Friday, February 9, 2018

*కుంభలగ్నము*

కుంభలగ్నమునకు కుజశుక్రులు  రాజయెాగ కారకులగుదురు.ఈ కుజశుక్రులు కేంద్రకోణములయందెక్కడ కలిసినను విశేష భూజాతకుడగును.లేనిచో వాహనముద్రాది  కారముగల గొప్పఉద్యోగము చేయును.షష్ఠాష్టమ వ్యయస్థానములయందు కలిసిన మధ్య మధ్య యెాగిభంగము కళత్ర విచారము గలుగును.
రవిచంద్రులు కలిసియున్న భార్య రోగపీడితురాలై యుండును.చంద్రదశ లభించును రవిదశ ఫలించును.
రవికుజులు కలిసిన కళత్రసంబంధమైన ఆస్తికొంత కలియును.కళత్రము రోగశరీరము గలది యగును.రవిదశ కుజదశ కూడ ఫలించును.
రవిబుధులు గలిసిన బధదశ పూర్తిగా యెాగించును.రవిదశ మధ్య మధ్యను యెాగించును.
రవి గురులు కలిసిన రెండుదశలు యెాగించును.విశేషధన జాతకుడగును రవిదశ కంటె గురుదశ పూర్తిగా యెాగించును.
రవిశుక్రు కలిసిన రెండు దశలు గూడ పూర్తిగా యెాగించును.కళత్ర పరమైన భూమి కొంత కలియును.
రవి శనులు గలిసిన కళత్ర సౌఖ్యముండదు.రవిదశ యెాగించదు.శనిదశలో మధ్య యెాగభంగము గలుగును.
చంద్రకుజులు గలిసిన  చంద్రదశ యెాగించునుగాని కుజదశ యెాగించదు.చంద్రదశలో భూలాభమును కుజదశలో ఋణవృద్ధి యును గలుగును.
చంద్రబుధులు కలిసిన యెడల చంద్రదశ స్వల్పముగా మధ్య మధ్య యెాగించును.బుధదశ యెాగించదు.
చంద్రగురులు గలిసిన యెడల చంద్రదశ యెాగించును.గురుదశ యెాగించదు.చంద్రదశలో ధనవృద్ధియు గురుదశలో ఋణవృద్ధియు గలుగును.
చంద్ర శుక్రులు గలిసిన చంద్రదశలో విశేషభాగ్యము గలుగును.శుక్రుదశలో భాగ్యమంతయు క్షీణించును.
చంద్రశనులు గలసిన జాతకుడు వాతరోగము వలన భాధపడును.రెండుదశలు గూడ యెాగింపవు. శత్రు రోగభయములు హెచ్చుగా నుండును.
కుజబుధలు కలిసిన కుజదశ యెాగించదు.బుధదశ కొంత వరకు యెాగించి మిక్కిలి భూమి సంపాదించును.
కుజగురులు గలిసిన రెండు దశలును పూర్తిగా యెాగించును.విశేషధనజాతకుడగును.
కుజశుక్రులు కలిసిన రాజయెాగ జాతకమగును.కుజశనులు గలిసిన శరీరసౌఖ్యముండదు.కుజదశ యెాగించదు.మధ్య మధ్య యెాగభంగము గలుగును గాని శనిదశ పూర్తిగా యెాగించును.
బుధగురులు గలిసిన బుధదశలో విశేషధనమార్జించును.గురుదశ కంటె బుధదశ బాగుగా యెాగించును.
బుధ శుక్రులు కలిసిన బుధదశలో విశేషముగా యెాగించును.శుక్రదశలో మధ్యమధ్య యెాగభంగము కలుగును.
బుధశనులు కలిసిన రెండుదశలు యెాగించవు.శరీర పీడ,ధనవ్యయము మెుదలగునవి గలుగును.సంతాన సౌఖ్యముండదు.
గురుశుక్రుడు కలిసిన రెండుదశలు పూర్తిగా యెాగించును.విశేషధనవృద్ధి సంతానవృద్ధి కలుగును.
గురుశనులు గలిసిన యెడల శనిదశ యెాగించునుగాని గురుదశ యెాగించదు.అట్టిజాతకుడు మిక్కిలి పేరు ప్రతిష్ఠలు గలవాడు యెాగ్యుడు అగును.
శుక్రశనులు గలిసిన యెడల శుక్రదశకంటె శనిదశ విశేషముగా యెాగించును.విద్యవంతుడును ధనవంతుడును విశేష భూజాతకుడు అగును.
మెుత్తము మీద కుంభలగ్న జాతకమునకు గురుకజు శుక్రులు యెాగకారకులు శనిబుధులు మిశ్రమఫలము నిచ్చెడువారు.రవి యెాగకారకుడై మారకము నిచ్చెడు వాడు చంద్రుడు పూర్తిగా పాపి అగును.
*కుంభాది రవి ఫలము*

