Thursday, February 21, 2019

వివాహ విషయములు - ముహూర్త నిర్ణయము

వివాహ విషయములు  -  ముహూర్త నిర్ణయము
తరచుగా వివాహ విషయమై, ఎక్కువ మంది, ముహూర్త నిర్ణయము  చిన్న విషయమని,  వారికి తెలిసిన వారిని ఫోన్ లో అడిగి మరునిముషంలో ముహూర్తము చెప్పగానే  అదే ఖాయం చేయుచున్న విషయం మనకు తెల్సినదే.  ఈ వివాహ ముహూర్తమునకు, చాలా విషయములు, తీసుకో వలసిన జాగ్రత్తలు, ఏవి విస్మరించ వచ్చు ఏవి కాదు, ఇలా పరి పరి విధముల ఆలోచించి, గుణించి నిర్ణయము చేయవలెను.  చాలామంది  గమనించని, విస్మరించు దోషములు కొన్ని మనవి చేసెదను.  నన్ను అన్యధా భావింప వలదని  మనవి.   ముహూర్త కాలమున,  గురు, శుక్ర, చంద్ర గ్రహముల అస్తమయ కాలమైన,  వరుడు మరణించును.  ఆ మూడు గ్రహములకు, బాల్యదశా కాలమైన భార్య వ్యభిచారిణి కాగలదు.  ఈ గ్రహములకు వృద్ధస్తితి కల కాలమైన వధువు మరణించును..  వివాహ ముహుర్తునకు, ఈ శుభ గ్రహములు బలవంతులై, దోషములేక ఉండవలెను.
వింధ్యపర్వతములకు దక్షణమున నున్న వారు గురు, శుక్రులు, బాల్య, వృద్దాప్యము లందున్న  ౩  దినములు విడిచి,  మిగిలిన రోజులలో శుభకార్యములు చేయవచ్చుని కొందు చెప్పుచున్నారు.  కానీ ఈ వాదనను పెక్కురు సిద్దాంతులు, నిపుణులు అంగీకరించలేదు. --  వధూవరు లిద్దరు జేష్టులైన,  జేష్టమాసమున, జేష్టా నక్షత్రమున వివాహము చెయ్యరాదు.  జేష్టులనగా జన్మించి, సజివులైనవారే. అని చెప్పుకోవాలి.  కొందరు రాశి మైత్రి, గ్రహమైత్రి  బలముగలిగిన దోషములేదని వాదన ఉన్నది.  అది ఆమోద యోగ్యము కాదు. 
అక్కచెల్లెళ్ళ నోకనికే ఇచ్చి వివాహము చేయరాదు.  అక్కచెల్లెళ్ళను  అన్నదమ్ములకిచ్చుట,  తండ్రి యెకడైనా తల్లులు వేరైనా , అన్నదమ్ముల కీయరాదు.  ఓకే లగ్నమున ఒక ఇంట్లోని ఇద్దరు కన్యలకు వివాహము చేయరాదు.  కొడుకు , కూతురు లకు ఒకే లగ్నమున వివాహము చేయ రాదు.  ఇద్దరు సోదరులకు ఒకే ఇంట, ఒక లగ్నమున, ఉపనయనము,  వివాహము చేయరాదు.  కొన్ని పరిస్తితులలో,  కూతురు పెండ్లి తరువాత,  మరో లగ్నమున కొడుకు పెళ్లి చేయావచ్చును.  కొడుకు పెండ్లి తరువాత,  ఆరు నెలల లోపల, మరో కొడుకు పెళ్లి గాని ఉపనయనము గాని చేయరాదు.  అలా ఆరుమాసముల వ్యాధి కుదరక పోయిన,  ఉగాది ముందు ఒకనికి,  ఉగాది తరువాత మరొకరికి చెయ్యవచ్చును.  సంవత్సరము  మారినందున ఆ దోషము లేదు.   
        
వివాహ లగ్నము  - కొన్ని దోషములు
వివాహలగ్నమునకు కుజుడు 8 వ ఉండరాదు.  దీనిని కుజాష్టమ దోషమందురు.  శుక్రుడు 6 వ ఇంట  బృగుషట్కమందురు, ఈ రెండును మహా దోషములు మ్రుత్యుప్రదములు.   వివాహలగ్నమున రెండు పాప గ్రహము లుండి  అందొకటి 12 వ ఇంట మరొకటి రెండవ ఇంట ఉన్న  ఆ మద్యనున్న లగ్నమునకు కర్తరి దోషమగును.  ఇది నిషిద్దము.  వివాహ లగ్నము, జన్మలగ్నమునకు, చంద్ర రాశికి, అష్టమమున  ఎన్ని శుభములు కలిగి ఉన్నాను విడిచపెట్టవలెను.  అష్టమ లగ్నాధిపతి, వివాహ లగ్నాధిపతి  వివాహ లగ్నమందున్న దంపతులకు కీడు కలుగును. జన్మరాసికి అష్టమమున చంద్రుడున్న ఆ ముహూర్తము  కలహము దరిద్రమును కలిగించును. ఇక్కడ జన్మ లగ్నము కుడా  చెప్పిరి.  అందుచే వివాహ ముహూర్తము నిర్ణయిమ్చునపుడు  జాతక చక్రములు కుడా ఉండవలెను.  చంద్రుడు  వివాహ లగ్నమునకు 6వ , 8వ , 12వ  స్తానములలో నుండరాదు. చంద్రుడునకు మరే గ్రహముతోను సంభందము ఉండరాదు. చంద్రుడు శుభులతో కలిసియున్న దోషములేదని కొందరి అభిప్రాయము.   ఈ సగ్రహ చంద్ర దోషము వలన కలుగు కొన్ని దోషములు  వివరించెదను.  వివాహ లగ్నమున చంద్రుడు రవితో కలిసియున్న,  దరిద్రము కలుగును.  కుజునితో కలిసియున్న మరణము సంభవించును. బుదునితో కలిసిన సంతాన దోషము.  గురునితో కలిసిన దౌర్భాగ్యము,  శుక్రునితో కలిసిన  సవతి వచ్చు యోగముండును.   రాహు, కేతువు లతో కలసియున్న కలహము  దుఃఖము సంభవించును.    అందుచే  చంద్రుడు, శుభగ్రముతో కలిసిన దోషము లేదన్న వాదన సరికాదు.

No comments:

Post a Comment