Friday, February 9, 2018

*మకర లగ్నము*

మకరలగ్నమునకు బుధుశుక్రులు మిక్కిలి రాజయెాగ కారకులగుదురు.ఈ బుధశుక్రులు కేంద్ర కోణములయందెక్కడ కలసిన మిక్కిలి ఆయుర్భాగ్యములు పేరు ప్రతిష్ఠలు గల జాతకులగుదురు.షష్ఠాష్టవ్యయముల యందుకలిసిన  వాహనముద్రాధికారములుండవు.ఈ బుధశుక్రులు కన్యామీన రాసులయందు కలిసిన యెడల బుధదశలో గాని శుక్రదశలో గాని మధ్య మధ్య యెాగభంహము గలుగును.
బుధ శుక్రులతో అష్టమాధిపతియగు రవికలిసియున్న యెడల బుధదశలో శుక్రదశలో గాని మధ్య మధ్యను యెాగభంగము కలుగును.రవిగదశ పూర్తిగా యెాగించును.
రవిచంద్రులు కలిసిసియున్న రవిదశ స్వల్పముగా యెాగించును.చంద్రదశ యెాగించదు.
రవికుజులు గలిసిన యెడల మధ్య మధ్య యెాగించి తర్వాత యెాగభంగము గలుగును.రవిబుధులు కలిసియున్న రవిదశ యెాగించును.బుధదశ యెాగింతదు.
రవిగురులు గలిసిన రెండుదశలలో వ్యవహారపు చిక్కులు,శరీరపీడ మెుదలగునవి గలుగును.రవి శుక్రులు కలిసియున్న కళత్రసౌఖ్యముండదు.
రవి శనులు గలిసియున్న రవిదశ యెాగించును.శనిదశ  యెాగించదు.శరీరపీడ,ధనవ్యయము,ఒకప్పుడు మారకముగూడ గలుగును.
చంద్రకుజులు కలిసిన కళత్రవియెాగము గలుగును.కళత్రమునకు మశిచికాదిబాధలు గలుగును విశేష  భూజాతకమగును.అట్టి చంద్రుడు పూర్ణచంద్రుడైయుండవలెను.
చంద్రబుధలు గలిసిన విశేష భాగ్యవంతుడగును.రెండు దశలు యెాగించును.కళత్రసంబంధమైన ఆస్తికలియును.
చంద్ర గురులు గలిసిన కళత్రముస్థూలముగా నుండును.రెండుదశలు సామాన్యముగా యెాగించును.
చంద్ర శుక్రులు కేంద్ర కోణముల యందు గలిసియున్న వాహనముద్రాధి కారముగాని రాజసన్మానముగాని గలుగును.రెండుదశలు పూర్తిగా యెాగించును.
శని చంద్రులు కలిసినపుడు చంద్రుడు పూర్ణచంద్రుడైనచో విశేష ధనజాతకమగును.గాని శనిదశలో స్వల్పముగా నలతజేయును.కుజ బుధులు గలిసిన విశేష భాగ్యవంతుడగును.మాతృసంబంధమైన భూమి కొంత గలియును. రెండుదశలును పూర్తిగా యెాగించును.
కుజ గురులు గలిసిన పిత్రార్జితమైన భూమి కొంత వ్యయము చేయును.గురుదశ యెాగించును గాని కుజదశ యెాగించదు.
కుజ శుక్రులు గలిసిన సంతాన కళత్ర విచారము గలుగును.కుజదశ శుక్రదశ గూడ యెాగించును.కుజదశలో విశేష భూమిని
సంపాదించును.
కుజశనులు గలిసిన మశూచిబాధ గలుగును.శనిదశ కంటె కుజదశ విశేషముగా యెాగిమచును.
బుధ గురులు గలిసిన బుధదశ  యెాగించదు.గురుదశ యెాగించును.పిత్రార్జిత భూమి ఖర్చుపెట్టును.
బుధ శుక్రులు గలిసిన రెండుదశలు అఖండముగా యెాగించును.బుధశనులు గలిసిన శనిదశ కంటె బుధదశ విశేషముగా యెాగించును.గాని శనిదశలో విశేషముగా శరీరపీడ ధనవ్యయమును కలుగును.
గురు శుక్రులు కలిసిన విశేషసంతానముచే దరిద్రమనుభవించును.గురుదశ యెాగించును.గాని శుక్రదశ యెాగించదు.
గురు శనులు కలిసిన స్థూలశరీరము గలవాడు.వాతతత్వముగలవాడు అగును.గురుదశ యెాగించును.
శుక్ర శనులు కలిసిన మిక్కిలి పేరు ప్రతిష్ఠలు గలవాడు ఆయుర్భాగ్యములు గలవాడు పండితుడు అగును.శుక్రదశలో శనిభుక్తియందు గాని శనిదశలో శుక్రభుక్తియందు గాని కళత్ర విచారము గలుగును.మధ్య మధ్య సంతాన నష్టము గలుగును.శుక్రదశశనిదశయు పూర్తిగా యెాగించును.
మెుత్తము మీద మకరలగ్నమునకు రవి గురులును పూర్ణచంద్రుడును,మారక స్థానములయందున్న యెడల మారకము నిచ్చువారగుదురు.తక్కిన గ్రహములన్నియు యెాగకారకులగుదురు.
*మకరాది రవి ఫలము*

మకరలగ్నమునకు రవి అష్టమాధిపతి యగుటచే రవి యేస్థానమందున్న యెాగించదు.శరీరపీడ ధనవ్యయము చేయును.
మకరలగ్నమై లగ్నమందు రవియున్న శరీరపీడ ధనవ్యయము యెాగభంగము జేయును.
ద్వతీయమందు రవియున్న యెంత ధనమార్జించినను నిలువయుండదు.ఈ రవిదశ యెాగించదు.
తృతీయమందు రవియున్న ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.ఈ రవిదశ స్వల్పముగా యెాగించును.
చతుర్థమందు రవియున్న మాతృసౌఖ్యము తక్కువ.ఆయుర్భాగ్యము హెచ్చుగా నుండును.పిత్రార్జితమైన భూమి కొంత ఖర్చు పెట్టును.
పంచమమందు రవియున్న ఆయుర్భాగ్యము హెచ్చుగాని సంతానసౌఖ్యముండదు.
షష్టమమందు రవియున్న శతృవృద్ధి విశేషముగా నుండునుగాని చివరకు జయమును పొందును రవిదశ శరీరమునకు విశేషముగా నలత జేయును.
సప్తమస్థానమందు రవియున్న కళత్రము పతిభక్తి గలదగును గాని,రోగపీడితురాలగును.
అష్టమమందు రవియున్న ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండునుగాని,రవిదశలో యెాగభంగము గలుగును.
నవమమందు రవియున్న రవిదశ యెాగించును.గాని పితృసౌఖ్యము స్వల్పము.
దశమమందు రవియున్న యెాగించదు.ఆయుర్భాగ్యము లు అల్పముగా నుండును.
ఏకాదశమందు రవియున్న ఆయుర్భగ్యములు సంపూర్ణముగా నుండును రవిదశ యెాగించును.
ద్వదశమందు రవియున్న యెడల ఈ రవిదశ  ఫలించదు బాలారిష్టము గలుగును.దుర్వ్యయము చేయును.
*మకరాది చంద్ర ఫలము*

ఈమకర లగ్నమునకు చంద్రుడు సప్తమాధిపతి యదుటచేత, పూర్ణచంద్రుడై కేంద్రకోణములయందున్న యెడల మారకము చేయును.క్షీణచంద్రుడైన యెడల మారకము చేయడగాని కేంద్రకోణములయందున్న యెడల యెాగించును.
మకరము లగ్నమై లగ్నమందు పూర్ణచంద్రుడున్న యెడల రూపము శరీరదారుఢ్యము స్వల్పముగా నుండును గాని స్థూలశరీరము కలవాడగును.ఈ చంద్రదశ యెాగించును.
క్షీణచంద్రుడై లగ్నమందున్న శరీరము కృశించి యుండును.కొంచెము కష్టము లనుభవించును.ఈ చంద్రదశ యెాగించదు.
ద్వితీయమందు పూర్ణచంద్రుడున్న సుందరమైన ముఖము గలవాడు.ధనవంతుడు,విద్యావంతుడు అగును.ఈ చంద్రదశ ఫలించునుగాని,ఒకప్పుడు మారకము చేయును.క్షిీణచంద్రుడు ద్వితీయమందున్న యెడల మారకము చేయడు గాని ధనము నిలవదు.
తృతీయమందు పూర్ణచంద్రుడున్న సోదర వృద్ధి బాగుగా నుండును.పిరికి వాడుగును.స్వల్పముగా యెాగించును (క్షీణచంద్రుడున్నచో ధైర్య స్థైర్యములు గలవాడు.ఈ దశబాగుగా యెాగించును.)
చతుర్థమందు చంద్రుడున్న యెడల విద్యాభూమి వాహనము మాతృసౌఖ్యము సంపూర్ణముగా నుండును.క్షీణచంద్రుడున్నచో స్వల్పముగా నుండును.
పంచమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి ప్రఖ్యాతి గల ఒక పుత్రసంతానముండును.ఈ చంద్రదశ బాగుగా యెాగించును.క్షీణచంద్రుడున్న సంతాన నష్టము గలుగును.ఈ చంద్రుడు స్వల్పముగా యెాగించును.
షష్ఠమమందు పూర్ణచంద్రుడున్న శత్రు,రోగ ఋణములుండవు క్షీణచంద్రుడున్న యివి మూడును స్వల్పముగా నుండును.
సప్తమమందు పూర్ణచంద్రుడున్న సుందరమైన భర్య లభించునుగాని,జాతకునకు మధ్య మధ్య నలత జేయును.క్షీణచంద్రుడున్న భార్యాసౌఖ్యము తక్కువగా నుండును.ఈ స్థానమందు పూర్ణచంద్రుడు యెాగించునుగాని క్షీణచంద్రుడు యెాగించడు.
అష్టమమందు పూర్ణచంద్రుడున్న మధ్యాయుర్ధాయ జాతకమగును క్షీణచంద్రుడై నయెడల అల్పయుర్ధాయము కలవాడగును.ఈ స్థానమందు ఏ చంద్రుడున్న యెాగించడు.
నవమమందు పూర్ణచంద్రుడున్న ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.తండ్రి మిక్కిలి పేరు ప్రతిష్టలు గలవాడగును.క్షీణచంద్రుడున్న పితృసౌఖ్యము తక్కువగా నుండును.ఈ చంద్రుదశ యెాగించును.
దశమమందు పూర్ణచంద్రుడున్న యెడల శష్టాచారము గలవాడు స్వతంత్ర వృత్తివలన జీవనము చేయువాడును తీర్థయాత్రలు సేవించువాడగును అగును.ఈ చంద్రదశ పూర్తిగా యెాగించును.క్షీణచంద్రుడున్నచో ఆచారవిహీనుడు నీచవృత్తిగలవాడు.డాంబికము కలవాడును అగును.
ఏకాదశమందు పూర్ణచంద్రుడున్న ఈ దశ స్వల్పముగా యెాగించును.కళత్ర సౌఖ్యముండదు.క్షీణచంద్రుడున్న కళత్రవిచారము,ధనవ్యయము మొుదలగునవి గలుగును.
ద్వాదశమందు పూర్ణచంద్రుడున్న యెడల ధర్మకార్యములు చేయును.కళత్రము రోగపీడితురాలగును.క్షీణచంద్రుడున్న యెడల జాయానష్టము.దుర్వ్యయము గలగును.ఈ స్థానమందు ఏ చంద్రుడుగూడ యెాగించడు.
*మకరాది కుజ ఫలము*

