Wednesday, September 5, 2018

ద్రేష్కాణ బలము వివరణ

పురుష,నపుంసకస్త్రీ,గ్రహములు వరుసగాఆది,మధ్య,అంత్యద్రేష్కాణములందుండిన పాద(1/4=0-15 కలలు)బలము నిత్తురు.(రవి,కుజ,గురులు,పురుషులు,బుధశనులు నపుంసకులు,రాహు,చంద్ర,శక్రులు స్త్రీ గ్రహములు.)
*దిగ్బలము*
రవి కుజులనుండి చతుర్థభావమును,గురుబుధల సప్తమభావమును,శని నుండి లగ్నమును,శుక్రచంద్రులనుండి దశమమును,తీసివేసి.శేషము రాశి 6 కన్న ఎక్కువగానున్న 12 నుండి తీసివేసి,భాగదికము చేయుము.దానిని 3చే భాగించగా వచ్చినది దిగ్బల మగును.

*నతోన్నతబలమమ*
నతఘటికలను 2చే గుణించిన(రెట్టించిన) కుజ, చంద్ర, శనుల బలమగును.60నుండి వాటిని తీసివేయగా తక్కిన గ్రహముల కలదాక బలము వచ్చును.బుధునిది ఎప్పుడును పూర్ణమే (60 కలలు) ఒకరూపమే అని తేలియవలేను.

*పక్షబలము*
స్ఫుటచంద్ర రాశ్యాదినుండి స్ఫుటరవి తీసివేసి,శేషమున రాశి 6 కన్న ఎక్కువగా ఉన్న,12నుండి తీసివేసి,మిగిలిన అంశాదికమును 3చే భాగించగా,వచ్చినది చంద్ర,బుధ,శుక్రు,గురుల పక్షజ బలమును 60నుండి తీసివేయగా పాపగ్రహములైన - రవి,కుజ,శనుల బలము వచ్చును.
*దినరాత్ర్యంశ బలము*
పగటిని మూడుభాగములు చేయగా,క్రమముగా బుధ సూర్య,శనులున్ను,రాత్రిని మూడుభాగములు చేయగా,క్రమముగా చంద్ర,శుక్ర కుజులును అధిపులు.వారివారి భాగమున వారికి సంపూర్ణబలముండును.గురుడెప్పుడును పూర్ణబలుడే.

*వర్ష మాస,దిన,హెూరాబలము*
వర్షాధిప,మాసాధిప,దినాధిపులకు క్రమముగా 15, 30 45 కలలు.హెూరాధిపతికి పూర్ణ(60)బలము ఉండును.

*స్ఫుట నేసర్గిక బలము*
60ని ఏడుచే భాగించి క్రమముగా 1నుండి 7 సంఖ్యలచే గుణించగా వచ్చినది శిని,కుజ,బుధ,గురు,శుక్ర,చంద్ర,సూర్యుల నైసర్గిక స్ఫుట బలమని తెలియదగినది.
*అయన బలము*
45,33,12 ఇవి మూడు ఖండాలు.అయనబలము తెలియవలెనన్న సాయనగ్రహమును తీసికోవలెను.వానిలో రాశితుల్యమైన ఖండమును కూడవలెను.అంశాదిని భోగ్యఖండముచే గుణించి 30చే భాగించవలెను.లబ్ధమును రాశితుల్య ఖండమునకు కలిపిన అంశాది వచ్చును.అంశాది 30కన్న ఎక్కువగా ఉన్న రాశ్యాది చేయును.మేషాది 6రాశులలో ఉన్న 3రాశిలో తీసివేయవలెను.బుధునిలో మేషాది తులాది రెంటిలోను 3రాశి కలుపవలెను.మిగిలిన రవి,కుజ,గురు,శుక్రులకు విపరీతము.అనగా మేషాది 6రాశులలోనున్న 3రాశులు కలుపవలెను.తులాదిలో నున్న 3రాశులనుండి తీసివేయవలెను.ఇట్లు వచ్చిన అంశాదిలో (1/3) 3చే భాగించగా అయనబలము వచ్చును.

*దృగ్బలము*
బలైక్యము చేయుపుడు,యెాగములందు (1/4) పాద బలము కలుపుట పాపగ్రహదృష్టి,యెాగములందు పాద (1/4) బలము తీసివేయుట,చేయగా వచ్చినదానితో బుధ,గురుదృష్టిని కలిపినది స్ఫుటమైనది గ్రహబలమగును.
పరస్పరయుద్ధము చేయు కుజాది తారాగ్రహముల (కుజ,బుధ,గరు,శుక్రశనులు తారాగ్రహములు.వీటికి పరస్పర సంయెాగము యుద్ధమనిపించు కోనును.)బలభేదమును జయించినవానికి కలిపిన పరాజితునికి తీసివేసిన - స్ఫుట బలమగును.

No comments:

Post a Comment