Friday, February 9, 2018

*సింహలగ్నము*

సింహలగ్నమునకు కుజుడు వాహనభాగ్యధిపతి యగుటచే సంపూర్ణ యెాగమునిచ్చును.ఈ కుజుడనితో తృతీయరాజ్యాధి పతియగు శుక్రుడు కలసిన  రెండుదశలుగూడ పూర్తిగా యెాగించును.కుజుడు ప్రత్యేకముగా నున్నకుజదశ యెాగించును.శుక్రుడు ప్రత్యేకముగానున్న ఈ దశ అంతగా యెాగించదు.ఈ లగ్నమందు రవికూడ కుజునివలె యెాగకారకుడగును.రవికుజులు గలిసిన రెండుదశలను బాగుగా యెగించును.వేరువేరుగా నున్నను ఈ రెండు గ్రహములును యెాగించును కాని తక్కిన గ్రహములు స్వతంత్రముగా యెగించవు.
ద్వితీయలాభధిపతి యగుటచే త బుధుడు,తృతీయ రాజ్యాధిపతి యగుటచేత శుక్రుజు మిక్కిలి పాపూలగుచున్నారు.కనుక శుక్రుడుగాని బుధుడుగాని ప్రత్యేకముగా నున్నపుడు యెాగించరు ఇతర కారకగ్రహములతో గలిసి యున్న యెడల యెాగించును.గురుడు పంచమాష్టమాధిపతి యగుటచేత పంచమకోణధిపత్యముండుటవలన అషమాధిపత్యమున్నను కొంతవరకు స్వతంత్రముగా యెాగించును.
రవితోగాని,కుజునితోగాని  కలిసిన సంపూర్ణముగా యెాగించును,శనిషష్ఠ సప్తమాధిపతి యగుటచేత యిా శని యెగించడు.చంద్రుడు వ్యయస్థానధిపతి యగుటచేతను యెాగించరు.రవిచంద్రులు కలసిన రవిదశ యెగించదు.చంద్రదశ స్వల్పముగా యెగించును.రవికుజులు కలిసినయెడల రెండుదశలును గూడ సంపూర్ణముగా యెగించును.రవిబధులు కలిసిన రవిదశ కంటె బుధదశ  బాగుగా యెాగించును.రవిదశకూడ కొంతవరకు యెాగించును గాని రవి దశలో పాపభుక్తులయందీ సింహలగ్నజాతకునకు విశేషముగా శరీరపీ చేయును.రవిగురులు గలిసిన యెడల గురుదశ పూర్తిగా యెాగించును.రవిదశలో కొంతవరకు యెాగించి పిమ్మట యెాగభంగము గలుగును.రవిశనులు కలిసిన యెడల శనిదశలో స్వల్పముగా అప్పుడప్పుడు యెాగించును.రవిదశలో పూర్తగా యెాగభంగము గలుగును.
చంద్రకుజులు గలిసిన చంద్రదశ పూర్తిగాయెాగించును కుజదశ కొంతవరకు యెగించును గాని మధ్యమధ్య యెగిభంగముగూడ గలుగును.చంద్రబుధులు గలిసిన యెడలచంద్రదశ స్వల్పముగా యెగించును.బుధదశ యెాగించదు.మారకస్థానమందున్న యెడల మారకముగూడజేయును.చంద్రగురులు గలిసిన యెడల చంద్రదశ స్వల్పముగా యెగించును.గురుదశలో మధమధ్య యెగభంగము గలుగును చంద్రశుక్రులు కలిసిన యెడలఈ చంద్రదశ బాగుగా యెగించును.శుక్రదశ యెగించదు.కుజబుధులు కలిసినయెడల గురుదశ పూర్తిగా యెాగించును.శుక్రదశ యెగించదు కుజబుధులు కలిసిన యెడల ఈ రెండుదశలు గూడ పూర్తిగా యెగించును.
కుజగురులు కలిసిన యెడల గురుదశ  పూర్తిగా యెాగించును.కుజుదశ సామాన్యయెాగమునిచ్చుచు కుజశక్రులు గలిసిన యెడల శుక్రదశ విశేషముగా యెాగించును.స్త్రీ సంబంధయిన భాగ్యము లభించును.కుజశనులు గలిసిన యెడల శనిదశ  యెాగించునుగాని కళత్ర సౌఖ్యముండదు.బుధగురు గలిసిన యెడల గురుదశ పూర్తిగా యెాగించును.బుధదశలో యెాగము హెచ్టుటయు తగ్గుటయు గలుగును.బుధశక్రులు గలిసిన  యెడల మిక్కిలి యెాగజాతకమగును.ఈ రెండుదశలును యెాగించును.బుధదశలో మధ్యమధ్యను శరీరపీడ చేసి ధననష్టము గల్గును.గురు శుక్రులు గలిసిన యెడల గురుదశ బాగుగాయెాగించును శుక్రదశలో మధ్యను యెాగభంగముగలుగును.గురుశనులు గలిసిన యే దశయు గూడయెగించదు.విశేషముగాసంతానముగూడ నష్టమగును శనిశుక్రులు కలిసిన శనిదశ పూర్తిగా యెాగించును.శక్రదశలో మధ్యమధ్యను యెాగభంగముగలుగును.మెుత్తముమీద రవికుజబుధులు యెాగకారకులును శనిబధ శుక్రులు మారకము నిచ్చుగ్రహములును అగుదురు.
*సింహాది రవి ఫలము*

సింహము లగ్నమయి లగ్నమందు రవియున్న యెడల ద్వికళత్ర యెాగము గలుగును.లేని యెడల జారత్వము తప్పదు.కాని యిట్టిజాతకుడు రూపలక్షణము గలవాడు పేరు ప్రతిష్ఠలు గలవాడు అగును.
ద్వితీయమందు రవియున్న యెడల ఈ రవిదశ  స్వల్పముగా యెాగించును.గాని ఖర్చు విశేషముగా జేయును.
తృతీయమందు రవియున్న యెడల శరీర సౌఖ్యము లేనివాడును కపట స్వభావము గలవాడు అగును.ఈ రవిదశ యెాగించదు.
చతుర్థమందు రవియున్న యెడల ఈ రవిదశ పూర్తిగా యెాగించును.భూమి విద్య ధనము విశేషముగా సంపాదించి మిక్కిలి పేరు ప్రతిష్ఠలు గలవాడగును.
పంచమమందు రవియున్న మిక్కిలి భాగ్యమనుభవించును.స్వల్పముగా సంతానముండును.షష్ఠమమందు రవియున్న యెడల ఈ రవిదశ యెాగించదు.శత్రరోగ ఋణములు హెచ్చగా నుండును.
సప్తమమందు రవియున్న కళత్రసౌఖ్యము తక్కువగా నుండును.ఈ రవిదశ స్వల్పముగా యెాగించును.
అష్టమమందు రవియున్న  యెాగించదు పిత్రార్జితము స్వర్జితముగూడ ఖర్చుఅగును.వ్యవహారపు చిక్కులు విశేషముగా నుండును.
నవమమందు రవియున్న యెడల ఈ రవిదశ పూర్తిగా యెాగించును.గాని పితృసౌఖ్యము తక్కువగా నుండును.
దశమమందు రవియున్న యెడల ఉద్యోగస్థుడైనచో వాహన ముద్రాధికార సౌఖ్యము పూర్తిగా ననుభవించును.ఎవరికయినను ఈ దశలో మంచియెాగము గలుగును.
ఏకాదశమందు రవియున్న యెడల ఈ రవిదశలో విశేషధనలాభము గలుగును.పితృభాగ్యము విశేషముగా నుండును.
ద్వాదశ మందు రవియున్న యెడల ఈ రవిదశ  యెాగించదు.బాల్యమునందు వచ్చిన యెడల బాలరిష్టము గూడ గలుగును.మెుత్తముమిద యి సింహలగ్నజాతకునకు యిా రవి.కేంద్రకోణములయందె క్కడున్న యెాగము నిచ్చు వాడగును.
*సింహాది చంద్ర ఫలము*

సింహము లగ్నమయిలగ్నమందు చంద్రుడున్నచో పూర్ణచంద్రుడైన యెాగించును.మిక్కిలి పేరు ప్రతిష్ఠలుగలవాడు రూపలక్షణములు గలవాడు అగును.క్షీణచంద్రుడైనచో దీనికి వ్యతిరేకముగా నుండును.
ద్వితీయమందు చంద్రుడున్న యెడల అధిక ధనవ్యయము కలుగును.ధన సంపాదన స్వల్పముగా నుండును.పూర్ణచంద్రడైనచో కొంత మెరుగుగ నుండును.
తృతీయమందుచంద్రుడున్న యెడల సోదరీ భాగ్యమును భవించును.బాగుగా యెాగించును.
చతుర్ధమందు చంద్రుడున్న ద్వికళత్రయెాగము సంభవించును గాని కొంతవరకు యెాగమునిచ్చును.
పంచమమదు చంద్రుడున్న  పూర్ణచంద్రుడైనచో పూర్తిగా యెాగించును.సంతాన సౌఖ్యము అనుభవించును.
షష్టమమందు చంద్రుడున్న శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.పూర్ణచంద్రుడైన శత్రువులపై జయుమును పొందును.క్షీణచంద్రుడైనచో శత్రువులవలన పరాభవమును పొందును.
సప్తమమందుచంద్రుడున్న పూర్ణచంద్రుడైనచో యెాగ్యమైన కళత్రము లభించును.క్షీణచంద్రుడైనచో ద్వికళత్రయెాగము పట్టును.
అష్టమమందు చంద్రుడున్న ఏ చంద్రుడును యెాగించదు.బాల్యమందీదశవచ్చిన యెడల బాలారిష్టము కలుగును.
నవమమందు చంద్రుడున్న యెడల పూర్ణచంద్రుడైనచో మిక్కిలి బాగుగా యెాగించును.పితృభాగ్యము విశేషముగా నుండును.
దశమమందు పూర్ణచంద్రుడున్న విశేష భూమి ధనము సంపాదించును.మిక్కిలి ఆచారవంతుడగును.
ఏకాదశమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి ధనలాభము గలుగును.న్యాయముగా ధనమార్జించును గాని మిక్కిలి లోభియగును.
వ్యయమందు పూర్ణచంద్రుడున్న ఏసత్కార్యముజేసినను  విశేషముగా ధనముఖర్చుపెట్టును క్షీణచంద్రుడైనచో దుస్సాంగత్యము గలిగి దుర్వ్యయము చేయును. *సింహాది కుజ ఫలము*

సింహము లగ్నమయి లగ్నమందుకుజుడున్న యెాగించును.కాని శరీర సౌఖ్యము తక్కువగానుండును.
ద్యితీయమందు కుజుడున్న యెాగించునుగాని ద్యితీయ కళత్రయెాగము గలుగును.
తృతీయమందు కుజుడున్న యెడల ఈ కుజదశ  యెాగించదు.సోదరీనష్టము గలుగును.
చతుర్థమందు కుజుడున్న బాగుగా యెాగించును.మాతృసౌఖ్యము తక్కువగా నుండును.విద్యా విఘ్నము గలుగును.విశేషగా భూమి సంపాదించును.
పంచమమందు కుజుడున్న పూర్తిగా యెాగించును గాని స్వల్పముగా సంతాన విచారము గల్గును.
షష్ఠమమందు కుజుడున్న శత్రువుల వల్లను జ్ఞాతులవల్ల విశేషముగా భాగ్యము లభించును.
సప్తమమందు కుజుడున్న యెాగించును.కాని ద్యికళత్రయెాగము గలుగును.
అష్టమమందు కుజుడున్న యెడల పిత్రార్జితమంతయు ఖర్చుపెట్టును.ఈ కుజదశ యెాగించదు.కళత్రవిచారము,సంతానవిచారము మెుదలదునవి గలుగును.
నవమమందు కుజుడున్న విశేషభూమిసంపాదించును.గాని పితృసౌఖ్యము తరక్కువగా నుండును.
దశమమందు కుజుడున్న యెడల ఈ కుజదశబాగుగా యెాగించును ఉద్యోగస్థుడైనచో  వాహన ముద్రాధికార సౌఖ్యము  సంపూర్ణముగా అనుభవించును.
ఏకాదశమందు కుజుడున్న విశేషముగా భూమియు ధనము సంపాదించును.కాని మిక్కిలి అన్యాయముగా ధనమార్జించును.
వ్యయమందు కుజుడున్న యెాగించదు.మిక్కిలి దరిద్రమనుభవించును.
*సిహాది రాహా ఫలము*

సింహము లగ్నమయిలగ్న మందు రాహువున్న యెడల శరీరసౌఖ్యము లేనివాడు,కుటిలస్వభావము గలవాడును పట్టుదల గలవాడును అగును
ద్వితీయమందు రాహువున్న యెడల యిా రాహుదశలో విశేషముగా నలతజేయును.ధనహీనుడై మిక్కిలి కష్టముల నుభవించును.
తృతీయమందు రాహువున్న సంపూర్ణముగా యెాగించును.విశేషముగా భూమియు ధనమును సంపాదించును.
చతుర్థమందు రాహువున్న యెడల మాతృసౌఖ్యము లేనివాడగును.విద్యావిఘ్నము గలవాడగును భూవ్యయము జేయువాడును అగును.
పంచమమందు రాహువున్న సంతానము గలిగి నష్టపోవును.గాని యిా రాహుదశ బాగుగా యెాగించును.
షష్ఠమమందు రాహువున్న రాహుదశలో వారసత్వపు ఆస్తిగలియును.శత్రువులను జయించి వ్యవహారము లందు మిక్కిలి జయమును బొందును.
సప్తమమందు రాహువున్న కళత్ర నష్టము గలుగును.శరీరమునకు విశేషముగా నలత జేయును.
అష్టమమందు రాహువున్న శత్రరోగ ఋణమమలు హెచ్చుగా నుండును యిాదశ బొత్తిగా యెాగించదు.
నవమమందు రాహువున్న రాహుదశలో విశేష భూమి ధనము సంపాదించును.కాని కుటుంబసౌఖ్యము తక్కువగా నుండును.
దశమమందు రాహువున్న యిాదశ బాగుగా యెాగించును. కొంచెము యెాగ జాతకమయిన ఈదశ లో వేలకొలది ధనమార్జించును.
ఏకాదశ మందు రాహువున్న విశేష ధనమార్జించును కాని సంపాదించిన ధనమంతయు న్యాయముగానుండును.
వ్యయమందు రాహువున్న యెాగించదు.పిత్రార్జిత మంతయు ఖర్చుపెట్టును.
*సిహాది గురు ఫలము*

సింహము లగ్నమయి లగ్నమందు గురుడున్న యెడల ఆ గురుదశలో మి శ్రమఫలమిచ్చుని.
ద్యితీయమందు గురుడున్న  యెడల ఒకప్పుడు ధనమును ఒకప్పుడు ఋణమును గలిగియుండును కాని 2,3 విద్యలయందు ప్రవేశముండును.
తృతీయమందు గురుడున్న సోదరవృద్ధి విశేషముగానుండును. ఈ దశ సామాన్యముగా యెాగించదు.
చతుర్థమందు గురుడున్న భూమిసంపాదించును,తిరిగి ఖర్చు పెట్టును 2,3 విద్యలయందు ప్రవేశముగలవాడగును.కాని ఒక దానియందును పాండిత్యముండదు.
పంచమమందు గురుడున్న మిక్కిలి కష్టము మీద పుత్రసంతానము నిలుచును.
షష్ఠమమందు గురుడున్న అష్టకష్టములనుభవించును.
సప్తమమందు గురుడున్న మంచి కళత్రము లభించునుగాని రోగపీడితయై యుండును.
అష్టమమందు గురుడున్న మిశ్రమఫలము  నిచ్చును.కుటుంబము వృద్ధిగా నుండును.
నవమమందు గురుడున్న బాగుగా యెాగించును.ఆయుర్భగ్యములు సంపూర్ణముగానుండును.
దశమమందు గురుడున్న గురుదశలో సత్కార్యములు చేయును.మిక్కిలి ఖ్యాతి సంపాదించును.
ఏకాదశ మందు గురుడున్న మిక్కిలి న్యయముగా ధనసంపాదనచేయును.
ద్యాదశమందు గురుడున్న యెడల మంచి మంచి తీర్థయాత్రలు చేయును,ఆదాయముకంటెవ్యయము హెచ్చుగా నుండును.మెుత్తముమీద ఈ సింహలగ్నమునకు గురుడు యెక్కడున్నను విుశ్రమఫలమునే యిచ్చును.
*సింహాది బుధ ఫలము*

సింహలగ్నమయి లగ్నమందు బుధుడున్న ధనవంతుడు విద్యావంతుడు పేరు ప్రతిష్ఠలు గలవాడు అగును.
ద్వితీయమందు బుధుడున్న వేలకొలది ధనము నిలవయుండును.సుందరమయిన సుఖముగలవాడును వాచాలకుడు అగును.
తృతీయమందు బుధుడున్న స్వల్పముగా యెాగించును.సోదరీ సౌభాగ్యము బాగుండును.
చతుర్థమందు బుధుడున్న  యెడల మాతృసౌఖ్యము విద్య భూ ధన వాహనము ఇవి స్వల్పముగా నుండును.
పంచమమందు బుధుడున్న సంపూర్ణముగా యెాగించును.స్త్రీ సంతానము హెచ్చుగా నుండును.
షష్ఠమమందు బుధుడున్న యెాగించదు.తన ధనమంతయు శత్రువుల పాలగును.
సప్తమమందు బుధుడున్న యెడల ఈ బుధదశ యెాగించును గాని మధ్య మధ్య నలతజేయును.
అష్టమందు బుధుడున్న ఋణము హెచ్చుగా నుండును.
నవమమందు బుధుడున్న యెడల శత్రువులను జయించి వారి ధనమంతయును సంపాదించును.
దశమమందు బుధుడున్న విశేష ధనవంతుడగును.మిక్కిలి ఖ్యాతి సంపాదించును.
ఏకాదశమందు బుధుడున్న యెడల ఆ బుధదశలో ఏకార్యము ప్రయత్నించినను పూర్తిగా నెరవేరును.
ద్వాదశమందు బుధుడున్న యెాగించదు.విశేష ధనవ్యయ మగును.
*సంహాది శని ఫలము*

సింహము లగ్నమయి లగ్వమందు శని యున్న కురూపి రోగశరీరము గలవాడు,మందబుద్థిగలవాడు అగును.
ద్యితీయమందు శనియున్న ధనము లేనివాడు,సంతానవిచారము గలవాడు,కళత్ర సౌఖ్యము లేనివాడు అగును ఒకానొకప్పుడు ఈ శని మారకము గూడచేయును.
తృతీయమందు శనుయున్న జ్ఞాతివృద్ధి విశేషముగానుండును ఋణగ్రస్తుడగును.మిక్కిలి యెాగ్యమైన కళత్రము లభించును.సోదరనష్టము గలుగును.
చతుర్ధమందు శనియున్న మాతృసౌఖ్యము,విద్య,భూమి,వాహనము యివి స్వల్పముగా నుండును.
పంచమమందు శనియున్న దశ యెాగించునుగాని సంతానము విశేషముగా నష్టమగును.
షష్ఠమమందు శనియున్న బాగుగా యెాగించును.శత్రు సంబంధమయిన ఆస్తిగూడ కొంత కలియును.
సప్తమమందు శనియున్న కళత్రము స్థూలకాయము గలదియగును.ఈ దశ మిశ్రమఫలము నిచ్చును.
అషష్టమందు శనియున్న యెడల యిా శనిదశలో అనేక కష్టనష్టములు దేహఅనారోగ్యము ఔషదసేవయు కలుగుగలదు.
ఏకాదశమందు శనియున్న  యెడల ఈ శనిదశలో విశేషముగా భూమియు ధనమును సంపాదించును.
ద్యిదశమమందు శనియున్న యెడల శనిదశ యెాగించదు.అనేక కష్టములనుభవించును.ఈ తనికి మరి యెుక పాపగ్రహసంబధ మున్న యెడల కారగృహ పాప్తిగూడ గలుగును.
*సంహాది కేతు ఫలము*
సంహములగ్నమందు లగ్నమందు కేతువున్నబాల్య దశలోబాలారిష్టముచేయును. ఈ కేతుదశ యెాగించదు.
ద్వితీయమందు కేతుయున్న యడల శరీరపీడ చేయును ధనవ్యయమగును.
తృతీయమందు కేతవున్న ఈ కేతు దశపూర్తిగా యెాగించును విశేషభూమి ధనము సంపాదించును.
చతుర్థమందు కేతువున్న మాతృ సౌఖ్యము,విద్య,భూమి,వాహనము యివి స్వల్పముగా నుండును.
పంచమమందు కేతువున్న  సంతానము వలన సౌఖ్యముండదు కాని యిా కేతుదశ యెాగించును.
షష్ఠమమందు కేతువున్న యెాగించదు.అష్టకష్టములును భవించును.
సప్తమమందు కేతువున్న శరీరమునకు నలతజేయును కళత్రసౌఖ్యము తక్కువగా నుండును.
అష్టమమందు కేతువున్న యెగించదు.మిక్కిలి చిక్కులునుభవించును.
నవమందు కేతువున్న బాగుగా యెాగించును.విశేషముగా భూమి  ధనము సంపాదించును.
దశమమందు కేతువున్న యెడల అనాచారముగల వాడుగును.ఈ కేతుదశ స్వల్పముగా యెాగించును.
ఏకాదశమందు కేతువున్న యెడల ఈ కేతుదశ పూర్తిగా యెాగించును.మిక్కిలి పేరు ప్రతిష్ఠలు సంపాదించును.
వ్యయమందు కేతువున్న యెడల యిా కేతుదశలో విశేష తీర్థయాత్రలు చేయును.విశేష సత్కార్యములు గూడ జేయును.                  *సింహాది శుక్ర ఫలము*

సింహము లగ్నముయి లగ్నమందు శుక్రుడున్న బాగుగా యెాగించును.తన వంశములో పేరు ప్రతిష్ఠలు గలవాడగును.
ద్వితీయమందు శుక్రుడున్న చాలభాగము కుటుంబనష్టము గలుగును.ఈ దశయెాగించదు.
తృతీయమందు శుక్రుడున్న శుక్రదశ పూర్తి గాయెాగించును.ఆయుర్భగ్యములు సంతానము మిక్కిలి హెచ్చుగా నుండును.
చతుర్థమందు శుక్రుడున్న  విద్యవంతుడు భూసంపాదన పరుడు వాహన సౌఖ్యము గలవాడు పరస్త్రీలోలుడు అగును.
పంచమమందు శుక్రుడున్న స్త్రీ సంతానవృద్ధిగలవాడు బుద్ధిమంతుడు ఖ్యాతిగల పురుషుడు అగును.ఈ శుక్రదశ పూర్తిగా యెాగించును.
షష్ఠమందు శుక్రుడున్న శత్రురోగ ఋణముల వలన భాధ పడునమ.
సప్తమమందు శుక్రుడున్న యెగించును గాని ఆ దశలో విశేషముగా శరీరమునకు నలత జేయును.
అష్టమమందు శుక్రుడున్న శుక్రదశలో సమస్త సౌఖ్యములు  అనుభవించును.
నవమమందు శుక్రుడున్న  పితృభాగ్యము హెచ్చుగానుండును. ఈ దశ యెాగించును.
దశమమందు శుక్రుడున్న మిశ్రమఫలము నిచ్చును.
ఏకాదశ శుక్రుడున్నయెడల ఈ శుక్రదశ బాగుగా యెాగించును. విశేష ధనమార్జించును.
ద్వాదశమందు శుక్రుడున్న విశేష ధనము సంపాదించి  సత్కార్యముల క్రింద వినియెాగించును.
మెుత్తము మీద సంహలగ్న జాతకునకు శుక్రుడేరాశి యందున్న విుశ్రమ ఫలమును ఇచ్చును.

1 comment:

  1. Thanks for sharing these blogs. It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.

    ReplyDelete