మకరలగ్నమునకు కుజడు చతుర్థలాభాధిపతి యగుట చేత ఏ స్థానమందున్నను విశ్రమఫల మిచ్చును.
మకరలగ్నమై లగ్నమందు కుజుడున్న పేరు ప్రతిష్ఠలు గలవాడు,కొపదారియు అగును.శరీరసౌఖ్యముండదు.కుజదశ యెాగించును.
ద్వితీయమందు కుజుడున్న యెంత ధనమార్జించినను నిలువక సంతాన విచారము గూడ కలుగును.
తృతీయమందు కుజుడున్న యెడల ధైర్యవంతుడగును గాని కుజదశ యెాగించదు.సోదరనష్టము గూడ గలుగును.
చతుర్ధమందు కుజుడున్న యెడల కుజదశ బాగుగా యెాగించును.అధికముగా భూమి సంపాదించును.
పంచమమంది కుజుడున్న యెాగించును గాని సంతాన విచారము గలుగును.గర్భస్రావము కూడ కలుగును.
షష్ఠమమందు కుజుడున్న స్వల్పముగా భూమి నష్టమగుట భూసంబంధమైన వ్యవహారపు చిక్కులు గలుగును.ఈ కుజదశ యెాగించదు.
సప్తమమందు కుజుడున్న భార్య దుర్భలముగా నుండును.ఈ కుజుదశ యెాగించదు భూవ్యయము మెుదలగునవి గలుగును.
అష్టమమందు కుజుడున్న కళత్రవిచారము,ధనవ్యయమగలుగును ఈ కుజదశ  యెాగించదు.
భాగ్యమందు కుజుడున్న యెడల ఈ కుజదశ స్వల్పముగా యెాగించునుగాని పితృసౌఖ్యముండదు.
దశమమందు కుజుడున్న ఈ కుజదశ పూర్తిగా యెాగించును.మిక్కిలి పేరు ప్రతిష్ఠలు గల జాతకమగును.
ఏకాదశమందు కుజుడున్న యడల ఈ కుజదశ యెాగించునుగాని మిక్కిలి అన్యాయముగా ధనమార్జించును భూజాతకమగును.
ద్వాదశమందు కుజుడున్న కుజదశ యెాగించదు కళత్రపీడ ధనవ్యయము మెుదలగునవి చేయును.
*మకరాది రాహు ఫలము*

మకరము లగ్నమయి లగ్నమందు రాహువున్న యెాగించదు.శరీరపీడ ధనవ్యయము మెుదలగునవి చేయును దుష్టస్వభావము గలవాడగును.
ధనస్థానమందు రాహువున్న యెడల ఈ రాహుదశఫలించదు.ఎప్పుడును ధనమునకు చిక్కులు పడుచుండును.
తృతీయమందు రాహువున్న ఆయుర్భాగ్యములు నిండుగా నుండును.ఈదశ అఖండముగా ఫలించును.
చతుర్థమందు రాహువున్న రాహుదశ ఫలించదు.విద్యవిఘ్నము,భూవ్యయము,మాతృపీడ మెుదలగునవి కలుగును.
పంచమమందు రాహువున్న బాగుగా ఫలించును.గానిస్వల్పమైన సంతాన విచారముండును.
షష్ఠమమందు రాహువున్న పూర్తి  ఆయుర్భాగ్యములుండును.కానిమధ్యమధ్య శత్రురోగ ఋణములు హెచ్చు.
సప్తమమందు రాహువున్న యెడల రాహుదశ ఫలించదు.కళత్రనష్టము శరీరపీడ మొదలగునవి కలుగును.
అష్టమమందు రాహువున్న యెడల ఈ రాహుదశ ఫలించును కాని విశేష కష్టము లనుభవించును.ఎంత ధనమార్జించినను నిలవదు.భాగ్యమందు రాహువున్న బాగుగా ఫలించును.గాని పిత్రారిష్టము హలుగును.
దశమమందు రాహువున్న యెడల ఈ రాహుదశ స్వల్పముగా ఫలించును.కానిమనస్సు స్థిరముగా నుండక విదేశ  సంచారము చేయును.స్వల్పముగా తీర్థయాత్ర కూడ లభించును.
ఏకాదశమందు రాహువున్న యెడల ఈ రాహుదశ ఫలించును.కాని నిచవృత్తివలన ధనమార్జించును.
ద్వాదశమందు రాహువున్న రాహుదశ ఫలించదు.దుర్జనసాంగత్యము,దుర్వ్యయము మెుదలగునవి చేయును.
*మకరాది గురు ఫలము*