కుంభము లగ్నమై లగ్నమందు రవియున్న శరీరసౌఖ్యము తక్కువ.రవిదశ స్వల్పముగా యెాగించును.
ద్వితీయమందు రవియున్న ధనము నిలువదు.శరీరపీడ చేయును.రవిదశ స్వల్పముగా యెాగించును.
తృతీయమందు రవియున్న పూర్తిగా యెాగించును.కళత్రము మిక్కిలి యెాగ్యురాలు భాగ్యవంతురాలు అగును.
చతుర్థమందు రవియున్న రవిదశ యెాగించును.కళత్రవిత్తము కొంత కలియును.
పంచమమందు రవియున్న ఒక పుత్రసంతానముండును. ఈ రవిదశ ఫలించును.
షష్ఠమమందు రవియున్న భార్య రోగపీడితురాలగును.ఈ రవిదశ ఫలించదు.
సప్తమమందు రవియున్న యెడల కళత్రము యెాగ్యురాలును పతిభక్తిగలది అగును ఈ రవిదశ ఫలించును.
అష్టమమందు రవియున్న రవిదశ ఫలించదు.కళత్రము రోగపీడితురాలగును.
నవమమందు రవియున్న కళత్రనష్టము.ధనవ్యయము గలుగును.
దశమమందు రవియున్న రవిదశ పూర్తిగా యెాగించును.
ఏకాదశమందు రవియున్న  ఈ రవిదశ పూర్తిగా ఫలించును విశేషధనజాతకమును భూజాతకమును అగును.
ద్వాదశమందు రవియున్న ఈ రవిదశ  ఫలించదు.కళత్రసౌఖ్యముండదు ధనవ్యయము మెుదలగునవి గలుగును.మెుత్తము మీద కుంభ లగ్నమునకు రవియెాగకారకుడగును.
*కుంభాది చంద్ర ఫలము*

