Monday, July 30, 2018

కోణములు - కేంద్రములు
కోణములు : లగ్న, పంచమ, నవమ 1, 5, 9 స్థానములు కోణములు.
కేంద్రములు : చతుర్ధ, సప్తమ, దశమ 4, 7, 10 స్థానములు కేంద్రములు.
జన్మ లగ్నము నుండి 1, 5, 9 స్థానములు కోణములు. 4, 7, 10 స్థానములు కేంద్రములు అవుతాయి.
జ్యోతిష శాస్త్రమునకు కోణములు - కోణాధిపతులు మూలము. శాస్త్రము అంతయు కొనములపై అధారిపడి ఉన్నది. కోణములే శాస్త్రమునకు మూల ఆధారము. కోణములను విడిచిన జ్యోతి నిలువదు.
ఏ లగ్నమయినా కోణములు సంపూర్ణ శుభ స్థానములు కోణాదిపతులు స్థిర శుభులు.
** రవి, కుజ, శని, క్షీణ చంద్రుడు, రాహు కేతువులు క్రూరులుగా గురు, శుక్ర, పూర్ణ చంద్ర, శుద్ధ బుధ(పాపులతో కలువని బుధుడు) శుభులు . క్రూరునితో కలిసిన బుధుడు పాపి అని నిర్ణయము చేసి వీటిపై శాస్త్రము రచించడము వలన ఈ రోజు అప్రమాణమయిన శాస్త్రము లోకమంతా వ్యాపించినది.
లగ్నము, కోణములను విడిచి రాశులను, నక్షత్రములను, తిథులను, మాసములను, వారములను ప్రమాణముగా తీసుకొని ఎన్నో వేల దారులు సృష్టించి గ్రంధములు రచించినారు.
నిర్జీవమయిన రాసులు, మాసములు, తిథులు, వారములు, యోగము, కరణములు శుభము అశుభము కలిగించునని శాస్త్రకారులు చెప్పడము. గ్రహములు మాత్రమే శక్తి కలవి వీటి వలెనే సమస్తము శుభ అశుభములు కలుగునని తెలుపక పోవుట చేత శాస్త్రము దెబ్బతిని అశాస్త్రీయముగా మారినవి.
కోణములే శాస్త్రమునకు ఆయువు. జన్మ లగ్నము అనుసరించక జన్మ రాశి అనుసరించడము వలన ఫలిత భాగము దెబ్బతిన్నది. 

కోణములు :-
మానవునికి త్రిశక్తులు ముఖ్యము ఈ త్రిశక్తులు నెలవుండు స్తానములే కోణములు.
త్రిశక్తులు : దేహ శక్తి, జ్ఞాన శక్తి, ధన శక్తి
ఈ మూడు ప్రతీ మానవునికి ముఖ్యమయినవి. త్రిశక్తులలో ఏది లోపించినా మానవుడు దుఖఃపడును. త్రిశక్తులు కలిగినవారు సుఖపడుదురు.
త్రిశక్తి స్తానములు : లగ్నము దేహశక్తి స్థానము, పంచమము జ్ఞానశక్తి స్థానము, నవమము ధనశక్తి స్థానము.
దేహశక్తి కి పార్వతి అధిపతి, జ్ఞాన శక్తికి సరస్వతి అధిపతి, ధనశక్తికి లక్ష్మీ అధిపతులుగా ఉన్నారు.
లగ్నమును పార్వతి, పంచమమును సరస్వతి, నవమమును లక్ష్మీ పాలింతులు.
ఈ మూడు స్థానముల అధిపతుల కలయికే యోగమనబడును.
ప్రస్తుత గ్రంధములలో ఎన్నో యోగములు చెప్పినారు. అవన్నీ యోగములు కావు. దారులు తెలియక చెప్పినవే కాని ప్రమాణమునకు నిలువనివి.
త్రిశక్తి కలయిక కలిగిన వారే రూపవంతులు, జ్ఞానవంతులు, ధనవంతులు.
త్రిశక్తులు చెడిన వారే అంగహీనము - కురూపము, అజ్ఞానులు - నిరక్షరాస్యత, నిర్ధనులు - అభాగ్యులు.
త్రికోణములే పూర్వ పుణ్య స్థానములు త్రికోణాధిపతులే పుణ్య ఫల ప్రధాతలు శుభ గ్రహములు.
త్రికోణములు ఏ లగ్నములకు మారునవి కావు స్థిర శుభ స్తానములు. త్రికోణాదిపతులు స్తిర శుభ గ్రహములు ఇవికూడా మారునవి కావు.

కేంద్రములు:-
సృష్టి, పాలనా, లయ శక్తులు కలిగిన స్థానము కేంద్రములు.
చతుర్థమును బ్రహ్మ, సప్తమమును శివుడు, దశమమును విష్ణువు పాలింతురు.
రుద్ర స్థానము అయిన సప్తమము ఏ లగ్నములకు మారదు ఇది ఎప్పుడూ అశుభ/పాప స్థానము.
చతుర్థ, దశమములు శుభ అశుభ స్తానములుగా లగ్నమును అనుసరించి మారుచుండును. చతుర్థ, దశమములు అస్తిర పాప స్థానములు. సప్తమము స్థిర పాప స్థానము.
సప్తమము రుద్ర స్థానము ఇక్కడ కోణాధిపతులున్న కళత్రసౌఖ్యము, సంసార సుఖము, ఆహార విహారాదులతో సుఖముకలుగును.
చతుర్ధము బ్రహ్మ స్థానమ ఇక్కడ కోణాధిపతులున్న గృహోపకరణములు, స్తిరాస్తులు, బంధు మిత్ర సౌక్యము కలుగును.
దశమము విష్ణు స్థానము ఇక్కడ కోణాధిపతులున్న పాలనా శక్తి మెండుగా ఉండును, గౌరవ మర్యాదలు, రాజ సత్కారము, వంశ వృద్ధి కలుగును.
కేంద్రములలో కోణాధిపతులు లేకున్న మానవునికి సుఖముండదు.


కోణములు - కొణాధిపతులే శాస్త్రమునకు మూలాధారము.

No comments:

Post a Comment