మకరలగ్నమునకు గురుడు తృతీయ వ్యయాధిపతి యగుటచే యేస్థానమందున్న ను స్వతంత్రముగా యెాగించడు అనగా మిక్కిలి బలముగలవాడై కేంద్రకోణములయందున్నప్పుడు శుభవర్గుల యెుక్క బలము గలిగినప్పుడు అష్టవర్గునందు ఆ బిందువులకంటె యెుక్కువ బిందువులు గలిగినప్పుడు  ఈ లగ్నమునకు యెాగకారకులైన బుధ శుక్రకుజులతో గలిసియున్నప్పుడు ఈ గురుడు యెాగించును.
మకరము లగ్నమై లగ్నమందు గురుడు నీచయందుండుటచే ఈ గురుదశ యెాగించదు.గురునకు నీచభంగము గలిగినచో అఖండ యెుగము గలుగును.మిక్కిలి పేరు ప్రతిష్టలు గలవాడు యెాగ్యుడు సామాన్య దేహదారుఢ్యము గలవాడు అగును.
ద్వితీయమందు గురుడున్న యెడల కుటుంబవృద్ధి ధన వృద్ధిగలుగును.ఈగురుదశ స్వల్పముగా యెాగించును.
తృతీయమందు గురుడున్న యెడల సోదరవృద్ధి విశేషముగా నుండును.సోదరులవలన జాతకుడు అభివృద్ధి నొందును.ఈ గురుదశ స్వల్పముగా యెాగించును.
చతుర్థమందు గురుడున్న విద్య,భూమి మాతృసౌఖ్యము గృహము వాహనము  స్వల్పముగా నుండును.ఈ గురుదశ స్వల్పముగా యెాగించును.
పంచమమందు గురుడున్న అధిక సంతానము గలుగును.సంతానము స్వల్పముగా నష్టమగును.ఈ గురుదశ యెాగించును.
షష్ఠమమందు గురుడున్న గురుదశ యెాగించదు.శత్ర రోగ ఋణములు హెచ్చుగా నుండును.
సప్తమమందు గురడున్న కళత్రము కొంచెము స్థూలముగా నుండును.ఈ గురుదశ యెాగించును కాని ఖర్చు విశేషముగా నుండును.
అష్టమమందు గురుడున్న ఫలించదు.దరిద్రముచే బాధపడును.కుటుంబవృద్ధి హెచ్చుగానుండును.
నవమమందు గురుడున్న గురుదశ స్వల్ప యెాగము పిత్రుసౌఖ్యము బాగుగా నుండును.
దశమమందు గురుడున్న పేరు ప్రతిష్టలు విశేషముగా నుండును.స్వంతవిద్య వలన జీవనము చేయును.ఈ దశ స్వల్పముగా యెాగించును.
ఏకాదశమందు గురుడున్న గురుదశ ఫలించును.విశేషధనమార్జించును.న్యాయమైన వృత్తివలన జీవనము చేయును.
ద్వాదశమందు గురుడున్న ఖర్చు విశేషము న్యాయమైన ఖర్చు చేయును.ఈ గురుదశ ఫలించదు.
*మకరాది శని ఫలము*

మకరలగ్నమున శనియేస్థానమందున్నను ఫలించును.కెంద్ర కోణముల యందున్న విశేషముగా ఫలించును.
మకరలగ్నమై లగ్నమందు శనియున్న సౌఖ్యము లేనివాడు,తాపత్రయము గలవాడు,సుఖములేని ఉద్యోగము చేయువాడు అగును.కాని శనిదశ యెాగించును.
ద్వితీయమందు శనియున్న కళత్రసౌఖ్యము లేనివాడు.ధనమునకు తడువుకొనుచుండువాడు అగును.శరీర పీడ,కుటుంబ సంబంధమైన చిక్కులు గలుగును.
తృతీయమందు శనియున్న ఈ శనిదశలో ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.మిక్కిలి యెాగ్యుడు పారమార్థిక చింత గలవాడు అగును.
చతుర్థమందు శనియున్న శనిదశ యెాగించదు.శరీరపీడ ధనవ్యయము మెుదలైనవి గలుగును.
పంచమమందు శనియున్న శనిదశ యెాగించును.కాని సంతాన సౌఖ్యముండుదు.
షష్టమమందు శనియున్న శత్రురోగ ఋణములు హెచ్చుగాన ఈ శనిదశ యెాగించదు.
సప్తమమందు శనియున్న శనిదశ యెాగించును.కాని కళత్రసౌఖ్యము తక్కువగా నుండును.
అష్టమమందు శనియున్న దశ యెాగించదు మిక్కిలి కష్టములను భవించును.
నవమమందు శనియున్న యెాగించదు.పీతృసౌఖ్యము ఎక్కువగా నుండును.
దశమమందు శనియున్న పేరు ప్రతిష్టలు.విశేషవాహన ముద్రాధికారము గలవాడు అగును.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.ఈశనిదశ అఖండముగా యెాగించును.
ఏకాదశమందు శనియున్న శనిదశ యెాగించును.విశేషముగా భూమి సంపాదించును.
ద్వాదశమందు శనియున్న పిత్రార్జితము స్వర్జితము చివరకు ఖర్చుపెట్టును.డాంబికముగా ధనవ్యయము చేయును.ఈ శనిదశ యెాగించదు.
*మకరాది బుధ ఫలము*

