Significance of Yagnopaveetham and details :-
ప్రస్తుతం కలియుగ కాలమానంలో,ఈ నవయుగంలో ఎంతమంది యజ్ఞోపవీతం నిత్యంధరించి ఉంటున్నారు . అనగా యజ్ఞోపవీతము ధరించే ఆచారం వున్న బ్రాహ్మణ , క్షత్రీయ , వైశ్యులు ఈ పరమ పవిత్ర యజ్ఞోపవీత ఆవశ్యకతను మరచి సంచరించటం ఈతరం వారికే కాకుండా వర్తమాన భవిష్య తరాలకి కూడా ఏమాత్రం శ్రేయెూదాయకం కాదు .
ఇచ్చట మనం ముందుగా యజ్ఞోపవీత మంత్రార్ధం క్లుప్తంగా తెలుసుకుందాం !!
మంత్రః
"యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యథ్సహజంపురస్తాత్
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచశ్శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః "
అనగా యజ్ఞోపవీతమనే సూత్రం పరమపవిత్రమైనది.
" ప్రజాపతెః యథ్సహజం పురస్తాత్ "
బ్రహ్మదేవునకి పుట్టుకతోనే ఉన్నది అని ఆయుష్యు , తేజస్సును ఇచ్చునది అని మంత్రార్ధం . చాలమందికి ఈమంత్రార్థం ఇంచుమించుగా తెలిసినా "ప్రజాపతెః యథ్సహజం పురస్తాత్" అన్నవాక్యం బ్రహ్మ దేవునికి జన్మతః వున్నది అన్న అర్ధం తెలియకపోవచ్చు అలాగే ఉపనయన కాలమందు
" శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్ఠాన యెూగ్యతా సిథ్యర్థం పరమపవిత్ర యజ్ఞపవీత ధారణం కరిష్యే"
అని సంకల్పిస్తారు అనగా శ్రౌత స్మార్త నిత్యకర్మలని చేయుటకు యజ్ఞోపవీతం ధరించి వుండాలి అని లేనిచో వారు అనర్హులని వేద శాస్త్రాలు చెప్పాయి .
బ్రహ్మచారి మూడు ప్రోగులు కలిగిన యజ్ఞోపవీతమును ధరించి విధ్యను అభ్యసించవలెనని శాస్త్రం . ఇది వారి బ్రహ్మచర్య వ్రతమునకు , విద్యాభ్యాసమునకు వారధి . ఇక రెండవది వివాహకాలమున
" శ్వశుర దత్త యజ్ఞోపవీతము " మామగారు ధరింపచేయునది ఉద్వాంహాంగభూత శ్వశుర దత్త పరమపవిత్ర ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పిస్తారు . అనగా గృహస్థాశ్రమ ధర్మమును ఆచరించుటకు ధర్మ సంతానము పొందుటకు , శ్రౌత స్మార్త కర్మలకు రెండవది వారధి . శాస్త్రంలో రెండు యజ్ఞోపవీతములే ధరించమని ఉన్నది .
మరి కొందరు మూడు లేక ఐదు ధరించుట వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం !!
ముందర చెప్పినట్టు రెండుతర్వాత మూడవది ఉత్తరీయార్ధం భావమునకు అనగా శాస్త్రంలో
శ్లో॥హోమదేవార్చనా ద్యాసు క్రియాసు పఠనే తథా ।
నైకవస్త్రః ప్రవర్తేత ద్విజోనాచమనే జపేత్ ॥
హోమము,దేవతార్చనము,వేదపఠనము,ఆచమనం,జపము మెుదలగు వానిని సలుపునపుడు ఏక వస్త్రము ధరించరాదు అని శాస్త్రం . మూడవది ఉత్తరీయానికి కనుక మూడువది ఉన్నవారు ఉత్తరీయము లేకున్ననూ పైక్రియలన్నీ సలుపవచ్చును . నాలుగవది మరియు ఐదవది బ్రహ్మచారులకి కానీ గృహస్థులకి కానీ ఎపుడైననూ యజ్ఞోపవీతం ఒక పోగు పెరిగినను (తెగిననూ) లేదా తెలియకుండా నష్ఠమైననూ అపుడు బ్రహ్మచారులకి ఒకటీ గృహస్థులకి రెండూ ఆపద్దర్మంగా వారికి కొత్తది మరలా మార్చుకొనే వరకు ఈనాల్గవది ఐదవదీ ఇవ్వవచ్చు.
శ్లో॥ వినా యజ్ఞోపవీతేన దినమేకమపిద్విజః ।
స్థితః శూద్రత్వమాప్నోతి మృతశ్చ శ్వోపజాయతే ॥
బ్రాహ్మణ , క్షత్రీయ , వైశ్యులు ఎవరైననూ యజ్ఞోపవీతము లేకుండా ఒకరోజు ఉన్నచొ వారికి వారి జననము వలన కలిగిన మరియు జనన ప్రభ్రుతి సంపాదించుకున్న పుణ్యము నశించి మరుజన్మలో విధి శునకము గా పుడతారు అని భావ అర్ధం ॥
ఈ వ్యాసం వ్రాసి పోస్ట్ చేయటానికి సహకారాన్ని అందించిన నా ముఖ పుస్తక మిత్రులు శ్రీ ములగాలేటి రామశాస్త్రి గారికి ధన్యవాదములు .
మరియొక అంశంతో మళ్ళి కలుద్దాం . సర్వేజన సుఖినో భవంతు . దయచేసి మీ సలహాలను సందేహాలను క్రింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు . మీ అమూల్య మయన సమయాన్ని వెచ్చించి నా పోస్ట్లు చదివి ,కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదములు ,
సదా ఆద్యాత్మిక సేవలో ,
బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ భువనగిరి ,
నార్త్ కరోలినా , USA .

మంచి విషయం చెప్పారు . అసలు శిఖ ఎందుకు పెట్టుకోవాలి
ReplyDelete