గ్రహావస్థలు
గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు.
స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.
ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు ఉన్న భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా చేసుకుని గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు.
గ్రహాల సంచారం..తెలుసుకోనే ప్రయత్నం చేద్దాం !
గ్రహాల సంచారం
ఒకొక్కరాశి 30 డిగ్రీల నిడివి కలిగి ఉంటుంది.12 రాశులుంటాయి .రాశి చక్రం మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది.
ప్రతి గ్రహాం రాశిలో ఉన్న 30 డిగ్రీలలో 27 డిగ్రీలు దాటిన తరువాత రాబోవు రాశిని చూచును.
రవి :-ఒక్కొక్క రాశిలో నెల రోజులుండును.5 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రవి రోజుకు "1"డిగ్రీ చొప్పున సంచారం జరుపును.
చంద్రుడు :-ఒక్కొక్క రాశిలో రెండున్నర రోజులుండును.3 ఘడియలు (72 నిమిషాలు) ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.చంద్రుడు "1"డిగ్రీ కదలటానికి 1 గంట 48 నిమిషాలు పట్టును.ఆంటే రోజుకు 13 డిగ్రీల నుండి 15 డిగ్రీల వరకు సంచారం జరుపును.
కుజ :-ఒక్కొక్క రాశిలో సుమారు 45 రోజులుండును.8 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకు 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు సంచారం జరుపును.
బుధ :-ఒక్కొక్క రాశిలో సుమారు నెల రోజులుండును.7 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.30 డిగ్రీలను దాటటానికి 27 రోజులు పట్టును.రోజుకు ఒకటిన్నర డిగ్రీలు సంచారం జరుపును.రవి నుండి 28 డిగ్రీలు దాటి ముందుకు గాని వెనుకకు గాని వెళ్ళడు.
గురుడు :-ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం రోజులుండును.2 నెలల ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకి 5 నుండి 15 నిమిషాల వరకు సంచారం జరుపును.
శుక్రుడు :-ఒక్కొక్క రాశిలో సుమారు నెల రోజులుండును.7 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకి 1 డిగ్రీ (65 నిమిషాల నుండి 85 నిమిషాల వరకు)సంచారం జరుపును.రవి నుండి 47 డిగ్రీలు దాటి ముందుకు గాని వెనుకకు గాని వెళ్ళడు.
శని :-ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరములుండును.4 నెలలు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.నెలకు ఒక డిగ్రీ చొప్పున రోజుకి 2 నిమిషాలు సంచారం జరుపును.
రాహువు,కేతువు :-ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరములుండును.3 నెలల ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును. రోజుకు 3 నిమిషాలు చొప్పున సంచారం జరుపును.

Super
ReplyDeleteThank you so much
DeleteNice Information! Thanks for sharing.
ReplyDeleteThank you so much.
Delete