*ఏకాదశ(ఆయు)భావ ఫలాధ్యాయము*
ఇక మీకు లాభభావఫలమును చెప్పుదును.దాని శుభఫలములు తెలియగోరిక మనుజులకు స్వాభావికము.లాభాధిపతి లాభమునగాని కేంద్రత్రికోణములందుగాని యున్న ఉచ్ఛస్థడై రవ్యంశయందున్నను,బహులాభము కలుగ జేయును.లాగ్నాధిపతి ధనరాశి యందుండి,దనాధిపతి కేంద్రమందు గురునితో కలిసియున్నయెడల ఎక్కువలాభము కలుగును.లగ్నాధిపతి శుభగ్రహయుక్తుడై తృతీయమున ఉన్న జాతకుడు ముప్పుదారేండ్లు రాగానే రెండువేల నిష్కముల లాభమును పొందును.లాభాధిపతి శుభగ్రహయుక్తుడై కేంద్రకోణములందున్న నలుబదవయేట వెయ్యిన్నర నిష్కముల పొందును.లాభస్థానమున చంద్రుడున్న భాగ్యస్థానమున శుక్రుడును ఉన్న ఆరువేల కధిపతియగును.
లాభాత్తు లాభమున (నవమమున)గురుడు,చంద్ర బుధులున్న ఉన్న జాతకుడు ధనధాన్యములు,రత్నభరణములు కలవాడు నగును.లాభాధిపతి లగ్నమున ఉండి,లగ్నాధిపతి లాభమున ఉన్న ముప్పదిమూడవయేట వెయ్యి నిష్కములు కలవాడగును.ధనాధిపతి లాభమున ఉండి,లాభాధిపతి ధనరాశిలోనున్న వివాహమైన తర్వాత బహుభాగ్యము కలుగును.తృతీయాధిపతి లాభమున లాభాధిపతి తృతీయమున(పరివర్తనము)ఉన్న జాతకునకు భ్రాతృవర్గమునుండి ధనప్రాప్తి కల్గును.
*అలాభయెాగము*
లాభాధిపతి నీచస్థుడైగాని,త్రికమున(6,8,12)ఉండిగాని పాపగ్రహసంబంధమును కలిగియున్న ఎంత ప్రయత్నము చేసినను లాభముండదు.
No comments:
Post a Comment