*దత్త స్వీకారమునకు* :- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి తిధులునూ,రోహిణి,పునర్వసు,పుష్యమి,ఉత్తర,హస్త,స్వాతి,అనూరాధ,ఉత్తరాషాడ,శ్రవణకము,ధనిష్ఠ,శతభిషము,ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రములును,మేష,కర్కాటక,తుల,మకరము,వృషభ,సింహ,వృశ్చిక,కుంభ లగ్నములు శుభ దాయకము.ఉత్తరాయణము - పూర్వహ్నకాలము మంచిది.యజమాని అంటే దత్తత తండ్రికి దత్తత పుత్రునకు ఇద్దరికి తారాచంద్రబలములు సరిగా ఉండునట్లు చూడాలి.పుత్ర స్థానమగు పంచమ స్థానములో పాపులుండరాదు,పితృభాగ్యస్థానమగు నవమ స్థానము కూడ గ్రహములు బలీయముగా ఉండాలి.లగ్నమందు శుభగ్రహములు వుండాలి.లేదా కనీసము శుభగ్రహవీక్షణమైనను.ఉండాలి.బుధ,గురు,శుక్రావారములు శ్రేష్ఠములు.
*ద్వారంబధ స్థాపనము*
ద్వారబంధము స్థిరరాశులైన వృషభ,సింహ,వృశ్చిక,కుంభలగ్నములు ప్రశస్తములు.స్థిరనక్షత్రములగు ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరభాద్ర,రోహిణి నక్షత్రములు ప్రశస్తములు.చరలగ్నమైనను తులా లగ్నము ద్వారబంధస్థాపన చేయువచ్చునని కృష్ణ వాస్తు నందుతెలుపబడినది.
*ద్వారబంధ చక్ర వివరణము*
సూర్యడున్న నక్షత్రము లగాయితు మెుదటి
1,2,34, నక్షత్రమలు = రాజ్యసుఖము.
5,6,7,8,10,11,12, నక్షత్రములు = ఉద్యాసనము.
13,14,15,16,17,18,19,20. నక్షత్రములు = సంపద.
21,22,23. నక్షత్రములు = వరణము
24,25,26,27. నక్షత్రములు = సౌఖ్యము.
పైవిదముగా పరిశీలించి ద్వారబంధ స్థాపన గావించుకోవాలి. *పథ్యము*:-స్థిరరాసులుత్తమంబలు గరిమ ్ ద్వారంబు నిలుపగా చరమైన ్ చరగతులు ద్విస్విభావము లరుదుగ దలుపులు ఘటింప ననువగు కృష్ణా (కృష్ణవాస్తు శాస్త్రము).
పైపద్యము స్థిరరాశులందు ద్వారబంధము నిలుపుట మంచిది.ద్వాస్వభావరాశులైన మిధున,కన్య,ధనస్సు,మీనలగ్నములందు తలుపు అమర్చుకోవాలి.తలుపులు అమర్చుటకు చరనక్షత్రములైన స్వాతి,పునర్వసు,శ్రవణ,ధనిష్ఠ,శతభిషా నక్షత్రములు ప్రశస్తము.సామాన్యముహూర్తములకు తిథి,వార,నక్షత్ర బలములు గ్రహించినచో చాలును.
*వ్యాపార ప్రారంభమునకు* :- సోమ,బుధ,గురు,శుక్రావారములు ప్రశస్తములు.విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ తిధులు ప్రశస్తములు.ముఖ్యముగా వృషభ,మిధున,కర్కాటక,కన్య,తుల,ధనస్సు,మీన లగ్నములు శ్రేయెాదాయకము.
*కొనుగోలు నక్షత్రములు* :- వ్యాపారమునకు ఇచ్చిపుచ్చు కొనుటకు మంచి నక్షత్రములు.శ్రవణము,ధనిష్ఠ,శతభిషము,హస్త,చిత్త,స్వాతి,పుష్యమి,పునర్వసు,మృగశిర,అశ్వని,రేవతి,,అనూరాధ నక్షత్రములు ధనము ఇచ్చుటకు,భూమి,వగైరా కొనుటకు మంచిది.