కుంభము లగ్నమై లగ్నమందు పూర్ణచంద్రుడున్న వాతశరీరము రోగశరీరము గలవాడు అగును.ఈ చంద్రదశ యెాగించదు.
క్షీణచంద్రుడున్నచో దుష్టస్వభావము గలవాడు మిక్కిలి కష్టములనుభవించువాడు అగును.
ద్వితీయమందు పూర్ణచంద్రుడున్న ఈ చంద్రదశ యెాగించును.ధనవృద్ధి కలుగును.వాక్ శుద్ది కలుగును. క్షీణచంద్రుడున్న ఈ చంద్రదశ యెాగించును గాని ధననష్టము కలుగును.
తృతీయమందు పూర్ణచంద్రుడున్న ఈ చంద్రదశ స్వల్పముగా యెాగించును.సోదరీవృద్ధి కలుగును.క్షీణచంద్రుడున్న ఈ దశ యెాగించును.కానీ భాతృనష్టము కలుగును.
చతుర్థమందు పూర్ణచంద్రుడున్న యెడల ఈ చంద్రదశలో ఋణము హెచ్చుగా నుండును.భూజాతకము ఋణజాతకము అగును పేరు ప్రతిష్ఠలుండునుగాని ధనముండదు.క్షీణచంద్రుడున్న మాతృసౌఖ్యము,విద్య,భూమి,స్వల్పముగా నుండును.ఈ చంద్రదశ యెాగించదు.
పంచమమందు పూర్ణచంద్రుడున్న యెడల స్వల్పముగా సంతాననష్టము గలుగును.ఈ చంద్రదశ స్వల్పముగా యెాగించును.క్షీణచంద్రుడున్న యెడల సంతాన సౌఖ్యముండదు.ఈ చంద్రదశ యెాగించదు.
షష్ఠమమందు పూర్ణచంద్రుడున్న స్వల్పముగా యెాగించును.క్షీణచంద్రుడున్న చంద్రదశ యెాగించదు శత్రురోగ ఋణములు హెచ్చు.
సప్తమమందు పూర్ణచంద్రుడున్న యడల ఈ చంద్రదశ యెాగించును.కళత్రము మిక్కిలి పతివ్రతయగును.క్షీణచంద్రున్న యెడల కళత్రసౌఖ్యముండదు.చంద్రదశ యెాగించదు.
అష్టమమందు పూర్ణచంద్రుడున్న మథ్యాయుర్ధయము.కాని శరీరసౌఖ్యముండదు.క్షీణచంద్రుడున్న అల్పాయుర్ధాయము గలవాడు అగును.
నవమమందు పూర్ణచంద్రుడున్న చంద్రదశ కొంతయెాగించును.క్షీణచంద్రుడున్న పితృసౌఖ్యము తక్కువ ఈ చంద్రదశ యెాగించదు.
దశమమందు పూర్ణచంద్రుడున్న చంద్రదశ స్వల్పముగా యెాగించును. క్షీణచంద్రుడున్న పూర్తిగా యెాగించును.
ఏకాదశమందు పూర్ణచంద్రుడున్న చంద్రదశలో విశేష ధనలాభము కలుగును.క్షీణచంద్రుడున్న ఈ చంద్రదశ ఫలించును.కాని అన్యాయముగా ధనమార్జించును.
ద్వాదశమందు పూర్ణచంద్రుడున్న ధనమంతయు శుభకార్యములకు ఖర్చుపెట్టును.ఈ చంద్రదశలో తీర్థయాత్రలు విశేషముగా జేయును.క్షీణచంద్రుడున్న దుర్జన సాంగత్యముదుర్వ్యయము చేయును.ఈ చంద్రదశ ఫలించదు.
మెుత్తము మీద కుంభలగ్నమునకు చంద్రుడేస్థానమందున్నను పలించదు.కేంద్ర కోణముల యందున్న యెడలధనము నిలవకపోయినను సంపాదన గలుగును.
*కుంభాది కుజ ఫలము*

కుంభలగ్నమునకు కుజుడు తృతీయ రాజ్యాధిపతి యగుటచేత యే భావమందున్నను.ఫలించును.కేంద్రకోణముల యందున్న యెడల విశేషఫలము నిచ్చును.
లగ్నమందు కుజుడున్న కుజదశ యెాగించునుగాని శరీరసౌఖ్యముండదు.కోపస్వభావి చురుకైనవాడు.అగును.
ద్వితీయమందు కుజుడున్న కళత్ర విచారము,సంతాన విచారముగాని గలుగును.ఎంత ధనమార్జించినను నిలువదు.ఈ కుజదశలో విశేషధనము సంపాదించును.
తృతీయమందు కుజుడున్న కుజదశ యెాగించును.విశేషభూమి సంపాదించును.ఆస్తి కలియును.
చతుర్థమందు కుజుడున్న కుజదశ యెాగించదు.విద్యవిఘ్నములు కలుగును.
పంచమమందు కుజుడున్న కుజదశ యెాగించును.సంతానసౌఖ్యముండదు.
షష్ఠమమందు కుజుడున్న దశ యెాగించదు శుత్రు రోగఋణములు హెచ్చును.
సప్తమమందు కుజుడున్న కుజదశలో యెాగించును కళత్రసౌఖ్యముండదు.
అష్టమమందు కుజుడున్న కుజదశ యెాగించదు.అష్టకష్టము లనుభవించును.వ్యవహారపు చిక్కులు ఎక్కువ.
భాగ్యమందు కుజుడున్న కుజదశ విశేషముగా యెాగించును.రాజసన్మానము మెుదలగునవి గలుగును.
దశమమందు కుజుడున్న కుజదశ అఖండముగా యెాగించి విశేషజాతకుడగును.లేనిచో గొప్ప యుద్యోగము జేయువాడగును.
ఏకాదశమందు కుజుడున్న యెడల ధనమార్జించి నిలువజేయును.ఈ కుజదశ యెాగించును.
ద్వాదశమందు కుజుడున్న మధ్యమధ్య  యెాగభంగము ఖర్చు ఉండును.ఈ కుజదశ యెాగించదు.
*కుంభాది రాహు ఫలము*

