వృషభ లగ్నమునకు శనియెుక్కడే రాజయెాగకారకుడు.ఈ శని రవితో కలిసి కేంద్రకోణములు యందున్న యెడల రవిదశగూడ ప్రబలముగా యెాగించును.కేవలము శనియెుక్కడే యెాగమునిచ్చునుటకు సమర్ధుడగును.కాని ఈ శనిరవితోగాని బుధునితోగాని గలిసిన యెడల అఖండ యెాగమునిచ్చును.చంద్రుడు తృతీయ ధిపతియైనను శనితో గలిసిన యెడల చంద్రదశ బాగుగా యెాగించును శని చంద్ర సమాగమయెాగము మంచిది.కనుక యే లగ్నమునకైనను యిా శని చంద్రులు గలిసి యెడల యెాగించును,అట్టి విషయములో వృషభ చంద్రుడు గలిసియున్న యెడల ఆ చంద్రదశ నిస్సందేహముగా యెాగించును.ఒకవేళ చంద్రునితో గలిసిన యెడల శనిదశ యెాగించక పోవచ్చును.గాని శనితో గలిసిన చంద్రుడు మాత్రము తప్పక యెాగించును.
శని శుక్రులు కలిసిన యెడల శనిదశలో కొంతవరకు యెాగముగలిగి చివరకు యెాగభంగము గలుగును.శుక్రదశ స్వల్పముగా యెాగించును.
శనిశుక్రులు కలిసిన యెడల కుజదశ బాగుగా యెాగించును.శనిదశ కొంతవరకు యెాగించి పిమ్మట విశేషముగా శరీరపీడ గలుగజేయును.
శని కుజులు మారకస్థానమందు గలిసిన యెడల శనిదశలో తప్పక మారకము జరుగును.
శని గురులు కలిసిన యెడల యెాగభంగము గల్గును.గురుదశ పూర్తిగా యెాగించును.
మెుత్తం మీద వృషభలగ్నజాతకునకు శనిరవులును శనిబుధులును శనికుజులును రవి బుధులును యిా జంట గ్రహములలోనేవి కలిసియున్నను రాజయెాగము గలుగును.
గురుబుధులు కలిసి కేంద్రములయందుగాని కోణములయందుగాని ధనస్థానమందుగాని ఉన్నయెడల విశేష ధనము నిలువ వుండును.
రవిగురులు కలసిన యెడల రవిదశ యెాగించదు.గురుదశ యెాగించును.
రవి శుక్రులు గలసిన శుక్రదశ యెాగించును.రవి దశలో ఋణము పెరుగును.
చంద్ర బుధులు గలిసిన యెడల చంద్రదశ యెాగించును కుజ బుధులు గలిసిన యెడల కుజదశ యెాగించును.బుధదశలో కొంతవరకు యెాగము గలిగిన పిమ్మట భంగము గలుగును.
బుధ శుక్రులు గలిసిన శుక్రదశ,శని శుక్రులు గలసిన శుక్రదశ యెాగించును.శని దశలో యెాగభంగముగలుగును.
ఈ వృషభలగ్నజాతకునకు పైన వ్రాసినది గాక తక్కిన జంట గ్రహములు యేవి కలిసియున్నను రెండు గ్రహములు గూడాయెాగించవు.
శని బుధులుగాని,శని కుజులుగాని,గలిసిన యడల శనిదశ కొంత వరకు యెాగించి పిమ్మట మారకము చేయును.
వృషభలగ్నమునకు తృతీయాధిపతి యగుటచేత చంద్రుడును,షష్ఠాధిపతి యగుటచేత శుక్రుడును,అష్టమలాభాధిపతియగుటచేత గురుడును యిా 3 గ్రహములును పాపఫలము నిచ్చెదరు ఒకప్పుడు మారకముగూడ జేయుదురు.ఈ 3 గ్రహములలో నే గ్రహముతో నైనను శనికలిసిన యెడల యెాగమునకు బదులు మారకమును కష్టఫలమును నిచ్చును.
ఈ లగ్నమునకు చంద్రబుధ కుజశుక్ర గురులు యిా 5 గ్రహములు మారక లక్షణములు గలవై యుండుటచేత,ఈ 5 గ్రహములలో నేగ్రహము మారక స్థానమందున్నను తప్పక మారకమును చేయును. *వృషభస్థ రవి ఫలము*
వృషభలగ్న జాతకునకు లగ్నమందు రవియున్న యెడల మంచి రూపసియు,మేహశరీరము గలవాడును.సాత్వకస్వభావము గలవాడును నగును.రవిదశ పూర్తిగా యెాగించును.
ద్వితీయమందు రవియున్న యెడల ధనసంపాదన చేయునుగాని యెంత ధనము సంపాదించినను నిలువయుండదు.ఈ రవి స్వల్పముగా యెాగించును ఈ రవిదశలో నేత్రములకు స్వల్పముగా నలతజేయును.
తృతీయమందు రవియున్న మిక్కిలి ఖ్యతి గల ఒక్క సోదరుడు ఉండును. ఈ రవి యెాగించునుగాని ఆ యెాగము చివర వరకు నిలబడదు.చతుర్దమందు రవి యున్న వాహన ముద్రాధికారములతో యుద్యోగము చేయును.పంచమమందు రవియున్న ఒక్కడే పుత్రుడుండును ఈ రవి సంపూర్ణముగా యెాగించును.శతృస్థానమందు రవి యున్న యెడల అదివరకున్న యెాగము చెడిపోవును.
విశేషభూవి వ్యయముగును.శతృరోగఋణములు హెచ్చును.
కళత్రస్థానమందు రవియున్న రూపవతి,చురుకైన బుద్దిగలదియునగు కళత్రము లభించును.రవిదశలో కళత్రమునకు కొద్దిగా నలతజేయును.
అష్టమమందు రవియున్న మంత్రారిష్టము,శరీరపీడ,ధనవ్యయము మెుదలగు కష్టములు సంభవించును.
భాగ్యమందు రవిచే శతృవుల వల్లను జ్ఞాతుల వల్లను మంచి భాగ్యము గలుగును.
దశమమందు రవియున్న మంచి తీర్థయాత్రలు సత్కార్యములు చేయును.
ఏకాదశమందు రవియున్న విశేషధనలాభము పేరు ప్రతిష్ఠలు పొందును.వ్యయస్థానమందు రవియున్న మంచి సత్కార్యములు చేయును.విశేషముగా ధనముఖర్చు పెట్టును.
ఈ రవిదశలో నెప్పుడును సత్కాధా కాలక్షేపము చేయుచుండును.
*వృషభస్థ చంద్ర ఫలము*
వృషభలగ్నమందు పూర్ణచంద్రుడున్న అట్టిజాతకుడు గొప్ప వంశమున జన్మించువాడు.దేశప్రఖ్యాతి పురుషుడు సుందరమైన ముఖముగలవాడు సంపూర్ణభాగ్యవంతుడు అగును.క్షీణచంద్రుడయిన పైన వ్రాసిన ఫలముసన్నియు లభింపవు.యిాచంద్రదశలో స్వల్పముగా శరీరమునకు నలతజేయును.
ద్వితీయమందు పూర్ణచంద్రుడున్న యెడల వేలకొలదిధనము నిలవ యుండును.క్షీణచంద్రుడైన సంపాదించిన ధనమంతయుఖర్చు అగును.
తృతీయమందు పూర్ణచంద్రుడున్న యెడల సోదరీవృద్ది విశేషముగా నుండును.క్షీణచంద్రుడైనచో కొంతవరకు నష్టముగలుగును.ఈ స్థానమందు ఏ చంద్రుడును స్వతంత్ర ముగా యెాగించును.
చతుర్ధమందు పూర్ణచంద్రుడున్న యెడల విద్యవాహనము భూమిభాగ్యము యివి సంపూర్ణముగా నుండును.క్షీణచంద్రుడైన యెడల మాతృవిచారము భూవ్యయము మెుదలగునవి గలుగును.
పంచమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి భాగ్యవంతురాలగు నొక్కకుమారై యుండును.ఈ చంద్రుడు పూర్తిగా యెాగించును.క్షీణచంద్రుడైన సంతానము వలన సౌఖ్యముండదు.
షష్టమందు పూర్ణచంద్రుడున్న యెడల శత్రురోగ ఋణములు స్వల్పముగా నుండును.క్షీణచంద్రుడున్న యెడల హెచ్చుగా నుండును.
సప్తమందు పూర్ణచంద్రుడున్న యెడల కళత్రము రూపవతి యెాగ్యురాలు పతి భక్తిగలది అదృష్టవంతురాలు అగును.క్షీణచంద్రుడైన చో కుటిలస్వభావముగలది రోగవతి అగును.
అష్టమమందు చంద్రుడున్న యెడల విశేషముగా శరీరపీడ చేయును.క్షీణచంద్రుడున్న యెడల అనేక నష్టములు గలుగును అష్టమమందు యేచంద్రుడు యెాగించడు.
భాగ్యమందు పూర్ణచంద్రుడున్న యెడల సంపూర్ణభాగ్యము గలుగును.క్షీణచంద్రుడైనచో అప్పటికప్పుడు స్వల్పముగా లభిచునుగాని శాశ్వతముగా నిలువయుండదు.
దశమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి రాజయెాగమునిచ్చును.గంగాస్నానఫలము లభించును.మంచి మంచిసత్కార్యములు చేయును.క్షీణచంద్రుడైన అనాచార ప్రవర్తకుడగును.
ఏకాదశమందు పూర్ణచంద్రుడున్న విశేషముగా ధనము సంపాదించును.తానుసంపాదించిన ధనమంతయు మిక్కిలి న్యాయముగా నుండును.క్షిణచంద్రుడైన అన్యాయముగా ధనమార్జించును.మెుత్తముమీద ఈ స్థానమందు యేచంద్రుడున్నను యెాగించును.
వ్యయమందు పూర్ణచంద్రుడున్న తానుసంపాదించిన ధనమంతయు పుణ్యకార్యములకు వినియెాగించును.క్షీణచంద్రుడున్న దురాచార ప్రవర్తనగలిగి ధనము దుష్కార్యములకు వినియెాగించును.
*వృషభాది కుజ ఫలము*
వృషభము లగ్నమైలగ్నమందు కుజుడున్న యెడల మశూచి వంటి రోగములు గలుగును.ఎప్పుడును సౌఖ్యముండదు.
శరీరదారుఢ్యముండదు. కుటిలస్వభావము గలవాడయియుండును.
ద్వతీయమందు కుజుడున్న యెడల యెంత ధన మార్జించినను నిలువదు.ద్వికళ త్రయెాగముసంభవించును.
తృతీయమందు కుజుడున్న యెడల కళత్ర శరీరపీడ సోదర నష్టము భూమివ్యయమును కలుగును.
మాతృస్థానమందుకుజుడున్న మాతృ సౌఖ్యముండదు.ఏవిద్యయు తృప్తిగాలభించదు.స్వల్పముదగా భూవ్యయము చేయును.
పంచమమందు కుజుడున్న యెడల సంతానము గలిగి నష్టపోవును.
షష్టమందు కుజుడున్న యెడల శత్రువుల వలన బాధకలుగును.రోగము హెచ్చుగానుండును.ఋణముచే భూమి సంపాదించును.మెుత్తముమీద ఈ కుజదశ స్వల్పముగా యెాగించును.
కళత్రస్థానమందు కుజుడున్న కళత్రనష్టము గలుగును.భూ సంపాదన జేయును.
అష్టమమందు కుజుడున్న ద్వికళత్రయెాగము సంభవించును.పిత్రార్జిత మైన భూమియంతయఖర్చు పెట్టును.అనేక కష్టములు గలిగి విశేష ధనవ్యయము చేయును.
నవమమందు కుజుడపన్న యెడల ఈ కుజదశలో విశేషముగా భూమి సంపాదించును.మంచి రాజయెాగము గలుగును గాని తండ్రికి విశేషముగా నలత జేయును.
దశమమందు కుజుడున్న వ్యవసాయము వలన జీవనము చేయును.ఈ కుజదశలో తీర్థయాత్రలు చేయును.కొన్నిటికి విఘ్నములు కలుగును.
ఏకాదశమందు కుజుడు విశేషముగా యెాగించును.తాను సంపాదించిన ధనమంతము మిక్కిలి న్యాయముగా నుండును.బహుసంపాదన చేయును.
వ్యయస్థానమందు కుజుడున్న యెడల ఋణముచేసి భూమి సంపాదించును.ఖర్చు విశేషముగా నుండును.దుర్వినియెాచ్చుగా నుండును.
*వృషభాది రాహు ఫలము.*
వృషభము లగ్నమైలగ్నమందు రాహువున్న జాతకునకు శరీరదారుఢ్యము తక్కువగా నుండును.ఈ దశబాగుగ యెాగించును.మిక్కిలి పేరుప్రతిష్ఠలు సంపాదించును.
ద్వితీయమందు రాహువున్న యెడల సోదరులు విశేషముగా గలిగిన స్వల్ప ముగా నష్టముండును.ఈ రాహువు పూర్తిగా యెాగించును.
చతర్దుమందు రాహువున్న తల్లికి నలత జేయును.భూవ్యయమగును.సౌఖ్యము తక్కువగానుండును పంచమమందు రాహువున్న పూర్తిగా యెాగము గలుగును గాని సంతాన విచారము కలుగును.
అష్టమమందు రాహువున్న శత్రురోగ ఋణములు పూర్తిగా నుండును.సప్తమ మందు రాహువున్న భార్య భర్తలిరువురకు విశేషముగా నలతజేయును.
అష్టమమందు రాహువున్న మిక్కిలి కష్టములనుభమించును.శరీరపీడ చేయును.అది వరకుయెాగము చెడిపోవును.
భాగ్యమందు రాహువున్న యెడల బాల్యమందు వచ్చిన బాలారిష్టము గలుగును.లేనియెడల పితృసూరకము జరుగును గాని జాతకునకు యెాగించును.
రాజ్యమందు రాహువున్న గంగాస్నానఫలము గలుగును.ఈ దశ బాగుగా యెాగించును.
ఏకాదశమందు రాహువున్న యెడల విశేషధనలాభం గలుగును.ఉద్యోగస్తుడైన యెడల వాహనముద్రాధికారములు గలుగును.
ద్వాదశమందు రాహువున్న యెడల దుర్జన సవాసము జేసి విశేషముగా ధనము ఖర్చు పెట్టును.శత్రువువలన పరాభవము గలుగును.పూర్తిగా నష్టము గలుగును.
*వృషభాది గురు ఫలము*
వృషభము లగ్నమయి లగ్నమందు గురుడున్న యెడల యెాగ్యుడు విద్యావంతుడు రూపవంతుడు అగును.శరీరదారుఢ్యము స్వల్పముగా నుండును.స్వల్పముగా యెాగించును.
ద్వితీయమందు గురుడున్న యెడల స్వల్పముగా ధనమునిలువయుండును.కుటుంబవృద్ధిహెచ్చుగా నుండును.
తృతీయమందు గురుడున్న మిక్కిలి పేరుప్రతిష్ఠలు గల సోదరులుందురు,వారి వలన యిా జాతకునకు బాగుగా యెాగించును.
చతుర్ధమందు గురుడున్న యెడల మాతృ సౌఖ్యము విద్య,భూమి,వాహనము స్వల్పముగా నుండును.
పంచమమందు గురుడున్న యెడల బాగుగా యెాగించును. సంతానవృద్థి విశేషముగా నుండును.
షష్ఠమందు గురుడున్న యెడల శత్రురోగ ఋణములు కొంచెము హెచ్చుగా నుండును.ఈ గురుడు యెాగించడు.
సప్తమస్థానమందు గురుడున్న కళత్రము రూపవతియు పతి భక్తి గలదియు నగును.శరీరదారుఢ్యము స్వల్పముగా నుండును.
అష్టమమందు గురుడున్న స్వల్పముగా యెాగించును.భాగ్యము స్వల్పముగా నున్నను ఆయుర్దాయము హెచ్చుగా నుండును.
భాగ్యమందు గురుడున్న గురుదశలో శరీరపీడ ధనవ్యయము గలుగును.ఈ దశ యెాగించదు.అది వరకున్న యెాగము గూడ చెడిపోవును.
దశమమందు గురుడున్న యెడల ఆచారవంతుడు స్వతంత్ర విద్యవలన జీవనము చేయువాడు తీర్ధయాత్రలు చేయువాడు అగును.
ఏకాదశమందు గురుడున్న తాను సంపాదించిన ధనమంతయు న్యాయముగా నుండును.ఈ గురుదశ బాగుగా యెాగించను.
వ్యయమందు గురుడున్న గురుదశ యెాగించదు. ఆర్జన స్వల్పముగా నుండును.ఖర్చు విశేషముగా నుండును.సద్వినియెాగము హెచ్చుగా నుండును.
*వృషభాది శని ఫలము*
వృషభము లగ్నమయి లగ్నమందు శని యున్న మిక్కిలి యెాగించును.విశేషము గాధసంపాదనచేసిమంచి పేరుప్రతిష్ఠలు సంపాదించును.శరీరదారుఢ్యము మాత్రమే తక్కువగా నుండును.
ద్వితీయమందు శనియున్న యెడల ఈ శని దశబాగుగానే యెాగించునుగాని ధనముమాత్రము నిలువ యండదు.
తృతీయమందు శనియున్న మధ్యమధ్యను రోగము హెచ్చుగా నుండి తిరిగి తగ్గుచుండును.అది వరకున్న యెాగము పాడు చేయదు.గానఅంతకంటే హెచ్చదు.
చతుర్థమందు శనియున్న మిక్కిలి రాజయెాగము నిచ్చును.
పంచమమందు శనియున్న వాహన ముద్రాధికారముగల గొప్ప యుద్యోగము చేయునుగాని సంతానసౌఖ్యముండదు.
షష్ఠమందు శనియున్న జ్ఞాతులవల్ల విశేషభాగ్యము లభించును.ఒక దేశమునకు తాను ప్రభువైన యెడల యితర రాజ్యముగూడ తనకు లభించును.
సప్తమమందు శనియున్న కళత్రవిచారము కల్గును గాని యెాగము చెడదు.
అష్టమమందు శనియున్నతన భాగ్యమంతయు బంధువులకు మిత్రులకును వినియెాగించును.
భాగ్యమందు శనియున్న పితృ సౌఖ్యము తక్కువగా నుండును.పిత్రార్జితమువల్ల భాగ్యము హెచ్చుగా ముద్రధికారము గల గొప్ప యుద్యోగముచే మిక్కిలి పేరు ప్రతిష్ఠలు వేల కొలది ధనము సంపాదించును మధ్యమధ్యను సత్కార్యములు గూడ చేయును.
వ్యయమందు శనియున్న అదివరకున్న యెాగమంతయు చెడిపోవును శత్రు రోగ ఋణములు హెచ్చుగా నుండును.అవమానము మాత్రము జరగదు.
మెత్తము మీద వృషభలగ్న జాతకుడు ద్వాదశాష్టమయములందుగాక తక్కిన భావముల యందుయే భావములయందుశనియున్నను మిక్కిలి యెాగమునిచ్చు వాడగును.
*వృషభాది బుధ ఫలము*
వృషభము లగ్నమై లగ్నమందు బుధుడున్న జాతకుడు శరీరసౌఖ్యము గల వాడు,సుందరమైనవాడు,పారమార్ధికచింత గలవాడు,విద్యావినయ సంపన్నుడు అగును.
ద్వితీయమందు బుధుడున్న విశేషముగా ధనమును సంపాదించి నిలవ జేయును.విశేషముగా శరీర పీడకలుగును కుజునితో రాహువుతో గలిసిన యెడల తప్పక మారకము చేయును.
తృతీయమందు బుధుడున్న యెాగించదు.ఈదశలో అదివరకు యెాగము నకు భంగము చేయును.
చతుర్ధమందు బుధుడున్న విద్యావంతుడు,మాతృసౌఖ్యము గలవాడు భూజాతకుడు అగును.
పంచమమందు బుధుడున్న అఖండముగా యెాగించును.వాహనముద్రాధికార సౌఖ్యములు సంపూర్ణముగా నుండును.
షష్ఠమందు బుధుడున్న యెాగించదు.విశేష ధన వ్యయమగును.
సప్తమమందు బుధుడున్న స్వల్పముగా యెగించును.సుందరమైన కళత్రము లభించును.
అష్టమమందు బుధుడున్న అది వరకున్న యెాగము చెడి పోవును.శరీరపీడ ధనవ్యయము కలుగును.
నవమమందు బుధుడున్న విశేషభాగ్యము లభించును.మిక్కిలి సౌఖ్యము గలవాడును.
దశమమందు బుధుడున్న దేశ ప్రఖ్యాతి గల వర్తకము చేసి విశేషఖ్యాతి సంపాదించును.
ఏకాదశమందు బుధుడున్న న్యాయమైన ధనసంపాదన విశేషముగా చేయును గాని ఈ బుధదశలో సంపాదించిన ధనమంతయు సత్కార్యములక్రింద వినియెాగించును.కొంతవరకు తీర్థయాత్రలు చేయును.
ద్వాదశమందు బుధుడున్న యెడల ఋణజాతకుడగును కాని పారమార్దిక చింతగలవాడయి సత్కధాకాలక్షేపము చేయును.
*వృషభాది కేతు ఫలము*
లగ్నమందు కేతువున్న జాతకు డుకొంచెం నలుపుగాను పోట్టిగాను వుండును.దేహదారుఢ్యముమంచిదికాదు.మిక్కిలి పారమార్థికచింత గలవాడుగుడు.
ద్వితీయమందు కేతువున్న యెడల సంతానం విచారము ధనవ్యయము శరీరపీడ కలుగును.
తృతీయమందు కేతువున్న యెడలయిా దశపూర్తగా యెాగించును.భూధనలాభము విశేషముగా నుండును.
చతుర్థమందు కేతువున్న యెడల మాతృసౌఖ్యంవిద్య భూమి వాహనము యిని బహు స్వల్పముగా నుండును.
పుత్రస్థానమందు కేతువున్న యెడల సంతాన విచారము గలుగును.లాభవ్యయములు సమానముగానుండును.
షష్టమందు కేతువున్న యెడల యిా కేతుదశ బాగుగా యెాగించును.మాతులనష్టము గలుగును.
సప్తమమందు కేతువున్న యెడల యిా దశలో కళత్రవిచారము కలుగును.జాతకు నకు గూడ స్వల్పముగా నలత జేయును.
అష్టమమందు కేతువున్న యెడల శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును. యిాదశ పూర్తిగా పాడు జేయును.
నవమమందు కేతువు యెడల యిాదశ స్వల్పముగా యెాగించును.తడ్రికి పూర్తిగా నలతజేయును.
దశమమందు కేతువున్న యెడల యిాదశలో అనేక సత్కార్యములు గొప్ప తీర్థయాత్రలు చేయును.
ఏకాదశమందు కేతువున్న యెడల ఈ దశలో పూర్తిగా ధనము సంపాదించును గాని అన్యాయ నిత్తము హెచ్చుగా నుండును.
ద్వాదశమందు కేతువున్న యెడల సర్వదా హరినామ స్మరణచేయును ఈ కేతుదశ అంత్యమందువచ్చిన మెాక్షము పొందును ఎప్పుడును పురాణ శ్రవణము చేయును.గాని ఈ కేతుదశ యెాగించదు.విశేషధనవ్యయము చేయును వ్వవహారపు చిక్కులు శరీరాయాసము గలుగును.
*వృషభాది శుక్ర ఫలము*
వృషభము లగ్నమందు శుక్రుడున్న యెడల అట్టి జాతకుడు కురచగా నుండపను సంగీత సాహిత్యములయందు ప్రవేశము గలవాడగును.చురుకయిన బుద్దిగలవాడు రాజసన్మానము గాలవాడు అగును.
ద్వితీయమందు శుక్రుడున్న ధనము స్వల్పముగా నుండును.ఈ శుక్రదశలో పూర్వఖండమునందు యెాగించునుగాని ఉత్తరఖండమునందు శత్రురోగ ఋణములు హెచ్చుగా నుండును.
తృతీయమందు శుక్రుడన్న బాగుగ యెాగించును.మిక్కిలి యదృష్టము గల సోదరీలు గల్గుదురు.
చతుర్థమందు శుక్రుడున్న యెడల ఆంధ్రగీర్వణ ములయందు ప్రవేశముండును.భూసంపాదనచేయును.వాహన సౌఖ్యము గలుగును.
పంచమమందు శుక్రుడు విశేషముగా నలతజేయును.యెాగభంగము గలుగును.కళత్రపీడ చేయును.
షష్ఠమందు శుక్రుడుఋణముచేసి భూసంపాదన చేయిను.ఈదశలో మధ్యమధ్యను యెాగభంగము గలుగును.
సప్తమమందు శుక్రుడున్న యెాగించును.చపలచిత్తుడై యుండును.
అష్టమమందు శుక్రుడున్న జాతకుని కళత్రమునకు విశేషముగా నలతజేయును.అపరిమితముగా ధనవ్యయమగును.
భాగ్యమందు శుక్రుడున్న భాగ్యము హెచ్చుగా నుండును.పేరుప్రతిష్ఠలు గల ఉద్యోగము చేయును.
దశమమందు శుక్రుడున్న వ్యవసాయము మిక్కిలిగా ఫలించును.భూముల వలన విశేషముగా ధనరాబడి కలుగును.
ఏకాదశమందు శుక్రుడున్న దశ పూర్వఖండములో మిక్కిలి రాజయెాగము గలుగును.ఉత్తర ఖండములో ఋణములవలన బాధలుగలుగును.
వ్యయమందు శుక్రుడున్న శరీరపీడ నలత కల్గును శుభకార్యములు చేయుట వలన ఋణజాతకుడగును.
Thursday, February 1, 2018
*వృషభలగ్నము*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment