*గృహారంభమునకు సాముదాయకముగా శుభ సమయములు*
*తిభతిథులు*: శుక్లపక్ష విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశ,త్రయెాదశి,పూర్ణిమి తిథులు బహుళపక్షమున విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి తిథులు.
*శుభ వారములు*: సోమ,బుధ,గురు,శుక్రవారములు.
*శుభనక్షత్రములు*:అశ్వని,రోహిణి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాఢ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,శ్రవణ,ధనిష్ఠ,శతభిషము,రేవతి.
*శుభలగ్నములు*:వృహభ,మిథున,సింహ,కన్య,వృశ్చిక,కుంభం,మీనం.
*మిశేషములు*:గురుశుక్ర మౌఢ్యములందు శూన్యమాసములందు వాస్తు కర్తరీ యందు చేయకూడదు.లగ్నమునకు అష్టమశుద్ది కలిగియుండవలయును.వృషభ,కలిశ చక్రశుద్దులు కలిగియుండుట మేలు.చతుర్థస్థానమున పాపగ్రహము లుండరాదు.ప్రతి లగ్నమునకు తారా చంద్ర బలమును ముఖ్యముగా పరీశీలించ గలరు.పగటికాలము లేదా తెల్లవారు జాములందు గృహనిర్మాణము చేయుట మేలు.
*నూతన గృహప్రవేశము*
శుభగ్రహవారమందును,శుక్లపక్షమునందును గురు,శుక్రులు బలయుక్తులై యుండాగా (గురుశుక్ర మౌఢ్యములు,బాల,వృద్దత్వము లేనిచో బలవంతులు)ఉత్తరాయణమునందు నూతన గృహప్రవేశము శుభదాయకమైననది.అటు తరువాత వాస్తుపురుషుని యెుక్క పూజ,భూతబలిని చేయవలయును.
మాఘ,ఫాల్గుణ,వైశాఖ,జ్యేష్ఠమాసములు శుభప్రదమైనవి.మార్గశిర కార్తీక మాసములు మధ్యమ ఫలముల నిచ్చునట్టివిగా తెలుసుకొనవలయును.
ఆది మంగళవారములను,రిక్తతిథులు అంటే చవితి,నవమి,చతుర్దశి తిథులు అమావాస్యను విడిచి మిగిలిన దినములందు పగటి యందు గాని,రాత్రియందు గాని నూతన గృహప్రవేశమునకు శుభము నిచ్చునది యగును.
సోమ,బధ,గురు,శుక్రవారములందు నూతన గృహప్రవేశము చేసిన పుత్రులు,పౌత్రులు,సకల సంపదలు,అధిక ధనలాభము నిచ్చును.శనివారమునందు గృహప్రవేశము చేసిన స్థిరత్వము నిచ్చును.కాని శనివారమునందు చోరభయముండును.
రిక్తతిథులగు చవితి,నవమి,చతుర్దశి యందును తిథిదినత్రయమును,శూన్యతిథులు,(ఖండతిథులు)సూర్య చంద్రులచేత చూడబడినట్టియు,పాపగ్రహములున్నట్టియు,పాపగ్రహములు ప్రవేశించబడునట్టియు నక్షత్రములును,తిథిషడ్వర్గ నక్షత్రములును గృహప్రవేశమందు విడిచిపెట్టదగినవి దీనినే పాపగ్రహక్రాంతము అందురు ప్రసిద్ద పంచాంగములందు రవిక్రాం,కుజక్రాం,శనిక్రాం,రాహుక్రాం,కేతుక్రాం,అంటూ తెలియజేయుదురు.
రోహిణి,ఉత్తర,ఉత్తరాషాఢ,ఉత్తరాభాద్రా,నక్షత్రములు నూతన గృహప్రవేశమునకు శుభప్రదమైనది.రేవతి,జ్యేష్ఠ,అనూరాధ,నక్షత్రములందు పాతదియైన నూతనగృహమందు ప్రవేశమునకు శుభప్రదమైనది.అశ్వని,హస్త,శ్రవణ,పుష్యమి నక్షత్రములందు నూతన గృహప్రవేశము మంచిది కాదు.అలాగే పాత ఇంటి గృహప్రవేశమునకు మంచివి కావు.రవి కుంభరాశి యందును,కర్కాటక రాశియందును,కన్యారాశి యందున్న కాలమందు గృహప్రవేశము చేయరాదు.
హస్త,స్వాతి,పుష్యమి పునర్వసు,అశ్వని,శ్రవణా నక్షత్రములందు నూతన గృహప్రవేశము చేసిన 3 సంవత్సరముల పైన పరులచే చిక్కును.మిగిలిన నక్షత్రములందు మృత్యుప్రదమగును.
రోహిణి,ఉత్తర,ఉత్తరాషాఢ,ఉత్తరాభాద్ర,పూర్వాషాఢ,అనూరాధ,మృగశిర,చిత్త,రేవతి,ధనిష్ఠ నక్షత్రములందు నూతన గృహప్రవేశము చేసిన సంపదను కలిగించునది యగును.జ్యేష్ఠ,పుష్యమి,నక్షత్రములందు నూతన గృహప్రవేశము చేసిన మధ్యమ ఫలములు కలిగించును.
కేంద్రము అనగా 1,4,7,10 స్థానములందు శుభగ్రహములును,అష్టమమందు గ్రహములు లేకుండగను,గురు శుక్రులు ధనుర్మీన,తులా వృషభములలో నొక లగ్నమునందున్నను లేక స్థిరలగ్నములందున్నను,చంద్రడు బలవంతుడుగా యున్న గ్రామమందుగాని,తోటి యందుగాని,గృహమందుగాని ప్రవేశించవలయును.
జన్మనక్షత్రమున గాని,జన్మ లగ్నమున గాని ఆరెండింటి కంటె 3,6,10,11 స్థానమున గాని నూతన గృహప్రవేశమైన సంతానము ధనము ఇచ్చునట్టి దగును.జన్మనక్షత్రలగ్నములకు మరియెుక లగ్నమునందైతే దుఃఖము,కీడు,రోగము,దారిద్ర్యము కలిగించును.బంధువులకు సంతానమునకు హాని చేయనట్టియు,కళత్ర హాని చేయునట్టియు మృత్యుప్రదము,కీడు చేయునట్టిది యగును.
జన్మరాశియందలి గృహప్రవేశము సకలకార్యసిద్ధి,ధనమును కలుగజేయునట్టిది,భయనాశనము చేయునట్టిది యగును.
తలుపులు లేనట్టిదియు,బలిహరణ,బ్రాహ్మణ భోజనములు చేయకున్నది యు,పైకప్పు లేనిదియగు గృహమున ప్రవేశించరాదు.అట్టుగాక గృహప్రవేశము చేసిన అ గృహము ఆ పదలకు నిలయమగును.
No comments:
Post a Comment