Thursday, June 28, 2018

*అష్టమ(ఆయుః)భావ ఫలాధ్యాయము*

ఆయుర్భాలఫలమును చెప్పుచున్నాను వినుడు.అష్టమాధిపతి కేంద్రమందున్న జాతకుడు దీర్ఘాయువగును.అష్టమాధిపతిగాని,లగ్నాధిపతిగాని పాపగ్రహములతో అష్టమమందున్న ఆల్పాయువగును.ఇట్లే శని,దశమాధిపతులవలనను ఆయుర్ధాయ విచారణ చేయదగినది.
*దీర్ఘాయు యెాగములు*
షష్ట,వ్యయాధిపతులు షష్ఠమందుగాని,లేదా లగ్నమునగాని,అష్టమమునగాని యున్నజాతకుడు దీర్ఘాయుష్మంతుడగును.లగ్నాధిపతికాని,అష్టమాధిపతిగాని స్వక్షేత్రమున,స్వాంశయందు,మిత్రాంశయందుగాని,మిత్రక్షేత్రమునగాని యున్న జాతకుడు దీర్ఘాయువును జేయును.లగ్న,అష్టమ,దశమాధిపతులను,శనియు,కేంద్రత్రికోణములందుగాని,లాభమునగాని యున్నను దీర్ఘాయుని జేయుదురు.బలవంతుడైనా లగ్నాధిపతి కేంద్రములందున్న శుభగ్రహములచే చూడబడిన యెడల జాతకుడు సద్గుణములు కలవాడు,దీర్ఘాయువు కలవాడు నగును.లగ్నాధిపతి ఉచ్ఛస్థుడై,చంద్రుడు లాభముననుండి,గురుడష్టమమున ఉన్న దీర్ఘాయుర్దాయమునకు సంశయములేదు.విద్వాంసుడైన దైవజ్ఞుడు వీరిలో బలవంతుడైన గ్రహనుసారము బహుధా విచారించి ఫలితము చెప్పవలెను.
*అల్పయుష్షు యెాగములు*
అష్టమాధిపతి కేంద్రముననుండి, లగ్నాధిపతి దుర్బలుడైన జాతకమడు 20 ఏళ్ళు జీవించును.పరమాయుర్దాయము 32సం"లు.రంధ్రాధిపతి నీచయందుండి,అష్టమమున పాపులుండి,లగ్నాధిపతి దుర్బలుడై యుండగా పుట్టినవాడు అల్పాయుష్కుడగును.రంధ్రాధిపతి పాపులతో కలిసియుండి,అష్టమమున పాపులుండి,వ్యయమున క్రూరగ్రహములున్న శిశువు పుట్టగానే చనిపోవును.పాపులు కేంద్ర కోణములందుండి,శుభులు షష్ఠ,అష్టమములందుండి,రంధ్రాధిపతి నీచస్థుడైన శిశువునకమ సద్యోమృతి చెప్పవలెను.పంచమమున పాపులుండి,అష్టమాధిపతి పాపయుక్తుడైన,అష్టమము పాపగ్రహయుక్తమైన స్వల్పాయుష్యము చెప్పవలెను.అష్టమాధిపతి అష్టమమందుండి,చంద్రుడు పాపయుక్తుడైన,శుభులచే చూడబడకున్న జాతకుడు మాసాంతమున చనిపోవును.

No comments:

Post a Comment