Friday, February 9, 2018

*ధనుర్లగ్నము*

ధనుర్లగ్నమునకు గురుడు కుజుడు రవి బుధులు ఈ నాలుగు గ్రహములు యెాగకారకులగుదురు.
వీరిలో రవి బుధు లిరువురు మిక్కిలి యెాగకారకులు.రవి బుధులు భాగ్యరాజ్యాధిపతులగుట చేతను కేంద్ర కోణమలయందు కలిసియున్న వాహన ముద్రాధికారములు కలుగును.షష్టాష్టమ వ్యయములయందున్న ఆయుర్భాగ్యములు,పేర ప్రతిష్టలు మాత్రముండును.వాహన ముద్రాది కార్యములుండవు.
రవి,బుధులు ఈ ధనుర్లగ్నమునకు తులయందుగాని మీనమందుగాని యున్నచోమెుట్ట మెుదట రాజయెాగము కలిగి తరువాతయెాగభంగము కలుగును.లగ్నధిపతియగు గురుడు ఏ విధమైన పాపగ్రహ సంబంధ వీక్షణములు లేక కేంద్రకోణముల యందున్న యెడల ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.రవిచంద్రులు కలిసిన రవిదశలో శత్రు రోగ ఋణములు హెచ్చును.చంద్రదశలో కొంతవరకు యెాగము కలుగును.రవి కుజులు కలిసిన యెడల రెండుదశలు యెాగించును.
రవి గురులు గలిసిన యెడల గొప్ప ఖ్యాతిగల పురుషుడు,మిక్కిలి రాజయెాగముగల వాడునగును.శత్రురోగ ఋణములు హెచ్చును.రవికుజులు కలిసిన యెడల యెాగించును.రవిదశలో పిత్రార్జితము కలుగును.చంద్ర కుజులు గలిసిన యెడల చంద్రదశలో మాత్రారిష్టము గలుగును.గాని చంద్రదశ యెాగించును.కుజదశ యెాగించును.
చంద్ర బుధుడు కలిసిన చంద్రదశలో యెాగము గలుగును బుధదశలో చిక్కులు గలుగును.గురుదశలో రోగపీడితులై మిక్కిలి కష్టములనుభవించును.చంద్రశుక్రులు గలిసిన విపరీత రాజయెాగము గలుగును.ఈ చంద్ర శుక్రులు వృషభమందు కర్కాటమమందు కలిసియున్న విపరీత రాజయెాగము గలుగును.తక్కిన స్థానములయందు చంద్ర శుక్రులెక్కడ కలిసినను మధమధను యెాగభంగము గలుగుచుండును.
చంద్రశనులు గలిసిన రెండుదశలు మంచివికావు.అనేక యెాగభంగములు.మారకములు,కష్టములు కలుగును.
కుజబుధులు కలిసిన రెండుదశలును యెాగించును.విశేషభూజాతకమగును.కానిఆచారము స్వల్పముగా నుండును.కళత్రము రోగపీడితురాలై యుండును.కుజగురులు కలిసిన దశలు యెాగించును.విశేష సంతానము కలుగును భూజాతకమగును.కుదశుక్రులు గలిసినచో భూజాతకము ఋణజాతకమగును.
ఈ లగ్నమునకు కుజశుక్రులు గలిసినప్పుడు కళత్రము రోగపీడితురాలగును.స్త్రీ సంతానము హెచ్చు.శుక్రదశ స్వల్పముగా యెాగించును.కుజదశ యెాగించును.
కుజశనులు గలిసిన సంతాన విచారము గలుగును.సామాన్యయెాగము ఈ కుజశనులు వ్యయస్థానమందైన కారగృహప్రాప్తి గలుగును.
బుధ గురులు గలిసిన పండితుడును ప్రఖ్యాతిగల పురుషుడును అగును.రెండుదశలును గూడ రాజయెాగమునిచ్చును.బుధశుక్రులు గలిసినచో బుధదశలో వ్యవహారపు చిక్కులు గలుగును.శుక్రదశలో కొంతవరకు యెాగించును.
బుధ శునులు గలిసిన బుధదశలో కళత్రవిచారము ఉద్యోగభంగము మెుదలగునవి గలుగును.శనిదశ యెాగించును.ధనవృద్థిగలుగును.గురుశుక్రులు గలిసిన యెడల సామాన్య యెాగజాతకమగును.శుక్రదశ స్వల్పముగా యెాగించును.
గురుశనులు గలిసిన జాతకుడు రోగశరీరుడగును సుఖముండదు ధనజాతకమగును.గురుదశకంటె శనిదశ స్వల్పముగా యెాగించును.
శుక్రశనులు గలిసిన ఋణజాతకమగును.రెండుదశలు యెాగించవు.
ధనుర్లగ్నమునకు శనిశుక్రులిరువురు మిక్కిలి పాప గ్రహములగుదురు.శనిశుక్రులు దశాభుక్తులందు మారకమగును.
*ధనురాది రవి ఫలము*

ధనుస్సులగ్నమై లగ్నమందు రవియున్న  ఈ  రవిదశ
లోరాజయెాగము.పేరుప్రతిష్ఠలు గలుగును.
ద్వితీయమందు రవియున్న ధనము నిలువదు.ఈ రవిదశ స్వల్పముగా యెాగించును.
తృతీయమందు రవియున్న తండ్రికి అల్పాయుర్ధాయము కలుగును.చతుర్థమందు రవియున్న ఆయుర్భాగ్యము సంపూర్ణముగా నుండును.
పంచమమందు రవియున్న వాహన ముద్రాధికారములతో యెాగజాతకమగును.
షష్టమమందు రవియున్న వ్యవహారపు చిక్కులు వలన శతృవృద్ధి,ఋణవృద్ధ,రోగవృద్ధి కలుగును.
సప్తమమందు రవియున్న యెడల పతివ్రతయగు కళత్రము లభించును.ఈ రవిదశ యెాగించును.
అష్టమమందు రవియున్న యెడల పిత్రార్జితమంతయు ఖర్చుపెట్టును.
నవమమందు రవియున్న ఆయుర్భగ్యము సంపూర్ణముగా నుండును.
దశమమందు రవియున్న రాజయెాగము గల్గి మిక్కిలి ప్రతిష్ఠ సంపాదించును.
ఏకాదశమందు రవియున్న వ్యవహారపు చిక్కులు గాని యెాగభంగము గాని గలుగును.
ద్వాదశమందు రవియున్న ధర్మకార్యములు చేయును.రవిదశ యెాగించదు.
*ధనురాది చంద్ర ఫలము*

ధనస్సు లగ్నమై లగ్నమందు చంద్రుడున్న  యెడల రోగశరీరము గలవాడు సుఖము లేనివాడు అగును.
ద్వితీయమందు చంద్రుడున్న పూర్ణచంద్రుడైనచో గొప్ప ధనవంతుడు క్షీణచంద్రుడైనచో దరిద్రుడు అగును.
తృతీయమందు పూర్ణ చంద్రుడున్న యెడల సోదరవృద్ధి గలవాడును.క్షీణచంద్రుడున్నచో సోదరీనష్టము గలవాడు అగును.
చతుర్థమందు పూర్ణచంద్రుడున్న మాతృసౌఖ్యము విద్య,భూమి,వాహనము యివి సంపూర్ణముగా నుండును.క్షీణచంద్రుడైనచో స్వల్పముగా నుండును.
పంచమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి ప్రఖ్యాతి గల సంతానము గలుగును.క్షీణచంద్రుడున్న సంతాన నష్టము గలుగును.
షష్ఠమందు పూర్ణచంద్రుడున్న రోగములు స్వల్పముగా నుండును.క్షీణచంద్రుడున్న సంపూర్ణముగా నుండును.
సప్తమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి యెాగ్యమైన కళత్రము లభించును.క్షీణచంద్రుడున్న కళత్రము నష్టమగును.
అష్టమమందు పూర్ణచంద్రుడున్న ఆయుర్వృద్ధి గలుగును.క్షీణచంద్రుడైనచో దురభ్యాసము కలవాడును నాస్తికుడు అగును.
నవమమందు పూర్ణచంద్రుడున్న యెడల దేవబ్రాహ్మణ భక్తిగలవాడుపితృసౌఖ్యము గలవాడు.భాగ్యవంతుడు అగును.క్షీణచంద్రుడైనచో దానికి వ్యతిరేకముగా నుండును.
దశమమందు పూర్ణచంద్రున్న శిష్టాచారముగలవాడు,తీర్థయాత్రాపరుడు,పేరుప్రతిష్ఠలు గలవాడు అగును.క్షీణచంద్రుడున్న నీచకృత్యములవలన జీవనము చేయువాడు,ఆచారహీనుడు అగును.
ఏకాదశమందు పూర్ణచంద్రుడున్న విశేషధనమార్జించువాడు న్యాయార్జనపరుడును అగును క్షీణచంద్రుడున్నచో అన్యాయముగా ధనమార్జించు వాడగును.
ద్వాదశమందు పూర్ణచంద్రుడున్న శుభ వ్యయము చేయువాడు మెాక్షాపేక్ష గలవాడు అగును.క్షీణచంద్రుడున్న దుర్జన సహవాసము గలవాడు దుష్కార్యములు చేయువాడు అల్పాయుర్దాయము గలవాడు అగును.
మెుత్తమీద యి ధనుర్లగ్నమునకు చంద్రుడు అష్టమాధిపతి యగుటచేత నేస్థానమందున్నను యెాగించడు క్షీణచంద్రుడున్న అనేక కష్టములనుభవించును.పూర్ణచంద్రుడైన కేంద్రకోణములయందున్న యెడల స్వల్పముగా యెాగించును.           *ధనురాది కుజ ఫలము*

ధనుర్లగ్నమునకు కుజుడు పంచమాధిపతి యగుటచేత సామాన్యముగా ఏభవమందున్నను యెాగించును.
కేంద్రకోణముల యందున్న విశేషముగా యెాగించును.గాని కుజుడు నైసర్గికపాపియగుటచే ఏభావమందుడునో ఆ భావఫలమును మాత్రము పాడుచేయును.
ధనుస్సు లగ్నమయి లగ్నమందు కుజుడున్న శరీర సౌఖ్యము లేనివాడును కోపదారి వికృత రూపము గలవాడు మశూచి భయము గలవాడు అగును.కాని యెాగ విషయములో ఈ కుజమహాదశ విశేషముగా యెాగించును.భూమివిస్తారముగా సంపాదించును.
ద్వితీయమందు కుజుడున్న సంతానవృద్ధి ధనవృద్ధ కలుగును.స్త్రీ సంతానము విశేషముగా నుండును.కోపస్వభావము గలవాడును సుఖములేనివాడును అగును.గాని యిా కుజదశ యెాగించును.
తృతీయమందు కుజుడున్న యెడల మాయావియు లోభియు అగును.సోదర ద్రవ్యము నపహరించు వాడగును.
చతుర్థమందు కుజుడున్న మాతృసౌఖ్యము,విద్య,భూమి,వాహనము యివి స్వల్పముగా నుండును సంతాన వృద్ధి విశేషముగా నుండును.ఈ కుజదశ బాగుగా యెాగించును.
పంచమమందు కుజుడున్న భూలాభమధిక మగును కాని సంతానము విశేషముగా నష్టమగును.
షష్ఠమమందు కుజుడున్న శత్రరోగ ఋణములు హెచ్చు కుజదశలో పుత్రులతో విరోధము కలుగును.
సప్తమమందు కుజుడున్న యెడల కళత్రసౌఖ్యములేనివాడు.పౌరుషముగలవాడు అగును.
అష్టమమందు కుజుడున్న సంతాన విచారముగల వాడు సుఖములేనివాడు విద్యవిహీనుడు వ్యవహారపు చిక్కులు గలవాడు అగును.
నవమందు కుజుడున్న యెాగించును గాని పితృసౌఖ్యముతక్కువగా నుండును ననికేరళమతము.
