Monday, October 29, 2018

మీ పేరును బట్టి ఇంటి సింహ ద్వారమును ఎంచుకోవటం లేక ఏదిక్కు ఇల్లు మీకు అదృష్టాన్ని ఇస్తుందో తెలుసు కోవటం ఎలా ?

ఓం శ్రీ మహా గణపతయే నమః
House facing according to Name
ఉపోత్ఘాతం:- 

అతి ప్రాచీన మైన భారత దేశము శిల్ప కళలకు, వాస్తు వైభవం నకు ప్రఖ్యాతి వహించింది .
భారత దేశ నాగరికత అద్భుతమైన వాస్తు వైభవమునకు అద్దం పడుతుంది . భారత దేశం లోని
అన్ని గ్రామాలు , పట్టణాలు , మహా నగరాలు మహా సౌధాలు శిల్పకళలతో నిండి వాస్తు శాస్త్ర
విజ్ఞానాన్ని , మన పూర్వికుల శిల్పకళా మరియు నిర్మాణ సామర్ద్యాన్ని ప్రపంచానికి
చాటిచెబుతూ అందరిని అబ్బుర పరుస్తున్నాయి .

ఇలా పురములు,దివ్య సౌదములు మరియు సాధారణ గృహములు ఎన్నో కట్టడాలు
వస్తువులుగా తనయందు కలిగి వున్నది కావునే “ భూమికి “ దేవనాగరి యందు “ వాస్తు “
అని కూడా పేరుగలదు. అలాంటి ఎన్నో విషయములను తెలియజేయు విజ్ఞానమే “
వాస్తుశాస్త్రము “ అని పిలవబడినది.

“దిశ కుదిరి దశ కుదురు“ నను సామెత తెలిసిందే ! దిశ అనగా “ తాను నివసించు దిక్కు,
స్థలము,గృహము” అని అర్ధము! దశ అనగా జాతక రీత్యా ప్రాప్తించు అభివ్రుది, శుభ
యోగములు ! కనుక గృహనిర్మాణము తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహం
నిర్మించుకోవాలి . నివసించే గ్రహము సొంతమైన కాక పోయిన అందు వసతులు నివసించు
వారు అనుబవించు నట్లు , అందలి దోషములను కూడా యజమానితో పంచుకోనవలసిందే.
అలాగే మంచిని కూడా నివాసము వుండే వారు యజమాని అనుభవిస్తారు .

ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము , కాని కొన్ని సందర్భాలలో వేరొక
ఇంటిలో నివసించ వలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది .
అలాంటి సందర్భములలో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా ?
కదా ? అని తెలుసుకోనటాన్ని “ వాస్తుశాస్త్రం” లో అర్వణము అని అంటారు .


అర్వణము రెండు రకములుగా లెక్కించ వచ్చు 1. జన్మనక్షత్రము రీత్యా 2. నమనక్షత్రము రీత్యా .
నామ నక్షత్రమును బట్టి గృహము యొక్క సింహద్వారము ఎదిక్కున ఉండాలో నిర్ణయించటం
ఎక్కువగా వాడుకలో వున్నా శ్రేష్టమైన విడనంగా చెప్పవచ్చు. తెలుగు తమియ మలయాళ
కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి మరియు రాశిని బట్టి కూడా
తెలుసుకుంటారు. కానీ ఈవిధానాలు అంత ఎక్కువ వాడుకలో లేక పోవటం గమనించ
వచ్చు. ముందుగా తన పేరునకు గల మొదటి అక్షరం ప్రకారం “దిశావర్గ” నిర్ణయం
చేసుకోవాలి. సాధారణం గా దంపతులు అనగా భార్య భర్తలు గృహ నిర్మాణం తలపెడితే
సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి.
భార్య భర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన అవసరం లేదు అని గమనించ వచ్చు . భూమి భార్య
పేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహ ద్వారం
నిర్ణయించాలి.

“దిశావర్గ” నిర్ణయం :- 

తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 51 వున్నవి. వీటిని 8 భాగాలుగా విభజించినారు. వీటినే
“అష్టవర్గులు” అని పిలుస్తారు. ఈ విధానాన్ని సులువుగా అర్ధం చేసుకోవటానికి పైన
ఇవ్వబడిన పట్టికను గమనించ గలరు.

మొదటది “అ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ, ౠ,ఎ, ఏ, ఐ, ఒ,
ఓ,ఔ,అం,అః” అనే 16 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా
అట్టివారు “అ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “తూర్పు దిక్కు” స్వదిశ
అవుతుంది.

రెండవది “క” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “క, ఖ, గ, ఘ, ఙ ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “క వర్గు” నకు చెందిన వారుగా
పరిగణింప బడతారు. వీరికి “ఆగ్నేయ దిక్కు” స్వదిశ అవుతుంది.

మూడవది “చ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “చ, ఛ, జ, ఝ, ఞ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “చ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “దక్షిణదిక్కు” స్వదిశ అవుతుంది.

నాల్గవది “ట” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ట, ఠ, డ, ఢ, ణ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ట వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ నైరుతి దిక్కు” స్వదిశ అవుతుంది.

ఐదవది “త” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “త, థ, ద, ధ, న” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “త వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ పడమర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఆరవది “ప” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ప, ఫ, బ, భ, మ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ప వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ వాయవ్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఏడవది “య” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “య, ర, ల, వ” అనే 4 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “య వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఉత్తర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఎనిమిదవది “శ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “శ, ష, స, హ, ళ, క్ష” అనే 6 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “శ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఈశాన్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందిన వారో తెలుసు కోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించు కోవాలి.

“దిశావర్గ ఫలితములు”

ప్రతి వారికి వారి జన్మ గృహము శుభము , తన జన్మ గృహము కాక మరియే ఇతర కారణముల వల్లనైన ఇంకో గృహమున నివసించ వలసివచ్చిన తప్పక “ సింహద్వారం దిశను” శాస్త్రరిత్య నిర్ణయించు కొనినివసించుట అత్యంత శుభము!

తన స్వదిశ లో సింహద్వారము ఉండుట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1,3,7 దిశలు కూడాఅత్యంత శుభములే. 2,4,6 దిశలు మద్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5,8 దిశలు ఎంచు కొనిన బాధలు, ఇబ్బందులు, చింతలు, ధనవ్యయం,అనారోగ్యం అధికమగును! తద్వారా దరిద్రమును అనుబవించ వలసి వచ్చును.ఫలితములు వరుసగా

స్వదిశ అనగా 1)పుష్టి 2) సమం 3) మిత్ర 4)సమం 5)శత్రు 6)సౌఖ్యం 7)భోగం 8)వ్యయం. 

వీలైనంత వరకు విదిక్కులు లైన “ ఆగ్నేయం,నైరుతి,వాయవ్యం,ఈశాన్యం” లకు సింహద్వారము ఉండకుండా చూచుట శుభము . గృహమునకు “గేహము” అని పేరు వున్నది! వాస్తు పురుషుని స్వరూపము మనవ దేహము లాంటిది. అందుకు వాస్తుపురుషుని పూజ అంటే తనచే కట్టబడిన గృహమునకు పూజ అని అర్ధము .

 “ సర్వాంగే నయనం ప్రధానం “ అనగా అన్ని దేహ అంగములలో కళ్ళు ప్రధానమైనవి అదే విధంగ “ గేహన్గే సింహ ద్వారం ప్రధానం” అంటే ఇంటికి సింహద్వారం చాలా ప్రధానంఅని అర్ధం.

“ గృహస్తస్య సర్వ క్రియాన సిద్యంతి గృహం వినా” అని శాస్త్ర వాక్యము. అనగా స్వగృహము లేకుండాపరుల గృహములలో ఎన్నాళ్ళు ఎన్ని సత్కర్మలు ఆచరించిన పరిపూర్ణముగా సిద్ధిoచవు. ఆ సత్కర్మల ఫలితమును సంపూర్ణముగా పొందుట కష్టసాద్యము . అందుకే చిన్నదో పెద్దదో తమది అనే ఒక గృహము చాలా అవసరము !

ఇహ పరములకు సాధనము గృహము. చెడు పాత్రలో కాచిన పాలు విరిగి పోయిన విధముగా, చవిటి నెలలో వేసిన పంట పండ నట్లు , వాస్తు సరిలేని గృహమునందు నివాసము నిష్ప్రయోజనం . గృహమునకు సింహద్వారము యెంత ప్రధానమో , గృహము శల్య వాస్తు మరియు ఇంటి లోపల వున్న గదుల నిర్మాణము వాటి స్థితి కూడా అంతే ప్రధానము. కావున తామందరూ శాస్త్రపరిజ్ఞాన సహాయతతో అందమైన,శుభ వాస్తు పరమైన గృహములను నిర్మించుకొని ఉత్తమ ఫలితాలను పొందాలని ఈశ్వరుని ప్రార్ధిస్తూ ..

మీ
భువనగిరి మురళీ కృష్ణ శర్మ ( శర్మాజీ )
నార్త్ కరోలిన, అమెరికా.

Sunday, October 28, 2018

తెలుగువారు అసలు రాహుకాలం మనం పాటించాలా...? వద్దా...?

తెలుగువారు అసలు రాహుకాలం మనం పాటించాలా...? వద్దా...?
రాహుకాలం కథేంటి ..?
తెలుసుకుందాం.

గత కొంత కాలంగా మన తెలుగుపంచాంగాల్లో రాహుకాలం అనే క్రొత్త విషయం వచ్చి చేరింది. దానితో ఈ రాహుకాలం అనేది చెడ్డకాలం కాబట్టి దీని విధిగా విసర్జించాలీ అనుకుని గడబిడ పడుతున్నారు చాలా మంది తెలుగువాళ్ళు. ఈ రాహు కాలం కూడా మనకు అలవాటైన వర్జ్యం, దుర్ముహూర్తం అనే వాటి సరసన చేర్చి దీనికి భయపడటం పెరుగుతోంది. ఈ‌ రాహుకాలం ప్రతిరోజూ వస్తుంది. రాహుకాలం సమయాలు ఇలా కనిపిస్తున్నాయి కాలెండర్లలో.

వారం సమయము మొదలు-వరకు
ఆదివారం సాయంత్రం 4.30 - 6.00
సోమవారం ఉదయం 7.30 - 9.00
మంగళవారం మధ్యాహ్నం 3.00 - 4.30
బుధవారం మధ్యాహ్నం 12.00 - 1.30
గురువారం మధ్యాహ్నం 1.30 - 3.00
శుక్రవారం ఉదయం 10.30 - 12.00
శనివారం ఉదయం 9.00 - 10.30

చాలా పంచాంగాలు, గోడ కేలండర్లలో పైన చూపిన పట్టిక ప్రకారం రాహుకాలం చూపించటం బహుళంగా కనిపిస్తుంది. కాని ఇది చాలా తప్పు.

సూర్యోదయం ఉదయం గం.6:00 మరియు సూర్యాస్తమయం సాయంత్రం గం.6:00 ఐతే మాత్రమేపై పట్టికలో చూపించిన సమయాలు వర్తిస్తాయి.

కాని సాధారణంగా సూర్యోదయసూర్యాస్తమయ సమయాలు అలా ఉండవు. సర్వ సాధారణంగా దినప్రమాణం ఖచ్చితంగా 12 గంటలు ఉండదు. అలా పగలు రాత్రీ కూడా సమానంగా 12గంటలుగా ఉండేది సంవత్సరంలో ‌కేవలం రెండు రోజులే సుమా! అందుచేత సూర్యోదయం నుండి సూర్యోదయం వరకూ పగటి సమయం ఎంత కాలమో దాన్ని ఎనిమిది భాగాలు చేసి, సూర్యోదయం నుండి ఆ భాగాలు లెక్కిస్తూ ఈ క్రింది పట్టికలో చూపినట్లుగా సరియైన విధంగా రాహుకాలం గ్రహించాలి.

వారం. రాహుకాల భాగం
ఆదివారం. 8వ భాగం
సోమవారం. 2వ భాగం
మంగళవారం 7వ భాగం
బుధవారం 5వ భాగం
గురువారం 6వ భాగం
శుక్రవారం 4వ భాగం
శనివారం 3వ భాగం

సూర్యోదయం ఉదయం 5గం. ప్రాంతంలో కూడా రావచ్చు వేసవిలో మే నెలలో. అటువంటప్పుడు సూర్యాస్తమయం సా॥7గం. కు అవుతుంది. అంటే పగటి సమయం ఇంచుమించు 14గం. పాటు ఉంటుంది. రాహుకాలం ప్రమాణం 14/8 = గం.1:45ని॥అవుతుంది. అలాగే శీతకాలంలో రాహుకాలం గం.1:15ని॥ కావచ్చును కూడా. రాహుకాలం‌ ప్రారంభ కాలాలు కూడా చాలా తేడాగా వస్తాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే గోడకాలెండర్లలో ఉన్న రాహుకాలాలు ఎంత శుధ్ధతప్పో తెలుస్తోంది కదా!

ఉదాహరణకు ఒక వేసవికాలం ఆదివారం నాడు సూర్యోదయం గం.5:00 సూర్యాస్తమయం సాయంత్రం గం.7:00 ఐతే నాటి రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 7:00 అవుతుంది కాని కేలండర్లలో ఇస్తున్నట్లుగా సాయంత్రం 4.30 - 6.00 కాదు. చూడండి ఎంత తేడా వస్తోందో!

అలా గని, అందరూ సరైన రాహుకాలాలు గణనం చేసుకుని వాడాలంటే కాలెండర్లలో సూర్యుడి ఉదయాస్తమయాల వివరాల సదుపాయం తక్కువే మరి. గోడకాలెండర్లలో కొన్ని కొన్ని మాత్రమే సూర్యోదయం చూపుతున్నాయి. సూర్యాస్తమయం చూపేవి తక్కువే. బండగా మొదటి పట్టిలో ఉన్నట్లుగా రాహుకాలాన్ని చూపించేవి మాత్రం కొల్లలు. మరి రాహుకాలం జనసామాన్యం సరిగా తెలుసుకునేది ఎలా అన్నది ప్రశ్న.

అసలు తెలుగువారు ఈ‌ రాహుకాలం పాటించవలసిన అవసరం లేదు అన్నది జవాబు. అప్పుడు గణితమూ సరైన విలువా అంటూ గొడవే లేదు కదా!

ఒకవేళ ఎవరైనా రాహుకాలం పాటించి తీరాలీ అన్న స్థిరాభిప్రాయంలో ఉంటే వారికి వార్తాపత్రికలు కొన్ని ఉపకారం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ‌నాడు పత్రికలో ప్రతిరోజూ ఆ నాటి పంచాంగం వివరాలను సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలతో సహా ఇస్తారు. వాటి ఆధారంతో ఓపిక ఉన్నవారు గణితం‌ చేసుకోవచ్చును. ఐతే, ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలు పత్రిక స్థానిక ఎడిషన్ ప్రాంతానికే వర్తిస్తాయి. హైదరాబాదు ఎడిషన్ తీసుకుని కాకినాడవారు గణితం చేసుకోరాదు - ఆ అవకాశం తక్కువే అనుకోండి.

నిజానికి రాహుకాలాన్ని తెలుగువారు పాటించటం అన్న ఆచారం లేనే లేదు. పైన చెప్పినట్లుగా ఈ‌ రాహుకాలం అనేది మన తెలుగుపంచాగాల్లో ఇటీవల చేరిన విశేషం మాత్రమే. బహుశ గత పాతికేళ్ళలో ఇది మన దగ్గరకు వచ్చింది.

రాహుకాలాన్ని తమిళులు ఎక్కువగా పాటిస్తారు.

శ్రీకప్పగంతు సుబ్బరామశర్మగారు ఆంధ్రభూమి పత్రికలో తమ రాహుకాలం - దుర్ముహూర్తం అన్న వ్యాసంలో తెలుగువారి పాత పంచాంగాలు తిరగేస్తే మనకు రాహుకాలంలో పంచాగకర్తలు సుముహూర్తాలు ఇచ్చిన దాఖలాలు కనిపిస్తాయని చెప్పారు. వారు నెల్లూరు నుండి తమిళనాడు, కర్ణాటకలలో రాహుకాలం, నెల్లూరు ఇవతల ఆంధ్రలో దుర్ముహూర్తం వాడకం ప్రధానమైంది అన్న విషయం తెలియ జేసారు. తమిళనాడు, కర్ణాటకలలో మరి ఇతర రాష్ట్రాల పంచాంగంలో ఇప్పటికీ దుర్ముహూర్తం గోచరించదు, మన పంచాంగవిధానంలో రాహుకాలం కనబడదు. మన పెద్దలు ఆచరించని రాహుకాలం మనం ఎందుకు ఆచరించాలి, అవసరం లేదు అని వారి అభిప్రాయం. ఇదే నా అబిప్రాయం కూడా.

రాహుకాలం పూజకు మంచి సమయం అన్నది తమిళదేశంలో ఆచారం. తెలుగుదేశంలో‌కాదు. వ్యాప్తిలోకి వస్తున్న మరొక అభిప్రాయం ఏమిటంటే దుర్గాపూజకు రాహుకాలం మంచిది అని. ఇది నిరాధారమైన అభిప్రాయం. దుర్గామాతపూజకూ రాహుకాలానికీ ఏ సంబంధమూ‌ లేదు.

ఈ రాహుకాలం పాటించటం అనే దాని మీద వ్యగ్రత ఎంత దూరం వెళ్ళిందంటే రాహు కాలంలో పిల్లలు పుడితే దోషమేనా? అన్న ప్రశ్నకు జవాబుగా తప్పక కొన్ని శాంతులు చేయించవలసి వస్తుంది అన్న జవాబు ఇచ్చారు

Thursday, October 25, 2018

“విదేశీయానం” పరిశీలన

సాప్ట్ వేర్  రంగం పుణ్యమా అని భారతదేశంలో నేటి యువతరం ఆకాశం అంచులను తాకుతుంది. ఒక తరం క్రిందటి వరకు ఎవరూ ఊహించని, ఊహించలేని ఉద్యోగ అవకాశాలు, ఉపాది అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను ఉంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ  విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్యా కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు ప్రతి ఇద్దరులోను ఒకరు ఖచ్చితంగా ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది ఆయా జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు మనల్ని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం.

పూర్వకాలంలో ప్రజలు అధికంగా జలయానమే చేసేవారు. అప్పట్లో విమానయానం లేదు కాబట్టి. జలయానం చేయాలంటే జల రాశులైన కర్కాటకం, మీనం, వృశ్చిక రాశులతో పాటు చంద్రబలం కూడా ఉండితీరాలి. ఇప్పుడు విమాన ప్రయాణాలు పెరిగాయి. దీనికి వాయుతత్వ రాశులైన మిధున, కుంభ, తుల రాశుల యొక్క ప్రభావం అధికమని చెప్పవచ్చును. దీనితో పాటు ఆకాశతత్వ ప్రభావాన్ని కలిగి ఉండే గురుగ్రహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

రాసులు తమ తమ స్వభావాలను బట్టి యాత్రలను చేసే అవకాశాలను కలిగిస్తాయి. వాటి వాటి స్వభావాల ప్రకారం విభజిస్తే చర, స్ధిర, ద్విస్వభావ రాశులనే మూడు రకాలుగా ఉంటాయి.

చరరాశులు:- మేషం, కర్కాటకం, తుల, మకరం

స్ధిర రాశులు:- వృషభం, సింహాం, వృశ్చికం, కుంభం

ద్విస్వభావ రాశులు:- మిధునం, కన్య, ధనస్సు, మీనం

చరరాశులు వాటి స్వభావరీత్యా చలన గుణ సంపన్నమై ఉంటాయి. దాని వలన ఈ రాశిలోని వారు ఎప్పుడు యాత్రలు చేయాలనే అభిలాష కలిగి ఉంటారు. ముఖ్యంగా జలారాసులైన కర్కాటకం, మకర రాశులైతే మరింత యాత్రలు చేయాలనే అభిలాష కలిగి ఉంటారు. ద్వి స్వభావ రాశులలో ధనస్సు, మీనరాశులు సైతం ఇలాంటి విదేశీయాత్ర స్వభావాన్నే కలిగి ఉంటాయి. స్దిర రాశులకు ఇలాంటి విదేశీ ఆకాంక్షలు తక్కువనే చెప్పాలి. స్దిర రాశుల్లో వృశ్చికరాశికి విదేశీ అవకాశాలు కొంతవరకు ఉంటాయి. మిగిలిన వారికి వారి వారి జన్మదేశంలోనే ఉండి పోవాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది.

కొన్ని నక్షత్ర స్వభావాలు కూడా విదేశీ ప్రయాణాల వైపుకు మొగ్గు చూపుతున్నాయి. అవి...

శనిగ్రహ నక్షత్రాలైన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర

రాహుగ్రహ నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిషం

గురుగ్రహ నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర

చంద్రగ్రహ నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణం

ఇంకా చర నక్షత్రాలైన స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం మొదలగు నక్షత్రాలు విదేశాలకు వెళ్ళాలనే కోరికను ప్రేరేపిస్తాయి.

జాతకచక్రంలో ఒక వ్యక్తికి విదేశీ గమన ఆకాంక్షను లగ్నం, తృతీయం, పంచమం, సప్తమం, అష్టమం, నవమం,ద్వాదశ భావాలు కలిగిస్తాయి. చరలగ్న జాతకుడు తన భ్రమణ కారక ప్రవృత్తి వలన జన్మస్ధలానికి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. స్దిరలగ్న జాతకులు తమ జన్మ స్ధలంలోనే ఉండిపోతారు. ద్విస్వభావ లగ్న జాతకులు అప్పుడప్పుడు విదేశీ యాత్రలు చేసిన అధికంగా వారు స్వస్ధలానికే వచ్చేస్తుంటారు. తృతీయ స్ధాన ప్రభావం వలన దేశ సరిహద్దులకు మించి విదేశాలకు వెళ్ళలేరు. సప్తమ స్ధానాన్ని అనుసరించి విదేశాలలోనే స్దిర నివాసం ఉంటుందా లేదా స్వదేశానికి తిరిగి వస్తారా అన్నది తెలుసుకోవచ్చు.  పంచమం, నవమ స్ధానాల వలన విదేశాలకు వెళ్ళాలనే కోరికలు పుడుతుంటాయి. అష్టమ భావం వలన  వ్యక్తి విదేశాలలోనే ఉండిపోయే అవకాశాలను నవమ, ద్వాదశాల ప్రభావం కూడా ఉంటే తెలుసుకోవచ్చును. అష్టమ భావం వృశ్చికం అయితే విదేశాలలో ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. అష్టమ భావం ధనస్సు నుండి మీనం వరకు ఉన్న రాశులలో ఉంటే విదేశీ అవకాశాలు ఎక్కువ.

నవమ భావం గమనాన్ని, పరివర్తనను, తీర్ధ యాత్రలను, దేశాంతర యానాన్ని తెలియజేస్తుంది. విదేశీయాత్రకు అవసరమైన భూమికను తయారుచేస్తుంది. నవమభావం ఆదిపత్యం లేకుండా విదేశీ ప్రయాణం చేయలేము.

ద్వాదశభావం దూరం అవటం, ఎడబాటు కలగటం తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు దూరం కావటం. కుటుంబ సభ్యులకు ఎడబాటు కలగటం అంటే విదేశాలకు వెళ్ళటం.

విదేశాలలో స్ధిర నివాసం గురించి లగ్నం, లగ్నాధిపతి, చతుర్ధం, చతుర్ధాధిపతికి సంభంధం ఉంటే విదేశీ యోగం ఉంటుంది కానీ స్ధిర నివాసానికి అవకాశాలు తక్కువ.  చతుర్ధభావం, చతుర్ధభావాధిపతికి ద్వాదశ భావ ప్రభావం ఉంటే అతడు విదేశాలకు వెళ్తాడు గాని స్దిర నివాస అవకాశాలు తక్కువ.

‘సర్వేశ్చరే స్ధితౌ రజ్జః’ అనే శ్లోకం ఆధారంగా రజ్జుయోగం ఉంటేనే విదేశీ యోగం ఉంటుందని అర్ధం. గ్రహాలన్నీ చరరాశిలో ఉన్న రజ్జుయోగం అంటారు.

“అనరప్తియ సురపాః ప్రదేశ జాతాః క్షీవ ప్రవాసీ వ్యయేశే పాపి సంయుక్తే వ్యవపాప సమన్వితే పాపగ్రహణే సందృష్టే దేశాంతర గతః “ సప్తమభావం రాహువు కలసి విదేశాలకు వెళ్ళే కారకాలు అవుతాయి. సప్తమం, రాహువు నిర్వాసనా స్దితిని తెలియజేస్తుంది. పూర్వకాలంలో నిర్వాసనా స్ధితి రాజదండన వలన కలిగేది ఇప్పుడు విదేశీయానంగా మారింది. రాహువు వ్యయంలో ఉండటం వలన బందనయోగం ఎర్పడి శుభగ్రహ ద్రుష్టి ఉంటే కుటుంబ సభ్యులను వదలి దూరంగా విదేశాలకు వెళ్తాడు.

అష్టమ, నవమాధిపతుల యుతి  ఉంటే విదేశీగమన యానం  ఉంటుంది. చతుర్ధభావంలో పాపగ్రహం ఉండి, చతుర్ధాధిపతి పాపగ్రహ యుతి కలిగి చంద్రుడు కూడా పాపగ్రహంతో కలసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న చదువు కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దీనికి తోడు దశమాధిపతికి, షష్టమాధిపతికి సంబంధం ఉన్నా లేదా దశమభావం పైన షష్టమాధిపతి ప్రభావం ఉన్న ఆ వ్యక్తి విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువ.

వ్యయాధిపతి వ్యయంలో గాని, కోణంలో గాని ఉన్న ధనార్జన కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దశమాధిపతి సంబంధం ఉంటే ఉద్యోగరీత్యా ధనార్జన ఉంటుంది. సప్తమభావాధిపతి, లగ్నాధిపతి ద్వాదశభావంలో కలసి ఉన్న లేదా, సప్తమాధిపతికి, లగ్నాధిపతికి, ద్వాదశాధిపతికి సంభంధం ఉన్న విదేశాలలో వివాహం చేసుకుంటాడు.

సప్తమాధిపతికి, దశమాధిపతికి సంభంధం ఉన్న, సప్తమాధిపతి దశమంలో ఉన్న, దశమాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమభావ, దశమభావ గ్రహాధిపతుల మధ్య పరివర్తన ఉన్న విదేశాలలో ఉద్యోగం లభిస్తుంది. నవమస్ధానం పైన గాని, నవమాధిపతి పైన గాని శని ప్రభావం ఉంటే వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. నవమస్ధానంపైన గాని, నవమాధిపతి పైన గాని గురుగ్రహ ప్రభావం ఉంటే విద్య కొరకు, దేవాలయ దర్శనం కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ.

షష్ఠమాధిపతి నవమంలో ఉన్న, నవమాధిపతి షష్థంలో ఉన్న నవమ, షష్ఠ భావ గ్రహాదిపతుల మధ్య పరివర్తన జరిగిన ఆరోగ్య సమస్యలరీత్యా విదేశీయానం చేయవలసి ఉంటుంది. నవమస్ధానం, నవమాధిపతులపైన, ద్వాదశ స్ధానం, ద్వాదశాధిపతుల పైన శుక్రగ్రహ ప్రభావం ఉంటే టూరిస్ట్ లుగా విదేశీ అందాలను తిలకించటానికి  విదేశీయాత్ర చేసే అవకాశాలు ఉంటాయి. 

నవమస్ధానం పైన, నవమాధిపతికి గురుగ్రహ, శని గ్రహ సంబంధం ఉంటే స్వాములు, అవధూతలు, మత ప్రచారకులు, మతభోధకులు, ప్రవాచాలాలు చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్తుంటారు. నవమస్ధానంలో రవి ఉన్న చంద్రుడు ఉన్న కాళ్ళకు చక్రాలు పెట్టుకున్నట్లుగా భ్రమణకాంక్షగా విదేశాలకు తరచుగా వెళ్తుంటారు.

చరలగ్నం, లగ్నాధిపతి చరలగ్నంలో ఉండి, నవాంశ కూడా చరలగ్నం అయితే ఆ జాతకుడు విదేశీ యాత్రలద్వారానే ధనార్జన చేస్తాడు. నవమస్ధానంలో గురువు ఉండి శని, చంద్రుల  దృష్టి ఉంటే వారు విదేశాలకు వెళ్ళటమే కాకుండా అక్కడ స్దిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. నవమస్ధానంలో శుక్రుడు, గురువు, బుధుడు, శని గ్రహాలు ఉంటే ఆ వ్యక్తి అశేషమైన విదేశీ ధనాన్ని సముపార్జిస్తారు.

జాతకచక్రంలో గ్రహాల పొందికను బట్టి విదేశీయానం ఉన్న, ఆ వ్యక్తి యొక్క కుటుంబం, ఆర్ధిక పరిస్ధితులు పరిగణనలోకి తీసుకోవాలి. నక్షత్రాలు, గ్రహాలు, రాశులు అన్నీ కలసిన కుటుంబంలో ధనలక్ష్మీ లేకున్నా, దైవానుగ్రహం, పూర్వపుణ్య బలం  లేకున్నా నక్షత్రాలు, గ్రహాలు, రాశులు ఏవి మనకు సహాయపడలేవని గుర్తించాలి. పైన చెప్పిన అంశాలన్నీ విదేశీగమన జ్యోతిష్య అవగాహనకు మంచిగా తోడ్పడుతుంది.

Sunday, October 7, 2018

గోచారములో గురుడు పన్నెండు రాశులలో సంచరించునపుడు కలుగు ఫలితములు

గోచారములో గురుడు పన్నెండు రాశులలో సంచరించునపుడు కలుగు ఫలితములు

గురువు ఒక రాశిని విడిచి మరొక రాశిలో ప్రవేశించటాన్ని పుష్కరము అంటారు.గురువు మేషాదిగా 12 రాశులలో సంవత్సరానికి ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు.అలా ప్రవేశం జరిగినప్పుడు ఒకొక్కరాశికి ఒకొక్క నది చొప్పున క్రమముగా పుష్కరాలు వస్తాయి.గురువు ఆ రాశిలో ఉన్నంత కాలం ఆ నది పుష్కరములలో ఉన్నట్లే.

గోచారం ప్రకారం గురువు 2 5 7 9 11 రాశులలో ఉన్నప్పుడు  శుభ ఫలితములు కలుగజేయును. గోచారరీత్యా వృశ్చిక రాశిలోకి సంచరిస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి అష్టమ స్ధాన ఫలితాలను, వృషభరాశి వారికి సప్తమ స్ధాన ఫలితాలను, మిధునరాశి వారికి షష్టమ స్ధాన ఫలితాలను, కర్కాటకరాశి వారికి పంచమ స్ధాన ఫలితాలను, సింహరాశి వారికి చతుర్ధ స్ధాన ఫలితాలను, కన్యారాశి వారికి త్రుతీయ స్ధాన ఫలితాలను, తులారాశికి ద్వితీయ స్ధాన ఫలితాలను, వృశ్చికరాశి వారికి జన్మ స్ధాన ఫలితాలను, ధనస్సు రాశి వారికి వ్యయ స్ధాన ఫలితాలను, మకర రాశి వారికి లాభ స్ధాన ఫలితాలను, కుంభరాశి వారికి దశమ స్ధాన ఫలితాలను, మీనరాశి వారికి నవమ స్ధాన ఫలితాలను కలుగజేస్తాడు. గోచార రీత్య గురువు సంచరించే రాశులలో అష్టకవర్గు బిందువులు 28 పైన ఉన్న రాశులలో సంచారం చేస్తున్నప్పుడు అది శతృ రాశి ఐనా చిన్నపాటి రెమిడీస్ తో శుభ ఫైతాలను, 28 బిందువుల కంటే తక్కువ ఉన్న రాశులో గురువు సంచారం చేస్తున్నప్పుడు కిష్టమైన రెమిడీస్ తో శుభ ఫలితాలను పొందవచ్చును. అంతే కాక గురువు సంచరించే రాశులలో 4 అష్టక వర్గు బిందువుల కంటే ఎక్కువ ఇచ్చిన రాశులలో శుభ ఫలితాలను, 4 కంటే తక్కువ అష్టక వర్గు బిందువులను ఇచ్చినప్పుడు అశుభ ఫలితాలను ఇవ్వటానికి అవకాశాలను కలిగిస్తాడు.

 గురుడు : దేశ త్యాగం, విత్తం లాభం అనర్ధం ధన నాశనం
                   సంపద, క్లేశం, ఆరోగ్యం, ధన హానిం, ధనాగమం
                   పీడనం లాభ నష్టంచా క్రమేణ కురుతే గురుః 

తాత్పర్యము : గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .

శ్లోకం :   రాజకోపో యశోహానీ రుద్యోగస్య విరోధకం І
          బుద్ధిభ్రంశో భాగ్యహాని ర్భయంతను గతే గురౌ ІІ

జన్మ రాశిలో గురుడు సంచరించు నపుడు ప్రభుత్వ అధికారుల కోపమునకు గురియగుదురు. పేరు ప్రఖ్యాతలకు నష్టము కలుగును. చేయు వృత్తి, వ్యాపారములలో ఇబ్బందులు ఎదురగును. బుద్ది గతి తప్పును. సంపద నశించును. భయముగా ఉండును.

శ్లోకం :   మనస్సౌఖ్యం యశోవృద్ధి స్సౌభాగ్యంచ ధనాగమః І
               ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్తానగేగురౌІІ

రెండవ రాశిలో గురు సంచార వేళలో మనస్సున సౌఖ్యము కలుగును, గృహమునందు శుభ కార్యములు జరుగును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. ధన రాబడి బాగుంటుంది. తీర్ధ యాత్రలు చేయడము, ధర్మ బద్దమైన కార్య క్రమములలో పాల్గొనడము జరుగుతుంది. సంతోషముగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము కలుగును.

శ్లోకం :   అతిక్లేశం బంధువైరం దారిద్యం దేహపీడనం І
               ఉద్యోగ భంగం కలహం తృతీయ స్తానగే గురు: ІІ

మూడవ రాశిలో గురుడు సంచారము చేయు చున్నప్పుడు శారీరక శ్రమ అధికము గా ఉంటుంది. చుట్టములతో విరోధము ఏర్పడుతుంది. దరిద్రమును అనుభవిస్తారు. ఉద్యోగ వ్యాపారములలో నష్టములు కలుగుతాయి. శరీరమునందు భాధలు, అనవసరమైన తగవులు ఏర్పడతాయి.

శ్లోకం :   యాచనం బుద్ది చాంచల్యం తేజో హానీం ధన వ్యయం І
                దేశ త్యాగంచ కలహం చతుర్ధ స్తానగే గురు: ІІ

నాలుగవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు దీన స్థితి కలుగుతుంది. బుద్ది చంచలముగా ఉండును. మర్యాద నశించును. ధన నష్టము కలుగును గొడవలు పెరుగుతాయి. స్థాన నాశనము కలుగుతుంది.

శ్లోకం :   అర్ధ లాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం І
               సదా స్వజన సౌఖ్యంచ పంచమస్థే భావే ద్గురౌ ІІ

అయిదవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు ధన లాభము కల్గుతుంది. స్వయముగా చేపట్టిన పనులు అనుకూలించుటయే కాక విజయము లభించును. తన కుటుంబ మరియు బంధు వర్గముల వలన సౌఖ్యమును అనుభవిస్తారు.

శ్లోకం :   దారాపుత్ర విరోధశ్చ స్వజనై కలహస్తదా І
               చోరాగ్ని నృప భీతిశ్చ షష్టమస్తే భవేద్గురౌ ІІ

బృహస్పతి ఆరవ రాశి సంచారము లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితోనూ, పిల్లలతోనూ విరోధము ఏర్పడును. అసహనము కలుగును, దొంగల వలన నష్టము ఏర్పడును. అగ్ని భయము కలుగును. ప్రభుత్వ సంభందిత వ్యవహారములలో ఇబ్బందులు కలుగును.

శ్లోకం :   రాజ దర్శన మారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం І
                అభీష్ట కార్య సిద్దిశ్చ సప్తమస్తే భవేద్గురౌ ІІ

ఏడవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు మంచి ఆరోగ్యముగా ఉంటారు. ప్రభుత్వ పరిపాలకుల తో పరిచయములు ఏర్పడతాయి. తలచిన కార్యములు నెరవేరుతాయి. ప్రతి పని తనకు అనుకూలముగా జరుగుతుంది.

శ్లోకం :   చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం І
               నిష్టురం సాహసం క్రోధం అష్టమస్తే గురౌ భవేత్ ІІ

ఎనిమిదవ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు దొంగల వలన గానీ, అగ్ని వలన గానీ, నష్టము ఏర్పడును, శరీర సౌఖ్యము ఉండదు. నిస్టూరముగా మాట లాడడం, ప్రతి పనిలోనూ తెగింపు, కోపము ఎక్కువగా ఉండడము జరుగుతుంది.

శ్లోకం :   అర్ధంచ స్వకులాచారః గృహలాభః సుభోజనం І
                నిత్య స్త్రీ జన సంపర్కం నవమస్తే భవేత్ గురౌ ІІ

తొమ్మిదవ రాశిలో గురుని సంచారము ఉన్నప్పుడు సునాయాస ధన లాభము కలుగును. మంచి ఆచార సాంప్రదాయముల ప్రకారము నడచుకొంటారు. గృహము నిర్మించుకొంటారు. ఇరుగు పొరుగు వారితో కలసి మెలసి ఉంటారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది.

శ్లోకం :   ధాన్య నాశో ధనచ్చేదః వృధా సంచరణం భయం І
                స్వజనై దూషనః చైవ దశమష్తో యదా గురు: ІІ

బృహస్పతి పదవ రాశిలో సంచరించు చున్నప్పుడు ధనమునకు నాశనము కలుగును, అనవసర ఖర్చులు పెరుగుతాయి. బ్రతుకు భయముగా సాగుతుంది. ఇతరులచే దూషించ బడతారు.

శ్లోకం :   యశో వృద్ధి బలం తేజ స్సర్వత్ర విజయ స్సుఖం І
                శత్రు నాశో మంత్రం సిద్ధి రేకాదశ గతే గురౌ ІІ

పదకొండవ రాశి లో గురుడు సంచారము  చేయుచున్నప్పుడు మంచి పేరును సంపాదిస్తారు. తేజస్సు, పలుకుబడి పెరుగుతుంది. శత్రువులు నాశనమవుతారు, అన్నివిధాలా లాభమును పొందుతారు.

శ్లోకం :   శుభ మూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం І
                స్థాన భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్తానగే గురౌ ІІ

పన్నెండవ రాశిలో గురుడు సంచారము జరిగేటప్పుడు ఇంటిలో శుభ కార్యములు జరుపుట వలన ధనము ఖర్చగును. ఆస్తులను అమ్ముకొంటారు. దరిద్రమును అనుభవించుట, స్థానమును మారుట మొదలగు ఫలితములను కలుగచేయును.


మేష రాశి వారికి గురువు అష్టమంలో సంచారం చేస్తాడు కావున పనులలో ఆటంకాలను కలిగించును. ధనం వృధాగా ఖర్చు అగును. అనారోగ్య సమస్యలు వేదించును. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. పెట్టుబడులకు సంబందించిన విషయాలలో జాగ్రత్తగా ఉండవలెను. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. తరచుగా ప్రయాణాలు కలగవచ్చు.

వృషభ రాశి వారికి గురువు సప్తమంలో సంచారం చేస్తాడు కావున వివాహం కానీ వారికి ఇది మంచి సమయం. గురు సంచారం వలన మనస్సుకు నచ్చిన జీవిత బాగస్వామిని ఎన్నుకోవచ్చును. వైవాహిక జీవితంలో అన్యోన్నత కలుగును. భాగస్వాములతో చేసే వ్యాపారాలు కలసి వచ్చును. ఉద్యోగ సంబంధ విషయాలలోనూ, వ్యాపార సంబంధ విషయాలలోనూ, ధన సంబంధ విషయాలలోనూ ఆచి తూచి నిర్ణయం తీసుకోవటం మంచిది.

మిధున రాశి వారికి గోచారరీత్యా గురువు షష్టమ స్ధాన సంచారం వలన శతృ స్ధానం వలన జాగ్రత్తగా ఉండవలెను.  ఈర్షా ద్వేషాలు ఎక్కువ అగును. నమ్మక ద్రోహం కలిగే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. చిన్న పనులను కూడా కష్ట సాద్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది. కోర్టు సమస్యలు వలన సమస్యలు ఉంటాయి. 

కర్కాటక రాశి వారికి గోచారరీత్యా గురువు పంచమ స్ధాన సంచారం వలన సంతాన సమస్యలు ఉన్నవారికి ఈ రాశిలో గురు సంచారం వలన సంతానం పొందే అవకాశాలు ఉంటాయి. ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. విధ్యార్ధులకు మంచి సమయం. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరగవచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగును. ప్రభుత్వ అధికారుల నుండి ప్రయోజనాలు పొందవచ్చును.

సింహరాశి వారికి గోచారరీత్యా గురువు చతుర్ధ స్ధాన సంచారం వలన స్ధిరాస్తులు కలసి వచ్చును. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ పెరుగును. స్నేహితుల మరియు బంధు మిత్రుల సహకారం లభించును. మానసికమైన ఇత్తిడి పెరుగును. తల్లి ఆరోగ్య విషయంలోనూ, పిల్లల ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ వహించాలి. వాహన సంబంధ విషయాలలో ఇబ్బందులు ఉంటాయి.

కన్యారాశి వారికి గోచారరీత్యా గురువు తృతీయ స్ధాన సంచారం వలన దగ్గరి ప్రయాణాలు కలగవచ్చును. వ్యాపార సంబంధ విషయాలలో అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఎంతో కష్టపడితే గాని ఫలితాలు పొందలేరు. స్నేహితులు స్వార్ధపూరితంగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ సంబంధ ప్రమోషన్ విషయంలో ప్రతికూలతలు ఏర్పడవచ్చును.

తులారాశివారికి గోచారరీత్యా గురువు ద్వితీయ స్ధాన సంచారం వలన కుటుంబ విషయాలలో మంచి జరుగును. కుటుంబంలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు సుగుమం అగును. పెట్టుబడిగా పెట్టిన ధనం విషయంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అన్నీ విధాల ఆదాయ మార్గాలు అనుకూలం అగును. కృషికి తగిన ఫలితం పొందవచ్చును. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన కలగటానికి మంచి సమయం. చేతిలో డబ్బు నిలబడుతుంది. మాటకు విలువ పెరుగుతుంది.

వృశ్చిక రాశి వారికి గోచారరీత్యా గురువు జన్మ స్ధానంలో సంచారం వలన స్దాన చలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహం వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవటం వలన నష్టపోవచ్చును. మానసికఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు రాశి వారికి గోచారరీత్యా గురువు వ్యయ స్ధాన సంచారం వలన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. స్ధిరాస్ధులు కొనుగోలు అమ్మకాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ విషయాలలో ఇబ్బందులు కలగవచ్చును. అనవసరమైన ఖర్చులు కలగవచ్చును. అనారోగ్య సమస్యల వలన హాస్పటల్ ఖర్చులు వచ్చును. సమయం, డబ్బు వృధా జరగవచ్చును.

మకర రాశి వారికి గురువు గోచారరీత్యా లాభ స్ధాన సంచారం వలన కృషికి తగిన ఫలితం పొందవచ్చును. ఉద్యోగ సంబంద విషయాలలో ఆదాయం పెరగవచ్చును లేదా ప్రమోషన్స్ పొందవచ్చును. వ్యాపార లావాదేవీలు అనుకూలత పొంది వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల వలన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును.

కుంభ రాశి వారికి గోచారరీత్యా గురువు దశమ స్ధాన సంచారం వలన ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాలలో మార్పులు కలగవచ్చును. ఉద్యోగ, వ్యాపా మార్పులు కలగవచ్చును. పిత్రార్జితం కలగవచ్చును. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా బలం పొందే అవకాశాలు ఉన్నాయి. కృషితో సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపార విషయాలలో కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.

మీనరాశి వారికి గోచారరీత్యా గురువు నవమ స్ధాన సంచారం వలన దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు కలగవచ్చును. తీర్ధయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించింది, ఊహించిన విషయాలను ఆచరణలోకి పెట్టవచ్చును. తండ్రి సలహాలను పాటించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.

Saturday, October 6, 2018

వివాహ పొంతన సమగ్ర పరిశీలన

వివాహ పొంతన సమగ్ర పరిశీలన

జీవితంలో వివాహం అనేది ఒక ముఖ్య వ్యవహారం.వదూవరుల మద్య భావాలు కలసి, భావైక్యత ఉందో లేదో తెలుసుకొని వివాహం చేస్తే జీవితం అన్యోన్యంగా ఉండేందుకు అవకాశం ఉంది.దీనికి ముఖ్యంగా లగ్నాన్ని,సప్తమభావాన్ని పరిగణలోకి తీసుకుంటారు.లగ్నంలో తాను,సప్తమంలో భార్య,లేదా భర్త సామాజిక సంబంధాలు ఉన్నాయి.కానీ ఏ ఇద్దరి మద్య అభిప్రాయాలు అన్నీ విషయాలలో ఏకీభవించకపోవచ్చు.అయితే కొన్ని ముఖ్యమైన అభిప్రాయాలు కూడా ఏకీభవించకపోతే కలసి జీవించటం కష్టం.

చంద్రుడు మనఃకారకుడు కావటం వల్ల చంద్రుడున్న నక్షత్రాన్ని,రవి ఆత్మశక్తికి కారకుడు కావటం వల్ల రవి ఉన్న నక్షత్రాన్ని ,లగ్నం శరీరశక్తి కావటంవల్ల లగ్నాన్ని పొంతన చూడాలి అని చెప్పిన అనుభవజ్ఞుల అభిప్రాయం మంచిదనిపిస్తుంది.

ఇరువురి రాశిచక్రాలలో చంద్ర స్ధానాధిపతుల,లగ్నాధిపతుల,రవి స్ధానాదిపతుల మైత్రి ఉంటే వారిద్దరి మద్య అవగాహన,మానసికమైన ఏకీకృత ఆలోచనా విధానం,శారీరక విషయాలలో లోపాలు లేకుండటం మొదలైన అంశాలు ప్రత్యేకంగా గుర్తించబడతారు.

ఇటువంటి విశేషాలతో కూడుకున్న మేలాపలకం అనేది సైద్ధాంతిక ప్రాతిపదికలతో కూడుకున్నటువంటిది.బాల్యవివాహాలు ఆచారంగా ఉన్న రోజుల్లో వేరు పిల్లల మధ్యలో అవగాహన కలిగించటానికి ఏర్పాటు చేసుకున్న ఆరోగ్యకరమైన ఆనందకరమైన విధానమే ఈ మేలాపలకం.ఈ మేలాపలకం సరిగా ఉంటే వ్యక్తుల శరీర మానసిక ఆత్మిక ధోరణులలో ఐక్యత ఉండి దాదాపుగా ఇద్దరి ఆలోచనా ప్రవృత్తుల్లో ఆనందదాయకమైన ఫలితాలు ఏర్పడతాయి.లేకుంటే బలవంతంగా భావాలను,శరీరాలను పంచుకోవాల్సి రావటం వల్ల అక్రమ విధానాలకు,ఇబ్బందులకు వ్యక్తులు పాల్పడుతుంటారు.ప్రాశ్చాత్యులు కూడా ప్రస్తుత కాలంలో వివాహాల విషయంలో మేలాపకాదులను గమనిస్తున్నారంటే వారి విధానాల నుండి మన వైజ్ఞానిక మేలాపాక విధానం,సంప్రదాయ ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు వారు చూసే చూపును మనం అర్ధం చేసుకోవచ్చును.

చాలా మంది పంచాంగంలో పాయింట్లు చూసి 18 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాతకాలు కుదిరాయనుకుంటారు.ఈ నిర్ణయం చాలా తప్పు .అష్టకూటములలో సంతానం,వైదవ్యం,ద్వికళత్రయోగం లాంటివి తెలుసుకోవటానికి అవకాశం లేదు.ఉదా:-సప్తమస్ధానంలో కుజ,శుక్రుల సంయోగం ఉండి పాప వీక్షణ ఉన్న దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి.పంచమ స్ధానంలో రాహు,కేతువులు ,కుజుడు,శని గాని ఉండి పాప వీక్షణ ఉన్న సంతాన నష్టం,మృతశిశువు,గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.ఇవి ఏవి అష్టకూటముల ద్వారా నిర్ణయించలేము.పాయింట్లు బాగున్నాయని వివాహం చేసుకోవచ్చని వివాహ నిర్ణయం చేయరాదు.36 పాయింట్లకు 34 వచ్చిన జాతక చక్రంలో అనుకూలంగా లేకపోతే ఉపయోగంలేదు.

వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వదూవరులిద్దరి జాతకచక్రంలో పంచమం (సంతానం కోసం),సప్తమ స్ధానం (దాంపత్య జీవితం),అష్టమ స్ధానం(వైదవ్యం),దశ ,అంతర్దశలు (వివాహానంతర జీవితం)తప్పని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.పాయింట్లకు ప్రాదాన్యత ఇవ్వరాదు.తారాబలం,గ్రహమైత్రి,నాడీమైత్రి బాగుండి జాతకచక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వదూవరులిద్దరికి పొంతన కుదిరినట్లే.

వధూవరులకు వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో తీసుకొన్నారు .

1 వర్ణకూటమి 2 వశ్యకూటము ౩ తారాకూటమి 4 యోనికూటము 5 గ్రహకూటమి 6. గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి

వీటిలో మొత్తం 18 గుణాలు దాటితే శుభం అనేది సామాన్య వచనం,కానీ సప్తమ,పంచమ,అష్టమ భావాలు సంపూర్ణ శుభత్వం ఉంటే వివాహం చేయవచ్చు.ఒక వేళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రాన్ని అనుసరించి చూడాలి.

వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.

కర్కాటకం,వృశ్చికం,మీన రాశుల వారు బ్రాహ్మణ వర్ణం.
మేషం,సింహం,దనస్సు రాశుల వారు క్షత్రియ వర్ణం.
మిధున,తుల,కుంభ రాశుల వారు వైశ్య వర్ణం.
వృషభ,కన్య,మకర రాశులు శూద్ర వర్ణం.

వదూవరులు ఇద్దరు ఏక వర్ణమైన ఉత్తమం.వధువు వర్ణం కంటే వరుడి వర్ణం ఎక్కువైన మద్యమం.వరుని వర్ణం కంటే వధువు వర్ణం ఎక్కువైన వర్ణ పొంతన కుదరదు.

2 . వశ్యపొంతన : మేషరాశికి - సింహము ,వృశ్చికం, వృషభ రాశివారికి – కర్కాటక ,తులారాశులు , మిదునమునకు – కన్యరాశి, కర్కాటకరాశికి – వృశ్చికం, ధనుస్సు , సింహరాశికి – తులారాశి , కన్యకు – మిధున , మేషములు , తులా రాశికి – కన్య, మకరం, వృశ్చికరాశికి – కర్కాటకం ,ధనుస్సుకు – మీనము , మకర రాశికి – మేషం , కుంభం కుంభరాశికి – మేషము , మీనమునకు – మకరం ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను .మిధున,కన్య,తుల నర రాసులు.వీటికి సింహం తప్ప తక్కినవన్నీ వశ్యములే.సింహానికి వృశ్చికం తప్ప అన్నీ వశ్యాలే.

౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము వచ్చిన తారలు మంచివి కావు. అను జన్మతారలో చేసుకోవచ్చును.శుభతారలైతే 3 గుణాలు,అశుభ తారలైతే 1 న్నర గుణాలు ఉంటాయి.

4 . యోనిపొంతనము :
అశ్వని,శతభిషం-గుఱ్ఱం
స్వాతి,హస్త-ఎద్దు
ధనిష్ట,పూర్వాభాద్ర-సింహం
భరణి,రేవతి-ఏనుగు
పుష్యమి,కృత్తిక-మేక
శ్రవణం,పూర్వాషాడ-కోతి
ఉత్తరాషాడ,అభిజిత్-ముంగీస
రోహిణి,మృగశిర-పాము
జ్యేష్ఠ,అనూరాధ-లేడి
మూల,ఆరుద్ర-కుక్క
పునర్వసు,ఆశ్లేష-పిల్లి
మఘ,పుబ్బ-ఎలుక
విశాఖ,చిత్త-పులి
ఉత్తర,ఉత్తరాభాద్ర-ఆవు

పులి – ఆవు , పిల్లి – ఎలుక , లేడి – కుక్క , గుఱ్ఱము – దున్న , పాము – ముంగిస , సింహం – ఏనుగు , కోతి- మేక ఇవి విరోధ జంతువులు. వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి కాకూడదు.ఒకే యోని అయితే సంపద,భిన్న యోనులైతే శతృత్వం లేకపోతే మద్యమం,రాశి కూటం,వశ్య కూటం అనుకూలమైతే యోనికూటం కుదరకున్నా దోషం లేదు.

5 గ్రహకూటమి :

సూర్యుడు – శని , చంద్రుడు – బుధుడు , కుజుడు –బుధుడు .గురుడు –శుక్రుడు ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమి ని చూసేటప్పుడు పై విధంగా ఉండ కూడదు.
వధూవరుల రాశులకు అన్యోన్యమైత్రి ఉత్తమం,సమమైత్రి మద్యమం,పరస్పర సమత్వం కనిష్ఠం,పరస్పర శతృత్వం మృత్యుపదం,శతృత్వం కలహాప్రదం.

6 గణ కూటమి :-

స్వగుణం చోత్తమం ప్రీతి మధ్యమం దైవమానుషం
అధమం దేవడైత్యానాం మృత్యుర్మానుష రాక్షసం.

వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు. నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది.వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు. నక్షత్రాలు 27 .నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.

దేవగణ నక్షత్రాలు:-అశ్వని,మృగశిర,పునర్వసు,పుష్యమి,హస్త,స్వాతి,అనురాధ,శ్రావణం,రేవతి
దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు.శాంత స్వభావం కలిగి ఉంటారు.పరోపకారులై ఉంటారు.ఓర్పు,సహనం కలిగి ఉంటారు.

మనుష్యగణ నక్షత్రాలు:-భరణి,రోహిణి,ఆరుద్ర,పుబ్బ,ఉత్తర,పూర్వాషాడ,ఉత్తరాషాడ,పూర్వభాధ్ర,ఉత్తర భాధ్ర
మనుష్యగణ నక్షత్ర జాతకులు రజో గుణ లక్షణాలు కలిగి ఉంటారు.మంచి చెడు రెండు కలిగి ఉంటారు.భాదించటం,వేధించటం చేయరు.ఎవ్వరికీ హాని తలపెట్టరు.

రాక్షస గణ నక్షత్రాలు:-కృత్తిక,ఆశ్లేష,మఖ,చిత్త,విశాఖ,జ్యేష్ఠ,మూల,ధనిష్ట,శతబిషం
రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు.అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు.కఠినంగా మాట్లాడుతారు.మిక్కిలి స్వార్ధపరులు.

వధూవరులిద్దరిది ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం,ప్రేమానురాగాలు ఉంటాయి.వధువుది మనుష్య గణమై వరునిది రాక్షస గణమైతే వారిద్దరిమధ్య బొత్తిగా అవగాహన లేకపోవటం ,ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. వధువుది దైవగుణం వరునిది రాక్షసగణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.భార్యాభర్తల మద్య పొందిక కుదరదు.

.7. రాశి పొంతనము :
వధూవరుల జన్మ రాసులు ఒకదానికొకటి 6-8 అయితే మృత్యువు,5-9 అయితే సంతాన హాని,2-12 అయితే నిర్ధనత్వం.

ప్రీతి షడష్టకం:-మేషం-వృశ్చికం,మిధునం-మకరం,సింహం-మీనం,తుల-వృషభం,ధనస్సు-కర్కాటకం-కన్య.

మృత్యు షడష్టకం:-మేషం-కన్య,మిధునం-వృశ్చికం,సింహం-మకరం,తుల-మీనం,ధనస్సు-వృషభం,కుంభం-కర్కాటం.

శుభ ద్విర్ద్వాదశం:-మీనం-మేషం,వృషభం-మిధునం,కర్కాటకం-సింహం,కన్య-తుల,వృశ్చికం-ధనస్సు,మకరం-కుంభం.

అశుభ ద్విర్ద్వాదశం:-మేషం-వృషభం,మిధునం-కర్కాటం,సింహం-కన్య,తుల-వృశ్చికం,ధనస్సు-మకరం,కుంభం-మీనం.

శుభ నవపంచకాలు:-మేషం-సింహం,వృషభం-కన్య,మిధునం-తుల,సింహం-ధనస్సు,తుల-కుంభం,వృశ్చికం-మీనం,ధనస్సు-మేషం,మకరం-వృషభం.

అశుభ నవ పంచకాలు:-కర్కాటకం-వృశ్చికం,కన్య-మకరం,కుంభం-మిధునం,మీనం-కర్కాటకం.

ఏకరాశి:-సౌభాగ్యం,పుత్ర లాభాలు.
సమసప్తకం-ప్రీతి,ధన,భోగ,సుఖాలు.
తృతీయ లాభాలు:-ప్రీతి,ధనం,సౌఖ్యం.
చతుర్ధ దశమాలు:- ప్రీతి,ధనం,సౌఖ్యం.

8 నాడీపొంతనము : నాడీ దోషం ఎంతో విశిష్టమైనది.విడువరానిది.వదూవరులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు.వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం.వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేశించునని పెద్దలు అంటారు, పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనది కూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు. కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటములో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.

శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు.జ్యోతిష్య శాస్త్రము (Astrology)లో నాడులు మూడు ప్రకారములుగా వుండును, ఈ నాడుల పేర్లు ఆదినాడి, మధ్య నాడి, అంత్య నాడి.

1. ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తరఫల్గుని, హస్త, పూర్వభాద్ర,శతబిషం మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో వుండును. దీని వల్ల మేదోసంపత్తి,ప్రతీకార వాంఛ,ఆలోచనా విధానం,కోపం,ఆవేశం తెలుపుతుంది.వదూవరులిద్దరి నక్షత్రాలు ఉత్తర,శతభిషం,పూర్వాభాద్ర,పునర్వసు,ఆరుద్ర,మూల మొదలగు నక్షత్రాలకు ఆది నాడీ దోషం లేదు.

2. మద్య నాడి: పుష్యమి, మృగశిర, చిత్ర, అనురాధ, భరణి, దనిష్ట, పూర్వాషాడ, పూర్వఫల్గుణి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్య నాడిలో వుండును. దీని వల్ల శరీరం మద్య భాగంలో ఉన్న రుగ్మతలు,సంతానం, ఊపిరితిత్తులుగుండెలో ఉన్న రుగ్మతలు తెలుపుతుంది. వదూవరులిద్దరి నక్షత్రాలు పూర్వాషాడ,అనురాధ,ధనిష్ఠ,పుష్యమి,చిత్త,పుబ్బ,మృగశిర,అను నక్షత్రాలకు మద్య నాడీ దోషం లేదు.

3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్తరాషాడ, శ్రవణ మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వచ్చును. దీనివల్ల మర్మాయవాలు,కామవాంఛ,నపుంసకత్వం గురించి తెలియజేయును.వదూవరులిద్దరి నక్షత్రాలు కృత్తిక,విశాఖ,ఆశ్లేష,శ్రవణం,మఖ,ఉత్తరాషాడ,రోహిణి నక్షత్రాలకు అంత్య నాడీ దోషం లేదు.

జ్యోతిష్య శాస్త్ర ఆదారముగా వరుడు మరియు కన్య ఇరువురి నక్షత్రములు ఒకే నాడిలో వుండిన అప్పుడు ఈ దోషము కలుగును. అన్ని దోషముల కన్నా నాడీ దోషము అశుభ కరముగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఈ దోషము కలుగుట వలన 8 అంఖము యొక్క హాని కలుగును. ఈ దోషము కలుగుట వలన వివాహ ప్రసంసము చేయుట శుభకరముగా వుండదు.

మహర్షి వశిష్టు (Maharishi Vashisht)ని అనుసారముగా నాడీ దోషము లో ఆది, మధ్య మరియు అంత్య నాడులకు వాతము (Mystique), పిత్తము (Bile) మరియు కఫము (Phlegm) అనే పేర్ల ద్వారా తెలిపెదరు.

నాడి మానవుని యొక్క శారీరక ఆరోగ్యమును కూడ ప్రభావితము చేయును (Nari also effect human health). ఈ దోషము కారణముగా వారి సంతానము మానసికముగా వికసితము లేని మరియు శారీరకముగా అనారోగ్యముతో వుండును (Naridosh also effect Mind of their Child and Health of their Child).

ఈ స్థితులలో నాడీ దోషము కలుగదు: (Naridosha will not affect you in this Conditions)
1. యది వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రములు (Birth Nakshatras) ఒకటిగా వుండిననూ ఇరువురి చరణములు ప్రదమ చరణమైన ఎడల నాడీ దోషము కలుగదు.

2. యది వరుడు - వదువు ఒకే రాశిగా వుండి (Bride and Groom have Same Rashi) మరియు జన్మ నక్షత్రము బిన్నమైన (Different Birth Nakshatras) ఎడల నాడీ దోషము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.

3. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రము ఒకటిగా వుండి మరియు రాశులు వేరు వేరుగా (Different Rashi) వుండిన ఎడల నాడీ దోషము కలుగదు.
తప్పనిసరి అయితే నాడీ దోష పరిహారానికి మృత్యుంజయ జపం సువర్ణ దానం చేయాలి.