కుంభలగ్నమందు రాహువున్న ఈ రాహుదశ యెాగించదు. శరీరపీడ,ధనవ్యయము,శత్రువృద్ధి మెుదలగునవి గలుగును.
ద్వితీయమందు రాహువున్న రాహుదశ యెాగించదు.ఎప్పుడును ధనమునకు చిక్కులు పడుచుండును.మధ్య మధ్య శరీరమునకు నలత జేయును.
తృతీయమందు రాహువున్న దశబాగుగా యెాగించును.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
చతుర్థమందు రాహువున్న రాహుదశ బాగుగా యెాగించును.మిక్కిలి ప్రతిష్ఠ సంపాదించును.
పంచమమందు రాహువున్న దశ యెాగించును.గాని సంతాన సౌఖ్యముండదు.
షష్టమందు రాహువున్న యెాగించదు.శత్రు రోగ ఋణములు హెచ్చు.
సప్తమమందు రాహువున్న యెాగించదు.జాతకునుకు శరీరపీడయు కళత్రపీడ ఉండును.
అష్టమమందు రాహువున్న యెాగించదు.శరీరపీడ ధనవ్యయము జేయును.
నవమమందు రాహువున్న స్వల్పముగా యెాగించును.పితృసుఖ ముండదు.
దశమమందు రాహువున్న కొద్దిగా యెాగించును.నీచవృత్తి వలన జీవనము జేయును.
లాభమందు రాహువున్న యెాగించును.న్యాయముగా ధనమార్జించును.
వ్యయమందు రాహువు యెాగించదు.దుర్జన సాంగత్యమున దుర్వ్యయము చేయును.
*కుంభాది గురు ఫలము*

కుంభలగ్నమునకు గురుడు ధనలాభాధిపతి యగుట చేతను మిశ్రమఫలము నిచ్చును.కేంద్రకోణములయందున్న యెడల బాగుగా యెాగించును.
కుంభ లగ్నమై లగ్నమందు గురుడున్న ఈ జాతకుడు యెాగ్యడు రూపలక్షణములు గలవాడు,స్థూలశరీరము గలవాడు అగును.గురుదశ బాగుగా యెాగించును.
ద్వితీయమందు గురుడున్న విశేషధనజాతక మగును.గురుదశ యెాగించును.
తృతీయమందు గురుడున్న గురుదశ స్వల్పముగా ఫలించును.సోదరీవృద్ధి బాగుగా నుండును.
చతుర్థమందు గురుడున్న విద్యవంతుడు భూజాతకుడు అగును.తల్లిచిరకాలము జీవించును.ఈ గురుదశ ఫలించును.
పంచమమందు గురుడున్న గురుదశ ఫలించును.సంతానవృద్ధి విశేష ముగానుండును.
షష్టమమందు గురుడున్న గురుదశ ఫలించదు.ఎప్పుడు ధనమునకు చిక్కులు పడుచండును.
సప్తమమందు గురుడున్న భార్య పతివ్రతయగును.ఈ గురుదశ బాగుగా ఫలించును.
అష్టమమందు గురుడున్న యెడల ధనమార్జించును,కానీ నిలువదు ఈ గురుదశ ఫలించదు.
నవమమందు గురుడున్న పిత్రార్జితము స్వార్జితము హెచ్చుగా నుండి మిక్కిలి భాగ్యవంతుడగును.
దశమమందు గురుడున్న స్వతంత్ర విద్యవలన మిక్కిలి ఖ్యాతి సంపాదించును.ఈ గురుదశ అఖండముగా యెాగించును.
లాభమందు గురుడున్న విశేషముగా న్యాయముగా సొమ్ము సంపాదించును. ఈ గురుదశలో మిశ్రమఫలమునిచ్చును.
ద్వాదశమందమ గురుడున్న  యెడల ఈ గురుదశ యెాగించదు.సంతానవిచారము. ధనవ్యయము మెుదలగు చిక్కులు గలుగును.
*కుంభాది శని ఫలము*