మకరలగ్నమునకు బుధుడు సామాన్యముగా కేంద్ర కోణముల యందున్న యెడల యెాగించును.
లగ్నమందు బుధుడున్న యెడల విద్యవినయసంపన్నుడును,వేదశాస్త్రజ్ఞుడు మేధావియు నగును.ఈ బుధ దశ పూర్తిగా యెాగించును.
ద్వితీయమందు బుధుడున్న యెడల అప్పుడప్పుడు ధనము నిలవయుండును గాని బుధదశ స్వల్పముగా నలత జేయును.
తృతీయమందు బుధుడున్న యెడల ఈ బుధదశ యెాగించదు.అనేక కష్టములు గలుగును.పితృసౌఖ్యము స్వల్పము.
చతుర్ధమందు బుధుడున్న యెాగించును.విద్య,భూమి,వాహనము మాతృసౌఖ్యము బాగుగా నుండును.
పంచమమందు బుధుడున్న బుధదశ సంపూర్ణముగా యెాగించును.భాగ్యము వృద్ధిఅగును.స్త్రీ సంతానముండును.
షష్ఠమమందు బుధుడున్న బుధదశ యెాగించదు.శత్రు సంబంధ వ్యవహారములు గలిగి పిత్రార్జితమంతయు ఖర్చుపెట్టును.
సప్తమమందు బుధుడున్న బుధదశలో విశేషముగా నలత జేయును గాని భగ్యమభివృద్ధి నొందును.
అష్టమమందమ బుధుడున్న
బుధదశలో విశేషముగా దరిద్రమునుభవించును.
భాగ్యమందు బుధుడున్న భాగ్యము మిక్కిలి హెచ్చుగా నుండును.ఈ బుధదశ అఖండముగా ఫలించును.
దశమమందు బుధుడున్న  వర్తకము వలన గాని వైద్యము వలన గాని విశేష ధనమార్జించును ఖ్యాతిగల పురుషుడగును.బుధదశ అఖండముగా ఫలించును.
ఏకాదశమందు బుధుడున్న దశయెాగించును.మిక్కిలి యుక్తిగా ధనమార్జించును.
వ్యయమందు బుధుడున్న వ్యవహారపు చిక్కులు విశేషముగా నుండును.జాతకుడు దాతయగును           *మకరాది కేతు ఫలము*

కేతువు లగ్నమందున్న శరీరసౌఖ్యములేనివాడు చామనచాయ శరీరము గలవాడు అగును.ఈ కేతుదశ ఫలించదు.
ద్వితీయమందు కేతువున్న యెంత ధనమార్జించినను నిలువదు పారమార్ధిక చింతగలవాడు.
తృతీయమందు కేతువున్న కేతుదశ ఫలించును ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
చతుర్థమందు కేతువున్న ఫలించదు విద్య భూమి మాతృసౌఖ్యము స్వల్పముగా నుండును.
పంచమమందు కేతువున్న సంతాన సౌఖ్యముండదు .ఈ కేతుదశ స్వల్పముగా ఫలించును.
షష్ఠమమందు కేతువున్న  శత్రురోగ ఋణములు హెచ్చు.
సప్తమమందు కేతువున్న ఫలించదు.శరీరపీడ కళత్రనష్టము గలుగును.
అష్టమమందు కేతువున్న ఫలించక శరీరపీడ ధనవ్యయము శత్రువృద్ధి కలుగును.
నవమమందు కేతువున్న ఫలించును.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండునుగాని పితృసౌఖ్యము తక్కువ.
దశమమందు కేతువున్న ఆచారము స్వల్పముగా నుండును,పారమార్ధిక చింత గలవాడును అగును.ఈ కేతుదశ ఫలించును.
ఏకాదశమందు కేతువున్న యెడల ఈ కేతుదశ ఫలించును.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
ద్వాదశమందు కేతువున్న ఖర్చు విశేషముగా నుండును,పారమార్ధిక చింతగలవాడగును.
*మకాది శుక్ర ఫలము*

