భాగ్యభావఫలము చెప్పుచున్నాను,భాగ్యాధిపతి బలవంతుడై, భాగ్యమున ఉన్న భాగ్యవంతుడైనవాడు పుట్టును.గురుడు భాగ్యమున ఉండి,భాగ్యాధిపతి కేంద్రమందుండి,లగ్నాధిపతి బలవంతుడైన,బహు భాగ్యవంతుడగును.భాగ్యాధిపతి బలవంతుడై,భాగ్యమున శుక్రుడుండి,గురుడు కేంద్రమున ఉన్న,జాతకుని తండ్రి భాగ్యము కలవాడగును,భాగ్యాత్తుద్వితీయమున(దశమ)గాని,చతుర్థమున(వ్యయమున)గాని కుజుడుండి,భాగ్యాధిపతి నీచస్థుడైన జాతకుని తండ్రి నిర్ధనుడే,భాగ్యాధిపతి పరమెాచ్ఛస్థుడై,భాగ్యాంశమున గురుడుండి,లగ్నాచ్ఛతుర్థమున శుక్రుడున్న జాతకుని తండ్రిదీర్ఘాయుష్మంతుడు.భాగ్యాధిపతి కేంద్రమందుండి,గురునిచే చూడబడినచో జాతకుని తండ్రి వాహనము కలిగి రాజో,రాజసముడో అగును.భాగ్యాధిపతి దశమమున,దశమాధిపతి భాగ్యమున(పరివర్తనయెాగము)ఉండి శుభులచే చూడబడిన జాతకుని తండ్రి ధనాఢ్యుడు కీర్తమంతుడు అగును.
*పితృభక్తి యెాగములు*
రవి పరమెాచ్చాంశయందుండి,భాగ్యాధిపతి లాభమున ఉన్న జాతకుడు ధర్మిష్ఠుడు,పితృసేవి అగును.రవి త్రికోణమున ఉండి,భాగ్యాధిపతి సప్తమమున ఉండి,గురునితో కలిసిఉన్నను,చూడబడిన జాతకుడు పితృభక్తి కలవాడగును.
భాగ్యాధిపతి ధనభావముననుండి,ధనాధిపతి భాగ్యమున ఉన్న(పరివర్తనము)32ఏళ్ళ తర్వాత భాగ్యము,వాహనము కీర్తికలుగును.
*పితృ - శత్రుయెాగములు*
లగ్నాధిపతి భాగ్యమున ఉండి,షష్ఠాధిపతికూడ అక్కడనేయున్న తండ్రి - కొడుకులకు అన్యోన్యవైరము కలుగును.తండ్రి కుత్సితు డగును.
*భిక్షాటన యెాగము*
బలహీనుడైన తృతీయాధిపతి దశధిపతి కలిసియున్న,భాగ్యాధిపతి నీచస్థుడుకాని,అస్తంగతుడుగాని యైన జాతకుడు భిక్షాశను డగును.
*పితృ మరణ యెాగము*
రవి 6,8,12 భావములందుండి,అష్టమాధిపతి నవమమందుండి,వ్యయాధిపతి లగ్నమునుండి,షష్ఠాధిపతి పంచమమందున్న జాతకునికి పుట్టుకకు పూర్యమే తండ్రి మరణించును.రవి అష్టమమునుండి,అష్టమాధిపతి నవమున ఉండగా పుట్టినవాని మెుదటి యేటనే తండ్రి మరణించును.వ్యయాధిపతి భాగ్యమందు భాగ్యాధిపతి నీచాంశయందున్న 3-16 ఏట తండ్రి మరణించును.లగ్నాధిపతి అష్టమమున,అష్టమాధిపతి రవితో కూడియున్న 2- 12 ఏట తండ్రి మరణించును.రాహువు భాగ్యాత్తు అష్టమమున (చతుర్థమున)ఉండి,రవి భాగ్యాత్తు భాగ్యమున ఉండగా పుట్టినవానికి 16 -18 ఏట తండ్రిమరణించును.రవి రాహువుతో కూడియుండి,చంద్రాత్ భాగ్యమున శనియున్న 1 -7 ఏట తండ్రి మరణము చెప్పవలెను.భాగ్యాధిపతి వ్యయమున ఉండి,వ్యయాధిపతి భాగ్యమునున్నచో 44వ ఏట తండ్రి మరణించును.చంద్రుడు రవ్యంశలో ఉండి,లగ్నాధిపతి అష్టమమున ఉన్న 35 -41వ ఏట తండ్రి మరణించును.రవి నవమాధియై శని కుజులతో కలిసియున్న 50వ ఏట తండ్రి మరణించును.రవి భాగ్యమునకు సప్తమమున (తృతీయమున)ఉండి,రాహువు తృతీయమునుండి సప్తమమున(నవమమున)ఉన్న 6లేక 25 సం"న తండ్రి మరణించును.శని సప్తమ,అష్టమములలో నుండి,రవి శనికి సప్తమమున ఉన్న 30,21,26 సంవత్సరముల వయస్సులో తండ్రి మరణించును.భాగ్యాధిపతి నీచయందుండి,దాని అధిపతి భాగ్యమందున్న 26 లేక 33 ఏట తండ్రి మరణించును.
Thursday, June 28, 2018
*నవమ(భాగ్య)భావఫలాధ్యాయము*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment