What is Panchopachara Pooja ? Who many Vupacharas there in Hindu Dharma ?
ఉపచారము అనగా భగవంతునికి పూజ నందు చేయు సేవలు లేదా కైంకర్యము లు అని చెప్పవచ్చు. సనాతన ధర్మము నందు ఎన్నో రకముల సంప్రదాయములు , ఆచార వ్యవహారములు కలవు కావున వారి వారి పద్ధతి ని ఆచరించి ఈ ఉప చారములు వున్నవి . అందు కొన్ని వివరించు కొను ప్రయత్నం చేయుచున్నాను .
ఈ ఉపచారముల యందు ఏకోపచారము , త్రయోపచారము ,పంచోపచారము ,నవోపచారము , షోడశోపచారము ,అష్టాదసోపచారము ,ఎకవింశత్యుపచారం , ఎకత్రింశత్యుపచారములు మున్నగు భేదములు అనేకము కలవు .
కేవలం నైవేద్యము ను మాత్రమే చెల్లించుట ఏకోపచారము అనబడును . స్నాన , పుష్ప ,నైవేద్యము
లు త్రయోపచారము లేక త్రివిదోపచారము అగును . గంధ ,పుష్ప ,ధూప ,దీప,నైవేద్యం పంచోపచారము అనబడును .
ఆవాహన , పాద్య , ఆచమన , స్నాన , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యములు ,నవోపచారములు అని చెప్ప బడినది .
ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన , స్నాన ,వస్త్ర , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు ,గావించుట షోడశోపచారము .
ధ్యాన , ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన ,మధుపర్క , స్నాన ,వస్త్ర , గంధ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు అష్టాదసోపచారము .
ధ్యాన , ఆవాహన , ఆసన ,పాద్య ,అర్ఘ్య , ఆచమన ,మధుపర్క , స్నాన ,వస్త్ర ,యజ్ఞోపవీత , గంధ ,ఆభరణ , పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యము,తాంబూలం ,నీరాజన ,మంత్ర పుష్పం , నమస్కారములు ఎకవింశత్యుపచారములు అగును .
శైవ ధర్మమున శరీరస్తంబులగు ముప్పదియారు తత్వముల కార్య సమర్పనాత్మకముగ ముప్పదియారు ఉపచారములు శివ పూజ యందు గావింపబడుచుండెది . దేవి పూజలందు అరవైనాలుగు ఉపచారములు ఉపయోగించటం జరుగు చున్నది .
షోడశోపచారము ప్రసిద్ధములు , మంత్ర శాస్త్ర పరముగ పంచోపచారములు ప్రసిద్ధములు . జప , తప , స్తోత్ర , కవచాదుల యందు , దీని వినియోగం అధికం . దీనిని లమితి పంచ పూజ యని యును వ్యవహరించు చుందురు .

No comments:
Post a Comment