కుంభలగ్నమునకుశని యేస్థానములయందున్నను మిశ్రమ ఫలము నిచ్చును.మారకస్థానములయందు,షష్టాష్టవ్యయములయందువున్న యెాగించక పోవుటయేగాక మారకము చేయును.
కుంభలగ్నమై లగ్నమందు శనియున్న దశస్వల్పముగా యెాగించును గాని శరీరసౌఖ్యముండదు.
ద్వితీయమందు శనియున్న యెడల శనిదశ యెాగించదు.ధనము నిలువదు.మారకము గూడ జేయును.
తృతీయమందు శనియున్న యెడల దుష్టస్వభావము గలవాడు,శరీరసౌఖ్యము లేనివాడు అగును.
చతుర్థమందు శనియున్న బాగుగా యెాగించును.విద్యవంతుడు,భూజాతకుడు అగును.
పంచమమందు శనియెాగించును గాని సంతానసౌఖ్యముండదు.
షష్టమమందు శనియెాగించడు.శత్రరోగ ఋణములు హెచ్చు
సప్తమమందు శని శరీరపీడ చేయును.కళత్రసౌఖ్యము తక్కువగా నుండును.
అష్టమమందు శనియున్న అష్ట కష్టములు సంభవించును.శత్రురోగ ఋణములు హెచ్చు.
నవమమందు శనియున్న బాగుగా యెాగించును.మిక్కిలి పేరు ప్రతిష్ఠలు సంపాదించిను.
దశమమందు శనియున్న మిక్కిలి ఖ్యాతిగల పురుషుడగును.ఈ శనిదశ యెాగించదు.
ఎకాదశమందు శనియున్న శనిదశ యెాగించును.గాని అన్యాయముగా ధనమార్జించును.
వ్యయమందు శని యెాగించదు.
*కుంభాది బుధ ఫలము*

కుంభలగ్నమున బుధడు  పంచమాష్టమాధిపతి యగుటచేత యేస్థానమందున్న మిశ్రమఫలము నిచ్చును.
కుంభము లగ్నమై లగ్నమందు బుధుడున్న ఈ బుధదశ యెాగించును.కాని అష్టమాధిపతి ఖండములో కొంచెము యెాగభంగము శరీరపీడ చేయును.
ద్వితీయమందు బుధుడున్న  ఈ బుధదశ యెాగించదు.ధనమునకును చిక్కుబడును.సంతాన విచారము గలుగును.
తృతీయమందు బుధుడున్న బుధదశ మిశ్రమఫలము నిచ్చును.పిరికి వాడగును.
చతుర్థమందు బుధుడున్న బుధదశ బాగుగా యెాగించును.విద్యభివృద్ధి,భూలాభము,మాతృసౌఖ్యము మెుదలగునవి గలుగును.
పంచమమందు బుధుడున్న స్త్రీ సంతానముండును.బుధదశ యెాగించును.
షష్ఠమమందు బుధుడున్న బుధదశ యెాగించదు.సంతాన నష్టము గలుగును.
సప్తమమందు బుధుడున్న చురుకైన భార్య లభించును.బుధదశ స్వల్పముగా యెాగించును.
అష్టమమందు బుధుడున్న స్త్రీ సంతానము విశేషముగా నుండి మిక్కిలి తాపత్రయము గలవాడగును.ఈ బుధదశ  యెాగించదు.
భాగ్యమందు బుధుడున్న మంచి యెాగము కల్గును.భాగ్యవంతుడగును.
దశమమందు బుధుడున్న మిశ్రమఫలమునిచ్చును.మధ్య మధ్య యెాగించును.వర్తకమువలన గాని వైద్యము వలనగాని జీవించును.
ఏకాదశమందు బుధుడున్న యెాగించును.న్యాయముగా ధనమార్జించును
వ్యయమందు బుధుడున్న శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును
*కుంభాది కేతు ఫలము*

కుంభలగ్నమయిన లగ్నమందు కేతువు ఫలించదు.శరీరపీడ,ధనవ్యయము మెుదలగునవి జేయునుగాని పారమార్థిక చింత గలవాడును.
ద్వితీయమందు కేతువున్న యెాగించదు.ఎంత ధనమార్జించినను నిలువదు,శరీరపీడ చేయును.
తృతీయమందు కేతువున్న యెడల ఈ కేతుదశ బాగుగా ఫలించును.ఆయుర్భగ్యములు సంపూర్ణముగా నుండును.
చతుర్థమందు కేతువున్న విద్యవిఘ్నము మాతృ విచారము భూవ్యయము మెుదలగునవి గలుగును.కేతుదశ ఫలించదు.
పంచమమందు కేతువున్న యెడల ఈ కేతుదశ స్వల్పముగా ఫలించును.
షష్ఠమమందు కేతువు వలన శత్రువుల ద్వారా ధనసంపాదనా మార్గము గోచరించును.
సప్తమమందు కేతువున్న ఫలించక కళత్ర సౌఖ్యముండదు.
అష్టమమందు కేతువున్న శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండి మిక్కిలి దరిద్రమనుభవించును.
నవమమందు కేతువున్న ఫలించును.మిక్కిలి భాగ్యవంతుడగును గాని,పితృసౌఖ్యము తక్కువ.
దశమమందు కేతువున్న బాగుగా ఫలించును.మిక్కిలి పేరు ప్రతిష్టలు సంపాదించును.విద్యావినయ సంపన్నుడగును.
ఏకాదశమందు కేతువున్న బాగుగా ఫలించును.లెక్కకు మిక్కిలి ధనమార్జించును.
ద్వాదశమందు కేతువున్న యెడల పారమార్ధిక చింత గలవాజగును.కేతుదశ ఫలించక మిక్కిలి ధనవ్యయము గలుగును.
*కుంభాది శుక్ర ఫలము*

కుంభలగ్నమునకు శుక్రుడు వాహన భాగ్యాధిపతి యగుటచే సామాన్యముగా ఏస్థానమందున్నను యెాగించును.కేంద్రకోణములయందున్న అఖండయెాగము నిచ్చును.తృతీయ షష్ఠాష్టమములు యందున్న మధ్యమము,యెాగభంగము గలుగును.ఈ శుక్రుడు యెాగించడు.
కుంభలగ్నముకాగా లగ్నమందు శుక్రడున్న ఈ శుక్రదశ అఖండముగా యెాగించును.జాతకుడు విద్యవినయ సంపన్నుడు యెాగ్యుడు.భాగ్యవంతుడు అగును.
ధనస్థానమందు శుక్రుడున్న శుక్రదశలో విశేషధనము సంపాదించి నిలువ జేయును.వాక్చాతుర్యము గలవాడు యెాగ్యుడు అగును.ఈ శుక్రదశ బాగుగా ఫలించును.
తృతీయమందు శుక్రుడున్న ఈ శుక్రదశ ఫలించదు.సోదరీల సహాయము వలన జాతకుడు జీవనము చేయును.
చుతుర్థమందు శుక్రుడున్న విశేషభూజాతకుడు ఉద్యోగస్తుడైన వాహనముద్రాధికారముగల యుద్యోగము చేయును.ఈ శుక్రదశ బాగుగా ఫలించును.
పంచమమందు శుక్రుడున్న స్త్రీ సంతానము విశేషముగా నుండును.స్వతంత్ర విద్యవలన జాతకుడు జీవించును.
సప్తమమందు శుక్రుడున్న యెాగ్యకళత్రము లభించును.కళత్రము ఆస్తికొంత కలియును.ఈ శుక్రదశ ఫలించును.
అష్టమమందు శుక్రుడున్న కళత్ర,సంతాన విచారము గలుగును.ఈ శుక్రదశలో మధ్యమధ్య యెాగభంగము గలుగును.
షష్ఠమమందు శుక్రుడున్న ఫలించదు శత్రురోగ ఋణములు హెచ్చు.
భాగ్యమందు శుక్రుడున్న మిక్కిలి భాగ్యవంతుడగును.శుక్రదశలో అఖండ యెాగము కలుగును.
దశమమందు శుక్రుడున్న శుక్రదశ ఫలించును.విద్యావంతుడై స్వతంత్రవిద్య వలన జీవనము ,రాజసన్మానము సంభవించును.
ఏకాదశమందు శుక్రుడున్న ఫలించును.న్యాయముగా ధనమార్జించును.
వ్యయమందు శుక్రుడున్న అనేక ధర్మకార్యములు చేయును.మహాదాత యగును.ఈ శుక్రదశ స్వల్పముగా ఫలించును.

No comments:

Post a Comment