Monday, July 23, 2018

*ద్వాదశ(వ్యయ)భావఫలాధ్యాయము*

*ద్వాదశ(వ్యయ)భావఫలాధ్యాయము*

పరాశరులవారన్నారు:-ఓమైత్రేయై!ఇక వ్యయభావఫలము చెప్పుదును.వ్యయాధిపతి స్వ,ఉచ్ఛరాశులందున్నా,శుభగ్రహములతో కూడినా,చూడబడినా,వ్యయమందుశుభగ్రహములున్నా శుభనిమిత్తమైన వ్యయమగును.వ్యయాధిపతి చంద్రుడై,పంచమ,నవమ,లాభములందు,స్వ,ఉచ్ఛ,స్వాంశలందుగాని,లాభ,పంచమ,నవమరాశ్యంశలందుగాని ఉన్న జాతకుడు దివ్యభవనము,పర్యంకములు,దివ్యభోగములు,వస్త్రమాల్యాగులు,కలిగి గొప్ప సంపద కలిగి ప్రభువై విలాసములతో కాలము వెళ్లించును.
అట్లుగాక,వ్యయాధిపతి శత్రుస్థానమున,నీచాంశయందు,అష్టమ,షష్ఠములందు ఉన్న జాతకుని భార్యాసుఖము లేనివానిగాను,ఏక్కువ ఖర్చుతో బాధపడువానిగాను,భోగములు లేనివానిగాను చేయును.అతడే కేంద్ర త్రికోణములందున్న యెడల స్త్రీ సుఖాదులు పూర్తిగా కలుగజేయును.జాతకునేరీతిగా లగ్నమునుండి ఫలము చెప్పబడినదో,అట్లే తృతీయమువలన సోదరులది,చతుర్థమువలన తల్లిది,పంచమమువలన పుత్రులది జాతకము చెప్పవలెను.
రాశిచచక్రము సగము - లగ్నమున భోజ్యాంశనుండి సప్తమమున భోక్తాంశ వరకు దృశ్యము - పైకికన్పడునది.లగ్నము,లాభము,దశమము,నవమము,అష్టమము,సప్తమమున భుక్తియైనది,ఆకాశమున పైన ఉండును.అందునను దశమ భావాంశ సరిగా నైత్తిమీదికి (మధ్యకు)వచ్చియుండును.అట్లే అదృశ్యార్థమేదనగా - లగ్నభుక్తి,ద్వితీయ,తృతీయ,చతుర్థ,పంచమ,షష్ఠ,సప్తమ భోజ్యమున - అందును చతుర్థము సరిగా క్రిందిభాగమున ఉన్నందుననే దానికి పాతాళమని పేరు వచ్చినది.అందుచే జాతకమున దృశ్యరాశిస్థ గ్రహములు ప్రత్యక్షముగను,అదృశ్యార్థమున నున్న గ్రహములు పరోక్షముగాను ఫలితముల నిచ్చును.
రాహువు వ్యయమందుండు,రవికుజులతో కూడియున్నా లేక వ్యయాధిపతి రవితో కూడియున్న నరకము తప్పదు.శుభగ్రహము వ్యయమున ఉండి,వ్యయాధిపతి స్వ,ఉచ్ఛరాశులందున్న,శుభసంబంధము కల్గి యున్న యెడల ముక్తికలుగును.వ్యయాధిపతి పాపగ్రహయుక్తుడైనా,వ్యయస్థానమున పాపులున్నా,పాపుచే చూడబడినా,దేశాంతరము పోవును.వ్యయాధిపతి శుభరాశులందుండి,వ్యయస్థానము శుభసంబంధము కలిగియున్న జాతకుడు స్వదేశముననే యుండును.వ్యయమున శనికుజులుండి శుభదృష్టి లేకున్నచో  శ్రీ శకం ధనార్జన జరుగును.లగ్నాధిపతి వ్యయమున ఉండి,వ్యయాధిపతి లగ్నమున ఉన్న శుక్రునితో కూడియున్న యెడల ధర్మమార్గమున ధనమును ఖర్చుచేయును.

No comments:

Post a Comment