Sunday, May 27, 2018

*తృతీయ(సహజ)భావ ఫలాధ్యాయము*

ఇక సోదరభావఫలము చెప్పుదును.తృతీయము శుభగ్రహయుక్తమైనా,శుభగ్రహములచే చూడబడినా జాతకుడు భ్రాతృమంతుడగును.భ్రాతృస్థానాధిపతి కుజునితో కలిసియుండి,భ్రాతృస్థానమును చూచుచున్నను,భ్రాతృక్షేత్రమునఉన్నను,సోదరసుఖము కలుగును.భ్రాతృపతి,కుజులిద్దరు పాపులతో కూడినను,పాపక్షేత్రములందు కలిసినను,సోదరనష్టము కలుగును.
భ్రాతృభావాధిపతి స్త్రీగ్రృహముకాని,స్త్రీగ్రహము తృతీయమందుకానిఉన్న సోదరియుండును.పురుషరాశి పురుషగ్రహమునైన సోదరుడుండును.మిశ్రమములైన మిశ్రఫలమే చెప్పవలెను.బలాబలములు సరిచూచి చెప్పవలెను.తృతీయాధిపతి కుజుడు అష్టమమున పాపయుక్తులై ఉన్నను,పాపదృష్టులైనను సోదరులు చవిపోవుదురు.తృతీయాధిపతిగాని,సోదరకారకుడుగాని కేంద్రకోణ,ఉచ్ఛమిత్ర,స్వక్షేత్రములందు స్వవర్గలందున్నను భ్రాతృసౌఖ్యము చెప్పవలెను.భ్రాతృపుడుగాని,కారకుడుగాని,శుభయుక్తుడుగాని,శుభగ్రహవీక్షితుడుగానియైనను,భ్రాతృభావము బలయుక్తమైనను భ్రాతృవృద్ధి చెప్పనగును.
తృతీయమున బుధుడుండి,తృతీయాధిపతి చంద్రునితో కూడియుండి భ్రాతృకారకుడు శనితో కలిసియున్న జాతకునకు  అక్క ఒకామెయు,చిన్నవాడొక సోదరుడు ఉండి,చిన్నవాడొకడన మృతుడగును.కారకుడు రాహువుతో కూడియుండి,భ్రాతృధిపతి నీచయందుండినను,తనతర్వాత సోదరులుందురు;పైన ముగ్గురుందురు.భ్రాతృభావాధిపతి కేంద్రమునుండి,కారకుడు వానికి త్రికోణమున గురునితో కూడ ఉచ్ఛయందున్న యెడల పండ్రెండుగురు సోదరులుందురు.అందులో అన్నలిద్దరు,ఇతడు మూడు,ఏడు,తొమ్మిది,పండ్రెండు చనిపోగా,మిగిలిన ఆరుగురు దీర్ఘాయుష్మంతులుగా నుందురు.
లాభాధిపతితో కుజుడు కలిసియున్నను,గురునితో కూడియున్నను,తృతీయమున చంద్రుడున్న యెడల ఏడుగురు సోదరులుందురు.తృతీయమున చంద్రుడుండి,పురుషగ్రహముచే చూడబడిన సోదరులే ఉందురు;శుక్రునిచే కూడినను,చూడబడినను స్త్రీ సోదరులుందురు.తృతీయమున రవియున్న అగ్రజులు చనిపోవుదురు.కుజుడున్న పెద్దవారు,చిన్నవారు ఉభయులును చనిపోవుదురు.

No comments:

Post a Comment