*చేతినుండి పోయిన వస్తువు,అప్పు పెట్టిన ధనము,వగైరాలు తిరిగి చేతికి రాని నక్షత్రములు* :- ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,పుబ్బ,పూర్వాషాడ,పూర్వాభాద్ర,విశాఖ,రోహిణి,కృత్తిక,మఖ,ఆర్ద్ర,భరణి,ఆశ్రేష,మూల, ఈ నక్షత్రములలో దొంగిలించిబడిన వస్తువు,తాకట్టు పెట్టిన వస్తువు,పాతిపెట్టిన వస్తువు,అప్పు ఇచ్చిన ధనము తిరిగిచేతికిరావు.
మంగళవారమందు,సూర్య సంక్రమణదినమందు,హస్త నక్షత్రములో కూడిన ఆదివారమందు ఎవరి వద్ద అప్పు పుచ్చుకొనరాదు.అతని జీవితములో అప్పు తీరదు.
బుధవారము అప్పులు ఇవ్వరాదు.
ముఖ్యముగా వ్యాపారలగ్నమునకు ధనస్థానముగు ద్వితీయమున శుభగ్రహములు,1,5,9, శుభగ్రహములు,ఆరవశుద్ధి,11వ స్థానమున శుభగ్రహములున్న సంక్రమ సంపాదన,పాపగ్రహములున్న అక్రమసంపాదనలు వచ్చును.దస్రారంబాదులకు సహితము గ్రహబలము ప్రాముఖ్యమని గుర్తింపగలరు.
స్వాతి,పునర్వసు,మృగశిర,రేవతి,చిత్త,అనూరాధ,పుష్యమి,శ్రవణము,ధనిష్ఠ,శతభిషము,అశ్వని, నక్షత్రములందునూ,చరలగ్నములైన,మేష,కర్కాటక,తుల,మకరలగ్నములందు అప్పుఇచ్చుకోవాలి.అష్టమ శుద్దికూడా యుండునట్లు చూడాలి.ఫైనాన్స్ షాపులవారు పై నియమములను జాగ్రత్తపాటింప గోరుచున్నాను. *వివాహ నిశ్చయ తాంబూలములకు* :- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,తిథులు ఉభయపక్షములలోను శుక్ల పక్షములో ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమతిధులునూ,ఆది,బుధ,గురు,శనివారములును,శుభయుత లగ్నములు మంచివి.లగ్నాది 5,9 స్థానములందు పాపగ్రహములు లేకుండగను,శుభగ్రహ సంబంధముండునప్పుడు వివాహ నిశ్చయ తాంబూలములను స్వీకరించ వలయును.
*పెండ్లికూతురు,పెండ్లికుమారుని చేయుటకు*:- శుభతిధులతో కూడిన ఆది,బుధ,గురు,శనివారములలో పునర్వసు,పుష్యమి,అశ్వని,అనూరాధ,హస్త,చిత్త,స్వాతి,శ్రవణము,ధనిష్ఠ నక్షత్రములు మంచివి.పూర్వహ్నకాలము శ్రేయెాదాయకము.లగ్నది 5,9 స్థానములు శుద్ధికల్లిఉండాలి.సోమ,మంగళ వారములందు పెండ్లి కూతురును,పెండ్లికుమారుడుని చేయరాదు.పసుపుకొమ్ములను కొట్టరాదు.
సింహరాశియందు గురువు సంచరించు కాలమందు వివాహది శుభకార్యములు చేయరాదు.తోకచుక్క,భూకంపము,సూర్య,చంద్ర గ్రహణము వచ్చిన తరువాత 7 రోజులవరకు శుభకార్యములు చేయరాదు.
