కన్యలగ్నమందు భాగ్య రాజ్యాధిపతులగు బుధశుక్రులు ఏస్థానమందు కలిసియున్నను లేక పరివర్తనముగా నున్నను ఆ రెండు దశలు సంపూర్ణముగా యెాగించును.కన్య మీనరాశులయందు గలిసి యున్న మధ్యమధ్య యెాగభంగముగలుగును.గురుడు ఈ గ్రహములతో గలిసియున్న యెడల మిక్కిలి విద్యా వంతుడై దేశప్రఖ్యాతి సంపాదించును.రవి చంద్రదశ యెాగించదు.రవిదశ యెాగించును.
రవికుజులు గలిసిన యెడల షష్ఠాష్టమవ్యయ స్థానముల యందు విశేష యెాగమును తక్కిన స్థానములయందు సామాన్య యెాగమును యిచ్చెదరు.
రవిబుధులు కలిసిన పూర్తిగా యెాగించును.బధదశ సామాన్యముగా యెాగించును.
రవిగురులు గలిసిన యెడల రవిదశ మంచియెాగమును గురుదశలో ధనవ్యయమును గలుగును.
రవిశనులు కలిసిన యెడల ఈ రెండుదశలును యెాగించును.
చంద్రకుజులు కలిసిన కుజదశ సామాన్యంగా యెాగించును చంద్రదశలో మిక్కిలి కష్టములు గలుగును.
చంద్రబుధులు గలిసిన యెడల రెండుదశలు గూడ బాగుగా యెాగించును.
చంద్రగురులు గలిసిన యెడల ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.రెండుదశలు కూడ యెగించును.
చంద్రశుక్రులు గలిసిన చంద్రదశ అఖండ రాజయెాగము గలుగును.శుక్రదశ కొంచెము తక్కువగా యెాగించును.
చంద్రశనులు గలిసిన రెండు దశలు సామాన్యముగా యెగించును.
కుజ బుధులు గలిసిన యెడల కుజదశలో రాజయెాగము నిచ్చును.బుధదశలో యెాగభంగము కలుగును.
కుజగురులు కలిసిన యెడల కుజదశలో విశేష యెాగమునిచ్చును,గురుదశలో యెాగభంగము కలుగును.
కుజశుక్రులు గలిసిన కుజదశలో విశేషభాగ్యమనుభవించును.శుక్రదశలో బాలారిష్టాది చాలకష్టములనుభవించును.
కుజశనులు గలిసిన యెాగభంగము గలుగును.రెండు దశలలోను అవమానములు కూడ గలుగును.
బుధ గురులు గలిసిన యెడల రెండుదశలును గూడ యెాగించును.అట్టిజాతకుడు రూపలక్షణములు గలవాడును ఆయుర్భాగ్యములు గలవాడును పండితుడు అగును.
బుధశుక్రులు గలిసిన అఖండమైన రాజయెాగము నిచ్చును.రెండుదశలు పూర్తిగా యెాగించును.
బుధ శనులు గలిసిన శనిదశలో విశేషయెాగము గలుగును.బుధదశలో మధ్యమధ్య యెాగభంగము గల్గును.
గురుశుక్రులు గలిసిన రెండుదశలును కూడబాగుగా యెాగించును.గాని కుజదశ కంటె గురుదశ విశేష యెాగమునిచ్చును.
గురుశనులు గలిసిన రెండుదశలు మిశ్రమ ఫలము నిచ్చును.
శుక్ర శనులు గలిసిన శనిదశ పూర్తిగా యెాగించును.శుక్రదశ మిశ్రమఫలము నిచ్చును.
మెుత్తము మీద ఈ కన్యాలగ్నమునకు నాలుగు శుభగ్రహములలోను యే జంట గలిసిన యెాగించును.తక్కిన వారికంటె బుధశుక్రులు గలియుట విశేష రాజయెాగము.
*కన్యాది రవి ఫలము*
లగ్నము కన్యయై లగ్నమందు రవియున్న రవిదశ స్వల్పముగా యెాగించును.విశేషముగా ఖర్చుచేయు జాతకమగును.
ద్వితీయమందు రవియున్న అన్యాయముగా ధనమార్జించి ఆ ధనమంతయు దుర్వ్యయము చేయును.
తృతీయమందు రవియున్న స్వల్పముగా యెాగించును.
చతుర్థమందు రవియున్న మాతృసౌఖ్యము తక్కువగా నుండును.ఈ రవిదశ బాగుగా యెాగించును.
పంచమమందు రవియున్న ఒక పుత్రసంతానము వుండును.ఈ రవిదశ బాగుగా యెాగించును.
షష్ఠమమందు రవియున్న శత్రు సంబంధమయిన ఆస్తి కలిగించును.ఈ దశబాగుగా యెాగించును.
సప్తమమందు రవియున్న కళత్రసౌఖ్యము తక్కువగా నుండును.ఖర్చు విశేషముగా నుండును.
అష్టమమమదు రవియున్న రవిదశ యెాగించదు గాని సత్కార్యములు చేయచు విశేష ఖ్యాతి సంపాదించును.
నవమమందు రవియున్న పుత్రవిచారము గల్గును జాతకుడు లోభియగును.
దశమమందు రవియున్న బాగుగాయెాగించును.తీర్థ యాత్రలు జేయును.
ఏకాదశ మందు రవియున్న దశబాగుగా యెాగించిను.అన్యాయముగా ధనార్జన చేయును.
ద్వాదశమందు రవియున్న యెడల అనేక దుష్కార్యములు చేయుచు విశేష ధనము వృధాగా ఖర్చు పెట్టును.
మెుత్తము మీద యిారవి యే స్థానమందున్నను ఒంటరిగా యున్నప్పుడు సామాన్య యెాగము నిచ్చును.అదిగాక యేస్థానమందుండునో ఆ స్థాధిపతి యెుక్క ఫలమున యే గ్రహముతో గలిసియుండునో ఆ గ్రహము యెుక్క ఫలమును ఇచ్చును.
*కన్యాది చంద్ర ఫలము*
కన్యలగ్నమై లగ్నమందు పూర్ణచంద్రుడున్న యెడల ఈ చంద్రదశలో విశేష ధనమార్జించును అట్టి జాతకుడు పేరు ప్రతిష్ఠలు గలవాడగును రూప లక్షణములు గలవాడు అగును.క్షీణచంద్రుడైనచో స్వల్పముగా యెాగించును.
ద్వితీయమందు పూర్ణచంద్రుడున్న యిాచంద్రదశలో విశేషధన మార్జించును సుందరమైన ముఖముగల వాడును,మంచివాక్కు గలవాడు.అగును క్షీణచంద్రుడున్నచో సామాన్య యెాగము గలవాడగును.
తృతీయమందు పూర్ణచంద్రుడున్న ఈ దశస్వల్పముగా యెాగించును.క్షీణచంద్రుడున్న స్వల్పముగా ధనము సాంపాదిమచును.
పంచమమందు పూర్ణచంద్రుడున్న స్త్రీ సంతానము విశేషముగా నుండును.ఈ చంద్రదశ సంపూర్ణముగా యెాగించును క్షీణచంద్రున్నచో స్వల్పముగా ధనమార్జించును.
షష్టమమందు పూర్ణచంద్రుడున్న ఋణగ్రస్థుడగును.క్షీణచంద్రుడున్న అప్పుగూడ దొరుకుట కష్టము.
సప్తమమందు పూర్ణచంద్రుడున్న చంద్రదశ బాగుగా యెాగించును.తీర్థయాత్రలు చేయును.క్షీణచంద్రడున్న స్వల్పయెాగము నిచ్చును.
అష్టమమందు పూర్ణచంద్రుడున్న దశబాల్యమందు వచ్చిన బాలారిష్టము గలుగును క్షీణచంద్రుడున్న విశేషముగా నలతచేసి వెంటనే నెమ్మదించును.
నవమమందు పూర్ణచంద్రుడున్న విశేషధనమార్జించి నిలువజేయును.ఈ దశపూర్తిగా యెాగించును.క్షీణచంద్రుడైన స్వల్పయెాగమిచ్చును.
దశమమందు పూర్ణచంద్రుడున్నచో అనాచార ప్రవర్తకుడగును.
ఏకాదశమందు పూర్ణచంద్రుడున్న వేలకొలది ధనమార్జించును.క్షీణచంద్రుడున్న అన్యాయముగా ధనమార్జించును.
ద్వాదశమందు పూర్ణచంద్రుడున్న చంద్రదశ అంతయు సత్కాథాకాల క్షేపముతో జరుగును.క్షీణచంద్రుడైన దుర్జన సవాసము కలుగును.
*కన్యాది కుజ ఫలము*
కన్యలగ్నమయి లగ్నమందు కుజుడున్న శరీర సౌఖ్యము లేనివాడు,అష్టకష్టములు ననుభవించువాడును.అగును.
ద్వితీయమందు కుజుడున్న ధనములేని కళత్ర విచారము గలవాడును అగును.
తృతీయమందు కుజుడున్న కుజదశ స్వల్పముగా యెాగించును.కొంత భూమి సంపాదించును.
చతుర్థమందు కుజుడున్న మాతృసౌఖ్యము విద్యా,వాహనము ఇవి తక్కువగా నుండును.
పంచమమందు కుజుడున్న సంతాన విచారము గలుగును.పూర్ణాయుర్దాయము గలవాడుగును.
షష్ఠమందు కుజుడున్న శత్రువులను జయించును.ఈ కుజదశ బాగుగా యెాగించును.
సప్తమమందు కుజుడున్న కళత్రవిచారము గులుగును.ఒకప్పుడీ కుజుడు మారకము జేయును.
అష్టమమందు కుజుడున్న మిక్కిలి కష్టము లనుభవించును.
నవమమందు కుజుడున్న పితృవిచారము గలవాడగును.
దశమమందు కుజుడున్న ఆ చారహీనుడు నీచవృత్తి జీవనుడగును.
ఏకాదశమందు కుజుడున్న విశేష సోదర నష్టముగల వాడను అగును.
ద్వాదశమందు కుజుడున్న అంగ విహీనుడగును.మెుత్తముమీద ఈ కుజదశలో శత్రురోగములు హెచ్చుగానుండును.ఈ కుజుడు మరియెుక పాపగ్రహముతో గలిసిన ఈ కుజదశలో కఠినమైన శిక్షలననుభవింపజేయును.దుర్మార్గుడై అపఖ్యాతి పాలగును.అస్త్రశస్త్రాదుల వలన నొప్పులు బలవన్మరణము గూడ గలుగును.ఈ కన్యాలగ్నమునకు కుజుడెక్కడున్నను యెాగించదు.
*కన్యాది రాహు ఫలము*
కన్యలగ్నమై లగ్నమందు రాహువున్న ఈ రాహుదశ యెాగించును.అట్టి జాతకుడు వ్యవహారమందు మిక్కిలి నేర్పరియై విశేషధనము సంపాదించును.
ద్వితీయమందు రాహువున్న ఈ రాహుదశ యెగించదు.ఎప్పుడు ధనము లేక బాధపడుచుండును.
తృతీయమందు రాహువున్న రాహుదశ బాగుగా యెగించును.అన్యాయముగా ధనము సంపాదించును నీచవృత్తివలన జీవనము చేయును.
చతుర్ధమందు రాహువున్న దశయెాగించదు,మాతృవిచారముగాని పితృవిచారముగాని జరగును.
పంచమమందు రాహువున్న యాదశ యెాగించదు గాని సంతానము గలిగి నష్టపోవును.
షష్ఠమమందు రాహువున్నయెడల శత్రువుల యెుక్కగాని వారసులయెుక్కగాని ఆస్థి కొంతకలియును.
సప్తమమందు రాహువున్న దశయెాగించును కళత్రసౌఖ్యము తక్కువగా నుండును.జాతకున కప్పుడు నలతజేయును.
అష్టమమందు రాహువున్న దశలో గర్భదరిద్రమనుభవించును,అష్టకష్టములు పొందును.
నవమమందు రాహువున్న యెడల పితృకర్మచేయును గాని ఈ రాహుదశ బాగుగ యెాగించును.
దశమమందు రాహువున్న దశలో తీర్థయాత్రలు వగైరాలు చేయును.సామాన్యయెాగమునిచ్చును.
ఏకాదశమందు రాహువున్న మంచిలాభములు సుఖసంతోషములు అధిక ధనలాభములు కలుగును. ఈదశ యెాగించగలదు.
ద్వాదశమందమ రాహువున్న యెల్లప్పుడును అపరమితమయిన ఖర్చుచేయును.పిత్రార్జితము స్వర్జితము గూడఖర్చు పెట్టును.
మెుత్తము మీద ఈ రాహుదశ అయాస్థానముల యెుక్క,స్థానాధిపతుల యెుక్క సంబంధస్థితుల ననుసరించి యెాగమునిచ్చును.
*కన్యాది గురు ఫలము*
కన్యలగ్నమయి లగ్నమందు గురుడున్న యెడల ఈ గురుదశ సంపూర్తిగా యెాగించును.ఆ యుర్భాగ్యములు గలవాడగును.
ద్వితీయమందు గురుడున్న యెడల మెుట్టమెుదట యెాగించి చివర మారకము జేయును.
తృతీయమందు గురుడున్న యెడల ఈ గురుదశ యెాగించదు.బాల్యమున వచ్చినచో బాలారిష్టము గల్గును.
చతుర్థమందు గురుడున్న మాతృసౌఖ్యముగలవాడు పండితుడు,వాహనసౌఖ్యము గలవాడు,విశేషభూమి సంపాదించువాడు అగును.
పంచమమందు గురుడున్న ఈ గురుదశలో అనేక కష్టములు లనుభవించును.
షష్ఠమమందు గురుడున్న ఈ గురుదశ యెాగించదు.పిత్రార్జితము ఖర్చుపెట్టును.
సప్తమమందు గమరుడున్నచో రోగశరీరము గలదియు,పతివ్రతయు,రూపవతి యునగు భార్యలభించును.
అష్టమమందమ గురుడున్న యెాగించదు.కుటుంభ వృద్థిగలవాడు దరిద్రడు అగును.
నవమమందు గురుడున్నచో పిత్రార్జితము స్వార్జితము హెచ్చుగా నుండును.తండ్రి చాలాకాలము జీవించును.
దశమమందు గురుడున్న మంచికర్మలు చేయువాడును పేరు ప్రతిష్టలు గలవాడు అగును.
ఏకాదశమందు గురుడున్న గురుదశలో విశేషభాగ్య వంతుడగును.
ద్వాదశమందు గురుడున్న యెాగించదు.మెుత్తమీద ఈ గురుడు ఏస్థానమందున్నను యెాగించును.
*కన్యాది శని ఫలము*
కన్యాలగ్నమై లగ్నమందు శనియున్న శనిదశ సామాన్యముగా యెాగించును.శరీరసౌఖ్యము లేనివాడు శత్రువృద్ధి గలవాడు అగును.
ద్వితీయమందు శనియున్న దశ బాగుగా యెగించును గాని సంతాన విచారము గలుగును.
తృతీయమందు శనియున్న యెాగించదు.సామాన్య విద్యావంతుడగును.పిత్రార్జితము ఖర్చు పెట్టును.
చతుర్ధశని పుత్రకశత్ర వితవిభవములుండును.పరస్త్రీధనము పొందును.సామాన్య విద్య పొందును.పిత్రార్జితం వ్యయమగును.
పంచమమందు శవియున్న శనిదశ బాగుగా యెగించును.పుత్రసంతాన ముండదు స్త్రీసంతానము నిలుచును.
షష్ఠమందు శనిదశ యెాగించదు శత్రురోగఋణములు హెచ్చుగా నుండును.
సప్తమమందు శనియున్న శనిదశ కళత్రవిచారము గలుగును.
అష్టమమందు శనియున్న యెాగించదు.అష్టకష్టములనుభవించును.
నవమమందు శనియున్న యెడల పితృసౌఖ్యము తక్కువగా నుండును.ఈ శనిదశలో స్వార్జితమువలన భాగ్యవంతుడగును.
దశమమందు శనియున్న స్వల్పముగా యెాగించును ఆచారము తక్కువగా నుండును సేవకావృత్తి వలన జీవనము చేయును.
ఏకాదశ మందు శనియున్న పూర్తిగా యెాగించును.విశేషభాగ్యమనుభవించును.
ద్వాదశమందు శనియున్న శనిదశ యెాగించదు.దుష్ప్రవర్తన గలిగి దుర్వ్యయము చేయును.
మెుత్తమీద కన్యాలగ్నమునకు శని యేస్థానమందున్నను మిశ్రమ ఫలమునిచ్చును.
*కన్యాది బుధ ఫలము*
కన్యాలగ్నమయి లగ్నమందు బుధుడున్న బుధదశ పూర్తిగా యెాగించును.ఈ దశలో విశేషఖ్యాతియు భూమిధనము సంపాదించును.
ద్వితీయమందున్న బుధుడున్న ధనవంతుడును,వాచాలకుడును.సుందరమైన ముఖముగలవాడు అగును.ఈ బుధదశ బాగుగా యెాగించును.
తృతీయమందు బుధుడున్న ఈ దశ యెాగించదు.సోదరీమణులు విశేషముగా నష్టమగునుదురు.
చతుర్థమందు బుధుడున్న విద్యావంతును,భూసంపాదకుడును,మాతృసౌఖ్యము గలవాడు,మంచి మేడలు గలవాడు అగును.
పంచమమందు బుధుడున్న పుత్రసంతానము స్వల్పముగా నుండును.ఈ బుధుదశలో వేలకొలది ధనామర్జించి నిలవజేయును.
షష్ఠమందు బుధుడున్న యెగించదు.ఆయుర్భాగ్యములు స్వల్పముగానుండును.
సప్తమమందు బుధుడున్న నీచకావున యెాగించుదు.ఈ దశలో కష్టనష్టముగలుగును.కొంత చికాకుగలుగును.
అష్టమమందు బుధుడున్న యెాగించదు.పిత్రార్జిత మంతయు ఖర్చుపెట్టును.
నవమమందు బుధుడున్న ఈ బుధదశలో విశేష భాగ్యమనుభవించును.
దశమమందు బుధుడున్న యెడల న్యాయమైన వృత్తి వలన జీవనము జేయును.అచారవంతుడగును
ఏకాదశమందు బుధుడున్న మిక్కిలి ధనము సంపాదించును.చాలాధనము నిలువ చేయును.
వ్యయమందు బుధుడున్న యెడల ఆజన్మాంతము ఋణము చేయును.మెుత్తముమీద ఈ బుధుడెక్కడున్నను యెాగించును.
*కన్యాది కేతు ఫలము*
కన్యలగ్నమయి లగ్నమందు కేతువున్న బాల్యమందీదశ వచ్చినయడల తప్పకబాలారిష్టములు గలుగును.ఈ కేతుదశ యెాగించదు.
ద్వితీయమందు కేతువున్న కేతుదశలో దరిద్రము చేతమిక్కిలి బాధపడును.
తృతీయమందు కేతువున్న కేతుదశ సంపూర్ణముగా యెాగించును.విశేషభూమి సంపాదించును.
చతుర్థమందు కేతువున్న యెడల మాతృసౌఖ్యము తక్కువ గలవాడును.విద్యావిఘ్నము గలవాడును భూవ్యయము చేయువాడును అగును.
పంచమమందు కేతువున్న యెడల పుత్రసంతానము గలిగనష్టపోవును.స్త్రీసంతానము వలనసౌఖ్యపడును.
షష్ఠమందు కేతువున్న దశలో విశేషభూమి ధనము సంపాదించును.
సప్తమమందు కేతువున్న మిక్కిలి పెంకితనము గలభార్య లభించును.కళత్రమునకు సౌఖ్యముండదు.
అష్టమమందు కేతువున్న కేతుదశలో శత్రు,రోగ ఋణములు హెచ్చుగానుండి మిక్కిలి కష్టపడును.
నవమమందు కేతువున్న పితృసౌఖ్యము తక్కువగా నుండును.ఈ కేతుదశ పూర్తిగా యెాగించును.
దశమమందు కేతువున్న దేవ బ్రాహ్మణశక్తి హెచ్చుగానుండును.మంచిమంచి సత్కార్యములు చేయును.
ఏకాదశమందు కేతువున్న భూమి ధనము సంపాదించును.
ద్వాదశమందు కేతువున్న యెడల మిక్కిలి పారమార్థికచింత గలవాడుగును.మిక్కిలి ధనవ్యయము చేయును.
*కన్యాది శుక్ర ఫలము*
కన్యాలగ్నమయి లగ్నమందు శుక్రుడున్న ఆశుక్రునకు నీచభంగ రాజయెాగము గలిగినయెడల ఆశుక్రదశలోనే యెాగించును.
ద్వితీయమందు శుక్రుడున్న మిక్కిలి ధనవంతుడును,వాచాలకుడును కుటుంబవృద్థి గలవాడును అగును.
తృతీయమందు శుక్రుడున్న శుక్రదశ సామాన్యముగా యెాగించును.
చతుర్థమందు శుక్రుడున్న విశేషభూజాతకుడును విద్యావంతుడును అగును.
పంచమమందు శుక్రుడున్న విశేషభాగ్యముగలుగును.ఈ శుక్రదశ బాగుగా యెాగించును.మిక్కిలి యెాగ్యసంతానము కలుగును.
షష్ఠమమందు శుక్రుడున్న యెాగించదు.ఋణజాతకమగును.
సప్తమమందు శుక్రుడున్న గొప్ప జాతకుడు,భాగ్యవంతుడు అగును.
అష్టమమందు శుక్రుడున్న యెాగించదు.కుటుంబవృర్థి దారిద్యమనుభవించును.
నవమమందు శుక్రుడున్న పిత్రార్జితము స్వార్జితము హెచ్చుగానుండి మిక్కిలి భాగ్యవంతుడగును.
దశమమందు శుక్రుడున్న యిా శుక్రదశలో రాజయెాగముగలుగును.మంచిమంచి సత్కార్యములు చేసి విశేషఖ్యాతి సంపాదించును.
ఏకాదశమందు శుక్రుడున్న మిక్కిలి న్యాయముగా విశేషధనము సంపాదించును.
ద్వాదశమందు శుక్రుడున్న యిాదశ యెాగించదు.ఖర్చు విశేషముగానుండును.
మెుత్తమీద యిా కన్యాలగ్నమునకు శుక్రుడు యెాగకారకుడగును.
How to to distinguish Poorna Chandra and Kshina Chandra?
ReplyDeleteIs it with Angle of Moon or with Birth Thidhi?
Very good article thank you for post, It may helpful to who needs changes in life problems. Keep on update all your service. For best solution of Horoscope predictions you can consult with Pandit Jagannath Guru is a Famous Astrologer in Bangalore.
ReplyDelete