*సర్పశాపయెాగము*
*నిర్వచనము*- పంచమస్థానమునందు రాహువుండి కుజునిచే చూడబడినను లేదా పంచమము కుజస్థానమై రాహువు అందున్నను పంచమాధిపతి రాహువుతో కలసివుండగా,పంచమమందు శని చంద్రునితో కలసినను లేదా చూడబడినను సంతానకారకుడు కుజునితోను,రాహువు లగ్నమునందు,పంచమాధిపతి దుస్థానమునందున్నను - పంచమము కుజస్థానమై,రాహువుతో కూండి బుధునిచే చూడబడినను - పై యెాగములన్ని సర్ప శాపయెాగములు అవుతాయి.
*ఫలితములు*- ఈ యెాగమునందు జన్మించినవారు సర్పశాప కారణముగా సంతానము లేనివారగుదురు.
*వివరణ*- పైయెాగములను అనుసరించి పంచమస్థానమునకు సంబంధించి అశీస్సులు లేదా శాపములు సంతానము కలుగకపోవడానికో లేదా గర్భస్రావములు అవ్వడానికో కారణమౌతాయి.పై యెాగములందు పంచమము,పంచమాధిపతి,కారకడు మరియు రాహువు ప్రధానముగా కారకులవుతారు.
*పితృశాప సుతక్షయ యెాగము*
*నిర్వచనము* - రవి పంచమందుండగా నీచస్థానమైనను లేదా మకర,కుంభ అంశములైనను లేదా పాపగ్రహముల మధ్య ఉన్నను ఈయెాగము ఏర్పడును.
*ఫలితములు*- జాతకమందు ఈ యెాగము ఏర్పడిన పితృశాపము కారణంగా సంతానము లేనివారగుదురు.
*మాతృశాప సుతక్షయ యెాగము*
*నిర్వచనము*- అష్టమాధిపతి పంచమమందు,పంచమాధిపతి అష్టమమందు,చంద్రుడు చతుర్థాధిపతితో కూడి షష్ఠమందున్నపుడు ఈ యెాగము ఏర్పడుతుంది.
*ఫలితములు*- తల్లి శాపము కారణంగా సంతాన నష్టము అవుతుంది.
*భాతృ శాప సుతక్షయ యెాగము*
*నిర్వచనము* లగ్న పంచమాధిపతులు అష్టమస్థానమునందుండగా,తృతీయాధి పతి కుజ రాహువులలో ఎవరితోనైనా కలసి పంచమమందుండగా ఈ యెాగము ఏర్పడును.
*ఫలితములు*- సోదర శాప కారణముగా సంతాన నష్టము అవుతుంది.
*వివరణ*- ఈ యెాగములో లగ్న,తృతీయ,పంచమ,అష్టమ,రాహు,సోదర కారకుడైన కుజుల మధ్యలో సంబంధము ఉండడం గవనించవచ్చును.కొద్ది కొద్దిగా భేదాలతో అనేక రకములుగా ఈ యెాగము ఏర్పడుతుంది.పంచమాధిపతి కుజునితోను లేదా కుజుడు రాహువు పంచమమునందున్నను ఈ యెాగము ఏర్పడుతుంది.ఇక్కడ ప్రధానమైనయది తృతీయ,పంచమ స్థానములు,కుజుడు వీరి పాపత్వములు ఇక్కడ ప్రధానమైన విషయమని గ్రహించవచ్చును.
*ప్రేతశాప యెాగము*
*నిర్వచనము* -రవి,శనులు 5నందు,క్షీణచంద్రుడు 7లోను,రాహువు లగ్నమందు,గురుడు 12 నందున్నపుడు అది ప్రేతశాపయెాగము అవుతుంది.
*ఫలితములు*- ప్రేతశాపములు లేదా పితృదేవతల శాపముల కారణంగా సంతాన నష్టము కలుగును.
*వివరణ*- ఒక వక్తి మరణించడంతో స్ధూలదేహమున వదలి అంత్య సంస్కారములు పూర్తయ్యేవరకు అనగా సుమారు రెండువారముల వరకు ఒకప్రత్యేకమైన రూపంతో ఉంటారని శస్త్రములలో చెప్పబడింది.ఈ రూపమునే ప్రేత రూపము అంటారు.ఆజీవి బ్రతికి ఉన్నపుడు చేసుకున్న కర్మఫలమును అనుసరించి,వారి సంతానముచే ఆచరించబడిన ప్రేత సంస్కారమును అనుసరించి ఏకరమైనస్థితి ఏర్పడేది ఇక్కడ నిర్ణయించ బడుతుంది.ఈ ప్రేత సంస్కారము విధిని అనుసరించి జరుగనపుడు తరువాత స్థితిని చేరుకునే అవకాశము లేకపోవడంతో ఈ ప్రేతముల కోపములు శాపములుగా ఆ కర్మను చేసినవారిని బాధిస్తాయని చెప్పబడింది.ఈ యెాగమునందు అటువంటి ప్రేతశాపములచే సంతాన నష్టము కలుగుతుందని చెప్పబడింది.ఇది నిజమాకాదా అనే సంశయము లేకుండా కొన్నివిషయాలను నమ్మవలసి వస్తుంది.మరణమంటే భౌతిక శరీరమునుండి ఆత్మగా చెప్పబడే శక్తివెలువడి సూక్ష్మ శరీరాన్ని ధరించి,ఆ జీవి స్థూలశరీరంతో చేసుకున్న కర్మానుసారము తదనుగుణమైన రూపం పొందుతుంది.మహర్షులు తమ మనోనేత్రములతో అతీంద్రీయ జ్డానముతో ఆత్మ పరిణామమును తెలుసుకున్నారు.మనకు తెలిసిన శాస్త్రములలో మరణానంతరము ఏమిజరుగుతుందనే విషయంపై ఎటువంటి వివరములు ఉండవు.మరణమంటే కేవలము భౌతికశరీరాన్నివదలడం కాదని చెప్పవచ్చును.
బలహీనుడైన చంద్రడు సప్తమమునందు,రాహువు లగ్నమునందు,రవి శనులు పంచమమందున్నపుడు,చంద్రుడు అనేక రకములుగా పాపత్వం పొందడంతో అనగా చంద్రునితో కేతు యుతి,శని రాహువుల దృష్టి ఏర్పడడం జరిగింది.జాతకములో చంద్ర,రాహు,శనులసంబంధము ఏ విధంగా ఏర్పడినను అతీంద్రీయ శక్తులు,దెయ్యములు,పిశాచములు రూపములో ఇబ్బందులు కలిగిస్తాయి.
No comments:
Post a Comment