Thursday, May 31, 2018

*పంచమ(పుత్ర)భావ ఫలాధ్యాయము*

పంచమభావఫలముల చెప్పుచున్నాను;- లగ్నాధిపతి పంచమాధిపతియు పంచమమున ఉన్నను,కేంద్రకోణగతులైననన పుత్రుల సుఖము పూర్తిగా ఉండును.పంచమాధిపతి 6,8 12 లలోనున్న పుత్రులుండరు.పంచమాధిపతి అస్తంగతుడైనను,దుర్భలుడైనా కొడుకులు పుట్టరు; పుట్టినా చనిపోవుదురు.పంచమాధిపతి షష్ఠమున ఉండిన,లగ్నేశుడు కుజునితో కలిసియున్న ప్రథమ సంతానము చనిపోవును.అతని భార్య కాకవంధ్య(ఒక్కసారిమాత్తమే కన్నది)అగును.పంచమాధిపతి నీచస్థుడై పంచమమున చూడకున్న,పంచమమున శనిబుధులున్న కాకవంధ్య అగును.భాగ్యాధిపతి లగ్నమున ఉండి,పంచమాధిపతి నీచస్థుడైనా పంచమమున కేతుబుధులున్నా సుతుడు కష్టమున (ధర్మానుష్ఠానాదులు చేసినందున)కలుగును.పంచమాధిపతి త్రిక(6,8,12)స్థుడైనా,నీచస్థుడైనా,శత్రుక్షేత్రవర్తియైనా,పంచమమందున్నను కష్టమున పుత్రోత్పత్తి యగును.
పుత్రస్థానమున,బుధక్షేత్రమునగాని (కన్యామిథువములు)శనిక్షేత్రమున గాని(మకరకుంభములు)శనియుండి,మాందీగ్రహముతో కూడినను,చూడబడినను,దత్తాదిపుత్రులు కలుగుదురు.రవిచంద్రులోకేరాశి ఓకే అంశలో ఉన్న ముగ్గురు తల్లులచేగాని,ఇద్దరు తండ్రులచేగాని పోషింపబడును.పంచమమున ఆరుగ్రహములుండి,పంచమాధిపతి వ్యయమునున్న లగ్నాధిపతిచంద్రులు బలవంతులైన దత్తపుత్రాదులు కల్గుదురు.పంచమము బలవంతులైన బుధగురుశుక్రులతో కూడినను,చూడబడినను పంచమాధిపతి బలవంతుడైనా చాలమంది పుత్రులు కలుగుదురు.
పంచమాధిపతి చంద్రునితోకూడి చంద్రద్రేక్కాణమున ఉన్నచో కన్యకలే కలుగును.
పంచమాధిపతి చరరాశియందుండి,చంద్రుడు రాహువుతో కూడియుండి,పుత్రస్థానమున శనియున్న జాతకుడు పరజాతుడనవలెను.చంద్రునికష్టమమున గురుడుండి లగ్నమున కష్టమమున చంద్రుండి,పాపగ్రహములచే చూడబడిన కూడినా,జాతకుడు జారజుడని  తెలియదగినది.
ఉచ్ఛస్థుడైన పుత్రస్థానాధిపతి 2,3,5,9 స్థానములందుండి,గురునితో కూడినను,చూడబడినను పుత్రభాగ్యము కలుగును.పంచమమున ముగ్గురు నలుగురు పాపులుండి,శుభులు లేకుండ,పంచమాధిపతి నీచస్థుడైన జాతకుడు నీచుడగును.

No comments:

Post a Comment