Thursday, February 21, 2019

వివాహ విషయములు - ముహూర్త నిర్ణయము

వివాహ విషయములు  -  ముహూర్త నిర్ణయము
తరచుగా వివాహ విషయమై, ఎక్కువ మంది, ముహూర్త నిర్ణయము  చిన్న విషయమని,  వారికి తెలిసిన వారిని ఫోన్ లో అడిగి మరునిముషంలో ముహూర్తము చెప్పగానే  అదే ఖాయం చేయుచున్న విషయం మనకు తెల్సినదే.  ఈ వివాహ ముహూర్తమునకు, చాలా విషయములు, తీసుకో వలసిన జాగ్రత్తలు, ఏవి విస్మరించ వచ్చు ఏవి కాదు, ఇలా పరి పరి విధముల ఆలోచించి, గుణించి నిర్ణయము చేయవలెను.  చాలామంది  గమనించని, విస్మరించు దోషములు కొన్ని మనవి చేసెదను.  నన్ను అన్యధా భావింప వలదని  మనవి.   ముహూర్త కాలమున,  గురు, శుక్ర, చంద్ర గ్రహముల అస్తమయ కాలమైన,  వరుడు మరణించును.  ఆ మూడు గ్రహములకు, బాల్యదశా కాలమైన భార్య వ్యభిచారిణి కాగలదు.  ఈ గ్రహములకు వృద్ధస్తితి కల కాలమైన వధువు మరణించును..  వివాహ ముహుర్తునకు, ఈ శుభ గ్రహములు బలవంతులై, దోషములేక ఉండవలెను.
వింధ్యపర్వతములకు దక్షణమున నున్న వారు గురు, శుక్రులు, బాల్య, వృద్దాప్యము లందున్న  ౩  దినములు విడిచి,  మిగిలిన రోజులలో శుభకార్యములు చేయవచ్చుని కొందు చెప్పుచున్నారు.  కానీ ఈ వాదనను పెక్కురు సిద్దాంతులు, నిపుణులు అంగీకరించలేదు. --  వధూవరు లిద్దరు జేష్టులైన,  జేష్టమాసమున, జేష్టా నక్షత్రమున వివాహము చెయ్యరాదు.  జేష్టులనగా జన్మించి, సజివులైనవారే. అని చెప్పుకోవాలి.  కొందరు రాశి మైత్రి, గ్రహమైత్రి  బలముగలిగిన దోషములేదని వాదన ఉన్నది.  అది ఆమోద యోగ్యము కాదు. 
అక్కచెల్లెళ్ళ నోకనికే ఇచ్చి వివాహము చేయరాదు.  అక్కచెల్లెళ్ళను  అన్నదమ్ములకిచ్చుట,  తండ్రి యెకడైనా తల్లులు వేరైనా , అన్నదమ్ముల కీయరాదు.  ఓకే లగ్నమున ఒక ఇంట్లోని ఇద్దరు కన్యలకు వివాహము చేయరాదు.  కొడుకు , కూతురు లకు ఒకే లగ్నమున వివాహము చేయ రాదు.  ఇద్దరు సోదరులకు ఒకే ఇంట, ఒక లగ్నమున, ఉపనయనము,  వివాహము చేయరాదు.  కొన్ని పరిస్తితులలో,  కూతురు పెండ్లి తరువాత,  మరో లగ్నమున కొడుకు పెళ్లి చేయావచ్చును.  కొడుకు పెండ్లి తరువాత,  ఆరు నెలల లోపల, మరో కొడుకు పెళ్లి గాని ఉపనయనము గాని చేయరాదు.  అలా ఆరుమాసముల వ్యాధి కుదరక పోయిన,  ఉగాది ముందు ఒకనికి,  ఉగాది తరువాత మరొకరికి చెయ్యవచ్చును.  సంవత్సరము  మారినందున ఆ దోషము లేదు.   
        
వివాహ లగ్నము  - కొన్ని దోషములు
వివాహలగ్నమునకు కుజుడు 8 వ ఉండరాదు.  దీనిని కుజాష్టమ దోషమందురు.  శుక్రుడు 6 వ ఇంట  బృగుషట్కమందురు, ఈ రెండును మహా దోషములు మ్రుత్యుప్రదములు.   వివాహలగ్నమున రెండు పాప గ్రహము లుండి  అందొకటి 12 వ ఇంట మరొకటి రెండవ ఇంట ఉన్న  ఆ మద్యనున్న లగ్నమునకు కర్తరి దోషమగును.  ఇది నిషిద్దము.  వివాహ లగ్నము, జన్మలగ్నమునకు, చంద్ర రాశికి, అష్టమమున  ఎన్ని శుభములు కలిగి ఉన్నాను విడిచపెట్టవలెను.  అష్టమ లగ్నాధిపతి, వివాహ లగ్నాధిపతి  వివాహ లగ్నమందున్న దంపతులకు కీడు కలుగును. జన్మరాసికి అష్టమమున చంద్రుడున్న ఆ ముహూర్తము  కలహము దరిద్రమును కలిగించును. ఇక్కడ జన్మ లగ్నము కుడా  చెప్పిరి.  అందుచే వివాహ ముహూర్తము నిర్ణయిమ్చునపుడు  జాతక చక్రములు కుడా ఉండవలెను.  చంద్రుడు  వివాహ లగ్నమునకు 6వ , 8వ , 12వ  స్తానములలో నుండరాదు. చంద్రుడునకు మరే గ్రహముతోను సంభందము ఉండరాదు. చంద్రుడు శుభులతో కలిసియున్న దోషములేదని కొందరి అభిప్రాయము.   ఈ సగ్రహ చంద్ర దోషము వలన కలుగు కొన్ని దోషములు  వివరించెదను.  వివాహ లగ్నమున చంద్రుడు రవితో కలిసియున్న,  దరిద్రము కలుగును.  కుజునితో కలిసియున్న మరణము సంభవించును. బుదునితో కలిసిన సంతాన దోషము.  గురునితో కలిసిన దౌర్భాగ్యము,  శుక్రునితో కలిసిన  సవతి వచ్చు యోగముండును.   రాహు, కేతువు లతో కలసియున్న కలహము  దుఃఖము సంభవించును.    అందుచే  చంద్రుడు, శుభగ్రముతో కలిసిన దోషము లేదన్న వాదన సరికాదు.

Sunday, February 17, 2019

గృహారంభ గృహప్రవేశ విషయములు

గృహారంభమునకు సమాన్యముగా శంఖుస్థాపన అని వాడుట మనము చూస్తున్నాము
శంఖువు ఒక జాతి కార్రతో చేసి స్థాపించుట జరిగెడిది.  ఇప్పుడు గృహనిర్మాణములో ఆ ప్రక్రియ లేదు.
కాని పూజాది కార్యక్రమాలు నిర్వహించి శుభ ముహూర్తమున ఇటుకలు/రాళ్ళు మొ:
నిర్మాణమునకు ఉపయోగించు వస్తువులను పెట్టి ప్రారంభించుట ఆనవాయితీ గా జరుగుచున్నది.
ఈ ముహూర్తము స్థిరరాసులలో చెయ్యవలెను అనగా వృషభ, సిమ్హ, వృచ్చిక, కుంభ రాసులలో
మాతమే మంచిది. చర రాసులు ద్విస్వభావ రాసులు యోగ్యము కాదు. ఈస్థిర రాసులు పాపగ్రహ
రాసులయిననూ అవిఏ ఉత్తమము. అట్టి స్తిరరాసులలొ శుభగ్రహమున్న, చూచిన ఇంకనూ శుభకరము.

ఈ ముహూర్తములు పగలు సూర్యోదయము తరువాత 2, 3, రాసులలో పెట్టవలెను.
మద్యాహ్న, రాత్రి కాలములందు పనికిరాదు. బహుళ పక్షము కన్నా శుక్లపక్షము మంచిది. 
బహుళ పక్షమున కూడా చంద్రుడు కళాధికుడుగా నున్నప్పుడు  అనగా శుక్లపక్ష
తదియ/చవితి నుండి బహుళ పక్ష దశమి వరకూ ముహూర్తము నిర్ణయించు ఆచారము కలదు.
ఈ శుభ కార్యమునకు ఉత్తరా త్రయం చిత్ర, రోహిణి, స్వాతి జేష్థ  మృగశిర, మూల అశ్వని హస్త  పుష్యమి
అనూరాధ లు ప్రశస్తములు. రేవతి ధనిష్ట శతభిషం కూడా రెండవ పక్షముగా పనికి వచ్చును.

ఫాల్గున, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసములలో, శుక్ల పక్షమున శుభ తిధులలో బుధ,గురు ,శుక్ర, సోమ
వారములలో జరుపవలెను. శుభ గ్రహములు కేంద్ర కోణములలో ఉండుట పాపులు  3, 6, 11 ఇళ్ళలో ఉండుట
ముహూర్తమునకు బలము.  వర్జము దుర్ముహూర్తము, రాహు కాలము మొదలగు దోషములు చూచుకొనవలెను.

మరికొన్ని దోషములను వివరించెదను.   శూన్య మాసములందు పాపకర్తిరీ యోగమందు,గురు మూఢము,శుక్ర మూఢము
గల కాలమందు,చేయరాదు. రవి కృత్తికా నక్షత్రమున ఉన్న కాలమును పూర్తిగా నిషేధము.

గృహప్రవేశ విషయయమై ఈ శుభ కార్యము పగలు గాని రాత్రి గానీ చేయవచ్చును.
గృహారంభమునకు చెప్పిన తిధులు, నక్షత్రములు మాసములు లగ్న బలములు గృహప్రవేశమునకు
గూడా చెప్పబడినవి. జన్మ నక్షత్రము జన్మ లగ్నమునూ గృహప్రవేశమునకు శుభమని చెప్పిరి
జన్మ లగ్నమునకు గృహప్రవేశ లగ్నము 3 ,10 ,11 స్తానములలో ఉన్న శుభము.
6  8  12 స్థానములయిన కీడు కలుగును.

గృహప్రవేశము కొందరు నిర్మాణము పూర్తి కాకుండగనే జరిపించుట మనము చూచుచున్నాము.
అట్టి ముహూర్తములు కూడా పెట్టుచున్నారు.  తలుపులు కిటికీలు లేకుండా గృహప్రవేశము చెయ్యరాదు.
ముహూర్త దోషములకు,శాంతులు జపములు చెయ్యవచ్చనను వాదనలు శాస్త్రసమ్మతము కాదు.
దోషపూరితములయిన ఆ దోషములు తరువాతి కాలమున అనుభవించినవారు చాలామంది కలరు.

చివరిగా మరొక మాట.  వాస్తు దోషములు ఇంటికి లేకుండా ముందుగానే అన్ని విషయములూ
పరిగణలోనికి తీసుకొన వలెను. ముహూర్త దోషములున్న వానిని వాస్తు దోషములుగా చెప్పి
మార్పులు చేర్పులు చేయుచు యజమానులను అయోమయ స్థితికి తీసుకొని పోవువారు కలరు.
పాత ఇల్లు కొనునప్పుడు వాస్తు తో పాటు నిర్మాణ సమయమున ముహూర్తబలములు
చూచిరో లేదో కూడ తెలుసు కొనుట మంచిది.

గృహారంభము, గృహప్రవేశము రెండునూ చాల ముఖ్యమగు శుభకార్యములుగాన వీనికి
వృషభ చక్ర శుద్ధియూ కలశ చక్ర శుద్ధియూ తప్పక పాటించ వలెనని ఉత్తర కాలామృతమున
కాళిదాసు చెప్పియున్నారు.  ఈ రెండునూ తప్పక పాటించ వలెను. యివన్నియూ కొన్ని
విషయములు మాత్రమే. సామాన్య విషయములనే మనవిచేసితిని.

Friday, February 8, 2019

*ముహూర్తమునకుగ్రహగతులే ముఖ్యమా ?

మనము ఏ కార్యానికైతే ముహూర్తాన్ని నిర్ణయిద్దామని అనుకుంటామో అంటే అక్షరాభ్యాసమా, ఉపనయనమా, వివాహమా, వ్యాపారమా, గ్రుహప్రవేశమా ఏమైనా కావచ్చు ఒకొక్క కార్యానికి ముహర్త భాగములో ఒకొక్క భావము పర్జిక్యులర్గా శుద్ధిగా ఉండాలని ఉంటుంది. అలాగే ఆకార్యానికి సంబంధించిన కారక గ్రహములు భావాధిపతులు లగ్నస్థితి ఇవన్ని డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటాయి. ముహూర్తాన్నిబిట్టి అవి మారుతూ ఉంటాయి. అలాగే కార్యాన్ని బట్టి తారలను ఎంచుకొనవచ్చు. కాన్ని సందర్భాలలో క్షేమతార, కాన్ని సందర్భాలలో సాధనతార, కాన్ని సందర్భాలలో మిత్రతార, తీసుకుంటాము. అలాగే చంద్రబలాన్ని కూడా భేరీజు వేసుకుంటాము. ఒకాయన ముహూర్తానికి ప్రత్యక్ తార లేదా విపత్తార ఉంది ఎలా అంటాడు. ఎదో ఊహించేయటమే. ముహూర్తమునకు స్వక్షేత్రగతుడయి ఉన్న చంద్రునివలన విపత్తార, ప్రత్యక్ తారల దోషములు హరించును. మరియు విపత్తార, ప్రత్యక్ తారలకు చంద్రబిలము బాగున్నచో తార దోషమ పరిహారము అగును. అందుచేతనే వివాహాది శుభముహూర్తములకు తారాబలముకన్నా చంద్రబలమే ముఖ్యముగా చూచెదరు. అట్లుకానప్పడు ప్రథమనవకంలో జన్మతార ద్వితీయ నవకంలో వివత్తార, తృతీయ నవకంలో ప్రత్యక్ తార మూడు నవకములందు వైధనతార నిషిద్ధము. మిగతా నవకములలో ముహూర్తము పెట్టవచ్చును. అయినప్పటికి తప్పని వరిస్థితులలో జన్మతార ఏడు ఘడియలు విపత్తార మూడు ఘడియలు ప్రత్యక్ తార ఎనిమిది ఘడియలు వదలి మిగతా ఘడియలలో ముందుకు వెళ్ళవలసి వచ్చినపుడు ఆ స్వల్పదోషశాంతికి పెండ్లి కుమార్తె లేదా పెండ్లి కుమారునికి గాని జన్మ తారకు శాకదానము (గుమ్మడి పండు) వివత్తారకు బెల్లము, ప్రత్యక్ తారక ఉప్పు దానము ఇచ్చి వివాహాది శుభకార్యములు జరుపవచ్చును. మరొక ఆయన ఫలానా ముహూర్తానికి రాహూకాలము ఉందంటాడు. ఇంకోఆయన శనిహోర యమ గండం ఉందంటారు. ఒకాయన అయితే ఇంకేముంది చక్రంలో కుజుడు వ్యయంలో ఉన్నాడు అంటాడు. ఎవరికి వారు ఏదో ఊహించేసుకుని గందరగోళం పడితే ఎలా? అసలు ముహూర్తానికి ఆ నక్షత్రమేమిటి? ఆ రాశి ఏమిటి? ఆ లగ్నమేమిటి? ఆధిపత్యమేమిటి? గురుశుక్రుల పొజిషను ఏమిటి? చూసుకోవాలి కదా. ముహూర్తానికి లగ్నము గ్రహ గతులే ముఖ్యము. మరొకాయన చవితి రోజున ముహూర్తమేమిటి? అంటారు. చవితి, షష్టి అష్టమి తిథులలో కూడా వివాహాది శుభకార్యాలు జరుపుతూ ఉంటారు. తిథివారనక్షత్ర లగ్నములను పరిశీలించి పంచక రహితమయిందేమో చూసుకోవాలి. ముహూర్త సమయమున శని హోర, రాహుకాలము, యమగండకాలము ఇవి ఏకవింశతి మహా దోషములందు చెప్పబడలేదు. కనుక వాటిని మన ప్రాంతీయమువారు ఆచరించే సాంప్రదయము లేదు. మరియు యజ్ఞము, దేవతాచర్చనలు    
దానధర్మములు, నిత్యకార్యములకు వర్ణ దుర్ముహూర్తదులను చూడక ముందుకు సాగవచ్చును. ఒకవ్యక్తికి గవర్నమెంటు ఉద్యోగం వచ్చినది. అమావాస్య, మంగళవారము జాయిను అవమన్నారు. ఏమి చేస్తాము? తప్పదు. మనఃసంకల్పముతో భగవంతునిమీద భారము వేసి ముందుకు వెళ్లి ఆనందముగా రిటైర్ అయినవాళ్లు చాలామంది ఉన్నారు. కాలమే భగవంతుడు. అందున మన పని నిర్వహణ కార్యదీక్షలో భగవంతుని చూడాలి. ముహూర్తమవ్నది ఒక షెడ్యూలు లాంటిది. టైము ఇంపార్టెన్స్ని తెలియచేసేది. మనలో కార్యదీక్ష చైతన్యము, ఉత్సాపామును ఇచ్చి సకాలములో కార్యమును పూర్తి చేయటానికి నియమితమైనదే ముహూర్తముగా చెప్పబడుతున్నది. గృహప్రవేశమునకు ముహూర్తమును పెడుతున్నాము. (అక్కడ ఖగోళ చక్రాన్ని చూపిస్తున్నాము) కాదనము అంతరార్థము ఏమిటంటే ఆ ముహూర్త సమయమునకు ఈ చేపట్టిన వని అవ్వాలని కృషి చేయుటకు, అదేలేనట్లయితే ఈ ప్రపంచము ఇంత అభివృద్దికే రాదు. అన్ని వాయిదాలే. అంతేకాని ఆ ముహూర్త సమయము మాత్రమే గాప్పదనే భావముతో ఆ ముహూర్త సమయములను ఆదమరపులో దాటపెట్టుకాని బాధ పడవలసిన అవసరము లేదు. దోషములేని ముహూర్తము బ్రహ్మతరముకూడా కాదని అంటారు.
ఇక్కడ అన్నిటికి ఒకటే సూత్రం అనుకొని ముహూర్తకాల చక్రాన్ని జాతక చక్రమువలె పరిశీలించుట కూడ సమంజసము కాదు. అప్పుడు ముహూర్తమే కనిపించదు. ఒక జాతకుడు అమావాస్యరోజున పుడతాడు. పెద్ద పాజిషనుకి రావచ్చు. అలా అని అమావ్యా రోజున ముహూర్తము పెట్టము కదా. ముహూర్త చక్రమువేరు. తాతక చక్రాదులు వేరు. పంచాగ కర్తలు మంచి ముహూర్తాదులను పాందుపరచినప్పటికి శుభకార్యములను జరుపకొనేవారు ఎవరికివారు ఏదో వూహించేనుకుని మంచి సంకల్పము భావము లేకుండా కార్యాచరణ చేయుట సమంజసము కాదు.
1. వివాహమైన పదహారు రోజులలోపు వివాహ విషయాది తంతులకు ముహూర్తము లకు తిథివారనక్షత్రాదులను చూడనవసరము లేదు.
2. నెలపట్టిన ధనూ  సంక్రాంతి) మార్గశిర మాసమునందు కార్తీక మాసమునందు కూడా వివాహాది శుభముహూర్తములు జరపవచ్చను. ఉపనయనము తప్పనిసరిపరిస్థితులలో గ్రహబలములను గమనించుకొని లగ్నబలమును చూసి పుణ్యక్షేత్రము లండు నిర్వహించు కానవచ్చును.
3. అభిజిత్ లగ్నము : సూర్యుడు ఉదయించుచున్న లగ్నమును ఉదయ లగ్నమని ఆ ఉదయ లగ్నమునుంచి నాలుగవ లగ్నమును అభిజిత్ లగ్నము అందురు. ఇది సర్వదోషములను నశింపజేయును. అన్ని వర్ణములందును ఉపనయనము గర్భా దానము మినహా మిగిలిన అన్ని శుభకార్యములకు శుభ ప్రదము. లగ్న బలముచే లగ్న గురునిచే దోషములు ఎలా హరించునో అదే అభిజిత్ లగ్నమయినచో సర్వదోషములను హరించును. మిట్టమధ్యహాన్న సమయమున వచ్చు. ఈ అభిజిత్ లగ్నమును సర్వకార్యములకు ఆచరించవచ్చును.
4. గోధూళికా లగ్నము : సూర్యోదయ కాల లగ్నమునకు ఏడవ లగ్నమును గోధూళికా సమయము అందురు. అంటే పశు సంపద ఆవులు తమ నివాసమునకు చేరు సమయము. ఈ సమయముకూడ సర్వకార్యములకు శుభప్రదమని ప్రయాణమునకు కూడా వారశూలలతో సంబంధము లేకుండా శుభప్రదము.
5. శన్యూషఃకాలము : శనివారము ఉదయము సూర్యోదయమునకు ముందు (నలుబది నిమిషములు)గల సమయమును శన్యూషఃకాలము అందురు. ఈ సమయమునందు ఏ పని ప్రారంభించినను శుభప్రదము. ప్రయాణమునకు కూడ శుభప్రదము.
6. శంఖుస్థాపన జరిపిన పిదప గృహ విషయాది ఇతర పనులు ద్వారబందమును ఏర్పరుచుట, స్లాబును వేయుట, రెండు, మూడు ఫ్లోరులు వేయునపుడు ఇత్యాది విషయములకు ముహూర్తములు చూడనవసరము లేదు. శంఖుస్థాపన ముహూర్తము తదుపరి గృహప్రవేశ ముహూర్తమునకే మనము ప్రాముఖ్యత ఇవ్వవలెను.
7. ముహూర్తమునకు చంద్రుడు జన్మ తారయై, లగ్నయుక్తుడై ఉన్నప్పటికి శుభగ్రహ వీక్షితుడు అయినను, కేంద్రములందైనను, స్వాచ్చ, మూల త్రికోణములందు ఉన్నను, లగ్నాత్ లగ్నము లగాయతు ఉపచయస్థానములందును మూడు, ఆరు, పది, పదకొండు భావములందు ఉన్నను దోషవరిహారము అయి శుభదాయకము అగును.
8. ముహర్తమునకు గురు, శుక్ర, బుధుడు లగ్నమునందు ఉన్నను లేదా గురు, శుక్ర, బుధుడు లగ్నమునకు కేంద్రములందు ఉన్నచో అట్టి ముహూర్తము దోషరహిత మైనదిగా చెప్పబడును.
9. ముహూర్తమునకు గురుడుకాని, శుక్రుడుకాని కేంద్రములందును పాపగ్రహములు 3, 6, 11 స్థానములందు ఉన్నను అట్టి ముపాూర్త లగ్నమునకు తిథివార నక్షత్రయోగ దోషములు హరించబడును.
10. ముహూర్తమునకు రవి ఏకాదశ స్థానమున ఉన్నను నైసర్గిగశభలు కేంద్రకోణములందు అనగా 1, 4, 10, 5, 9 స్థానములందు ఉనను సకల దోషములు పారించవేయబడును.
11. అష్టదోషములు ఐన అబ్జదోషము, ఆయన దోషము, ఋతు దోషము, మాసదోషము పక్షదోషము, తిథిడోషము, నక్షత్రదోషము, దగ్హాదియోగదోషములు ఉన్నను ముహూర్త లగ్నమునకు కేంద్రములందు 1, 4, 10 శుభగ్రహములు ఉన్నచో దోషపరిహారము అగును.
12. ముహర్తమునకు చంద్రుడు షష్ణాష్ట్రమ వ్యయస్థానములందు ఉన్నప్పటికి అట్టి చంద్రుడు నీచ రాశి గతుడు అయినను లేదా నీచాంశలో ఉన్నను దోషము పరిహారము అగును.
13. ముహూర్తమునకు అష్టమ కుజదోషము ఉన్నను అట్టి కుజుడు అస్తంగతుడు అయినను, శత్రు క్షేత్రములందు ఉన్నను దోష పరిహారము అగును.
14. ముహూర్తమునకు షష్ట శక్రుడు దోషము అయినప్పటికి అట్టిశుక్రుని స్థానము నీచమైనను లేదా శత్రుక్షేత్రము అయినను దోషము పరిగణలోనికి రాదు.
15. వివాహ లగ్నమునకు ద్వి ద్వాదశములందు క్రూరగ్రహములు ఉన్నట్టి కర్తరీ దోషమునకు ఆ క్రూరగ్రపాములు అస్తంగతమై ఉన్ననూ నీచస్థానములై ఉన్నను శత్రు క్షేత్రగతులు అయినను లేదా కేంద్ర కోణములందు 1, 4, 5, 9, 10 స్థానములందు గురు, శుక్రులు ఉండినను లగ్నకర్తరీ, చంద్రలగ్న కర్తరీ దోషములు నివారించ బడును. ముహూర్తమును ముందుకు నడిపించ వచ్చును.
16. ముహూర్తమునకు రాత్రియందు రోగ-చోర పంచకములు ఉన్నను, పగటి యందు రాజ-అగ్ని పంచకములు ఉన్నను రెండు సంధ్యలయందును మృత్యు వంచక దోష భూయిష్టములు. రాత్రియందు రాజ, అగ్ని వంచకములు వగటియందు రోగ-చోర పంచకములు అనుసరించ వచ్చును.
17. జన్మ నక్షత్రములందు చేయకూడనివి:
పుంనవనము, సీమంతము, యుద్ధము, గర్భాదానము, శ్రాద్ధ కర్మ క్షుర కర్మ ఔషధ సేవ, ప్రయాణము, ఋణము, నూతన వ్యాపారము, ప్రభు సన్మానము, స్నేహము, రాచకార్యములు, వివాహము కూడవ జన్మ నక్షత్రములందు స్త్రీలకు వివాహము పరుషులకు ఉపనయనము జరిపించ వచ్చును.
18. జన్మ నక్షత్రమునందు చేయవలసిన పనులు :
నిషేకము, యజ్ఞము, చౌలకర్మ, అన్నప్రాసనము, ఉపనయనము, వ్యవసాయము,
ఉద్యోగము, పట్టాభిషేకము, విద్యారంభము, అక్షరాభ్యాసము, భూ సంపాదన (రిజిస్టేషన్) లు చేయవచ్చును.
19. వివాహానంతరము చేయతగని వనులు :
కుటుంబములో వివాపాము అయిన ఆరుమాసములవరకును చెవులు కట్టుట, నూతన గృహప్రవేశము, తీర్థయాత్రలు, నూతన వ్రతములు, వ్రత ఉద్యాపనలు చేయరాదు.
20 గృహారంభము చేసినతరువాత గృహప్రవేశము అయ్యేవరకు ఏ శుభకార్యములు చేయరాదు. గృహప్రవేశానంతరము శుభకార్యములు చేయవచ్చును. ఉపనయనము చేయరాదు.
21. మాతన వధువు అత్తవారింటికి పదహారురోజుల తర్వాత ప్రథమముగా గృహప్రవేసము జరుపవలసి వచ్చిన రాత్రి భాగము మంచిది. నూతన గృహప్రవేశము రాత్రి పగలు సమయమందు కూడ శుభము.

ఏకోదరులకు ఉపనయన, వివాహములు : ఒక తల్లి బిడ్డలైన ఇద్దరు కుమారులకు ఒక సంవత్సరములో ఉపనయనములు గాని, వివాహములు గాని చేయరాదు. సంవత్సరము యొక్క పేరు మారిన శుభప్రదమగును. మొదట కుమారునకు ఉపనయనము చేసి తరువాత కుమార్తెకు వివాపాము చేయవచ్చును. కుమార్తె వివాహానంతరము ఉపనయనము చేయవలసి వచ్చినచో ఆరుమాసముల వ్యత్యాసము ఉండవలెను. కుమారుని ఉపనయనము అయిన పిదప కుమారుని వివాహము తక్కువ వ్యవధిలో చేయవచ్చును. మరొక కుమారుని వివాహానంతరము ఉపనయనము చేయుటకు ఆరుమాసములు వ్యవధి ఉండవలెను. ఇరవరి కుమారులకు ఉపనయనము చేయవలెనన్నను ఇరువురి కుమార్తెలకు వివాహము చేయవలయునన్నను ఇరువరి కుమారులకు వివాహము చేయవలయుననన్నను ఆరు మాసముల కాలవ్యవధి ఉండవలెను. ఈ నియమము కవల సంతానమునకు వర్తించదు. కుమార్తె వివాహానంతరము కుమారుని వివాహము చేయవచ్చును. కుమారుని వివాహము అయిన పిదప కుమార్తె వివాహము చేయవలయునన్న ఆరుమాసముల కాలవ్యవధి ఉండవలయును. ఫాల్గుణమాసమునకుమార్తె వివాహము చైత్రమాసమున కుమారుని ఉపనయనము సంవత్సర భేదముచే శుభప్రదముగా చేయవచ్చును.
🙏🙏🙏🙏🙏