దశమమందు కుజుడున్న యెడల అట్టి జాతకుడు గ్రంథకర్త యగును.కుజదశలో విశేషఖ్యాతి గలుగును.మిక్కిలి కీర్తికాముడగు నొకపుత్రుడుండును.
లాభమందు కుజుడున్న విశేష సంతానముగలవాడు పండితుడు ఖ్యాతిగల పురుషుడగునుని శాస్త్ర నిర్ణయం.
వ్యయమందు కుజుడున్న యెడల సంతాన సౌఖ్యము లేనివాడును లోభియునగును.
*ధనురాది రాహు ఫలము*

ధనుస్సు లగ్నమై లగ్నమందు రాహువున్న శరీరసౌఖ్యము లేనివాడు.చంచలస్వభావము గలవాడు.చామనచాయ శరీరము గలవాడు అగును.లగ్నాధిపతి గురుడు బలముగా నున్న ఈ ధనుర్లగ్నమందున్న రాహువున్న యెాగించును అట్లుగాక గురుడు షష్టాష్టవ్యయములయందు దుర్బలముగా నున్న యెడల ఈ రాహువు యెాగించక అనేక కష్టములను గలిగించును.
ద్వితీయమందు రాహువున్న ధనము నిలవయుండదు రాహుదశ యెాగించక శరీరమునకు నలత జేయును.
తృతీయమందు రాహువున్న ఈ రాహుదశ యె్గించును.ఆయుర్భగ్యములు సంపూర్ణముగా నుండును.మిక్కిలి థైర్యము గలవాడగును.
చతుర్థమందు రాహువున్న యెాగించడు.విద్య,భూమి,మాతృసౌఖ్యము యివి తక్కువగా నుండును.
పంచమమందు రాహువున్న యెాగించును గాని సంతానము కొంతవరకు నష్టమగును.
షష్టమమందు రాహువున్న ప్రబలముగా యెాగించును.విశేషఖ్యాతి జెందును.స్వల్పముగా శత్రువృద్ధి యున్నను శత్రువులకే అపజయము కలుగును.
సప్తమమందు రాహువున్న యెాగించును.కళత్రనష్టము.జారత్వదోషము సంభవించును.
అష్టమమందు రాహువున్న యెాగించక అనేక కష్టములు కలుగును శరీరపీడ చేయును.
నవమమందు రాహువున్న అఖండముగా యెాగించును గాని పత్రార్జితము కలుగును.
దశమమందు రాహువున్న బాగుగా యెాగించును.స్వల్పముగా తీర్థయాత్రలు జరుగును.
ఏకాదశమందు రాహువున్న యెాగించునుగాని అన్యాయముగా ధనమార్జించును.
వ్యయమందు రాహువున్న యెాగించదు అనేక కష్టములు కలుగును.దుర్వ్యయము చేయును.
మెుత్తమీద ఈ రాహువు ఏస్థానమందుండునో ఆ స్థానాధి పతియెుక్క బలము నిచ్చును.అదిగాక మేషములగాయితు కన్య ఆఖరు వరకు ఈ స్థానములో యేస్థాన మందున్నను రాహువు  స్వత్పంతముగా యెాగించును.
*ధనురాది గురు ఫలము*

ధనుర్లలగ్నమునకు గురుడు లగ్నవాహనాధిపతి యగుట చేతను ఉభయ కేంద్రాధిపతి యగుట చేతను కేంద్రాధిపత్యదోషము కలిగినప్పటికి లగ్నాధిపతి యగుట చేతను యెాగ విషయములో కేంద్రకోణ ములయందెక్కడ నున్నను యెాగించును.
ధనస్సులగ్నమయి లగ్నమందు గురుడున్న అఖండ యెాగముగలుగును గాని జారత్వముగలవాడు ద్వికళత్రము గలవాడు గాని యగును.
ద్వితీయమందు గురుడున్న సంతానవిచారము గలవాడు.సుఖములేని వాడును.తీర్థయాత్రాపరుడు విదేశివాసియు నగును.ఈ గురుదశలో యెాగించదు.
తృతీయమందు గురుడున్న సోదరీవృద్ధిగలవాడు సామాన్య భగ్యవంతుడు అగును.
