జ్యోతిష్య శాస్త్రంలో అనేక విధాల అధ్యయనాలున్నాయి. ఇందులో భాగంగా గోచారం ఉంది. గోచారము అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలము. జాతకచక్రంలో వ్యక్తి జన్మించినప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ, ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశి గానూ చెబుతారు.
ఉదాహరణకు... 2014 సెప్టెంబర్ 25 తేదీన సూర్యోదయంలో(సుమారు 6 గంటలకి) జన్మించిన వ్యక్తి ఐతే, ఆ సమయానికి చంద్రుడున్న హస్త నక్షత్రం ఆ వ్యక్తి జన్మ నక్షత్రం, అలాగే చంద్రుడున్న రాశి కన్య ఆవ్యక్తి రాశి అవుతుంది. ఆ సమయంలో ఉదయిస్తున్న రాశి లగ్నము అవుతుంది. ఈ లగ్నాన్ని అనుసరించి జీవితంలోని స్వభావ, రోగ, వృత్తి, వివాహ, సంతాన, ప్రమాద మొదలైన అంశాలు నిర్ణయిస్తారు. గోచారానికి జాతకంతో ఉన్న సంబంధం ఒక వ్యక్తికి ఈ అంశాలకి సంబంధించిన పూర్తి సమాచారం అతని జాతకం చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాలాన్ని బట్టి వచ్చే మార్పులు పాప పుణ్యబలాల్ని సుఖ ఫలంగానూ దు:ఖ ఫలంగానూ చూపించే పట్టిక గోచారము. జాతకంలో ఉద్యోగంకానీ వివాహంగానీ యోగమున్నా గోచారంలో అనుకూల దశ లేకపోతే అవి వికటించవచ్చు. అలాంటప్పుడు పరిమితుల్లో ప్రవర్తనని ఉంచుకోవటం పుణ్యబలం పెంచుకోవటం అవసరం. అంటే జ్యోతిష జీవితాన్ని మార్చేది కాదు జీవితాన్ని సరిదిద్దుకునే సూచనలిచ్చేది అని తెలుసుకోవాలి.
కొన్ని ఉదాహరణలు... ఆదాయవ్యయాలు గమనించినప్పుడు.. వ్యయం ఎక్కువగా ఉన్నట్లైతే ఎలాగూ తప్పని ఖర్చు కనుక ఆ ఖర్చును పుణ్యకార్యాలకు ఖర్చుపెడితే మళ్లీ అది మనకు పుణ్యంరూపంలో ఉపయోగపడి కాపాడుతుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే పుణ్యకార్యాలతో పాటు స్థలాలు, ఇంటి నిర్మాణాలు మొదలైనవి కొనే ప్రయత్నం చేయటం మంచిది. భవిష్యత్ ఫలితాలను జాతకాదులలోని యోగావయోగాలతో పోల్చి చూసుకోవటం ద్వారా కాలాన్ని జీవితాన్ని సద్వినియోగంచేసుకోవచ్చు.
గోచార రీత్యా జన్మరాశి నుంచి 12 రాశులలో నవగ్రహములు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు ఈ విధముగా ఉంటాయి.
సూర్యుడు
సూర్యుడు జన్మ రాశిలో సంచరింస్తున్నప్పుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును ౩ సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును.
చంద్రుడు
చంద్రుడు 12 రాశులలో సంచరింస్తున్నప్పుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును ౩ ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగిస్తున్నాడు.
కుజుడు
కుజుడు ద్వాదశ రాశులలో సంచరిస్తున్నప్పుడు 1 దుఃఖము 2 భాగ్య హాని ౩ సౌభాగ్యము 4 శత్రువుల వలన బాధలు 5 శత్రు భయము 6 ద్రవ్య సిద్ది 7 కార్య హాని 8 శస్త్రబాధ గాయములు ఏర్పడుట 9 ధన వ్యయము 10 దుఃఖ నాశనము 11 ధన యోగము 12 క్రూరత్వమును కలుగ జేయును.
బుధుడు
బుధుడు 12 రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము ౩ శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును .
గురుడు
గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .
శుక్రుడు
శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము 2 అలంకారము ౩ లాభము 4 రతిసౌఖ్యము 5 మిత్రదర్శనము 6 మానహాని 7 విశేష రోగము 8 భూలాభము 9 ధాన్యవృద్ధి 10 ప్రమోదము 11 ధనము 12 సంతోషముల ను కలుగ జేయును .
శని
శని 12 రాశులలో సంచారము చేయునపుడు 1 ఆపదలను 2 హానిని ౩ సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .
రాహు , కేతువులు
రాహు కేతు గ్రహములు జన్మరాశి నుంచి 12 రాశులలో సంచరించు సమయమున 1 భయమును 2 కలహాలను ౩ సౌభాగ్యమును 4 మానహానిని 5 ధన నష్టములను 6 మహా సుఖములను 7 శత్రువుల వలన భయమును 8 చొర భయమును 9 శత్రు వృద్ధిని 10 ధన క్షయమును 11 శుభ ఫలములను 12 భ్రుత్యునాశనమును కలిగించుదురు .
No comments:
Post a Comment