ప్రథమ శాస్త్రమును అనుసరించి వాస్తుచెప్పబడుచున్నది.అటుపిమ్మట గురు,శుక్రమౌఢ్యములు లేని మాసమున పంచాంగశుద్ధి గలశుభ లగ్నమునందు గృహనిర్మాణమును ప్రారంభించవలయును.
గృహనిర్మాణము చైత్రమాసమందు చేసిన ధనలాభము శుభప్రదము,వైశాఖమాసము శుభమని తెలియవలయును.జ్యేష్ఠమాసమునందు మరణము నిశ్చయముగా గలుగును.ఆషాఢమాసమున గో సమూహమును హతమార్చును.శ్రావణమాసమునందు సేవకులు,పరిచారికలు జననసమృద్దియును,భాద్రపదమాసమునందు వ్యాధి,దుఃఖమును,ఆశ్వయుజమునందు కలహములును,కార్తికమాసమందు ధనలాభమును కలుగును.మార్గశిరమాసము నందు ధననాశనమును,పుష్యమాసమునందు అగ్నిభయమును,మాఘమాసము నందు అనేక పుత్రప్రాప్తియును,ఫాల్గుణ మాసమునందు శరీర నాశనమును అగును.చైత్రది 12 మాసముల యెుక్క శుభాశుభములు ఫలములు కలుగును చుండును.అనగా ఈ మాసములందు నూతన గృహారంభము చేసిరేని ఆయా ఫలములు కలుగును.
రవి,వృషభ,కర్కాటక,సింహ,కుంభ,మేష,తులా,వృశ్చిక,మకర రాశులందుండగా నూతన గృహారంభము చేసిన పుత్ర,పౌత్ర,సంతానాభివృద్ది కలుగును.
రవి స్థిరరాశులందుండగా గృహనిర్మాణము శుభకరం,రవి చరలగ్నము లందున్న మధ్యమము,ద్విస్వభావ రాశులందు రవియున్న అధమం అని గుర్తించగలరు.
గురు శుక్రుల మౌఢ్యమునందును,బాల,వృద్ధత్వమందును,శూన్యమాసమునందును,గృహనిర్మాణము చేయ ఒప్పిదముకాదు.
*గృహద్వార నిర్ణయములు*
రవి సింహరాశియందుండగా పడమర దిశయందు ద్వారమును,వృషభరాశి యందుండగా ఉత్తరదిశయందును,కుంభరాశి యందుండగా తూర్పుదిశ యందు ద్వారమును,వృశ్చికరాశి యందుండగా దక్షిణదిశయందు ద్వారముతో నిర్మింపబడేనేని ఆ ఇల్లు శుభకరము,సౌఖ్యము,వృద్ధి కలుగును.
రవి మకరమందుండగా పడమర ద్వారమును,తులారాశి యందుండగా ఉత్తర ద్వారమును,కర్కాటక రాశియందుండగా తూర్పు ద్వారమును,మేషరాశియందుండగా దక్షిణద్వారమును,నిర్మించిన అట్టిద్వారములుంచి ఆయా కాలములందు నిర్మించిన గృహములు మధ్యమములు.
*నక్షత్రముల వివరణ*
ఉత్తర,ఉత్తరాషాఢ,ఉత్తరాభాద్ర,చిత్త,రోహిణి,స్వాతి,జ్యేష్ఠ,మృగశిర,మూల,అశ్వని,హస్త,అనూరాధ,ఈ నక్షత్రములు గృహవాస్తు కర్మలందు ఎల్లప్పుడు ప్రశస్తమైనవి.
రోహిణి,మృగశిర,చిత్త,హస్త,జ్యేష్ఠ,ఉత్తర,ఉత్తరాషాఢ,శ్రవణం అను ఈ 8 నక్షత్రములు గృహకర్మలందు ప్రశస్తమైనవి.
స్వాతి,పుష్యమి,అనూరాధ,అశ్వని,శతభిషం,ఉత్తరాభాద్ర,రేవతి అను 7 నక్షత్రములు వాస్తు కర్మలందు మధ్యమ ఫలితముల నిచ్చును.మిగిలిన నక్షత్రములు విడిచి పెట్టవలయును.
*యెాగముల వివరణ - కరణముల వివరణ*
పరిఘయెాగమునందు మెుదటి సగము,వైధృతి యెాగము మెుత్తమును,గండ మరియు అతిగండ యెాగములందు మెుదటి 6 ఘడియలును,శూలయెాగమున మెుదటి 5 ఘడియలను విడువవలయును.
వ్యాఘాతనామయెాగమందు 9 ఘడియలును,మిగిలిన నిద్యములైన యెాగములందు సమస్తమును,విష్టి అంటే భద్రవాకరణము సమస్తమును వాస్తు కర్మలందు విడిచి పెట్టవలయును.
*లగ్నముల వివరణ*
శుభగ్రహములతో కూడి యుండునది లేక చూడబడినదియు,షడ్చలములతో కూడినదియు శుభగ్రహముల బలము కలిగినట్టి ద్విస్వభావ లగ్నమందుగాని,స్థిరలగ్నమందు గాని గృహనిర్మాణము చేయవలయునని మహర్షులచే చెప్పబడినది.
3,6,11, స్థానములు పొందినట్టి పాపగ్రహముల చేతను,పంచమ,నవమస్థానములను పొందిన శుభగ్రహముల చేతను గృహారంభము చేయుటమేలని సత్పురుషులతో చెప్పబడినది.వాస్తుకర్మలందు 8వ స్థానమున పాపగ్రహములున్న గృహకర్తకు మరణప్రధమట.
వృషభ లగ్నమున వెన్నుగాడి శుభప్రదము,రోహిణి నక్షత్రమందు నూతన గృహప్రవేశము మంచిది అని విద్యాంసులు చెప్పుదురు.
చంద్ర లగ్నమున స్థంభము నాటుట,బుధ లగ్నమును వాసపోయుట,శుక్ర లగ్నమున కప్పుట శుభదాయకము.ఈ ప్రకారము చేసిన అగ్నిభయ ముండదు.
త్రికోణ కేంద్రములను పొందిన శుభగ్రహములును,అట్లాగే 3,6,11 స్థానములను పొందిన పాపగ్రహములును గృహారంభము వలన కలిగిన దోషములను నిసంశయముగా పోగొట్టును.
లగ్నమున చంద్రునితోడ గురువు కలసినను,శుక్రుడు శత్రువే కాని లగ్నమును పొందిన వారగుచుండగా అట్టి సమయమున ప్రారంభించబడిన ఇల్లు అగ్నిచేత దహింపబడదు.
శుక్రుడైనను,గురువు అయినను లగ్నమందుండగను,బుధుడు గోధూళికా లగ్నమును బొందుచుండగా నిర్మించిన గృహము 100 సంవత్సరములుండుననుట సందేహము లేదు.
No comments:
Post a Comment