారణాలను విశ్లేషించి చూపుతుంది అనేది నిజం !
                           మనకు రోజు అనుభవం లోకి వచ్చే ఒక ముఖ్య విషయాన్నీ పరిశీలిధామ్ ......
రాత్రి వేళల్లో రోగ తీవ్రత అధికంగా వుంటుంది అది అందరికి తెలిసిందే . సూర్య కాంతి  రావటం తోటే మనిషి లో చైతన్యం వస్తుంది . సూర్య కాంతిలో ఎన్నో ఔషదములు వున్నాయని ఆనాటి  నుండి ఈనాటికి అనుభవం లో వున్నా విషయమే . A మరియు D విటమిన్లు సూర్య కంటి నుండే లభ్యమవుతాయి . సూర్య కాంతి లో అంతర్గత తీవ్రత కలిగిన కిరణాలు ఎన్నో మనచుట్టూ వున్నాయి . వాటిలో ముఖ్యమైనవి పరారుణ కిరణాలూ ( infrared) అతినీలలోహిత కిరణాలు (ultra violet ) వున్నాయి . వీటి ప్రభావం మానవుని ఆరోగ్యం పై చాల వుంటుంది .
అందుకనే " ఆరోగ్యం భాస్కరాధిఛ్చెత్ " అని శాస్త్రాలు చెబుతున్నాయి .
                     జీవ కోటి బతక డానికి సూర్యకాంతి చాల అవసరం . సూర్య కాంతి వల్లనే భూమి కి దెగ్గరగా వుండి అతి ప్రభావం చూపే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు . ఒక క్రమపద్ధతిలో సూర్య చంద్రులు పరిభ్రమిస్తుంటారు . చంద్రుడు జలకారకుడు . కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వం చంద్రుడు భూమిలో ఒక భాగమని తర్వాత జరిగిన మార్పుల వాల్ల భూమి నుండి విడి పడింది అనేది ఉహ ! ఆ భాగమే పసిఫిక్ ప్రాంతమని చెబుతుంటారు . చంద్రుడు భూమికి దెగ్గరగా వచినపుడు అంటే పౌర్ణమి నాడు సముద్రం అటు పోట్లు ఎక్కువగా వుంటాయి . ఇక మానవ శరీరంలో మూడింట రెండో వంతు నీరే కదా అందుకనే చంద్రుని ప్రభావం మానవుని పైన ఎక్కువగా వుంటుంది . ద్రవ రూపంలోని రక్తం , ప్లాస్మ చంద్రుని ఆకర్షణ వలన అధికంగా ప్రవహిస్తాయి . అందువలన మనస్సు ,ఆలోచనలో ఎన్నో మార్పులు వస్తాయి . అందుకనే పౌర్ణమి నాటి చంద్రుడు ని చుస్తే ఆనందం కలుగుతుంది , మానసిక ఉద్రేకాలు అవి అమావాస్య , పౌర్ణమి రోజులలో ఎక్కువ అని వైద్య శాస్త్రం చెపుతోంది . అందుకనే " చంద్రమ మనసో జాతః " అని వేదాలలో చెప్ప బడింది . ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వేదాలలో చెప్పా బడింది . ఈ విధంగా గ్రహాలు , నక్షత్రాలు ,రాసులు , వీటి ప్రభావం అధికంగా వున్నట్లు తెలుసుకున్నారు . ఈ శాస్త్రాభివృధి భారత దేశం లో ఏ ఏ కాలాలలో ఎలా జరిగిందో తదుపరి వ్యాసంలో తెలుసు కుందాం ...!

Wednesday, February 26, 2014

మంగళ శ్లోక:



 గణేశ స్తోత్రం

శ్లో ॥  శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
         ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||


శ్లో ॥    అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
        అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||


  
శ్రీరామ స్తోత్రం

శ్లో ॥  శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
        సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

శ్లో ॥  శ్రీ రాఘవం దసరధాత్మజ మప్రమేయం ।
         సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ।
         ఆజానబాహు మరవింద దళాయతాక్షం ।
         రామం నిశాచర వినాశకరం నమామి ॥


గురు శ్లోకం

శ్లో ॥ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
       గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

సరస్వతీ శ్లోకం

శ్లో ॥ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
       విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

వేంకటేశ్వర శ్లోకం

శ్లో ॥ శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌உర్థినామ్ |
        శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

దేవీ శ్లోకం

శ్లో ॥ సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
       శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||

దక్షిణామూర్తి శ్లోకం

శ్లో ॥ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
       నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||

నవగ్రహ ధ్యానశ్లోకమ్

శ్లో ॥ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
       గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

శ్లో ॥ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |
       సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ||