Friday, February 9, 2018

*వృశ్చికలగ్నము*

వృశ్చికలగ్నమునకు రవిచంద్రులిద్దరు మిక్కిలి రాజయెాగము నిచ్చువారగుదురు.కనుక ఈ రెండు గ్రహములును కేంద్రకోణములు యందెక్కడ కలిగినను మిక్కిలి యెాగజాతకమగును.
రవికుజులు కలిసిన రవిదశ సామాన్యముగా యెాగించును.కుజదశలో విశేషభూమి ధనము సంపాదించును.
రవిబుధులు కలిసిన రవిదశ సామాన్యముగా యెాగించును.బుధదశలో మిక్కిలి ధనము సంపాదించును.బాగుగా యెాగించును.
రవిగురులు గలిసిన రెండు దశలును విశేషముగా యెాగించును.
రవిశుక్రులు గలిసిన రెండు దశలను పూర్తిగా యెాగించును.
రవిశనులు గలిసి రవిదశ సామాన్యముగా యెాగించును శనిదశలో విశేషభూమి సంపాదించును.
చంద్రకుజులు కలిసినచో రెండు దశలును పూర్తిగా యెాగించును.విశేషముగా భూమిని ధనమును సంపాదించును.
చంద్రబుధలు గలిసిన యెడల చంద్రదశ సామాన్యముగా యెాగించును.బుధదశ బాగుగా  యెాగించును.
చంద్ర గురులు కలిసిన రెండు దశలలోను గూడ విశేష రాజయెాగము నిచ్చును.చంద్రశుక్రులు గలసిన రెండు దశలును పూర్తిగా యెాగించును.
చంద్రశనులు గలిసిన శనిదశ పూర్తిగా యెాగించును.చంద్రదశ  సామాన్యముగా ఫలించును.
కుజబుధలు గలిసిన ఈ రెండు దశలును యెాగించువు.కుజ గురులు గలిసిన రెండు దశలును గూడ పూర్తి యెాగించును.
కుజశుక్రులు కలిసిన కళత్రమునకు నలత జేయును.రెండు దశలును గూడ యెాగించవు.
కుజశనులు కలిసిన శరీరమెప్పుడును రోగపీడితమై యుండును.ఈ రెండుదశలలో యెాగభంగము కలుగును.
బుధశుక్రులు గలిసిన బుధదశలో సామాన్యముగా యెాగించును.
బుధశనులు గలిసిన శనిదశ యెాగించదు.బుధదశ స్వల్పముగా యెాగించును.
గురుశుక్రులు కలిసిన శుక్రదశ బాగుగా యెాగించును.విశేషధనము సంపాదించును.గురుదశ సామాన్యముగా యెాగించును.
గురుశనులు కలిసిన శనిదశ విశేషముగా యెాగించును.గురుదశ సామాన్యముగా యెాగించును.
శుక్ర శనులు కలిసిన శనిదశ విశేషముగా యెగించును.శుక్రదశ సామాన్యముగా యెగించును.
మెుత్తము మీద వృశ్చిక లగ్నమునకు శనిచంద్ర,కుజగురులలో యేజంట గ్రహములు గలిసినను విశేషరాజయెాగము నిచ్చును.
*వృశ్చికాది రవి ఫలము*

వృశ్చికము లగ్నమై లగ్నమందు రవియున్నా దశ అఖండముగా యెాగించును.మిక్కిలి ధనము సంపాదించును.
ద్వితీయమందు రవియున్న మిక్కిలి ధనము సంపాదించు జాతకమగునో గాని నిల్వజేయుజాతకుడు గాదు.
తృతీయమందు రవియున్న సామాన్య యెాగమిచ్చును.
చతుర్థమందు రవియున్న వాహన ముద్రాధికార యెాగములు గలవాడగును.
పంచమమందు రవియున్న దశలో సంతానమునకు స్వల్పనష్టము కలుగును.దశ అఖండముగా యెాగించును.
షష్ఠమమందు రవియున్న అఖండముగా యెాగించును.
సప్తమమందు రవియున్న బాగుగా యెాగించును.కళత్రసంబంధమైన ఆస్తికొంత గలియును.
అష్టమమందు రవియున్న యెడల పిత్రార్జితమంతయు పాడు చేయును.ఈ రవిదశ యెాగించదు.
నవమమందు రవియున్న ఈ దశలో విశేషభాగ్యమనుభవించును.
దశమమందు రవియున్న రాజయెాగము వాహన ముద్రాధికార సౌఖ్యము అనుభవించును.
ఏకాదశమందు రవియున్న విశేషముగా ధనమార్జించి నిలువజేయును.
ద్వాదశమందు రవియున్న యెడల ఈ రవిదశ యెాగించదు పిత్రార్జిత మంతయు ఖర్చు పెట్టును.
మెుత్తమీద వృశ్చికలగ్నమందు ఈ రవి యెక్కడ రవియెుక్కడనున్నను యెడల విశేషయెాగము నిచ్చును.
*వృశ్చికాది చంద్ర ఫలము*

వృశ్చికము లగ్నమయి లగ్నమమందు చంద్రుడున్న యెడల నీచభంగమైనచో సంపూర్ణఫలము నిచ్చును.
ద్వితీయమందు  పూర్ణచంద్రుడున్న విశేషధనము సంపాదించి నిలువజేయును.క్షీణచంద్రుడైనచో స్వల్పముగా ఫలించును.
తృతీయమందు పూర్ణచంద్రుడున్న స్వల్పముగా ఫలించును.క్షీణచంద్రుడైనచో యెాగభంగము గల్గును.
చతుర్థమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి పండితుడగును.విశేష భూమిని సంపాదించును.వాహన సౌఖ్యములనుభవించును.క్షీణచంద్రుడైనచో స్వల్పముగా ఫలించును.
పంచమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి అదృష్టముతో గూడుకొనిన సంతానము గలుగును.ఈ చంద్రదశ పూర్తిగా యెాగించును.
షష్టమమందు పూర్ణచంద్రుడున్న స్వల్పముగా యెాగించును.క్షీణచంద్రుడైనచో రోగ ఋణములు హెచ్చుగా నుండును.
సప్తమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి రాజయెాగము గలిగి విశేష భాగ్యమనుభవించును.
అష్టమమందు పూర్ణచంద్రుడున్న స్వల్పముగా యెాగించును.క్షీణచంద్రుడైనచో విశేషముగా నలతజేయును.
నవమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి భాగ్యవంతుడై విశేషఖ్యాతి సంపాదించును.క్షీణచంద్రుడైనచో స్వల్పముగా యెాగించును.
దశమమందు పూర్ణచంద్రుడున్న మిక్కిలి ఆచారముగలవాడు,తీర్థయాత్రలు చేయువాడు,గొప్పభాగ్యవంతుడగును.క్షీణచంద్రుడైనచో స్వల్పముగా యెాగించును.
ఏకాదశమందు పూర్ణచంద్రుడున్న యెడల మిక్కిలి భాగ్యవంతుడును,క్షీణచంద్రుడైనచో అన్యాయముగా ధనమార్జించువాడు అగును.
ద్వాదశమందు పూర్ణచంద్రుడున్న సత్కార్యములు చేసి విశేషఖ్యాతి సంపాదించును,క్షీణచంద్రుడైనచో అన్యాయముగా ధనవ్యయము చేయును.
మెుత్తమీద వృశ్చికలగ్నమునకు పూర్ణచంద్రుడు కేంద్రకోణములయందెక్కడున్న రాజయెాగము నిచ్చువాడగును.
*వృశ్చికాది కుజ ఫలము*

వృశ్చికము లగ్నమయి లగ్నమందు కుజుడున్న ద్వికళత్రయెాగముగాని పరస్త్రీ సౌఖ్యముగాని సంభవించును.
ద్వితీయమందు కుజుడున్న ధనము నిలువయుండదు.కుజదశలోమధ్యమధ్య శరీరపీడ చేయును.
తృతీయమందు కుజుడున్న కుజదశ స్వల్పముగా యెాగించును.సోదర సోదరీ సంబంధమైన ఆస్తిగూడ కొంత కలియును.
చతుర్థమందు కుజుడున్న మిక్కిలిభూజాతకుడగును,గాని స్వల్పముగా ఋణముండును.
పంచమమందు కుజుడున్న యెడల సంతానము గలిగి నష్టమగును.గాని ఆకుజుదశ బాగుగా యెాగించును.
షష్ఠమమందు కుజుడున్న యెడల శతృరోగఋణములు హెచ్చుగానుండును.
సప్తమమందు కుజుడున్న జారుడగును.ఈ కుజదశ స్వల్పముగా యెాగించును.
అష్టమమందు కుజుడున్న కళత్రపీడయు సంతాన విచారము గలుగును.
నవమమందు కుజుడున్న స్వల్పముగా యెాగించును.
దశమమందు కుజుడున్న  యెడల వ్యవసాయము వలన గౌరవముగా జీవించును.మంచి జాతకుడగును.
ఏకాదశమందు కుజుడున్న అన్యాయముగా ధనమార్జించి నిలవచేయును.
ద్వాదశమందు కుజుడున్న పిత్రార్జితము స్వార్జితము గూడ వృధాగా ఖర్చు పెట్టును.
మెుత్తము మీద ఈ వృశ్చికలగ్నమునకు కుజుడు మిశ్రమఫలము నిచ్చును గాని పూర్ణఫలము నీయుడు.
*వృశ్చికాది రాహు ఫలము*

వృశ్చికము లగ్నమైన లగ్నమందు రాహువున్న యెాగించదు.అట్టిజాతకుడు పేరు ప్రతిష్ఠలు  లేని వాడగును.
ద్వితీయమందు రాహువున్న ఎంత ధనమార్జించినను నిలువక ఎప్పటికప్పుడు ధనముకై వెదుకుచుండును.
తృతీయమందు రాహువున్న రాహుదశలో మిక్కిలి భాగ్యవంతుడగును.
చతుర్థమందు రాహువున్న మాతృసౌఖ్యము లేనివాడు విద్యవిఘ్నముగలవాడు ఋణజాతకుడు అగును.
పంచమమందు రాహువున్న యెడల ఈ రాహుదశ స్వల్పముగా యెాగించును.గానీ సంతానము గలిగి నష్టమగును.
షష్ఠమమందు రాహువున్న యెడల వారసత్వ సంబంధమైన ఆస్తి గలిగి మిక్కిలి భాగ్యమనుభవించును.
సప్తమమందు రాహువున్న రాహుదశలో విశేషధనము సంపాదించునుగాని కళత్ర విచారము కలుగును.
అష్టమమందు రాహువున్న యెాగించదు.మిక్కిలి కష్టము లనుభవించును.
నవమమందు రాహువున్న ఈ రాహుదశలో మిక్కిలి భూమి సంపాదించును.
దశమమందు రాహువున్న యెడల విక్కిలి ధనమార్జించి నిలువ జేయును.
ఏకాదశమందు రాహువున్న యెడల మిక్కిలి ఖ్యాతిగలవాడై విశేషభాగ్యమనుభవించును.
వ్యయమందు రాహువున్న యెడల దుర్జన సహవాసము చేసి చెడిపోవును.
*వృశ్చికాది గురు ఫలము*

వృశ్చికము లగ్నమయి లగ్నమమదు గురుడున్న పూర్తిగా యెాగించును మిక్కిలి ధనవంతుడు విద్యావంతుడు దేశప్రఖ్యాతిగల పురుషుడు అగును.
ద్వితీయమందు గురుడున్న యెడల మిక్కిలి ధనవంతుడగును సుందరమైన ముఖము గలవాడును సభాపూజ్యుడుగూడనగును.
తృతీయమందు గురుడున్న యెడల ఈ గురుదశ యెాగించదు.మిక్కిలి దారిద్ర్యమనుభవించును.
చతుర్థమందు గురుడున్న విద్యావంతుడను భూసంపాదనపరుడును.మాతృసౌఖ్యము గలవాడను అగును.
పంచమమందు గురుడున్న కుటుంబవృద్ధి గలవాడయి మిక్కిలి ధనవంతుడగును.ఈ దశ పూర్తిగా యెగించును.
షష్ఠమమందు గురుడున్న యెాగించదు.గాని సంతానము హెచ్చుగానుండి అప్పు పెరుగును.
సప్తమమందు గురుడున్న యెడల మిక్కిలి రూపలక్షణములు గల భార్యలభించును.కళత్రసంబంధమైన ఆస్తిగూడ కొంత లభించును.
అష్టమమందు గురుడున్న యెడల ఈ గురుదశ యెాగించదు.ఎప్పుడును ధనమునకు చిక్కులు పడుచుండును.
నవమమందు గురుడున్న విశేషభాగ్యమనుభవించును.
దశమమందు గురుడున్న యెడల సదాచార ప్రవర్తన గలిగి మిక్కిలి ఖ్యాతిసంపాదించును.
ఏకాదశమందు గురుడున్న విశేషముగా ధనముసంపాందించును.
ద్వాదశమందు గురుడున్న సత్కార్యములు చేయును గాని ఋణము వల్లబాధపడును.
మెుత్తము మీది వృశ్చిక లగ్నమునకు గురుడెక్కడున్నను యెాగించును.
*వృశ్చికాది శని ఫలము*

వృశ్చికములగ్నమై లగ్నమందు శనియున్న నలుపుగాను పొడువుగాను నుండును.కష్టజీవి యగును.
ద్వితీయమందు శనియున్న ఈ శనిదశలో సంతాన విచారము ధనవ్యయము నేత్రహాని గలుగును.
తృతీయమందు శనియున్న లాభవ్యయములు సమానముగా నుండును.
చతుర్థమందు శనియున్న మాతృసౌఖ్యము విద్య భూమియు యివి స్వల్పముగా నుండును.
పంచమమందు శనియున్న మిక్కిలి యెాగించును.ధనసంపదయు గలుగును గాని సంతానవిచారము గలుగును.
షష్ఠమమందు శనియున్న యెడల ఈ శనిదశ యెాగించును.మిక్కిలి కష్టములనుభవించును.
సప్తమమందు శనియున్న యెడల తప్పక ద్వికళత్రము సంభవించును.
అష్టమమందు శనియున్న ఈ శనిదశ యెాగించదు.పిత్రార్జితము స్వార్జితము గూడ ఖర్చు పెట్టును.
నవమమందు శనియున్న శనిదశ స్వల్పముగా యెాగించును.సుఖము స్వల్పముగనే యుండును.
దశమమందు శనియున్న మంచి కీర్తిప్రతిష్టలు శత్రు క్షేత్రము కావున సుభా సుభా మిశ్రముగా యుండును ఈ దశలోయెాగావ యెాగములు కలుగును.
ఏకాదశమందు శనియున్న యిా శనిదశ పూర్తిగా యెాగించును.ఆయుర్భాగ్యములు సంపూర్ణముగా నుండును.
వ్యయమందు శనియున్న విశేషముగా ధనమార్జించి తిరిగి ఖర్చు పెట్టును.
మెుత్తమీద వృశ్చికలగ్న జాతకునకు శని,మంచి స్థానము యందున్నను మిశ్రమఫలమునే ఇచ్చును.
*వృశ్చికాది బుధ ఫలము*

వృశ్చికము లగ్నమయి లగ్నమందు బుధుడున్న బుధదశలో కొంచెము శరీరాయాసము గలుగును.
ద్వితీయమందు బుధుడున్న విశేషముగా నలత చేయును.అప్పుదొరకుట కష్టముగా నుండును.
తృతీయమందు బుధుడున్న స్వల్పముగా యెాగించును.శత్రుసంబంధమైన ఆస్తికొంత కలియును.
చతుర్థమందు బుధుడున్న స్వల్పంగా భూమి సంపాదించి తిరిగి ఖర్చు పెట్టును.
పంచమమందు బుధుడున్న సంతానమువలన సౌఖ్యముండదు.చివరకు స్వల్పముగా పుత్రికాసంతాన ముండును.
షష్టమమందు బుధుడున్న బాగుగా యెాగించును.భూమియు ధనమును సంపాదించును.ఇతరుల ఆస్తి కొంతగలియును.
సప్తమమందు బుధుడున్న కళత్రము రోగపీడితురాలయి యుండును.
అష్టమమందు బుధుడున్న ముందుగా యెాగించి చివరకు యెాగభంగము గలుగును.
నవమమందు బుధుడున్న కొంచెము ధనమార్జించి నిల్వచేయును.
దశమమందు బుధుడున్న యెడల ఆచారము స్వల్పముగా నుండును.
ఏకాదశమందు బుధుడున్న సదా ధనమార్జించుచుండును.
ద్వాదశమందు బుధుడున్న యెాగించదు మిక్కిలి ధనవ్యయము గలుగును.
మెుత్తమీద వృశ్చికలగ్నమునకు బుధుడేపాద మందున్నను యెాగించకపోవుటయేగాక యేదియెానొక విచారమును కలుగజేయును.
*వృశ్చికాది కేతు ఫలము*

వృశ్చికము లగ్నమయి లగ్నమందు కేతువున్న కేతుదశ యెాగించదు.మిక్కిలి కష్టములను భవించును.
ద్వితీయమందు కేతువున్న  యెాగించదు ధనవ్యయము శరీరపీడ కలుగును.
తృతీయమందు కేతువున్న ఈ కేతుదశలో విశేషముగా భూమియు ధనమును సంపాదించును.
చతుర్థమందు కేతువున్న యిా  కేతుదశలో పిత్రార్జిత మంతయు ఖర్చు పెట్టును.
పంచమమందు కేతువున్న ఈ కేతుదశస్వల్పముగా యెాగించును.సంతానమువలన సౌఖ్యముండదు.
షష్టమమందు కేతువున్న మిక్కిలి భాగ్యమనుభవించిను.
సప్తమమందు కేతువున్న యెడల కళత్రవిచారము కలుగును.కళత్రము ఆఖరువరకు జీవించియున్నను అన్యోన్యము తక్కువ.
అష్టమమందు కేతువున్న శత్రు రోగ ఋణములు హెచ్చుగానుండును.
నవమమందు కేతువున్న పితృసౌఖ్యము తక్కువగ నుండును.ఈ కేతుదశ స్వల్పముగా యెాగించును.
దశమమందు కేతువున్న యెడల ఈ కేతుదశ మిశ్రమఫలము నిచ్చును.
ఏకాదశమందు కేతువున్నచో విశేష ధనమార్జించి నిలువజేయును ఈ కేతుదశ పూర్తిగా యెాగించును.
ద్వాదశమందు కేతువున్న యెాగించదు గాని పారమార్థిక చింతగలవాడై విశేషముగా ధనము ఖర్చుపెట్టును   *వృశ్చికాది శుక్ర ఫలము*

వృశ్చికము లగ్నమై లగ్నమందు శుక్రుడున్న జారుడగును.
ద్వితీయమందు శుక్రుడున్న శుక్రదశలో విశేషముగా నలత జేయును. కుటుంబవృద్ధి విశేషముగా నుండును.
తృతీయమందు శుక్రుడున్న యెడల మిక్కిలి భాగ్యము గల సోదరీలుందురు.
చతుర్థమందు శుక్రుడున్న ఆంధ్రగీర్వాణముల యందు పండితుడు,రాజ్యపూజితుడు అగును.
పంచమమందు శుక్రుడున్న ఈ శుక్రదశ బాగుగా యెాగించును.కళత్రసంబంధమైన ఆస్తిగలియును.
షష్ఠమమందు శుక్రుడున్న కళత్రము రోగపీడితురాలయి యుండును.ఈ శుక్రదశ యెాగించదు.
సప్తమమందు శుక్రుడున్న యెాగ్యురాలు.పతివ్రత ఆయుర్భాగ్యములు గలిదియు నగుకళత్రము లభించును.
అష్టమమందు శుక్రుడున్న యెడల ఈ శుక్రదశలో ఎంత ధనమార్జించినను నిలువదు.
దశమమందు శుక్రుడున్న సదాచారముగలవాడై వంశములో పేరు ప్రతిష్టలు సంపాదించును.
ఎకాదశమందు శుక్రుడున్న శుక్రదశ యెాగించదు.ధనవ్యయము కళత్రవిచారము గూడ గలుగును.
ద్వాదశమందు శుక్రుడున్న పూర్తిగా యెాగించును.సత్కార్యములు చేసి చాలాఖ్యాతి సంపాదించును.

No comments:

Post a Comment