ఏ పని మొదలుపెట్టడానికి.. బిజినెస్ స్టార్ట్ చేయడానికి.. బైక్, కార్లు కొనేటప్పుడు నెంబర్ ప్లేట్స్ కి లక్కీ నంబర్ ఉండేలా జాగ్రత్త పడతారు. లక్కీ నంబర్ ఇంత స్పెషల్ ప్లేస్ సంపాదించింది. అయితే ఏదీ లక్కినంబరో తెలియని వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
మీ రాశిని బట్టి మీకు ఏ నంబర్ అదృష్టం తీసుకొస్తుందో తెలుసుకోవడం మంచిది. ఈ నంబర్స్ మీకు మంచి ఫలితాలు తీసుకొస్తాయి. మీ పర్సనాలిటీకి తగ్గట్టు మీరు అదృష్టవంతులయిపోవచ్చు. సో మీ రాశిని బట్టి మీ అదృష్ట సంఖ్య ఏదో ఇప్పుడే తెలుసుకోండి.
మేష రాశి మేషరాశి వాళ్లకు మార్స్ రూలింగ్ ప్లానెట్. కాబట్టి వీళ్లు చాలా విభిన్నంగా, ఎనర్జిటిక్ గా, ధైర్యంగా, క్యూరియస్ గా ఉంటారు. వీళ్లకు 9 మరియు 1 అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్యలు. ఈ రెండు నెంబర్లు మీకు ఇబ్బందులున్న సమయంలో కూడా శ్రేయస్సు తీసుకొస్తాయి.
వృషభ రాశి వృషభ రాశి వాళ్లు రొమాంటిక్ గా ఉంటారు. అలాగే చాలా ఓర్పు కలిగి ఉంటారు. లాజికల్ గా ఆలోచించే గుణం ఉంటుంది. వీళ్లకు 2, 8 సంఖ్యలు చాలా అనుకూలంగా ఉంటాయి.
మిథున రాశి మిధున రాశివాళ్లకు ఈ ఏడాది చాలా శ్రేయస్కరమైనది. మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారు. మీకు అదృష్టం తీసుకొచ్చే సంఖ్యలు 3, 7. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ నంబర్స్ ని ఫాలో అయితే.. విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి ఎవరైతే కర్కాటక రాశి కింద పుట్టి ఉంటారో వాళ్లకు సిక్త్ సెన్స్ చాలా స్ర్టాంగ్ గా ఉంటుంది. అలాగే వీళ్లకు ఇమాజినేటివ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివాళ్లకు కలిసొచ్చే నెంబర్లు 4 మరియు 6.
సింహ రాశి సింహరాశి వాళ్లు నమ్మకానికి, ధానదర్మాలకు పెట్టింది పేరు. వీళ్లకు ఈ ఏడాది కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 4, 6. ఈ సంఖ్యలు మీరు ఎదురుచూస్తున్న పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తాయి.
కన్యా రాశి కన్యారాశి వాళ్లకు సహాయం చేసే గుణం ఉంటుంది. వీళ్లు చాలా అందంగా ఉంటారు. మోడల్స్ అయ్యే అవకాశాలు కన్యారాశి వాళ్లకు ఎక్కువ. వీళ్ల జీవితంలో శ్రేయస్సును, మంచి అదృష్టాన్ని తీసుకొచ్చే నంబర్లు 2, 5, 7.
తుల రాశి తులా రాశి వాళ్లు ఆదర్శవాదులుగా ఉంటారు. వీళ్లకు సోషల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. 1,2,7 సంఖ్యలు వీళ్లకు ఊహించని విధంగా అదృష్టాన్ని తీసుకొస్తాయి.
వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్లు రహస్య స్వభావం, సహజమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్లకు కలిసొచ్చే నెంబర్లు 2, 7, 9.
ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లు చాలా ధైర్యవంతులు. ఆశావాదులు. అలాగే కాస్త మతిమరుపు కూడా ఉంటుంది. వీళ్ల లైఫ్ లోకి అదృష్టం తీసుకొచ్చే సంఖ్యలు 3, 8, 5. ఇవి మీ లక్కును సూచిస్తాయి.
మకర రాశి మకర రాశి వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. వీళ్లు చాలా నమ్మకస్తులు, నిజాయితీపరులు. ఈ సంవత్సరం వీళ్లకు విజయాలు తీసుకొచ్చే అదృష్ట సంఖ్యలు 6, 8, 9.
కుంభ రాశి కుంభరాశి వాళ్లు చాలా సైలెంట్. అలాగే చాలా తెలివైన వాళ్లు. ఫ్రెండ్లీ నేచర్ కూడా కలిగి ఉంటారు. ఈ సంవత్సరం వీళ్లకు 2, 3 ,7 అదృష్ట సంఖ్యలు. ఇవి మీకు మ్యాజిక్ లా పనిచేస్తాయి.
మీన రాశి మీన రాశి వాళ్లకు చాలా ఆలోచనా శక్తి ఉంటుంది. వీళ్లకు కలిసొచ్చే, అనుకూలమైన సంఖ్యలు 1, 3, 4, 9. ఈ నంబర్లు మీకు లక్కీగా పనిచేస్తాయి.
ముఖ్య గమనిక :- శుభసంఖ్యలు (లక్కీ) గురించి శాస్త్ర నిర్ణయం లేదు