మకరం లగ్నమై లగ్నమందు శుక్రుడున్న యెడల-జయ జాతకమని చెప్పవచ్చును.స్వయంకృషితో పైకివచ్చును.పేమ కలాపములుండును.క్రమక్రమముగా ధనం వృద్ధినొందును.శ్రమించి జయమొందును.ఆశాపరుడుశుక్రమహాదశ యెాగించును.
ద్వితీయమందు శుక్రుడుండగా-సుఖవాంఛ వలన వ్యయము.స్వయంకృషి వలన వ్యాపార ఉద్యోగ వృత్తివలన ధనమార్జించును.స్వార్జితధనముండును.విద్యావంతుడు.శుక్రదశ యెాగించును.
తృతీయమందు శుక్రుడుండగా-సాహసకార్యములందు ప్రీతి.పరధనాపేక్ష అధికము.స్థిరమగు భావములు కలవాడు కాని పోరాడవలెను 32సం"లు తరువాత యెాగము శుక్రదశ ఆశాభంగాలుండును.
చతుర్థమందు శుక్రుడు -విద్యసామాన్యము.పేమ కలాపములు.స్వార్జిత ధననముండును.జీవితాంత్యమందు జయము.శుక్రదశ మధ్యమము.
పంచమమందు శుక్రుడు - సుఖి,బహుపేమ కలాపములు,సాహసకార్య ప్రీతీ.మనోబలము,తంత్రశాస్త్ర పరిజ్ఞానము.శుక్రదశ మధ్యమము.
షష్టమందు శుక్రుడు - స్పెక్యూలేషన్ వలన ధనప్రాప్తి.పేమ కలాపము లుండును.వృత్తివ్యాపారములందు అవరోధములుండును.బాధలుండును.శుక్రదశ వ్యక్తిగత జీవితమునకు అవరోధము.
సప్తమమందు శుక్రుడు -పాపత్వమున పేమ కలాపముల వలన నష్టము.వివాహ మూలకకీర్తి,లాభము.స్వీయయెాగప్రాప్తి.శుక్రదశ మధ్యమము.
అష్టమమందు శుక్రుడున్న -ఇతర వ్యవహారములందు లాభములు,వారసత్వ వలన లాభము.శుక్రదశ మధ్యమము.అశాభంగాలవలన శుక్రదశ యెాగము.అందుకొనలేరు.
నవమందు శుక్రుడున్న - దూరదేశయానము,కీర్తి,ప్రతిష్ఠలు.మానసికస్థితి అభివృద్థి శాసించును.శుక్రదశ మధ్యమము.
దశమమందు శుక్రుడున్న -కీర్తి,ఉద్యోగ,వాపార దక్షత ప్రభుత్వము మూలక లాభములుండును.శుక్రదశ మధ్యమముగా యెాగిము నిచ్చును.జీవితంలో రాణింపు ఉంటుంది.
ఏకాదశమందు శుక్రుడున్న- మనోవాంఛ ఫలసిద్ధి,లాభము.పాపత్వమున వ్యతిరేక ఫలితములు. భూసంబంధ,యంత్రసంబంధ లాభములుండును.ఉద్యోగ వ్యాపారములలో యెాగించును.ఉన్నత వర్గీయల స్నేహం శుక్రదశ సమత్వముగా నుండును.
ద్వాదశమందు శుక్రుడున్న - శ్రమానంతరము వలనగాని కార్యజయ ముండదు.పరిశోధనా సామర్థ్యము.వ్యక్తిగత జీవితములో స్థిరత్వము కొరకై కడశ్రమించవలసియుండును.శుక్రదశ వ్యక్తిగత జీవితమును పై ఆధారపడి నడుచును.

No comments:

Post a Comment