Wednesday, March 28, 2018

అసలు కుజదోషం అంటే ఏంటో తెలుసుకుందామా?

మనలో ప్రతి ఒక్కరూ సహజంగా వివాహ సమయంలో జాతకాలు చూసేటప్పుడు కుజదోషం అనే పదాన్ని వింటూనే ఉంటాం. కుజదోష నిర్ధారణ విషయంలో ఒక్కో పండితుడు ఒక్కోరకంగా నిర్ధారిస్తారు. అసలు కుజదోషం అంటే ఏంటో తెలుసుకుందామా?

నవగ్రహాలలో కుజుడిది మూడో స్థానం. కుజుడికి మంగళుడని, అంగారకుడని పేర్లు కూడా కలవు. మేష, వృశ్చిక రాశులకు ఈయన అధిపతి. మకరం ఉచ్చస్థానం, కర్కాటకం ఇతనికి నీచస్థానం. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు.

మార్గాలు.. వాటి సంగతి పక్కన పెడితే దోష స్థానంలో ఉన్న కుజునికి బుధ గురు గ్రహముల వీక్షణ కలిగినట్లైతే దోషం పరిహారమతుందనీ, అదే విధంగా దోష స్థానంలో ఉన్న కుజునితో గురువుగానీ చంద్రుడు గానీ కలిసి ఉన్నట్లైతే దోషపరిహారం కుజుడు కోప స్వభా వం కలిగినవాడు కావడంతో కుజుడి ఆధిపత్య కాలంలో సోదరుల మధ్య వివాదాలు, రుణబాధలు, భూవివాదాలు తలెత్తుతాయి. .

అయితే... ఒకరి జాతకంలో మాత్రమే కుజదోషం ఉంటే కష్టనష్టాలు కలుగుతాయి. ఇందులో భాగంగా... పురుషులకు 2, 12 స్థానాల్లోనూ, స్త్రీలకు 4, 7 స్థానాల్లోనూ... ఒకవేళ ఇద్దరికీ ఎనిమిదో స్థానంలో కుజుడు ఆధిపత్యం వహించినట్లైతే కుజదోషం తప్పకుండా ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు.

వధూవరులకు కుజదోషం లగ్నం నుండి, చంద్రుని నుండి, శుక్రుని నుండి 1, 2, 4, 7, 8 మరియు 12 స్థానాలలో అంగారకుడు ఉన్నట్లైతే... అలాంటి దంపతులు దీర్ఘకాలం సుఖసంతోషాలతో జీవిస్తారు. సంతాన సంపత్తి కూడా కలుగుతుంది.

అయితే ఒకరి జాతకంలో కుజదోషం ఉండి, మరొకటి జాతకంలో లేనివారికి వివాహం జరిపిస్తే ఆ దాంపత్యం చిరకాలం వర్ధిల్లదు. పుత్రనాశనం, మరణభయం కలుగుతుంది. వధూవరులిద్దరికీ కుజదోషం అనేది ఉంటే మంచిదే. దీనివల్ల శుభాలు కలుగుతాయని జ్యోతిష్కులు అంటున్నారు.

అలా కాకుండా ఇద్దర్లో ఏ ఒక్కరికో కుజదోషం లేకుంటే... అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం జరిపించటం మంచిది కాదు. జాతక ఫలాల్లో పెళ్లికి ప్రధాన అడ్డంకిగా అందరూ చెప్పుకునేది కుజదోషం. సాధారణంగా ఈ కుజదోషం స్త్రీ పురుషులు ఇద్దరికీ వారి జనన సమయంలో సంప్రాప్తిస్తుంది. వివాహాది సంబంధ విషయాలలో వధూవరుల జాతక ఫలాలను సరిచూసుకోవటం ఇప్పుడు ప్రతి ఇంటా జరుగుతున్న విషయం. కుజదోషం ఉండి దానికి సరైన పరిహారం చేయని వారి వివాహబంధంలో దాంపత్య అనుకూలత లోపించి సమస్యలు కలుగుతాయి. కనుక వధూవరులిద్దరూ తప్పనిసరిగా జాతక ఫలాలు చూసుకోవలసి ఉంటుంది.

ప్రధానంగా వరుని జాతకంలోని కుజదోషం వధువుకి, వధువు జాతకంలోని కుజదోషం వరునికి కీడు కలుగుతుందని అభిప్రాయం. అయితే వధూవరులు ఇద్దరికీ కుజదోషం ఉన్నట్లైతే దోష పరిహారం జరిగి శుభం చేకూరుతుంది. ఈ విషయంలో వధూవరులిద్దరికీ జాతకంలో సమపాళ్లలో దోషమున్నట్లైతేనే వివాహం చెసుకోవచ్చునన్న అభిప్రాయం ఉంది. ఈ దోషం స్త్రీలకు మాత్రమే ఉన్నట్లైతే దాంపత్య కలహం వంటి అనేక దుష్పరిణామాలు చోటు చేసుకోగలవని శాస్త్రవేత్తల అభిప్రాయం.

కుజదోష పరిహారానికి ఎన్నో జరుగుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. కనుక కుజదోష నివారణకు అనుసరించవలసిన మార్గాలను అన్వేషించి దోషం నివారణ జరిగిన తర్వాతే వివావ కార్యక్రమాలకు పూనుకోవాలని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కుజదోషం అని పండితులు చెప్పగానే వధూవరుల తల్లితండ్రులు కుమిలి కుమిలి పోతుంటారు. అలా బాధపడే వారందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే..."కుజదోషంపై నిజానిజాలు" ఇవ్వటము జరిగింది జాతకాలలో కుజగ్రహం జన్మలగ్నము నుంచి 2, 4, 7, 8, స్థానాలలో వుంటే కుజదోషముండునని తెలుసుకున్నాము. మరి ఈ కుజదోషం కొందరికి వర్తించదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరెవరికి ఈ కుజదోషం వర్తించదో ముందు తెలుసుకుందాం. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం కుజగ్రహం తన నీచస్థానమైన కర్కాటక రాశిలో వుండి వుంటే, అట్టివారికి కుజదోషం వర్తించదని భావం. అలాగే కుజుడికి తన స్వక్షేత్రములైన మేష వృశ్చిక రాశులలో గానీ, ఆయా లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. కుజగ్రహానికి మిత్రులైన రవి గురుల రాశులైన సింహ, ధనుస్సు, మీన రాశులలో గానీ, లగ్నాలలో గానే జన్మించివుంటే కుజదోషము వర్తించదు. కుజగ్రహానికి ఉచ్చస్థానమైన మకరరాశి యందు లేక మకరలగ్న మందు జన్మించిన వారికి కుజదోషము వర్తించదు. మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర, మీన రాశులలో గానీ, లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం భంగమగునని, భయపడవలసిన అవసరం లేదని........ పైన పేర్కొన్న పేరా సారాంశం. మొత్తం 12 రాశులలో 7 రాశుల జాతకులు పోనూ..... మిగిలిన అయిదు రాశుల జాతకులకు కుజదోషం వుంటే భంగం కాదనే కదా సారాంశం. మరి ఆ రాశులు ఏమిటంటే... వృషభ, మిధున, కన్య, తుల, కుంభ రాశులు... మరి ఈ రాశులలో మాత్రమే గాక మొత్తం 12 రాశులలో ఏ రాశివారికైన కుజదోషం వుండి వుంటే, వారి జాతకంలో కుజుడిని, గురుగ్రహం విశేష దృష్టులతో చూస్తూవుండిననూ కుజదోషం వర్తించదనే శాస్త్ర నిర్ణయములున్నవి.

రెండవ స్థానంలో కుజుడు దోషరూపంలో వుండి... వారు మిధున కన్యారాశులలో గానీ, మిధున కన్యాలగ్నాలలోవుండిన కుజదోషం వర్తించదనే శాస్త్రప్రమాణమున్నది. అనగా 4, 7, 8 స్థానాల దోషం భంగపడదు. కేవలం రెండవ స్థాన దోషం భంగమగునని ఉద్దేశ్యం. మరి ఈ విషయం 2 వ స్థాన దోషం వారికి ఊరట నిచ్చే మాట.
నాల్గవ స్థాన కుజదోషం వున్నవారు మేష వృశ్చిక రాశులలో గానీ, మేష వృశ్చిక లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. అంటే 2, 7, 8 స్థానాల లోపం ఉంటుందని భావం. అలాగే సప్తమ స్థానంలో కుజదోషం వున్నవారు మకర కర్కాటక రాశులలో గానీ, మకర కర్కాటక లగ్నాల యందు గానీ జన్మించి వుంటే 7 వ స్థాన కుజదోషం భంగమగునని, రెండు, నాలుగు, ఎనిమిది స్థానాలలో భంగం కాదని శాస్త్ర నిర్దేశం.

అష్టమ స్థాన కుజదోషం వున్నవారు ..... ధను, మీన రాశులలో లేక లగ్నాలలో జన్మించి వుంటే.... వారికి అష్టమ స్థాన కుజదోషం వర్తించదు. ఈ కుజదోషమనేది జన్మ లగ్నం నుంచే వుంటుంది. జనం లగ్నం నుంచే లెక్కించాలి. చంద్రుడు ఉన్న రాశి నుంచి, శుక్రుడు ఉన్న రాశి నుంచి, కుజ దోష స్థానాన్ని చూడవలసిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి జన్మ లగ్నం నుంచి, చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజదోషం వుండి తీరుతుంది. ఇది సరియిన సక్రమమైన వివరం కాదు. కేవలం జన్మ లగ్నం నుంచి మాత్రమే కుజదోషాన్ని లెక్కించాలి. ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించిన ఏ ఒక్కరూ కుజదోషం గురించి బెంగ పడాల్సిన అవసరం లేనేలేదు.
కుజదోషం ఉంటే... పగడం, శని (ఏలినాటి శని) దోషానికి... నీలం, ఇలా ఎప్పుడు కూడా ధరించకూడదు. మీ జాతకానికి పగడం సరిపడకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి. పగడం అనే రత్నం ఏ రకంగానూ కుజదోషాన్ని తగ్గించదు. విధించే హోదాలో ఉంటారు. శౌర్యము, ఆత్మగౌరవమును కలిగి ఉంటారు. ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. ఇక కుజగ్రహ కారకత్వములను పరిశీలిస్తే... కుజుడు శౌర్యము, యుద్ధ ప్రియుడుగా ఉంటాడని వారు చెబుతున్నారు.

కుజ, కుజునిగా పరిగణించబడే కుజాధిపత్య జాతకంలో జన్మించిన జాతకులు కఠిన కష్టాలను ఎదుర్కొన్నా... అంగారకుడిగా దోషం నుంచి శాంతి కలగాలంటే... రాగిని నైవేద్యం చేయడం ద్వారా తృప్తి పరుచవచ్చునని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ కుజగ్రహాధిపత్య జాతకులు విద్యుత్, వ్యవసాయం, మిలటరీ, పోలీసు రంగాల్లో రాణిస్తారు. గణితం కఠినమైన శిక్షలు ఇతరుల అంత సులభంగా నమ్మబోరు. వారితో స్నేహం అయిన చాలారోజులకే నమ్మటం చేస్తారు. తర్కశాస్త్రం, శస్త్రవిద్యలను అభ్యసించేవారుగా ఉంటారు. కుజదోషమున్న జాతకులు ఎరుపు వస్త్రంతో పాటు రాగి గింజలను నైవేద్యం చేసి తృప్తి పరచడం ద్వారా బలోపేతమైన సమస్యల నుంచి కాస్త విశ్రమించవచ్చునని జ్యోతిష్కులు వివరిస్తున్నారు.

కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాప గ్రహముగా చెప్పబడును. వివాహము మరియు వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును.

కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. గ్రహ దోషము కారణముగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతము అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుటుకొనుటకు దీని గురించి పూర్తిగా తెలుసుకొనుట అవసరము.
🙏🙏🙏🙏🙏

త్రిజేష్ఠం లో వివాహ ముహూర్తం చేస్తే ఫలితం ?

శ్లో జ్యేష్టాంగనా కరతల గ్రహణం న కుర్యాశ్ర్యేష్ట
నక్షత్రస్య పురుషస్యచ శుక్రమాసే !
చేదర్ణహాని కలహప్రద మాశుసద్వజ్యేష్టాంగనా పురుష యోశ్చ పరస్పరంచి!

(ముహూర్త దర్పణం - వివాహ ప్రకరణం నుంచి) అంటే, అమ్మాయి, అబ్బాయిలు జ్యేష్ణా నక్షత్రంలో పుట్టినా లేదా, జ్యేష్ట సంతానమైనా జ్యేష్ఠ మాసంలో వారిరువురికీ వివాహం చేయరాదు. చేస్తే కలహాలు, ధననష్టం, వంటి కీడు కలుగుతుంది. కేవలం త్రిజ్యేష్ఠ మాత్రమే గాక జ్యేష్టచతుష్టయం, జ్యేష్ట పంచకమని కూడా ఉన్నాయి.

ఇవి వున్నా జ్యేష్ఠమాసంలో వివాహం యోగ్యం కాదు. సామాన్య సూత్రంగా జ్యేష్ట సంతానానికి జ్యేష్ఠమాసం వివాహం నిషిద్ధం, అయితే వీరికి ఒక సడలింపు ఉంది. ప్రథమ గర్భ జనితులైన స్త్రీ పురుషులకు మాసాధిపతుల మిత్రత్వానుసారంగా వివాహం చేస్తే ! మంచిది.

Tuesday, March 27, 2018

సర్ప దోషము లేదా సర్ప శాపము

సర్ప దోషము లేదా సర్ప శాపము:- (1) రాహువు 5వ యింట వుండి కుజుని చేత చూడబడినను,
(2)మేష,వృశ్ఛికములలో (కుజ క్షత్రమున) రాహువు ఉండినను.
(3)పంచమాధిపతి రాహువు తో కూడినను,శని పంచమమునందు ఉన్నను, శని చంద్రునితో కూడినను,చూడబడినను
(4)పుత్ర కారకు డైన గురుడు రాహువు తో కలిసి వున్నను
(5) పంచమాధి పతి బలహీనుడైనను, లగ్నాధిపతి కుజునితో కలిసి వున్నను
(6)గురుడు కుజునితో కలసియున్నను, లగ్నము లో రాహువున్నను
(7)పంచమాధిపతి దుస్థానమున,నీచ,శతృ క్షేత్రమునున్నను
(8)కుజాంశలో కుజుడున్నను
(9)పంచమాధిపతి బుధుడైనను,పంచమాధిపతి తో రాహువు కలిసి వున్నను,బుధుడు చూసినను
(10) లగ్నమున రాహువు,మాంది యున్నను
(11)5 వ స్థానము లో రవి,శని,కుజుడు,రాహువు,గురు,బుధ లుండి పంచమ లగ్నాధిపతులు బలహీనులైనను
(12)లగ్నాధిపతి రాహువు తో కూడినను,పంచమాధిపతి కుజుడైనను,కారకుడు రాహువు తో కూడినను....సర్ప దోషము గా తెలియవలెను.
ఈ దోష నివారణకై నాగ పూజ లేదా నాగ ప్రతిష్ఠ చేయవలెను.యధావిధిగా గో,భూ,తిల,హిరణ్య ములు దానమీయవలెను.దీని వలన దోషము పోయి పుత్ర సంతతి కలిగి కులాభివృద్ధి,సంపత్సమృద్ధి కలుగ గలదు.
🙏🙏🙏🙏🙏

వివాహ విషయంలో సప్తమ స్ధానం ప్రాముఖ్యత

భారతీయ సాంప్రదాయంలో వివాహం జీవితంలో ఒకే ఒకసారి జరిగే అతి ముఖ్యమైన అంశం. వివాహం అనంతరం భార్యా భర్తలు జీవితాంతం కలసి ఉండే విధంగా జాతకాదులు పరిశీలించాలి. వివాహ విషయంలో కేవలం వధూవరుల గుణమేళన పట్టికలోని గుణాలను మాత్రమే పరిశీలించటమే కాకుండా, మిగతా అంశాలైన సప్తమ స్ధానం, పంచమ స్ధానం, వివాహానంతర దశలు మొదలగు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవలెను.

ప్రస్తుతం వధూవరుల నిర్ణయ విషయంలో ఉభయులకు విద్య, వృత్తి, సంపాదన, ఆస్తి, అందం, రంగు, పొడవు, ఎత్తు, లావు, సన్నం అనే విషయాలపై శ్రద్ధ వహిస్తూ ఇద్దరి మధ్య సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇద్దరి మద్య సఖ్యత లోపించినప్పుడు పై అంశాలు అన్ని నిరర్ధకం అని తెలుసుకోవాలి.

         యుక్త వయస్సు దాటి ఆలస్యమవుతుందని ఆరాట్మ్లో ఏదో ఒక సంబందాన్ని కుదుర్చుకోవాలనే ఆతృత కంటే వధూవరుల శాశ్వత సౌఖ్యానికి అధిక ప్రాదాన్యమిచ్చి ఆలస్యమైనా సరైన సంబంధం నిర్ణయించటం సముచితం.

      ప్రస్తుత సమాజంలో మహిళలు విద్య, వివిధ రంగాలలో ఉత్సాహం చూపిస్తూ స్వతంత్ర భావాలు, స్వాభిమానం, ధైర్యం పెంపోందించుకుంటున్నారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ స్వయంగా సంపాదనకు ప్రాముఖ్యం ఇస్తూ పురుషులకు పోటీతత్వంగా ఉంటున్నారు. కళలు, క్రీడలు, రాజకీయ రంగాలలో రాణిస్తున్నారు. కనుక శక్తికి, చైతన్యానికి, స్వతంత్ర భావాలకు, ధైర్య సాహసాలకు కారకుడు అయిన కుజ గ్రహం వీరి జాతకాలలో బలంగా కనిపిస్తుంది. వివాదాలకు కూడా కుజుడే కారకుడు కావటం వలన దాంపత్య జీవితంలో ప్రతికూల స్ధానంలో ఉన్న కుజుడు సఖ్యతకు భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. విద్యా అర్హతలతో ఉద్యోగాలలో రాణిస్తున్న నేటి మహిళలు భర్త వేదింపులు సహించలేక ఎటువంటి సంకోచం లేకుండా విడాకులకు సిద్ధమవుతున్నారు. కనుక తల్లిదండ్రులు, వధూవరుల జాతకంలోని సఖ్యత విషయమై నిదానంగా పరిశీలించి నిర్ణయాలకు రావటం శ్రేయస్కరం.

           ముందుగా ఇద్దరి  జాతకాలలోని సప్తమ స్ధానం, అక్కడి గ్రహాలను, సప్తమాధిపతి ఉన్న రాశి, భావాలను, వాటికి ఇతర గ్రహాల దృష్టి సంయోగాలను పరిశీలించాలి.

         సప్తమంలో రవి, బుధ గురు, శుక్రులు శుభ ఫలితాన్ని ఇస్తారు. చంద్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. శని, రాహు, కేతువులు బాధను కలిగిస్తారు. వక్రించిన గ్రహాలు సప్తమంలోఉన్న, సప్తమాధిపతి వక్రించిన వివాహ సంబంధాలు నిర్ణయించటం కష్టం అవటమే కాకుండా ఆలస్యమవుతుంది. 

        లగ్నాధిపతికి సప్తమాధిపతి సంయోగం కానీ, పరస్పర కోణ స్ధితి ఉన్న ఇద్దరి మధ్య సఖ్యతకు నిదర్శనంగా ఉంటుంది.

            సప్తమ స్ధానంలో శనిగ్రహం ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. లేదా ఇద్దరి మద్య వయో భేదం ఉంటుంది. లేదా ఇదివరకు వివాహం అయిన వారితో పెళ్ళి జరగచ్చు. లేదా వివాహం పట్ల విముఖత, అశ్రద్ధ, అసంతృప్తి కనిపించవచ్చు. సప్తమ శనికి శుభదృష్టి ఉంటే క్రమేణ అనుబంధాలు బలపడతాయి. కేంద్రంలో ఉన్న రవి, చంద్ర, శుక్రులకు శనితో సంయోగం ఇబ్బందికరంగా ఉంటుంది.

             సప్తమంలో కుజుడి వలన తీవ్ర విభేధాలు, వివాదాలు సంభవిస్తాయి. కేంద్రంలో ఉన్న చంద్ర, శుక్రులతో  కుజుడు కలసి ఉన్న ప్రతికూల పరిస్ధితులు ఉంటాయి. గురు దృష్టి ఉన్న అనుకూలంగా ఉండును.

             సప్తమంలో రాహు, కేతువుల వలన అపోహలతో సంసార జీవితాన్ని పాడు చేసుకుంటారు. అన్య మతస్ధులతో గాని ఇతర కులస్ధులతో గాని వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. శుభగ్రహ దృష్టి ఉంటే అనుకూల పరిస్ధితులు ఉంటాయి.
         
          లగ్నం, సప్తమ స్ధానం ద్విస్వభావ రాశులైన మిధునం, మీన, కన్య రాశులై  రవి, చంద్ర, కుజ, శుక్రులు సప్తమాధిపతి ఈ  ద్విస్వభావ రాశులలో ఉంటే రెండు వివాహాలు గాని, వివాహేతర సంబంధాలు గాని జరగవచ్చు.

             సప్తమ స్ధానంలో చంద్రుడు ఉన్న అందమైన వారితో గాని, సంచార వృత్తి లేదా ఉద్యోగం ఉన్న వారితో గాని, జన సంబంద, జనాకర్షణ కలిగిన వృత్తులలో ఉన్న వారితో వివాహం జరిగే అవకాశం ఉంది. సప్తమ చంద్ర స్ధితి కొంత వ్యామోహాలకు, చంచలత్వానికి సంకేతంగా ఉంటుంది.

            లగ్నం నుండి చతుర్ధాధిపతికి సప్తమం, సప్తమాధిపతితో సంబంధం ఏర్పడిన మాతృ వర్గీయులతోను, దశమాధిపతికి సప్తమం, సప్తమాధిపతితో సంబంధం ఏర్పడిన పితృ వర్గీయులతో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి.

             లగ్నం నుండి తృతీయ, నవమ స్ధానాలకు సప్తమ స్ధానంతో సంబంధం ఏర్పడితే  సోదరి, సోదరులు లేదా ధూరపు బందువులకు సంబందించిన వారితో లేదా వారి చొరవతో వివాహం  జరుగుతుంది.

        సప్తమాధిపతి నవమ, ద్వాదశ స్ధానాలలో ఉంటే విదేశాలలో ఉన్నవారితో గాని, భోధన, ప్రచార, సమాచార, సంచార రంగాలలో ఉన్న వారితో వివాహం జరగవచ్చును.

        సప్తమాధిపతి షష్టమ, అష్టమ, ద్వాదశ స్ధానాలలో ఉన్న వైద్యులతో  వివాహం జరుగవచ్చు.

సప్తమాధిపతి పంచమ, లాభ, తృతీయ, నవమ స్ధానాలలో ఉన్న, లేదా వాటి అధిపతులు సప్తమంలో ఉన్న ప్రేమ వివాహాలు జరుగవచ్చు.

సప్తమాధిపతి ద్వాదశ భావాలలో ఏ భావంలో ఉన్న ఆ భావానికి సంబంధించిన విషయాలలో ఆసక్తి గాని, వృత్తిగాని, ప్రాదాన్యం.
🙏🙏🙏

Sunday, March 25, 2018

నూతన గృహరంభ గృహప్రవేశ విషయమై శుభాశుభములు

గృహప్రవేశమునకు శుభాశుభములు

శుభ తిథులు : శుక్ల పక్షమున తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ తిథులును,బహుళపక్షమున పాడ్యమి,విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,తిథులు.
శుభ వారములు: సోమ,బుధ,గురు,శుక్రవారములు.
శుభ నక్షత్రములు:రోహిణి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాఢ,చిత్త,అనూరాధ,ధనిష్ఠ,శతభిషం,రేవతి.
శుభ లగ్నములు:వృషభ,మిథున,సింహ,కన్య,వృశ్చిక,ధనస్సు,కుంభం,మీనం.
విశేషములు అష్టమశుద్ది,చతుర్దశుద్ది,కలిశ చక్రశుద్ది కలిగియుండ వలయును.వృషభచక్ర శుద్ది కూడా చూచుట మంచిది.

నూతన గృహరంభ గృహప్రవేశ విషయమై వృషభచక్రశుద్ధి

రవి యున్న నక్షత్రాదిగా ఫలితములు చూచుకోవాలి.రవి అనూరాధ నక్షత్రములో యున్న అనూరాధ  మెుదలు 3 నక్షత్రములు  అంటే 1.అనూరాధ 2.జ్యేష్ఠ,3.మూల నక్షత్రములలో ఒకటి అయిన దుర్దశగను,తరువాత 4 పూర్వాషాఢ,5.ఉత్తరాషాఢ,6.శ్రవణ,7.ధనిష్ఠ నక్షత్రములైన దురవస్తగా స్వీకరించాలి.కానీ పాఠకులు ఈ శ్రమకు వెనుతగ్గి గృహస్థులకు తగిన న్యాయము జరుపుట లేనందున పాఠకులకు ఇసుమంత శ్రమలేకుండా రవియున్న నక్షత్రమున కెదురు వృషభచక్రశుద్ధి కలిగిన నక్షత్రముల పట్టిక తెలుపుచున్నాను.ముఖ్యము గృహారంభమునకు వృహభచక్రశుద్దిని,గృహప్రవేశమునకు కలిశచక్రశుద్దిని,అత్యంత ప్రాధాన్యముగాగుర్తించండి.ఉభయ చక్ర శుద్ధులు చూచుట మిక్కిలి శుభదాయకము.
 రవి సంచార నక్షత్రము నుండి లెక్కించగా (వృషభ చక్రమమదు అభిజిత్తు సహా లెక్కించాలి)
1. 1,2,3 నక్షత్రములు - దుర్దశ
2. 4,5,6,7, నక్షత్రములు - దురవస్థ
3. 8,9,10,11 నక్షత్రములు - చిరకాల స్థైర్యం
4. 12,13,14, నక్షత్రములు - దేశభ్రమణం
5. 15,16,17,18 నక్షత్రములు - ధనం
6. 19,20,21,22 నక్షత్రములు - ధాన్యం
7. 23,24,25 నక్షత్రములు - సంపద
8. 26,27,28 నక్షత్రములు - పశువృద్ది

 గృహారంభ,గృహప్రవేశములకు వృషభ చక్రశుద్ధి

రవిసంచార నక్షత్రము - గృహారంభ,గృహప్రవేశ ముహూర్త నక్షములకు వృషభ చక్ర శుద్ధి అయిన నక్షత్రములు.
అశ్వని పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల,ఉత్తరాషాఢ,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం,ఉత్తరాభాద్ర,రేవతి.

భరణి మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల,ఉ.షా,శవణ,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని.

కృత్తిక మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని.

రోహిణి ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా;శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా;రేవతి అశ్వని.

మృగశిర ఉత్తర,హస్త,చిత్త,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి.

ఆరుద్ర హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర.

పునర్వసు చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ.

పుష్యమి  స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవ,అశ్వని,రోహిణి,మృగ,పుష్యర్వసు.

అశ్లేష అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పునర్వ,పుష్యమి.

మఖ అనూ,మూల,ఉ.షాశ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి.

పుబ్బ మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహి,మృగశిర,పునర్వ,పుష్య,మఖ.

ఉత్తర మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ.

హస్త ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర.

చిత్త ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త.

స్వాతి శ్రవణ,ధనిష్ఠ,శత,ఉభా,రేవ,అశ్వని,రోహిణిమృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త.

విశాఖ శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.

అనూరాధ ధనిష్ఠ,శత,ఉభా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.

జ్యేష్ఠ శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ.

మూల ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల.

పూర్వాషాఢ ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల.

ఉత్తరాషాఢ రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల.

శ్రవణం
రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.

ధనిష్ఠ
రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ.

శతభిషం రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ.

పూర్వాభాద్ర మృగ,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.

ఉత్తరాభాద్ర
పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిష,పూర్వాభాద్ర.

రేవతి పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా.   

 నూతన గృహారంభ గృహప్రవేశ విషయమై కలిశ చక్రశుద్ధి

1. 1వ నక్షత్రము - శిరచ్చేదము
2. 2,3,4,5 నక్షత్రములు - పరదేశ గమనము
3. 6,7,8,9 నక్షత్రములు - నిర్భయము
4. 10,11,12,13 నక్షత్రములు - ధాన్యము
5. 14,15,16,17 నక్షత్రములు - నిర్ధనము
6. 18,19,20,21 నక్షత్రము - గర్భాస్రావము
7.22,23,24,నక్షత్రములు - సంపద
8.25,26,27,28 నక్షత్రములు - పూర్ణాయువు

రవి సంచార నక్షత్రమునుండి లెక్చించగా పై ఫలితములు కలుగును.కలిశచక్రమునందు 27.నక్షత్రములు మాత్రమే లెంక్కించాలి,కలశచక్ర శుద్ధి కలిగిన నక్షత్రములను దిగువ చక్రము ద్వారా తెలుపుచున్నాను.

గృహారంభ, గృహప్రవేశములకు కలశ చక్రశుద్ధి

రవిసంచార నక్షత్రము -  గృహారంభ,గృహప్రవేశ మూహూర్త నక్షత్రములకు కలశ చక్ర శుద్ధి అయిన నక్షత్రములు

అశ్వని పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవతి.

భరణి పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని,

కృత్తిక పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,శత,ఉ.భా,రేవతి,అశ్వని.

రోహిణి మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,ఉ.భా,రేవతి,అశ్వని.

మృగశిర మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి.

ఆరుద్ర ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,రేవతి,అశ్వని,రోహిణి.

పునర్వసు ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,అశ్వని,రోహిణి,మృగశిర.

పుష్యమి హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,రోహిణి,మృగశిర,పునర్వసు.

ఆశ్లేష చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,రోహిణి,మృగశిర,పున,పుష్యమి.

మఖ స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,రోహి,మృగ,పున,పుష్యమి.

పుబ్బ అనూ,మూల,ఉ షా,శ్రవ,ధని,మృగశిర,పున,పుష్యమి,మఖ.

ఉత్తర అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,పునర్వసు,పుష్యమి,మఖ.

హస్త మూల,ఉ.షా,శ్రవ,ధని,శతభిష,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర.

చిత్త మూల,ఉ.షా,శ్రవ,శతభిష,ఉ.భా,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త.

స్వాతి ఉ.షా,శ్రవ,ధన,శతభిష,ఉ.భా,రేవతి,మఖ,ఉత్తర,హస్త,చిత్త.

విశాఖ ఉ.షా,శ్రవ,ధని,ఉ.భా,రేవ,అశ్వ,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.

అనూరాధ శ్రవ,ధని,శతభిష,ఉ.భా,రేవ,అశ్వ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.

జ్యేష్ఠ ధని,శతభిష,ఉ.భా,రేవతి,అశ్వని,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ.

మూల శతభిష,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ.

పూర్వషాఢ ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,చిత్త,స్వాతి,అనూ,మూల.

ఉత్తరాషాఢ ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,స్వాతి,అనూరాధ,మూల.

శ్రవణం  రేవతి,అశ్వని,రోహి,మృగశిర,పునర్వసు,అనూ,మూల,ఉత్తరాషాఢ.

ధనిష్ఠ అశ్వని,రోహి,మృగశిర,పున,పుష్యమి,అనూ,మూల,ఉ.షా,శ్రవణం.

శతభిషం రోహిణి,మృగశిర,పున,పుష్యమి,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ.

పూర్వాభాద్ర రోహిణి,మృగశిర,పున,పుష్యమి,మఖ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.

ఉత్తరాభాద్ర రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.

రేవతి మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,ఉ.షా,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం.ఉ.భా.

గ్రహాల సంచారం తెలుసుకో....!

గ్రహావస్థలు
గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు.
స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.
ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు ఉన్న భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా చేసుకుని గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు.

గ్రహాల సంచారం..తెలుసుకోనే ప్రయత్నం చేద్దాం !

గ్రహాల సంచారం
ఒకొక్కరాశి 30 డిగ్రీల నిడివి కలిగి ఉంటుంది.12 రాశులుంటాయి .రాశి చక్రం మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది.

ప్రతి గ్రహాం రాశిలో ఉన్న 30 డిగ్రీలలో 27 డిగ్రీలు దాటిన తరువాత రాబోవు రాశిని చూచును.

రవి :-ఒక్కొక్క రాశిలో నెల రోజులుండును.5 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రవి రోజుకు "1"డిగ్రీ చొప్పున సంచారం జరుపును.

చంద్రుడు  :-ఒక్కొక్క రాశిలో రెండున్నర రోజులుండును.3 ఘడియలు (72 నిమిషాలు) ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.చంద్రుడు "1"డిగ్రీ కదలటానికి 1 గంట 48 నిమిషాలు పట్టును.ఆంటే రోజుకు 13 డిగ్రీల నుండి 15 డిగ్రీల వరకు సంచారం జరుపును.

కుజ :-ఒక్కొక్క రాశిలో సుమారు 45 రోజులుండును.8 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకు 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు సంచారం జరుపును.

బుధ :-ఒక్కొక్క రాశిలో సుమారు నెల రోజులుండును.7 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.30 డిగ్రీలను దాటటానికి 27 రోజులు పట్టును.రోజుకు ఒకటిన్నర డిగ్రీలు సంచారం జరుపును.రవి నుండి 28 డిగ్రీలు దాటి ముందుకు గాని వెనుకకు గాని వెళ్ళడు.

గురుడు  :-ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం రోజులుండును.2 నెలల ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకి 5 నుండి 15 నిమిషాల వరకు సంచారం జరుపును.

శుక్రుడు :-ఒక్కొక్క రాశిలో సుమారు నెల రోజులుండును.7 రోజులు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.రోజుకి 1 డిగ్రీ (65 నిమిషాల నుండి 85 నిమిషాల వరకు)సంచారం జరుపును.రవి నుండి 47 డిగ్రీలు దాటి ముందుకు గాని వెనుకకు గాని వెళ్ళడు.

శని :-ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరములుండును.4 నెలలు ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును.నెలకు ఒక డిగ్రీ చొప్పున రోజుకి 2 నిమిషాలు సంచారం జరుపును.

రాహువు,కేతువు :-ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరములుండును.3 నెలల ముందుగా రాబోవు రాశిని చూచును.అందుకు తగిన ఫలితమును ఇచ్చును. రోజుకు 3 నిమిషాలు చొప్పున సంచారం జరుపును.

Tuesday, March 20, 2018

భారతీయ పంచాంగ ఇతిహాసం. History of Indian Panchangam

ఆది నుండి విజ్ఞానానికి నిలయం - భారతం. తర తరాలుగా వారసత్వ రూపేణ, పరంపరల ఫలస్వరూపంగానో సాంప్రదాయ బధ్ధంగానో, శృతి, లేదా విభిన్న గ్రంధాల ద్వారానో విజ్ఞాన సంపద భావి తరాలకు అందజేయబడుతున్నాయి. విద్యా శక్తి, మేధా శక్తి, ఇచ్చా, క్రియా శక్తులు కాలనుగుణంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ శక్తుల సమన్వయీకరణ, మానవాళికి ఉపయుక్త సాధనంగా మారి, జీవన గమనం సులభసాధ్యం చేస్తూ, జీవిత సాఫల్యానికి దోహదపడుతున్నాయి.

ఈ పరివ్యాప్త సంపదలలో శాస్త్ర, సిద్ధాంత, వేద, గ్రంధాదులే కాదు, సమస్త జన, వస్తువులు నిక్షిప్తమై ఉన్నాయి. భారత దేశ మేదా శక్తిని, ఔన్నత్యాన్ని చాటి, ప్రపంచానికి అందించిన, అదిస్తున్న, అనేక జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞాన విశేషాల సమ్మేళనంతో - వాటి అర్ధమే కాక, భావార్ధం, నిగూఢ, నిక్షిప్త, పరమార్ధాలను విశ్లేషించి తదనుగుణ విషయాలను సేకరించి, సమన్వయం చేసి ఈ విజ్ఞాన భారతీయం " శీర్షికలో ప్రస్తుతీకరిస్తున్నాం.
ప్రపంచంలోని అత్యంత ప్రాచీన పంచాంగం భారత దేశం ప్రకటించింది. భారతీయ పంచాంగం ప్రత్యేకత ఏమిటీ అంటే అది చాంద్ర-సౌర మాన అధారంగా నిర్మించబడింది. ప్రపంచంలో మరే దేశం ఇలా పంచాంగాలు (క్యాలెండర్) ప్రకటించిన ఉదంతాలు లేవు. అధిక మాసాలు, క్షయ మాసాలు ఉదాహరణలు ఋగ్వేదంలో, " వేదాంగ జ్యోతిషం " (1200 బీ సీ) " గ్రంధంలో ఉన్నాయి.
నేడు ప్రపంచంలో 8 దేశాలు మాత్రమే ఏటా గణాంకాలు చేసి " ఎఫిమరీస్ " (క్యాలెండర్లు) ప్రచురిస్తున్నాయి. అవి - ఇండియా, యు. కే., రష్యా, అమెరికా, ఫ్రాన్స్, స్పేయిన్, చైనా, జపాన్. ఆసియా ఖండంలో భారత, చైనా, జపాన్ దేశాలు మాత్రమే క్యాలెండర్లు ప్రకటిస్తాయి. ఇతిహాసంలోకి తొంగి చూస్తే జైన, భౌద్ధ భిక్షువుల ద్వారా, భారతీయ గ్రంధాల తర్జుమాల వల్ల పంచాంగ సాధనా పద్ధతులు, తదనుబంధ వివరణలు టిబెట్ ద్వారా చైనాలో ప్రసారమయ్యేయి. కాలానుగుణంగా అవి జపాన్ కూడా చేరాయి. నేడు చినా, జపాన్ ప్రకటించే " ఏఫిమిరీస్ " కు మూలాధారం భారతీయ ప్రాచీన గ్రంధాలే.
భారత్ దేశంలో పరిపాలనా విధానాలకు, గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నారు. 1957 లో (క్యాలెండర్ సవరణలు) సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఎం ఎన్ సాహా, లాహిరీ ఆధ్వర్యంలో జరపబడ్డాయి. ఇవి కాక అనాదిగా వస్తున్న ప్రాంతీయ, ఆచార వ్యవహారాలను బట్టి చాంద్ర, సౌర మాన పంచాంగ పద్ధతులు వాడుకలో ఉన్నాయి.
ప్రపంచంలో అతి ప్రచీన పంచాంగం (క్యాలెండర్)
జ్యోతిషం గురించి ఋగ్వేదంలో 36 ద్విపదలలో ప్రస్తావించబడింది. క్రీస్తు పూర్వం 1200 సంవత్సరంలో (1200 బీ సీ లో) లగడ మహర్షి రచించిన " వేదాంగ జ్యోతిషం " గ్రంధంలో " యుగం " వివరణ ఇచ్చారు. ఇందులో యుగంలో ఐదేళ్ళున్నాయి. మాఘ మాస శుక్ల ప్రతిపద నాడు సూర్య చంద్రుల రేఖాంశ స్థానం ధనిష్ఠ (బీటా డెల్ఫినీ) నక్షత్రంలో ఉన్నప్పుడు ఆరంభమయ్యింది. ఇక్కడ విశేషంగా గమనించాల్సినది యేంటంటే ఆనాటికే మాస, తిథి, వార, ఆయన, నక్షత్ర, సంవత్సర, (రేఖాంశ స్థానం), కాల స్వరూపాలు వ్యవహారంలో ఉన్నాయి. క్షయ తిథులు, నక్షత్ర అహోరాత్రుల గణక సాధనాపద్ధతులు వ్యవహారంలో ఉండేవి.
యుగంలో ఉన్న యేళ్ళు - 5
సవన (సివిల్) దినములు (5 X 366) - 1830 దినములు
సౌర మాసాలు (5 X 12) - 60
చాంద్ర మాసాలు - 67
తిథులు (చాంద్రమాన దినములు) (62 X 30 దినములు) - 1860
క్షయ తిథులు (1860 - 1830) - 30
నక్షత్ర దినములు (67 X 27 దినములు) - 1809
కాల ప్రవాహం అనంతం. దీని ఆది తెలీదు. దీని అంతం తెలీది. కాని అపూర్వ ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు అత్యంత ప్రాధమికమైన ఈ అంశాలను యెప్పుడో కనుగొన్నారు. ఇంతటి అనంత ప్రవాహాన్ని కొలవడం యెలా? ఇది ఒక సమస్యగా గుర్తించి, తగు ఉపాయం చేసారు. నేడు మనం చూస్తున్న కాల, ప్రమాణాలు ఇవే.
పంచాంగం అంటే?
పంచాంగం అంటే యేమిటి? దీని అవసరం యేమిటి? ఇది మానవ జీవనంలోకి యలా వచ్చింది? దీని అంతర్యం యేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు సాధిస్తే పంచాంగం ప్రాముఖ్యం, దాని ఆవశ్యకత అర్ధమవుతాయి. సంఘటనలను సమయంతో అనుసందించడానికి " పంచాంగం " (క్యాలెండర్) అవసరం.
ప్రపంచంలో అతి పురాతనమైన పంచాంగం భారతీయ పంచాంగం. కాలమానాన్ని కొలవడం మను ఆది కాలం నుండి మొదలైంది. ఇది 8132 బీ సీ (క్రీస్తు పూర్వంలో మొదలైంది) అని మనకు అందుబాటులో ఉన్న మన ప్రాచీన గ్రంధాలలో ప్రస్తావించబడ్డాయి. అంటే, దాదాపు పది వేల సంవత్సరాలుగా పంచంగాలు వాడుకలో ఉన్నాయి. ప్రపంచం ఆవిర్భవించింది మొదలు, నేటి వరకు ఒక కాల పద్ధతి తయారు చేసి వాడుతున్నారు.
పంచాంగం ఒక క్రమబద్ధంగా, నిరంతరాయ కాల గమనంలో కొలిచే పద్దతి. దీనికి " యేడాది " ఒక కొలబద్ధ. మరి ఈ సృష్టిలో చెక్కు చదరకుండా నిలిచేవి, భూమి మనుగడకు ఆధారమైన సూర్య చంద్రాది గ్రహాలు. వీటి ఆధారంగానే యేర్పడ్డాయి మన " దిన రాత్రులు " – సంవత్సరాలునూ.
పంచాంగం అంటే – " ఐదు " అంగాలు. – ఇవి " తిథి ", " వార ", " నక్షత్ర ", " యోగ ", " కారణలు ". చాంద్ర దశను బట్టి " తిథి " యేర్పడింది. సప్త గ్రహములతో యేడు రోజులు (వారాలు) యేర్పరచారు. వారం - " ఆది వారం " అంటే సూర్యుడితో మొదలవుతుంది. చంద్రుడు భూమి చుట్టు తిరుగుతూ, ఒక ప్రదక్షిణం పూర్తి చేయటానికి సుమారు " నెల " రోజులు తీసుకుంటుంది. సూర్యుడు, ఒక్కక్క రాశిలో ఒక్కక్క నెల వుంటాడు. సూర్యుడు మకరంలోకి సంక్రమణం చేసినప్పుడు " సంక్రాంతి " వస్తుంది. పన్నెండు (12) రాశులలో 12 నెలలు గడుస్తాయి, అంటే ఓ సంవత్సరం. ఇది భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కాలం. రెండు నెలలకు ఒక ఋతువు, ఆరు నెలలకు ఒక ఆయనం (ఉత్తరరాయణం లేదా దక్షిణయణం) ఏర్పడ్డాయి.
నక్షత్రం – సూర్యోదయం వేళ, చంద్రుడు యే నక్షత్రానికి అతి సమీపంగా ఉంటాడో అది ఆ రోజు నక్షత్రం అవుతుంది. " యోగం " చంద్ర-సౌర రోజు. " కరణం " – తిథిలో సగం. ఈ పంచ అంగాలను ఉపయోగించి సృష్టి మొదలైనప్పటి నుంచి కాలాన్ని కొలిచే సాధనం తయరైయ్యింది.
ఇలా నిఖిల జగత్తునీ (కాస్మోస్) మానవాళిని అనుసంధాన పరుస్తుంది పంచాంగం. మానవునికి తన దైనందిన జీవితంలో చేయ వలసిన కార్యాల ప్రణాళిక, చేయవలసిన కార్యాలు, జరపవల్సిన కలపాలు జరిగిన సంఘటనలను పొందుపరిచే ఒక పద్ధతి ఇది. (ఇలా చేయడంతో కాలం మీద తమకు అజమాయిషి (నియంత్రణ) ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది, మానవులకి. కాని ఒక రకంగా, అజిమాయిషి, నియంత్రణలు తమ చేతులోనే వునట్టు, విశ్వాసం కలిగించే ఈ పద్ధతి – ప్రాచీన భారతీయుల అద్బుత కళా/కాల సృష్టి.)
సూర్య చంద్రులు, తెలుగు పంచాంగానికి కూడా కేంద్రాలు. సూర్యుని ప్రమాణంగా తీసుకుంటే " సౌర మానం ", చంద్రుడిని ప్రమాణంగా తీసుకుంటే "చాంద్ర మానం " ఈ రెండింటిని అనుసరిస్తే అది " చంద్ర-సౌర మానం ". ఇలా సూర్య చంద్రాది సప్త గ్రహాలతో మానవ దైనందిన జీవితం పంచాంగ సాంప్రదాయ పద్ధతితో, అనుసంధానం చేసారు. ఇది భూత, భవిషత్, వర్తమాన కాలాలను అనుసంధానం చేస్తుంది. ఇలా సృష్టితో మానవ జీవితాన్ని, మనం చేసే కార్యాలను అనుసంధానం చేశారు.
ఈ పంచాంగాల స్థితిగతులు, వాటి ప్రభావాలను మేళవించి అవి మనవాళికి యేవిదంగా ఉపయోగిస్తాయో చెప్పేది - " పంచాంగ శ్రవణం ". సూర్య, చంద్రాది గ్రహాల స్థితిగతులు, వాటి ప్రభావాలను బట్టి ఆదాయ, వ్యయాలను లెక్క గట్టి – ఉగాది నాడు వేద పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు, వర్ష ఫలం చెప్తారు.
విభిన్న పంచాంగాలు, సంప్రదాయాలు
ప్రాంతీయ, సాంప్రధయాలకణుగుణంగా, స్వల్ప మార్పులతో విభిన్న పంచాంగాలు వాడుకలో ఉన్నాయి.
భారత దేశంలో విభిన్న ప్రాంతాలలో, అనుసరించిన సాంప్రదాయాలను బట్టి విభిన్న సమయాలలో సంవత్సరాధి జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటక, మహరాష్ట్రాలలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు " ఉగాది " (యుగాది " సంవత్సరాది ") జరుపుకుంటారు. కాశ్మీర్ లో భాద్రపద మాసంలో సంవత్సరం మొదలవుతుండి. అరవ, ఆస్సాం, బెంగాల్, ఒరిస్సా, త్రిపురా, పంజాబ్ సాంప్రదాయలు సౌర మానమే. రాజస్తాన్ లో రాష్ట్రంలో దీపావళి తో (కార్తిక మాస, అమవాస్య) మొదలవుతుంది. గుజరాత్ లో అషాడ పూర్ణిమతో మొదలవుతుంది. కాలానుగుణంగా, సంవత్సరాది మారుతూనే వుంది. చాణక్యుడి కాలంలో (325 బీ సీ) ఆషాడ మాస పూర్ణిమతో సంవత్సరం మొదలైయ్యేది.
ఇదే కాలంలో చేసే క్రియలు, ప్రక్రియలను బట్టి కొన్ని కాలామాన పద్ధతులు అమల్లో ఉండేవి – ఇవి – గజ కాలం, అశ్వ కాలం ఇత్యాది వర్గాలుగా విభజించేరు. మరిన్ని వివరాలకు చాణుక్యుడి అర్ధశాస్త్రం (డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడి చే రచింపబదిన) పుస్తకాన్ని సంప్రదించండి.
భారత పంచాంగ ప్రత్యేకత
భారత దేశ పంచాంగం ప్రత్యేకత యేమిటంటే ఇది సౌర చాంద్ర మాన అధారమైన పంచాంగం (లునీ - సోలార్ క్యాలెండర్). తెలుగు వారి సంప్రదాయంలో సౌరమానం, చాంద్రమానం, "బృహస్పత్య ", మూడూ, తెలుగు పంచాంగంలో అంతర్భగాలే. తెలుగు పంచాగంలో " బృహస్పత్య " అంటే, అరవై యేళ్ళ సంవత్సర కాలచక్రం వాడుకలో ఉంది. ఇది ప్రభవ నామ సంవత్సరంతో మొదలవుతుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం సృష్టికర్త బ్రహ్మ త్రిలోకాల సృష్టి చైత్ర శుద్ధ పాడ్యమి నుండి ప్రారంబించాడు. అంధుకే ఈ తిథిని యుగాది గా జరుపుకుంటారు. సుప్రసిద్ధ గణితజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచర్యుడు (1150 ఏ డీ) ఈ రోజునే యుగాది అని పేర్కొన్నడు.
1178 ఏ డీ లో మల్లికార్జున సూరి అనే గణిత పండితుడు సంస్కృతంలో ఉన్న సూర్యసిద్ధాంత గ్రంధాన్ని తెలుగులోకి అనువధించాడు. దీనితో తెలుగు వారికి పాంచాంగ నిర్మాణ పద్ధతి అందుభాటు లోకి వచ్చింది. పంచాంగం నిర్మాణానికి సంబంధించిన తెలుగులో వెలువడిన ప్రప్రధమ గ్రంధం ఇదే. ఇలా దాదాపు వెయ్యి సంవత్సరాలుగా ఆంధ్రుల జీవనావళిలో పంచాంగాలు అంతర్భాగమయిపోయాయి.
యెలా పుట్టిందో, యందుకు పుట్టిందో తెలుసుకుంటే దాని అగత్యం యేమిటో బోధపడుతుంది. ఇలా యెందుకు యేర్పరిచారో కారణాలు తెలుసుకుంటే మంచిది. దేవతలకు గురువు బృహస్పతి. గ్రహాలలో అతి పెద్దది " బృహస్పతి " (గురు, అంగ్లంలో జూపిటర్ అని అంటారు). ఇది సూర్యుడు చుట్టూ ఓ ప్రదక్షిణం చేసే సమయం (భూ కాల పరిమితి ప్రకారం). సూర్య, చాంద్ర, బ్రిహస్పత్య కాలమానలు – మన " క్యాలెండర్ " లో చోటు చేసుకున్నాయి. ఇలా అతి ముఖ్యమైన ఈ మూడు గ్రహాల స్థితి గతులు – మనం వాడు కుంటున్నవన్నమాట.
పంచ అంగాలు – తిథి, వార, నక్షత్ర, యోగ, కారణం – ఇవి మానవులను ప్రభావతిం చేసే కాల సాధనాలు. ఇది అంతరిక్షాన్ని, భుగొళాన్ని, మనవ జీవితాలను ఒక్క తాటితో అనుసంధానం చేసి, సమన్వయ పరిచి ప్రస్తుతించారు. సూర్యసిద్ధాంత ఆధారంగా, తూర్పు గొదావరి జిల్లా కోనసీమకు చెందిన నరసింహ రచించిన తిథి చక్ర, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 600 యేళ్ళ పాటు వాడుకలో ఉన్నది. 1441 ఏ డీ నుండి చాంద్రమాన (లునీ సోలార్ క్యాలెండర్) తెలుగులో విలువడు సాగాయి.
ఆంధ్ర ప్రదేశ్ సిద్ధాంతులు
ఆంధ్ర ప్రదేశ్ సిద్ధాంతులు అనాదిగా వస్తున్న పంచాంగ గణాంక పద్ధతులను నేటికీ కొనసాగిస్తున్నారు. సూర్య సిద్ధాంత ఆధారంగా పంచాంగ, గణాంక పద్ధతులను వాడి యేటా పంచాగాలను ప్రకటిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో, నివసిస్తున్న కొంతమంది పంచాంగ శాస్త్రజ్ఞులు వేదాభ్యాసంతో పాటు సూర్య సిద్ధాంతం కూడా సాధన చేసినవారై, యేటా పంచాగాల గణాంకాలు చేసి, పంచాగాలు ప్రకటిస్తున్నారు. విశిష్టంగా వాడుకలో ఉన్న పంచాంగాలు - పిడపర్తి వారి పంచాంగం (ఆంధ్ర పత్రిక పంచాంగం), నేమాని వారి పంచాంగం.
విజయనగర పశుపతి రాజులు ఇచ్చిన అగ్రహారంతో - శ్రీ పిడపర్తి శివరామ శాస్త్రి గారు పిడపర్తిలో గురుకులం స్తాపించి విద్యా వ్యాప్తికి అంకురార్పణం చేసారు. విద్యార్ధులకు ఉచితంగా పాటాలు చెప్పేవారు. పిడపర్తి వారి లో విశిష్ట ఖ్యాతిని ఆర్జించిన వారు పిడపర్తి పెద దక్షిణా మూర్తి (1850 ఏ డీ) గారు; తరువాత వారి శిష్యుడు శ్రీపాద లక్ష్మీపతి సోమయాజులు గారు. వీరూ పంచాంగాలు ప్రకటించడం ప్రారంభించేరు. జ్యోతిషం, ఖగోళశాస్త్రాల పండితుడైన శ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి, తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం - సత్యనారయణ స్వామి దేవాలయం ఆవరణలో " నాడివలయ, రాశీవలయ యంత్రాలు " నిర్మించారు. అతి సామాన్యంగా కనిపించే ఈ యంత్రాలు అత్యంత సమర్ధవంతమైనవి - సూర్య, చంద్ర, ఇతర గ్రహాల స్థానాలను సులభంగా సూచించే పద్ధతిని వినియోగించి చేసారు. పిడపర్తి వారిలో మిక్కిలి వాసికెక్కిన వారు - పిడపర్తి పెద్ధ పూర్ణయ్య సిద్ధాంతి గారు. వీరు గొప్ప జ్యోతిష్కులు, పంచాంగాల కర్త. ఇదే పాండిత్య కోవకు చెందిన వారు శ్రీపాద చలమయ్య శాస్త్రి గారు. వీరు వేద పండితులు, శివరామ శాస్త్రి గారు పుత్రులు.
ఇక్కడ, పిడపర్తి పెద్ధ దక్షిణా మూర్తి గారి జీవితంలో జరిగిన విశేషం ఒకటి చెప్ప వచ్చు. పిడపర్తి పెద్ధ దక్షిణా మూర్తి గారు " ప్రశ్నా శాస్త్రం " లో ఉద్దండులు అని ఆ ప్రాంతంలో ప్రతీతి. వీరి పాండిత్యాన్ని పరీక్షింపదలిచాడు తూర్పు గోదావరి ప్రాంత కోర్టు న్యాయమూర్తి ఐన ఓ తెల్ల దొర. ఈ కోర్టుకు ఐదు ద్వారాలు ఉన్నాయి. న్యాయ విచారణ తరువాత నేను ఏ ద్వారం గుండా వెడతానో చెప్పండి? " అని అడిగాడు. (ధర్మాసనం ఉండే స్థానానికి సమీపంలో ఉండే ద్వారం ఆయన నిత్యం వాడే ద్వారం).
పిడపర్తి పెద్ధ దక్షిణా మూర్తి గారు ఓ చీటి మీద రాసిచ్చి బెంచి క్లర్క్ కి ఇచ్చారు. ఓ లకూటా (కవరు) లో పెట్టి అతను న్యాయ మూర్తి కి అందించాడు. న్యాయ మూర్తి అది కోటు జేబులో పెట్టుకున్నాడు. విచారణలు ముగిసిన తరువాత, హాలు లోకి నడిచి వచ్చి టక్కున బయటి దూకేశాడు. బయటకు వీళ్ళి ఆవరణలో లకూట తీసి చూసేడు. " నువ్వు ఒక కృత్రిమ ద్వారం ద్వరా దూకు తావు " అని రాశి వుంది. ఖిన్నుడై పోయాడు ఆ తెల్ల న్యాయ మూర్తి. వారి ప్రజ్ఞా పాటవాలు ఎలాటివో చెప్పడాని ఈ ఉదంతం చాలు. ఆయన ప్రశ్న అడిగిన సమయానికి లగ్నం కట్టి, కొన్ని గణాంకాలు చేసి , ఫలితం రాసి ఇచ్చారు. రాసినట్టే జరిగింది.
చారిత్రికంగా చూస్తే జ్యోతిష శాస్త్రంలో నోరి వారు సిద్ధహస్తులు. వీరు గోదావరి జిల్లాలోని, పాలకొల్లు వద్ధ, మునికొడలి గ్రామంలో ఉండేవారు. నోరి వారి జ్యోతిష విద్యను పిడపర్తి వారికి బోధించారు. కాలానుగుణంగా ఈ విద్యను పిడపర్తి వారి నుండి శ్రీపాద వారు అభ్యసించారు.
తరాలు మారిన ఈ కుటుంబికులు వంశ పారంపర్యంగా పంచాంగాల గణాంకం చేస్తూ, యేటా పంచాంగాలు ప్రకటిస్తూనే ఉన్నారు. నోరి వారి పంచాంగాలు - నోరి వారి కుటుంబికులు 1780 ఏ డీ నుండి పంచాంగాలు రూపొందించి ప్రకటిస్తూ వచ్చారు. వీరు పాలకొల్లు సమీపాన ఉన్న మునికొడలి వాస్తవ్యులు. జ్యోతిష శాస్త్రాన్ని ఉద్దేసించి ప్రముఖ సాహిత్యకారుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన పుస్తకం - " అనుభవాలు - జ్ఞాపకాలునూ ", సూర్యసిద్ధాంతంలోని ఓ సూత్రం - " సుపరీక్షితసిష్యయ దెయం వత్సరవసినెహ్ " అని ప్రస్తావించేరు. దీని సారం యేమిటంటే - " ఓ ఎడాది పాటు జ్యోతిష శాస్త్రం నేర్చుకునే విధ్యార్ధి వ్యక్తిత్వం, గుణ గణాలు, ప్రవర్తనా గమనించాలి ". ఇవి సవ్యంగా ఉంటేనే తరవాతే చదువు చెప్పాలి. భారత శాస్త్రవేత్తలు నిజమైన వివేకం నిండిన విజ్ఞానవేత్తలు కనుక ఇలాటి నియమం విధించడం వారికే చెల్లింది.
నేమాని వారి పంచాంగం
నేమాని వారి పంచాంగం 1441 ఏ డీ లో, ఆంధ్ర ప్రదేశ్ లోని, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం తాలూకాలోని పేరూరు లో ప్రప్రధమంగా మొదలయ్యింది. శ్రీ నేమాని అయ్యప్ప దీక్షితులు తో మొదలై - శ్రీ వేంకటప్ప దీక్షితులు, శ్రీ వేంకటేశ్వర శర్మ, శ్రీ శొమశంకర శర్మ (కాకినాడ), శ్రీ వీరశంకర సిద్ధాంతి, శ్రీ వేంకటరమణ సిద్ధాంతి, శ్రీ సత్యకృష్ణ శర్మ, శ్రీ వేంకట జగన్నాద్ధ శర్మ , శ్రీ వేంకట శేషగిరి శర్మ, శ్రీ వేంకట సన్యాసిదేవ శర్మ వరకు గడచింది. రానున్న తరాలు వారు కూడా ఈ పరంపరను కొనసాగించగలరని ఆశిద్దాం.
భారతీయ పంచాంగాలు (క్యాలెండర్లు)
మరికొన్ని భారతీయ పంచాంగాలు (క్యాలెండర్లు):
- దక్షిణ ఆమంత క్యాలెండర్
- పశ్చిమ ఆమంత క్యాలెండర్
- ఉత్తర పూర్ణిమంత క్యాలెండర్
- సూర మాన క్యాలెండర్ (కేరళ, తమిళ, ఒరిస్సా రాష్త్రాలలో)
- బెంగాల్ క్యాలెండర్
- జాతీయ క్యాలెండర్
- నానక్ షాహి క్యాలెండర్
శకాలు
శాలివాహన శకం - గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది 78 ఏ డీ లో మొదలైయ్యింది. కాబట్టి 2000 ఏ డీ, 1922 శాలివాహన శకంతో సమానం.ఈ శకంలో సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ముల్తాన్ ప్రాంతాలలో దీన్ని పాటిస్తారు. కాశ్మీర్ రాష్ట్ర, కనీర్ ప్రాంతంలో, సంవత్సరం భాద్రపద మాసంతో ఆరంభమవుతుంది. చాణక్య చంద్రగుప్త రాజ్యంలో (325 బీ సీ లో), సంవత్సరం ఆషాడ మాశంలో ప్రారంభమైయేది. రాజస్తాన్ రాష్ట్రంలో సంవత్సరాధి దీపావళి నుండి మొదలవుతుంది. ఇలా కలాణుగుణంగా భారత దేశంలో విభిన్న ప్రదేశాలలో ప్రంతీయ సంవత్సరాధులు వాడుకలో ఉండేవి.
బెంగాల్ శఖం, ఇతర శఖాలు
బెంగాల్ శఖం లక్ష్మణ శఖానికి పర్యాయంగా వాడుకలో ఉంది. ఇది 1119 ఏ డీ లో ప్రారంభమైయ్యింది. బెంగాల్ రాజ్యాన్ని లక్ష్మణశేన రాజు యేలుతూ ఉండేవారు. చైతన్య శఖం 1486 లో చైతన్య మహాప్రభు అణుగుణంగా మొదలయ్యింది. చైతన్య సమవత్సరం చైతన్య వైష్ణవులలో వాడకంలో ఉండేది. భారత దేశ, చిట్టగాంగ్ (అసాం రాష్ట్రం వద్ధ) ప్రాంతంలో " మాఘీ " శఖం వాడకంలో ఉంది. మాఘీ శఖం 638 ఏ డీ లో మదలయ్యింది. ఈ ప్రాంతాన్ని పరిపాలించే మధు రాజుల పేరు మీద, ఈ శఖం ఆరంభమయ్యింది.
తిథులు - అనుభంధ దేవతలు
ప్రతీ తిథికి ఓ అనుభంద దేవతను జతపరిచారు. అవి:
అమావాస్య – పిత్రు పూజ; చతుర్ది – గణపతి పూజ; పంచమి – ఆది శక్తి పూజ; సష్టి – మురుగన్ పూజ; అష్టమి – కృష్ణ పూజ; నవమి – రామ పూజ; ఎకాదశి – నరాయణ పూజ; ద్వాదశి – నరాయణ పూజ; త్రయోదశి – శివ పూజ; చతుర్దశి – శివ, గణపతి పూజ; పౌర్ణమి – సమస్త దేవతల పూజకు మంచిది - విశేసించి అరుణాచలుడికి.
ఉగాది
ఉగాది యుగానికి (సంవత్సరానికి) ఆరంభం. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఉగాది గాను, మహారాష్ట్రలో గుడి పడ్వా గా ప్రజలు సంవత్సరాది జరుపుకుంటారు. హిందూ ధర్మ జీవన విధానంలో - బ్రహ్మ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సృష్టించేడని ప్రతీతి. అందుకనే ఈ రోజు ఉగాది గా పండుగ చేసుకుంటారు. ప్రఖ్యాత భారతీయ గణితకారుడు, ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచర్య తన గణాంకాలలో ఉగాదినే పరిగణంలోకి తీసుకుని తన విశ్లేషణలు జరిపారు.