గృహారంభమునకు సమాన్యముగా శంఖుస్థాపన అని వాడుట మనము చూస్తున్నాము
శంఖువు ఒక జాతి కార్రతో చేసి స్థాపించుట జరిగెడిది. ఇప్పుడు గృహనిర్మాణములో ఆ ప్రక్రియ లేదు.
కాని పూజాది కార్యక్రమాలు నిర్వహించి శుభ ముహూర్తమున ఇటుకలు/రాళ్ళు మొ:
నిర్మాణమునకు ఉపయోగించు వస్తువులను పెట్టి ప్రారంభించుట ఆనవాయితీ గా జరుగుచున్నది.
ఈ ముహూర్తము స్థిరరాసులలో చెయ్యవలెను అనగా వృషభ, సిమ్హ, వృచ్చిక, కుంభ రాసులలో
మాతమే మంచిది. చర రాసులు ద్విస్వభావ రాసులు యోగ్యము కాదు. ఈస్థిర రాసులు పాపగ్రహ
రాసులయిననూ అవిఏ ఉత్తమము. అట్టి స్తిరరాసులలొ శుభగ్రహమున్న, చూచిన ఇంకనూ శుభకరము.
ఈ ముహూర్తములు పగలు సూర్యోదయము తరువాత 2, 3, రాసులలో పెట్టవలెను.
మద్యాహ్న, రాత్రి కాలములందు పనికిరాదు. బహుళ పక్షము కన్నా శుక్లపక్షము మంచిది.
బహుళ పక్షమున కూడా చంద్రుడు కళాధికుడుగా నున్నప్పుడు అనగా శుక్లపక్ష
తదియ/చవితి నుండి బహుళ పక్ష దశమి వరకూ ముహూర్తము నిర్ణయించు ఆచారము కలదు.
ఈ శుభ కార్యమునకు ఉత్తరా త్రయం చిత్ర, రోహిణి, స్వాతి జేష్థ మృగశిర, మూల అశ్వని హస్త పుష్యమి
అనూరాధ లు ప్రశస్తములు. రేవతి ధనిష్ట శతభిషం కూడా రెండవ పక్షముగా పనికి వచ్చును.
ఫాల్గున, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసములలో, శుక్ల పక్షమున శుభ తిధులలో బుధ,గురు ,శుక్ర, సోమ
వారములలో జరుపవలెను. శుభ గ్రహములు కేంద్ర కోణములలో ఉండుట పాపులు 3, 6, 11 ఇళ్ళలో ఉండుట
ముహూర్తమునకు బలము. వర్జము దుర్ముహూర్తము, రాహు కాలము మొదలగు దోషములు చూచుకొనవలెను.
మరికొన్ని దోషములను వివరించెదను. శూన్య మాసములందు పాపకర్తిరీ యోగమందు,గురు మూఢము,శుక్ర మూఢము
గల కాలమందు,చేయరాదు. రవి కృత్తికా నక్షత్రమున ఉన్న కాలమును పూర్తిగా నిషేధము.
గృహప్రవేశ విషయయమై ఈ శుభ కార్యము పగలు గాని రాత్రి గానీ చేయవచ్చును.
గృహారంభమునకు చెప్పిన తిధులు, నక్షత్రములు మాసములు లగ్న బలములు గృహప్రవేశమునకు
గూడా చెప్పబడినవి. జన్మ నక్షత్రము జన్మ లగ్నమునూ గృహప్రవేశమునకు శుభమని చెప్పిరి
జన్మ లగ్నమునకు గృహప్రవేశ లగ్నము 3 ,10 ,11 స్తానములలో ఉన్న శుభము.
6 8 12 స్థానములయిన కీడు కలుగును.
గృహప్రవేశము కొందరు నిర్మాణము పూర్తి కాకుండగనే జరిపించుట మనము చూచుచున్నాము.
అట్టి ముహూర్తములు కూడా పెట్టుచున్నారు. తలుపులు కిటికీలు లేకుండా గృహప్రవేశము చెయ్యరాదు.
ముహూర్త దోషములకు,శాంతులు జపములు చెయ్యవచ్చనను వాదనలు శాస్త్రసమ్మతము కాదు.
దోషపూరితములయిన ఆ దోషములు తరువాతి కాలమున అనుభవించినవారు చాలామంది కలరు.
చివరిగా మరొక మాట. వాస్తు దోషములు ఇంటికి లేకుండా ముందుగానే అన్ని విషయములూ
పరిగణలోనికి తీసుకొన వలెను. ముహూర్త దోషములున్న వానిని వాస్తు దోషములుగా చెప్పి
మార్పులు చేర్పులు చేయుచు యజమానులను అయోమయ స్థితికి తీసుకొని పోవువారు కలరు.
పాత ఇల్లు కొనునప్పుడు వాస్తు తో పాటు నిర్మాణ సమయమున ముహూర్తబలములు
చూచిరో లేదో కూడ తెలుసు కొనుట మంచిది.
గృహారంభము, గృహప్రవేశము రెండునూ చాల ముఖ్యమగు శుభకార్యములుగాన వీనికి
వృషభ చక్ర శుద్ధియూ కలశ చక్ర శుద్ధియూ తప్పక పాటించ వలెనని ఉత్తర కాలామృతమున
కాళిదాసు చెప్పియున్నారు. ఈ రెండునూ తప్పక పాటించ వలెను. యివన్నియూ కొన్ని
విషయములు మాత్రమే. సామాన్య విషయములనే మనవిచేసితిని.
No comments:
Post a Comment