జాతక చక్రంలో ప్రేమను ఐదవభావం, ఏడవ భావం వివాహన్ని సూచిస్తాయి.
ఈ రెండు భావాధిపతుల పరివర్తన, లేదా పరస్పర వీక్షణ లేక ఇద్దరూ ఒకే భావంలో కలిసి ఉన్నా అది ప్రేమ వివాహాన్ని సూచించుచుంది.
జాతక చక్రంలో ప్రేమను సూచించే గ్రహం శుక్రుడు పంచమ భావం జాతకుని యొక్క ప్రేమను , సరదాను తెలియజేస్తుంది.
శుక్రుడు ప్రథానంగా పంచమ గృహంలో ఉంటే ప్రేమ వివాహం గా చెప్పవచ్చు.
5, 2, 7, 11 భావాలలో శుక్ర స్థితి ప్రేమ వివాహాన్ని తెలియజేస్తుంది.
శుక్రుడు ఏ భావంలో ఉన్నాడన్నది ప్రథానం కాదు.
ఏభావంలో ఉన్నా కుజ సంబంధం ఉంటె ప్రేమకు ఆస్కారం ఉంది.
కుజుడు అంటే కోరిక .
శుక్రుడు అంటే ప్రేమ.
ఈ రెండిటి కలయిక కాముకతను సూచిస్తుంది.
కుజుడు శుక్రునితో కలిసి ఉన్నా కుజుని 4, 7 వ దృష్టి శుక్రుని పై పడి వీరిద్దరిలో ఒకరికి సప్తమ భావంతో గానీ, భావాధిపతి తో గానీ సంబంధం ఉంటే ప్రేమ వివాహం ఉందని చెప్పవచ్చు.
కుజుని 8వ దృష్టి పనికిరాదు. ఎందుకంటే, ప్రేమ లో విడిపోవడాన్ని సూచిస్తుంది.
అలాగే కుజుడు(కోరిక), శుక్రుడు(ప్రేమ + కామం) కలయిక .
5,7,10 లో వున్నా , లేదా ఒకే నక్షత్రంలో వున్నా వివాహము తరువాత ప్రేమతో కూడిన వివాహేతర సంబంధాలకు అవకాశాలు వుంటాయి.
శుక్రునితో చంద్రుడు కలిసి ఉన్నా కూడా ప్రేమ వ్యవహారం ఉందని గుర్తించాలి.
ముఖ్యంగా.....
ఐదు, పదకొండు భావాలలో కనుక వీరిద్దరూ కలిసి ఉంటే అది తప్పక ప్రేమవివాహానికి దారితీస్తుంది.
11భావం జాతకుని /జాతకురాలి పరిచయాలు, స్నేహితులు, సరదా మొదలైనవాటిని గురించి తెలుపుతుంది.
కనుక ఇందులో శుక్ర, చంద్ర కలయిక ద్వారా జాతకుని /జాతకురాలి స్నేహితులలోనే ఒకరు జీవితభాగస్వామి కావడాన్ని కూడా సూచించ వచ్చు.
జాతక చక్రంలో చంద్రుని నుండి 5,7 భావలలో శుక్రుడు ఉన్నాకూడా అది ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది.
కుజ, శుక్ర కలయిక అంశచక్రంలో ఉన్నదేమో కూడా పరిశీలించాలి. ఇది కూడా ప్రేమవివాహాన్ని,వివాహేతర సంబంధాన్ని తెలుపుతుంది.
కుజ, శుక్ర కలయిక విడాకులకు దారితీస్తుంది అనుకుంటే అది పొరపాటు. అటువంటి పనిచేసేది శుక్ర, రవి గ్రహాల కలయిక అయితే కుజ శుక్రుల కలయిక భార్య /భర్త మీద ఇష్టం తగ్గి పరుల మీద పెరుగుతుంది .
పై గ్రహస్థితులు ఉన్నప్పటికీ శని దృష్టి ఆయా భావాలకు, గ్రహాలకు కలిగినచో అది వివాహం వరకు దారితీయదు.
అలాగే ష్టష్టమ స్థానాధిపతి సంబంధం ఉన్నా, షష్టమంలో ఆయా గ్రహాలు పడినా అది ప్రెమికులిద్దరూ విడిపోవడాన్ని, గొడవలు పడడాన్ని సూచిస్తుంది.
ఆరవ భావంలో ఉన్న గ్రహం దృష్టి సోకినా కూడా అది సంభవిస్తుంది.
ఇదేవిధంగా అష్టమ, వ్యయ స్థానాల నుండి గూడా గ్రహించాలి.
ఆయా స్థాలతో, స్థానాధిపతులతో, ఆస్థానాలలో ఉన్నగ్రహాలతో శుక్ర, కుజులకు, పంచమ, సప్తమాలకు ఉన్న సంబంధంకూడా ప్రేమ వ్యవహారంలో విభేధాలను సూచిస్తాయి.
శుక్ర శని గ్రహాల కలయిక ఒకటికంటె ఎక్కువ ప్రెమ వ్యవహారాలను, సంబంధం బెడిసికొట్టడాన్ని కూడా తెలుపుతుంది.
రాహు,శుక్రుల కలయిక ప్రేమవ్యవహారాన్ని సూచిస్తుంది కానీ, రాహు మహర్దశా అంతర్దశలలో ఈ వ్యవహారం బెడిసి కొట్టే ప్రమాదముంది.
ప్రేమ, (శుక్ర)వివాహం,(7) ధైర్యం (కుజ)అనే మూడు విషయాల కలయికతో ప్రేమ వివాహం ఏర్పడుతున్నది.
జాతకంలో వివాహం (7 వ భావం, 7 వ స్థానాధిపతి, శుక్ర/గురు గ్రహాలు ) నకు ఈ క్రింది వాటి సంయోగం ఉంటే ప్రేమ వివాహం సూచితమవుతుంది.
ప్రేమ మరియు భావుకత (5 వ భావం, 5 వ భావాధిపతి, చంద్రుడు, శుక్ర గ్రహాలు) నిర్ణయింతీసుకునే ధైర్యం (3 వ భావం, 3 వ స్థానాధిపతి, కుజుడు, రాహు గ్రహాలు)
ఈ మూడిటి సంయోగంచే ప్రేమ+వివాహం సంభవిస్తుంది. ముఖ్యంగా మొదటి దైన వివాహ కారకత్వానికి రెండు,మూడు ల సంబంధం కలగాలి.
వివాహకారక భావాలతో గానీ గ్రహాలతొ గానీ సంబంధం కలగనట్లైతే అది వివాహం వరకు వెళ్లకపోవచ్చు .
No comments:
Post a Comment