చతుర్థమందు గురుడున్న పితృమాతృ సౌఖ్యములు గలవాడు.పండితుడు భూజాతకుడు అగును.
పంచమమందు గురుడున్న మేధావియు ఈశ్వరోపాసకుడు విశేషసంతానము గలవాడు.రాజ్యపూజ్యుడు అగును.అఖండయెాగము గలుగును.
షష్టమమందు గురుడున్న యెడల శత్రు రోగఋణములు హెచ్చుగా నుండును.ఈ గురుదశలో యెాగించదు.
సప్తమమందు గురుడున్న స్థూలశరీరముగల సుందరమైన భార్య లభించును.ఈ గురుదశ యెాగించునుగాని స్వల్పముగా నలతజేయును.
అష్టమమంది గురుడున్న అల్పాయుర్ధయముగల వాడును కష్టజీవియు అగును.ఈ గురుదశ యెాగించదు.
నవమమందు గురుడున్న సత్యవంతుడు భాగ్యవంతుడు పితృసౌఖ్యము గలవాడు అగును.ఈ గురుదశలో అఖండయెాగము గలుగును.
దశమమందు గురుడున్న ఖ్యాతిగల పురుషుడును శిష్టాచారము గలవాడును మంచివృత్తివలన జీవనము చేయువాడు అగును.ఈ గురుదశ యెాగించును.
ఏకాదశమందు గురుడున్న యెడల న్యాయముగా ధనసంపాదన చేయువాడును గవర్నమెంట్ ఉద్యోగము గలవాడు.పిత్రార్జిత ధనము గలవాడు.ధర్మాత్ముడు అగును.ఈ గురుదశ యెాగించును.
వ్యయమందు గురుడున్న గురుదశ యెాగించదు.వ్యవహార చిక్కులు విశేషముగా నుండును.
*ధనురాది శని ఫలము*

ధనుర్లగ్నమునకు శనిద్వితీయ తృతీయాధిపతి యగుటచేతను సామాన్యముగా యే స్థానమందున్న పాపఫలమునే యిచ్చును.
ధనస్సు లగ్నమై లగ్నమందు శనియున్న స్వల్పముగా యెాగించును.శరీర సౌఖ్యముండదు.
ద్వితీయమందు శనియిన్న కొంచము కష్టముమీద ధనము సంపాదించి నిలువజేయును.శరీరమునకు మధ్యమధ్య నలత జేయును.ద్వికళత్రము కలుగును.
తృతీయమందు శనియున్న ధైర్యస్థైర్యములు కలవాడు పరాక్రమము గలవాడు అగును.ఈ శనిదశ బాగుగా యెాగించును.
చతుర్థమందు శనియున్న మాతృసౌఖ్యము,భూమి,వాహనము యివి స్వల్పముగా నుండును.కాని శనిదశ  స్వల్పముగా యెాగించును.
పంచమమందు శనియున్న యెాగించును.సంతానము స్వల్పము. అధికారముగల యుద్యోగముండును.
షష్ఠమమందు శనియున్న ఆయుర్ధాయము ఖ్యాతి విశేషముగా నుండును.మధ్య మధ్యధనమునకు చిక్కులు బడుచుండును.
సప్తమమందు శనియున్న కళత్రసౌఖ్యము తక్కువ.విశేషముగా నలత
జేయును.ఈ శనిదశస్వల్పము గా యెాగించిను.
అష్టమమందు శనియున్న ధనము నిలువయుండదు ధనముకై తడుపుకొనుచుండును ఈ శనిదశ స్వల్పముగా యెాగించును.
నవమమందు శనియున్న పితృసౌఖ్యము తక్కువ.ఈ శనిదశ స్వల్పముగా యెాగించును.సంతానసౌఖ్యముండదు.
దశమమందు శనియున్న గొప్ప యుద్యోగమువలన గాని వ్యవసాయము వలనగాని జీవించువాడు ఆచారము స్వల్పముగా గలవాడు అగును.యిాశనిదశ బాగుగా యెాగించును.
