సప్తమాధిపతి స్వక్షేత్రమున,ఉచ్ఛయందు ఉన్న భార్యసుఖము పూర్తిగా లభించును.కళత్రాధిపతి స్వక్షేత్ర,ఉచ్ఛ,వర్గోత్తమాదులు కాక మరొకచోట ఉన్నను అష్టమ వ్యయములందున్నను భార్య రొగిణి యగును.సప్తమమున శుక్రుడున్న అతడు అతి కామకుడగును.ఎక్కడో ఒకచోట ఉండి పాపగ్రహయుక్తుడైన స్త్రీమూలకమైన మరణము కల్గును.
కళత్రాధిపతి బలవంతుడై,శుభగ్రహములతో కూడినను చూడబడినను జాతకుని సర్వసుఖ సంపత్తిశాలినిగా జేయును.కళత్రాధిపతి అస్తంగతుడైనా,నీచ,శత్రురాశుసందున్నా,అతి దుర్బలుడైనా,అతని భార్య రోగిణి అగును.అతడు బహు భార్యలు కలవాడగును.
సప్తమాధిపతి శుక్రక్షేత్రమునగాని,శని క్షేత్రమునగాని ఉండి శుభగ్రహదృష్టుడు ఉచ్ఛస్థుడైన జాతకుడు బహుపత్నీకుడగును.
సప్తమమున రవియున్న భార్యవంధ్య యగును చంద్రుడున్న రాశిలో స్వభావానుకూల భర్యకల్గును.కుజుడున్న రజస్వలా సంగము,వంధ్యాసంగము కల్గును.బుధుడున్న వేశ్యకాని,హినకాని వణిక్ స్త్రీగాని లంభించును.గురుడున్న బ్రాహ్మణ భార్యగాని,గర్భిణిగాని దొరుకును.శని రాహుకేతువులున్న హీనురాలు,పుష్పవతి లభించును.సప్తమమున కుజుడున్న సుస్తని భార్యయగును.శనియున్న దుర్భలయు,రోగపీడితయు నగును.గురుడున్న కఠినమైన పైకున్న కుచములు,కలది,శుక్రుడున్న స్థూలలమైన ఉత్తమస్తని భార్యయగును.సప్తమమున,వ్యయమున పాపులుండి,పంచమము చంద్రుడున్న - వాడు భార్యవశ్యడు,జాతి విరోధియగును.
సప్తమమున శని కుజులున్నను,వారు సప్తమాధిపతులైనను,అతని భార్య వేశ్యగాని,పరపురుషాసక్తగాని యగును.శుక్రకుజు క్షత్రమున నున్నను,కుజనవాంశలో ఉన్నను,కుజునితో కలిసివున్నను,చూడబడినను భగచుంబనము చేయును.శుక్రుడు శన్యంశలో నున్నను,శనిక్షేత్రమున ఉన్నను,శనితో కూడినను,చూడబడినను శిశ్నచుంబనపర డగును.
సప్తమాధిపతి ఉచ్ఛయందుండి,సప్తమ శుభగ్రహయుక్తమై,ప్రబలమైన లగ్నాధిపతి సప్తమమున ఉన్న అతని భార్య పుత్రపౌత్రాదులు కలిగి సుగుణవతి యగును.సప్తమాధిపతి శత్రుస్థానమున నున్నను లేదా నీచరాశిగతుడైనా,అస్తంగతుడైనా,పాపగ్రహములచే చూడబడినా,అట్లే సప్తమభావము పాపాక్రాంతమైనా,పాపదృష్చమైనా వానికి భార్యహాని కలుగును.సప్తమాధిపతి షష్ఠమున,అష్టమమున,వ్యయమునగాని యున్నను,దుర్బలుడైనా,నీచరాశిగతుడైనా దారనాశము చెప్పవలెను.కళత్రస్థానము చంద్రుండుండి,కళత్రాధిపతి వ్యయమందుండి కళత్రకారుడు బలహీనుడైయున్న వానికి దారసౌఖ్య ముండదు.
Thursday, June 28, 2018
*సప్తమ(కళత్ర)భావ ఫలాధ్వాయము*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment