*దశమ(కర్మ)భావ ఫలాధ్యాయము*
ఇటుపైన కర్మభావఫలమును చెప్పుదును వినుము.దశమాధిపతి స్వరాశి,స్వంశ,ఉచ్ఛలయందుండి,బలవంతుడైన జాతకుడు పుణ్యకర్మలు చేయువాడు,కీర్తికలవాడు,పితృసౌఖ్యము కలవాడు నగును.కర్మాధిపుడు దుర్భలుడైన కర్మభ్రష్టుడగును.రాహువు త్రికోణములందున్న జాతకుడు జోతిష్టోమాధి యాగములు చేయును.
కర్మాధిపతి శుభులతో కలిసి శుభస్థాన మందున్నయెడల వాణిజ్యమువలన గాని,రాజాశ్రయమూలమునగాని లాభముకలుగును.అట్లుగాక పాపులతో కలిసి,పాపస్థానములందున్న లాభముకలుగును.దశమ,ఏకాదశములు పాపయుక్తులైనా జాతకుడు దుష్కర్మలు చేయును.స్వజనులను దూషించును.కర్మాధిపతి అష్టమమందుండి,రాహువుతో కలిసిన నరుడు జనద్వేషి,మహామూర్ఖడు,దుష్కర్మలు చేయువాడు నగును.కర్మాధిపుడు శనికుజులతో కలిసి సప్తమమందుండి,దనేశుడుపాపయుక్తుడైన జాతకుడు వ్వభిచారి,పోట్టపోసుకొనువాడు నగును.
*సౌఖ్యయెాగము*
కర్మాధిపతి గురునితో కలిసి ఉచ్ఛరాశియందుండి,భాగ్యాధిపతి కర్మయందున్న జాతకుడు అభిమానము,ప్రతాపము,ఐశ్వర్యము కలవాడగును.లాభాధిపతి కర్మస్థానమున ఉండి,కర్మాధిపతి లగ్నమందున్నా,వారిద్దరును కేంద్రములందున్నా సుఖజీవనము కలవాడగును.కర్మాధిపతి గురునితో కలిసి మీనమందున్న వస్త్ర,ఆభరణ,సౌఖ్యాదులును పొందును.
*అసౌఖ్య యెాగము*
శని,రాహు,కుజరవులు లాభమందున్న జాతకుడు కర్మభ్రష్టు డగును.
*సత్కర్మ యెాగము*
శుక్రుడు,గురుడు,మీనమందు బలవంతులైయుండి,చంద్రుడుచ్ఛ రాశియందున్న నరుడు జ్ఞానార్థములు కలవాడగును.కర్మాధిపతి లాభమందు,లాభాధిపతి లగ్నమున,శుక్రుడు దశమమున ఉన్న నరుడు రత్నములు కలవాడగును.కర్మాధిపతి కేంద్ర త్రికోణములందు ఉచ్ఛయందుండి,గురునితో కలిసినా చూడబడినా సత్కర్మనిరతు డగును.కర్మాధిపతి లగ్నమున లగ్నాధిపతితో కలిసియుండి,చంద్రుడు త్రికోణములందున్న జాతకుడు సత్కర్మనిరతుడగును.
*అసత్కర్మ యెాగము*
నీచగ్రహముతో కూడినశని కర్మస్థానమున ఉండి,కర్మాధిపతి పాపగ్రహయుక్తుడుకాగా జాతకుడు కర్మహీనుడగును.కర్మాధిపతి అష్టమమున ఉండి,అష్టమాధిపతి కర్మయందుండి పాపగ్రహయుక్తుడైన నరుడు దుష్కర్మనిరతు డగును.కర్మాధిపతి నీచరాశియందుండి,పాపగ్రహముకర్మస్థానమందుండి,దశమమునుండి దశమమున (సప్తమమున)పాపగ్రహమున్న కర్మభ్రష్టుడగును.
*సత్కీర్తి యెాగము*
శుక్రుడు,గురుడు మీనమందు బలవంతులైయుండి,చంద్రుడుచ్ఛ రాశియందున్న నరుడు జ్ఞానార్థములు కలవాడగును.కర్మాధిపతి లాభమందు,లాభాధిపతి లగ్నమున,శుక్రుడు దశమమున ఉన్న నరుడు రత్నములు కలవాడగును.కర్మాధిపతి కేంద్ర త్రికోణములందు ఉచ్ఛయందుండి,గురునితో కలిసినా చూడబడినా సత్కర్మనిరతు డగును.కర్మాధిపతి లగ్నమున లగ్నాధిపతితో కలిసియుండి,చంద్రుడు త్రికోణములందున్న జాతకుడు సత్కర్మ నిరతుడగును
*అసత్కర్మ యెాగము*
నీచగ్రహముతో కూడిన శనికర్మస్థానమున ఉండి,కర్మాధిపతి పాపగ్రహయుక్తుడుకాగా జాతకుడు కర్మహీనుడగును.కర్మాధిపతి అష్టమమున ఉండి,అష్టమాధిపతి కర్మయందుండి పాపగ్రహయుక్తుడైన నకుడు దుష్కర్మనిరతు డగును.కర్మాధిపతి నీచరాశియందుండి,పాపగ్రహము కర్మస్థానమందుండి,దశమమునుండి దశమమున(సప్తమమున)పాపగ్రహమున్న కర్మభ్రష్టుడగును.
*సత్కీర్తి యెాగము*
దశమమున చంద్రుండుండి,దశమాదిపతి వానికి త్రికోణమునుండి,లగ్నాధిపతి కేంద్రములందున్న జాతకుడు సత్కీర్తిమంతుడగును.లగ్నాధితి కర్మయందుండి,కర్మాధిపతి బలవంతుడై గురునిచే చూడబడినయెడల సత్కిర్తి కలుగును.కర్మాధిపతి భాగ్యమందుండి,లగ్నాధిపతి కర్మయందుండి,పంచమమున చంద్రుడున్న గొప్పకీర్తి కలవాడగును.
కర్మభావ ఫలమిట్లు సంక్షేపముగా చెప్పబడినది.ఇంకను లగ్నాధిపతి కర్మాధిపతి ఆశ్రసమున పండితులచే తెలియదగినది
No comments:
Post a Comment