ఏకాదశమందు శనియున్న ఈ శనిదశ విశేషముగా ధనము సంపాదించి నిలవ జేయును.అన్యాయముగా ధనమార్జించును.ఈ శనిదశ అఖండముగా యెాగించును.
వ్యయమందు శనియున్న శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండి వ్యవహారపు చిక్కుల వలన బాధపడుచుండును.ఈ శనిదశ   యెాగించదు. కష్టములు గలుగుచుండును.
*ధనురాది బుధ ఫలము*

ధనుర్లగ్న జాతకమునకు బుధుడు సప్తమ రాజ్యాధిపతి యగుటచేత యేభావమందున్న ను యెాగించును.కేంద్రకోణములయందున్న విశేషముగా యెాగము నిచ్చును.
లగ్నమందు బుధుడున్న యెడల ఈ బుధ దశవిశేష యెాగము నిచ్చును.మిక్కిలి రూపవంతుడు మంచి స్వభావముగలవాడు.దేవాదార్డ్యము గలవాడు విద్యావినయ సంపన్నడు ఖ్యాతిగల పురుషుడు అగును.
ద్వితీయమందు బుధుడున్న వాచాలత్వము గలవాడును,ధనవంతుడును.సుందరమైన ముఖము గలవాడును అగును.ఈ బుధదశ యెాగించును.
తృతీయమందు బుధుడున్న బుధదశ సామాన్యముగా యెగించును.అధికారములేని స్వల్పయుద్యోగముండును.
చతుర్థమందు బుధుడు నీచరాశి కాన యెాగించదు కళత్ర విచారము యెాగభంగము గలుగును.
పంచమమందు బుధుడున్న విశేష స్త్రీ సంతానము గలవాడును.ఖ్యాతిగల పురుషుడ,మేధావి అగును.బుధదశ అఖండముగ యెాగించును.
షష్ఠమమందు బుధుడున్న యిా  బుధదశ సామాన్య ముగా యెాగించును.అధికారములేని యుద్యోగముండును.కళత్రము రోగపీడితురాలగును.
సప్తమమందు బుధుడున్న యెాగము కలుగును.బుధదశలో కళత్ర సుఖంబు లభించును.బుధదశలో విశేషయెాగము కలుగును అనుటలో సంశయములేదు.
అష్టమందు బుధుడున్న దరిద్రము.సౌఖ్యములేనివాడు కష్టజీవి అగును.ఈ బుధదశ యెాగించదు.
నవమమందు బుధుడున్న యిా బుధదశ యెాగించును.రాజాశ్రయము గలవాడును.తీర్థయాత్రలయందాసక్తిగలవాడు పరస్త్రీలోలుడు అగును.
దశమమందు బుధుడున్న యెాగ్యకళత్రము గలవాడు అగును.మిక్కిలి రాజయెాగము కలుగును.సత్యసంధుడై స్వతంత్ర జీవనము చేయువాడగును.
ఏకాదశమందు బుధుడున్న యుక్తిచేత ధనము సంపాందిచువాడు మిక్కిలి సౌఖ్యము గలవాడు సంతానవృద్ధి గలవాడు అగును.ఈ బుధదశల్ విశేష ధనమార్జించును.
ద్వాదశమందు బుధుడున్న దరిద్రుడుగాని లోభిగాని యగును.శత్రుబాధ గలవాడు కళత్ర సౌఖ్యములేనివాడు అగును.ఈ బుధదశలో యెాగభంగము గలుగును.
*ధనురాది కేతు ఫలము*

ధనస్సు లగ్నమై లగ్నమందు కేతువున్న పట్టుదల గలవాడు,కొంచెము కోపదార పారమార్జిక చింతగలవాడు శరీరసౌఖ్యము లేనివాడు అగును.
ద్వితీయమందు కేతువున్న ధనము నిలువయుండదు.మధ్య మధ్య ను నలతజేయును.ఈ కేతుదశ యెాగించదు.
తృతీయమందు కేతువున్న ఈ కేతుదశ బాగుగా యెాగించును.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
చతుర్థమందు కేతువున్న ఈ కేతుదశ యెాగించును.మాతృసౌఖ్యము,భూమి స్వల్పముగా నుండును.విద్య మిఘ్నము గలుగును.
పంచమమందు కేతువున్న సంతానసౌఖ్యముండదు గాని కేతుదశ యెాగించును.
షష్టమమందు కేతువున్న కేతుదశ స్వల్పముగా యెాగించును.గాని మాతృవర్గమువారికి నష్టము కలుగును.
సప్తమమందు కేతువున్న ఈ కేతుదశ యెాగించదు .శరీరపీడ,కళత్రపీడగలుగును.
అష్టమమందు కేతువున్న కేతుదశ యెాగించదు.శరీరపీడయు,ధనవ్యయమును చేయును.మిక్కిలి కష్టములనుభవించును.
నవమమందు కేతువున్న యెడల ఈ  కేతుదశ బాగుగా యెాగించును.ఆయుర్భగ్యములు సంపూర్ణముగా నుండును.
దశమమందు కేతువున్న యెడల ఈ కేతుదశ యెాగించునుగాని ఆదాయం స్వల్పముగా యుండును.
ఏకాదశమందు కేతువున్న విశేషముగా ధనమార్జించును.ఈ కేతుదశ యెాగించును.కాని ఆర్జితము అన్యాయముగా నుండును.
ద్వాదశమందు కేతువున్న యెడల ఖర్చు విశేషముగా నుండును.పారమార్థక చింత కలవాడగును.
*ధనురాది శుక్ర ఫలము*

ధనుర్లగ్నమునకు శుక్రుడు షష్ఠమాలాభాదిపతి యగుట చేతను సామాన్యముగా యేస్థానమందున్నను యెాగించదు.
ధనస్సు లగ్నమై లగ్నమందు శుక్రుడున్న పండితుడు కవి అగును.ఈ శుక్రదశ విశేష ముగా శరీరమునకు నలత జేయును.
ద్వితీయమందు శుక్రుడున్న ఈ శుక్రదశ స్వల్పముగా యెాగించును.స్త్రీ సంతానము గలవాడు స్వల్ప ధనవంతుడు సంగీత సాహిత్యములయందు ప్రవేశము గలవాడు అగును.
తృతీయమందు శుక్రుడున్న  శుక్రదశ స్వల్పముగా యెాగించును.సోదరీవృద్ధి గలవాడు కష్టజీవి అగును.
చతుర్థమందు శుక్రుడున్న విద్యావినయ సంపన్నుడు మాతృ సౌఖ్యము గలవాడు భూ జాతకుడు అగును.
పంచమమందు శుక్రుడున్న శుక్రదశ బాగా యెాగించును.సంతానము విశేషముగా నుండును.జాతకుడు జారుడగును.
షష్ఠమమందు శుక్రుడున్న శత్రుసంబంధము వలనగాని జ్ఢాతి సంబంధము వలన గాని ఆస్తి కొంత కలియును.గాని ఈ శుక్రదశలో శతృరోగ ఋణములు హెచ్చుగా నుండును.
సప్తమమందు శుక్రుడున్న విశేషకాముడు ప్రతిష్టగలవాడు విద్య వినయ సంపన్నుడు అగును.కళత్రము రూపవతి యగును.
అష్టమమందు శుక్రుడున్న కుటుంబవృద్ధి గలవాడై దారిద్ర్య మనుభవించును.
నవమమందు శుక్రుడున్న  పితృసౌఖ్యము గలవాడు,భాగ్యవంతుడు అగును.ఈ శుక్రదశ స్వల్పముగా యెాగించును.
దశమమందు శుక్రుడున్న దశలో కళత్రవిచారము శత్రు రోగఋణములు హెచ్చుగా నుండును.
ఏకాదశమందు శుక్రుడున్న దశ విశేషముగా యెాగించును.న్యాయమైన ధనసంపాదన జేయును శత్రువుల వలన ధనమార్జించును.
ద్వాదశమందు శుక్రుడున్న యిా శుక్రదశ యెాగించదు.శుభసంబంధమైన ఖర్చు విశేషముగా జేయును.కళత్రసౌఖ్యముండదు.

1 comment: