పరాశరులన్నారు:- జతకుని దేహమున రోగవ్రణాదికము తెలియునట్టి షష్ఠభావఫలము చెప్పుచున్నాను.షష్ఠాధిపతి పాపుడై లగ్నమునకాని.అష్టమమున గాని ఉన్న,భావరాశ్యాశ్రితమైన అవయవమున వ్రణము కలుగును.ఇట్లే పిత్రాది భావాధిపతులు షష్ఠాధిపతితో కలిసి షష్ఠాష్టమము లందున్న ఆ పిత్రాదులకు వ్రణములు కలుగునని చెప్పవలెను.షష్ఠాధిపతి రవితో కలిసియున్న శిరోవ్రణమున్ను,చంద్రువితోనైన ముఖమందును,కుజునితో చేరిన కంఠమందును,బుధునిచే నాభియందును గురువిచే ముక్కునందు,శుక్రునిచే కన్నులందు,శనియైన పాదములందు,రాహుకేతువులైన ఉదరమందును వ్రణము కలుగును.లగ్నాధిపతి కుజక్షేత్రమునగాని,బుధక్షేత్రమునగాని ఉన్నను,ఎక్కడ ఉన్నను బుధునిచే చూడబడినచో ముఖరోగము కలుగును.
*కుష్ఠ రోగము*
లగ్నాధిపతులైన కుజబుధులు శనిరాహుచంద్రులతో కలిసిన కుష్ఠరోగము కలమగును.లగ్నమున రాహుచంద్రులుండి,లగ్నాధిపతి లేకున్న శ్వేతకుష్ఠమును,శనియున్న కృష్ణకుష్ఠమును,కుజుడున్న రక్తకుష్ఠమును - ఇట్లు కలిసిన గ్రహవర్ణముకల కుష్ఠము నాలోచించ చెప్పవలెను.
*రోగ గండములు*
షష్ఠామాధిపతులు రవితో కలిసి లగ్నమందున్న జ్వరగండము,కుజునితో నున్న గ్రంథివాతములేక శస్త్ర వ్రణము,బుధునితో కలిసిన పైత్యరోగము,గురునితోనైన రోగముండదు.శుక్రునితోనైన స్త్రీలద్వారా రోగము,శనితో వాతప్రకోపమును,రాహువుతోనైన నాభియందు వ్రణము,కేతువుతో తలిసిన గృహభీతియు,చంద్రునితో కలిసిన జలగండము,లేదా కఫశ్లేష్మ ప్రకోపము చెప్పవలెను.ఇట్లు ప్రిత్రాది భావవశమున తండ్రి మున్నగువారికిన్నీ గండము నూహించి చెప్పవలెను.
*వివిధ రోగ గండములు*
షష్ఠమున పాపడుండి షష్ఠాధిపతి పాపయుక్తుడైన,శని రాహువుతో కలసి యున్నచో జాతకుడు డెప్పుడును రోగయుక్తుడై యుండును.కుజుడు షష్ఠమందుండి,షష్ఠేశుడు అష్టమమందుండగా ఆరు లేక ప్రండ్రెండవయేట జ్వరముచే బాధపడును.గురుడు షష్ఠమందుండి,గురుక్షేత్రము చంద్రయుక్తమైన 19 లేక 22 యేట కుష్ఠురోగము కల్గును.రాహువు షష్ఠమందుండి,మాంది కేంద్రమందుండి,లగ్నాధిపతి అష్టమమందున్న 26 వ యేట క్షయరోగము కల్గును.వ్యయాధిపతి షష్ఠమందుండి షష్ఠాధిపతి వ్యయమందున్న (పరివర్తనము)29 లేక 30వ యేట రక్తకుష్ఠము కల్గును.షష్ఠమందు చంద్రుడు శనియున్న ,55వ యేట రక్తకుష్ఠము కల్గును.లగ్నాధిపతి లగ్నమందుడి శని శత్రుగ్రహముతో కలిసియున్న 5వ యేట వాతరోగము కల్గును.అష్టమాధిపతి షష్టమందుండి,వ్యయాధిపతి లగ్నమందుండి,చంద్రుడు షష్ఠాధిపతితో కూడినయెడల 8వ యేట మృగభయముండును.షష్ఠమందుగాని,అష్టమమందుగాని రాహువువుండి,వానికి అష్టమమున శనియున్న,జాతకునకు ఏడాదిలో గాని రెండవయేట గాని అగ్నిబాధ,మూడవయేట పక్షిదోషము తగులును.రవి షష్ఠ అష్టమములందుండి,దానికి వ్యయమున చంద్రుడున్న 5 లేక 9వ యేట జలగండమున్నది.అష్టమమున శనియుండి,అష్టమమునకు ద్వాదశమైన సప్తమమున కుజుడున్న 10 లేక 30వ యేట స్ఫోటకము కల్గును.రాహువుతో కూడిన అష్టమాధిపతి తన నవాంశలో అష్టమ,నవమ,పంచమములలో ఉన్న 18లేక 22వ యేట ప్రమేహాది రోగపీడ కల్గును.లాభాధిపతి షష్ఠమున ఉండి,షష్ఠాధిపతి లాభమున ఉన్న(పరివర్తనము)31వ యేట శత్రుమూలమున ధనవ్యయ మగును.పంచమాధిపతి షష్ఠమందుండి,షష్ఠాధిపతి గురునితో కూడియున్న వ్యయధిపతి లగ్నమందున్న వానికి పుత్రుడు శత్రువగును.లగ్నాధిపతి షష్ఠమందుండి,షష్ఠాధిపతియు అక్కడనే యున్న 10లేక 19వ ఏట శునకభాధ కల్గును.
Sir
ReplyDeletePlease change the background color, its difficult to read telugu with bright letters on dark background
thank you very much for your great analysis. I follow your blog regularly for knowledge on astrology
thanks
Krishna