Saturday, June 2, 2018

*పుత్ర జనన మరణ యెాగములు*

పంచమమున గురుడుమడి,పంచమాధిపతి పుత్రువితో కూడియున్న 32,33 సం"రమున పుత్రుడు పుట్టును.పంచమాధిపతి కేంద్రములందుండి కారకగ్రహములతో కూడియున్న 30,36 సంవత్సరములందు పుత్రుడు కల్గును.లగ్నమునకు నవమమున గురుడుండి గురునికి నవమమున శుక్రుడుండినా,లగ్నాధిపతి శుక్రునితో కలిసియున్న నలుబదవయేట సుతుడు కలుగును.పంచమమున రాహువుండి పంచమాధిపతి పాపయుక్తుడైన,గురుడు నీచగ్రహస్థుడైనచో,గురునికి పంచమమందు పాపులున్నా 33,36,40 సం"లలో సుతనష్టము కలనగును.లగ్నమున మాంది,లగ్నధితి నీచయందున్న 56వ యేట పుత్రశోకము కలుగును.
*బహుపుత్ర సంతానము యెాగములు*
చతుర్థము,షష్టము,పాపసంయుక్తుములై పంచమాధిపతి పరమెాచ్చయందుడి లగ్నాధిపతితో కూడియుండి కారకుడు శుభపసంయుక్తుడైన పదిమంది కొడుకులుందురు.గురుడు పరమెాచ్చస్థుడై,ద్వితీయాధిపతి రాహువుతో కూడియుండి,నవమాధిపతి నవమమందున్న తోమ్మిదిమంది పుత్రులు.గురుడు పంచమ,నవమములందుండి,పంచమాధిపతి బలవంతుడై,ధనాధిపతి దశమమందున్న ఎనమండుగురు పుత్రులు కలుగుదురు.శని పంచమమునకు - నవమమున ఉండి,పంచమాధిపతి పంచమమందున్న ఏడుగురు పుత్రులు,రెండవ గర్ఛమున కవలలు ఉందురు.ధనాధిపతి పంచమమున,పంచమాధిపతి ద్వితీయమున ఉన్న(పరివర్తనము)ఆర్గురు పుట్టి,ముగ్గురు జీవించియుందురు.శనికి పంచమమున గురుడు,గురునికి పంచమమున  శనిగాని ఉండి,పంచమమ పాపయుక్తమైన ఒక్కపుత్రుడుకలుగును.పంచమమున పాపయుక్తమై,గురనికి పంచమమున శనియున్న,ముగ్గురు భార్యలుండి మరొక భార్యకు పుత్రుడు కలుగును.పాపయుక్తమై గురునికి పంచమమున శనియుండి,లగ్నేశుడు శనిభావమున ఉండి,పంచమాధిపతి కుజునితో కూడియున్న పిల్లలు పుట్టి చనిపోదురు.కాని అతడు దీర్ఘాయువు కలిగి వుండును.
*విశేషము:-* పుత్రాదేవ మహీపపుత్ర పీతృధీపుణ్యాని సంచింతయేత్' అని ఉన్నందున పంచమభావమును బట్టి- దేవతా,రాజ,పుత్ర,పితృబుద్ధి,పుణ్యములను విచారణ చేయవలెను.
ఏ భావమునకైనా సామాన్యముగా చూడదగినది దేమనగా - భావోభావపతిశ్చ కారకఖగఃఅనియున్నందున,మనమే విషయము చర్చించదలచితిమెా ఆభావము,భావాధిపతి,కారకగ్రహము - ఈ మూడిటిని పరిశీలింపవలెను.భావము పాపాక్రాంతము,పాపదృష్టమునైన భావము చెడిపోవును.భావాధిపతి స్వ'ఉచ్ఛ,మిత్ర,మూలత్రికోణ,కేంద్ర,కోణములందున్న భావమునకు పుష్టి కలుగును!భావాధిపతి 6,8,12 స్థానములందున్నను పరాజితుడైనను,పాపమధ్యగతుడైనను,అస్తంగతుడైనను,భావాంత్యమున ఉన్నను,సత్ఫలితమున నియ్యజాలడు.భావాధిపతి శుభస్థానములందున్నను,శుభగ్రహములతో కూడియున్నను,చూడబడినను పూర్ణఫలము నిచ్చును.ఏ భావమునకు ఎవరు ఫలితములు చెప్పినా ఇవి దృష్టిలో ఉంచుకొనియే జరుగును.
పంచమభావమునుబట్టి వేటి విషయమెట్లున్నా ముఖ్యముగా సంతానమమ,విద్య,బుద్ధి,ఉపాసన - ఇవి చూడవలెను.విద్యావిషయమమన పంచమ,ద్వితీయములబట్టియు,గురునిబట్టియు చెప్పవలెను.

No comments:

Post a Comment