*పునర్వివాహము*:- భర్య మరణించినను,ఎడబాటు జరిగినను మరొకసారి వివాహము చేసుకొనుటనే పునర్వివాహము అందురు.చనిపోయిన భార్యయెుక్కసంతానము జీవించియున్న బేసిమాసము ,బేసిసంవత్సరము లందును,సంతానములేనివారు సరిసంవత్సరము,సరిమాసములందువివాహము జరుపుకోవాలి.
*వివాహ సూదకములు*:- తండ్రి మరణించిన 1 సంవత్సరకాలము,తల్లిమరణించిన 6 మాసములు,భార్య మరణించిన 3 మాసములు,పుత్రలుగాని,సోదరులుగాని మరణించిన1 1/2మాసములు,వారసులు మరణించిన 1 నెల రోజులు విడచిన తరువాత శుభముహూర్తమున వివాహము గావించుకోవాలి.
*పెండ్లికుమారై - ఆచారములు* :- పెండ్లికుమారై వివాహమైన మెుదటి సం" అత్తవారిఇంట జ్యేష్ఠమాసములో యున్న బావగార్కి,పుష్యమాసములో యున్న మామగార్కి,అధికమాసములో భర్తకు,క్షయమాసములోతనకు కీడుకలుగును.ఆషాడమాసములో అత్తవారింట ఉన్న అత్తగార్కి కీడు.చైత్రమాసములో పుట్టింట ఉన్న తండ్రికి కీడు.ముఖ్యముగా లోకాచారముగా ఆషాడ మాసము మాత్రమే ఆచరణలో ఉన్నది
*నవవధూ ప్రవేశము* :- పెండ్లి అయిన 6 వరోజునుండి 16 వరోజులలోపల గృహప్రవేశము చేయువారికి తిథివార నక్షత్రాదులతో వనిలేదు.అనంతరమైన బేసి మాసములు,బేసి సంవత్సరములు శుభదాయకము.విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ,తిధులనూ,సోమ,బుధ,శనివారములును,అశ్వని,రోహిణి,మృగశిర,పుష్యమి,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,శ్రవణ,మఖ,మూల,పునర్వసు,జ్యేష్ఠ,ధనిష్ఠ,రేవతి,నక్షత్రములునూ,వృషభ,మిధున,కర్కాటక,సింహ,వృశ్చిక,ధనస్సు,కంభ,మీనలగ్నములుమంచివి.లగ్నమునకు ద్వాదశ శుద్ధి ఉండాలి. *గర్భవతి స్త్రీని పురిటికి తెచ్చుటకు* :- పంచాంగా శుద్ధి అంటే తిథి ,వారము ,నక్షత్రము కరణము,మంచిగా ఉండుట.పంచాంగశుద్ధి గల దినములన 7వ నెలలోగాని,9వ నెలలోగాని అత్తవారి ఇంటినుండి పుట్టింటికి పురిటికి తీసుకొనిరావాలి.మెుదటి రెండు పురుళ్ళు పుట్టింట,మూడవ పురుడు అత్తవారింట పోయవలయును.
*బాలింత స్నానమునకు* :- పురుడయిన 11వరోజున చేయించవలయును.అట్లు సాధ్యపడనివారు ఆది,సోమ,బుధ,గురు,శుక్ర,శనివారములనూ,అశ్వని,రోహిణి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,స్వాతి,అనూరాధ,రేవతి నక్షత్రములలో బాలెంతలకు స్నానము చేయించాలి.
*వెండి,బంగారు,పాత్రలు వాడుటకు* :- బుధ,గురు,శుక్రవారములనూ,శుభ తిధులందునూ,అమృతయెాగకాలమందు,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,హస్త,చిత్త,స్వాతి,శ్రవణ,ధనిష్ఠ,శతభిష,రేవతి,పుష్యమి,అనూరాధ,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర, నక్షత్రములతోకూడి శుభయుత లగ్నములందు వెండి,బంగారు పాత్రలు వాడుటకు మంచివి.
*మంచమునకు నులక,నవ్వారీ అల్లుటకు*:- అదివారము లాభము,సోమవారము సుఖము,మంగళవారము అగ్నికిదగ్ధం,జ్వరపీడ,బుధవారము రోగము,గురువారము పుత్రలాభము,శుక్రవారము సౌఖ్యము,శనివారము మరణ కలుగును.
*మంచములు కుర్చీలు వాడుటకు* :- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి తిధులనూ,బుధ,గురు,శుక్రవారములును,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,అనూరాధ,శ్రవణము,రేవతి నక్షత్రములందు కొత్త కలపవస్తువులు ఉపయెాగించుటకు శుభము.
*శిశువును ఊయలలో పరుండబెట్టుటకు*:- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి తిథులందునూ,సోమ,బుధ,గురు,శుక్రవారము లందునూ,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,అనూరాధ,రేవతి నక్షత్రములు శుభదాయకములు.వృషభ,మిధున,కర్కాటక,కన్య,తుల,ధనస్సు,మీనలగ్నములు శుభదాయకములు.ముఖ్యముగా లగ్నమునకు అష్టమశుద్ధి ఉండవలయును.వర్జ్యములు,దుర్ముహూర్తములు లేనికాలము మంచిది.1,3,5 మాసములు మంచివి.ముఖ్యముగా 11వ రోజుగాని,21వ రోజుగాని,29 వ రోజుగాని ముహుర్త నిర్ణయము చేసి పెద్ద ముత్తైదువుతోగాని,శిశువుయెుక్క తల్లితోగాని శిశువు శిరస్సు తూర్పు దిక్కుగా ఉండునట్లు చూచి శిశువును ఊయలలో పరుండబెట్టవలయును.
*బాలెంతరాలు నూతిలో చేద వేయుటకు*:- శుభ తిధులందు,సోమ,బుధ,గురు,శుక్రవారములును,పునర్వసు,పుష్యమి,హస్త,మృగశిర,మూల,అనూరాధ,శ్రవణ నక్షత్రములును కలువ చూచి ప్రసవానంతరము 21,23,25,27,29వ రోజులలో బాలెంతరాలుచేత జలపూజ చేయించి నూతిలో నీరు తోడించవలయును.
*పండ్లదుకాణముల ప్రారంభమునకు* :- రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,శ్రవణము,ధనిష్ఠ,పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రములును,సోమ,బుధ,గురు,శుక్రవారములు.శుభగ్రహయుత లగ్నములు శ్రేయెాదాయకము.
*స్త్రీలు క్రొత్తకాటుక వాడుటకు* :- ఆది,శుక్ర,శనివారములును,అశ్వని,చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ,ధనిష్ఠ,రేవతి నక్షత్రములందు పూర్వాహ్నకాలమందు శుభదాయకము.
*స్త్రీలు ఆభరణములు ధరించుటకు* :- అశ్వని,హస్త,చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ,ధనిష్ఠ,రేవతి నక్షత్రములు,బుధ,గురు,శుక్రవారములందు ఉదయకాలమున వెండి,బంగారు నగలు మరియు రత్నాభరణములు,నూతన వస్త్రములు ధరించుటకు మంచిది.
*ఆభరణములు ధరించరాని నక్షత్రములు* :- రోహిణి పునర్వసు.పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర నక్షత్రములందును,మంగళవారమునందు సౌభాగ్యవతియగు స్త్రీ నూతన వస్త్రములు,భూషణములు ధరించకూడదు.శనివారము దొంగభయము,సోమవారము మన్నికగా ఉండదు.
*శిశువును ఇల్లు కదుపుటకు* :- విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి తిధులునూ,అశ్వని,రోహిణి,పునర్వసు,పుష్యమి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,అనూరాధ,శ్రవణము,ధనిష్ఠ,శతభిషము,రేవతి నక్షత్రములు,మేష,వృషభ,కర్కాటక,తుల,ధనస్సు,మీన లగ్నములు,సోమ,బుధ గురు,శుక్రవారములు శుభదాయకము.
*శిశువునకు నేలపై కూర్చుండ బెట్టుటకు* :- 1 1/4 మానెడు ధాన్యము రాశిగా పోసి దానిపైనూతన వస్త్రమువేసి 5వ నెలలో శిశువపను దానిపై కూర్చుండబెట్టవలయును.పెద్దలచే ఆశీర్వాదము చేయించవలయును.
శుభతిధులతో కూడిన అశ్వని,మృగశిర,పుష్యమి,జ్యేష్ఠ నక్షత్రములును,సోమ,బుధ,గురు,శుక్రవారములు శ్రేయెాదాయకము.
*శిశువుకు సూర్యచంద్రల దర్శనము* :- శిశువు జన్మించిన 3వ నెలలో మంచి తిథి వార నక్షత్రములలో శిశువుకు సూర్య చంద్రులను చూపాలి.
శుక్లపక్షములో ప్రాతః కాలమున సూర్యుని చూపాలి.శుక్లపక్షమున రాత్రి మెుదటి జాములో చంద్రదర్శనము చూపాలి.ముఖ్యముగా తొలిసారి క్షీణచంద్రుని,అస్తమిస్తున్న సూర్యుని చూపరాదు.
*కన్యలకు ముక్కుకుట్టుటకు* :- అశ్వని,మృగశిర,పునర్వసు,పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,స్వాతి,శ్రవణ,ధనిష్ఠ,శతభిషము,రేవతి నక్షత్రములను,శుక్లపక్షమున శుభతిథులందు ముక్కు కుట్టవలయును.
*ఉద్యోగములో చేరుటకు* :- అశ్వని,హస్త,పుష్యమి,మృగశిర,చిత్త,అనూరాధ,రేవతి నక్షత్రములును,బుధ,గురు,శుక్రవారములును,రవి,కుజులు 10,11స్థానము లందున్నప్పుడు చేరురుట మంచిది అట్లాగే గుమస్తాలను చేర్చుకొనువారు కూడా ఈ నియమములను పాటించుట మంచిది.
*పరుండుటకు మంచి దికికులు* :-దక్షిణ శిరస్సు ధనలాభము,పడమర శిరస్సు సంపద,తూర్పు శిరస్సు సుఖము,ఉత్తర శిరస్సు హానికల్లించును.పరాయి ఇంట్లో పడమర,తన ఇంట్లో దక్షిణము శిరస్సు శ్రేయెాదాయకమని పెద్దల నానుడి.
*భోజన విధికి* :- తూర్పుముఖముగా కూర్చుని భుజించిన దీర్ఘాయువు,దక్షిణమున కీర్త,పడమర భాగ్యవృద్ధి,ఉత్తర జ్ఞానము కలుగును.
*నెల పురుడు* :- మగ పిల్ల పుట్టిన 30 దినములు,ఆడపిల్లలు పుట్టిన 40 దినములు నెల పురుడు ఉండును.
*ఔషధము సేవించుటకు* :-4,6,8,13,30 తిధులు కూడదు.మిగతా తిధులలో ఆది,సోమ,గురువారములు,రేవతి,అశ్వని,పునర్వసు,హస్త,శ్రమణము,ధనిష్ఠ,అనూరాధ,మృగశిర నక్షత్రములు శుభదాయకములు.
*పెండ్లిపీట* :- పెండ్లిపీట 6 అంగుళములు ఎత్తు,37 అంగుళములు పొడవు 5 అంగుళముల వెడల్పు కల్గి ఉండవలెను.
*శస్త్రచికిత్సలకు* :- శస్త్రచికిత్స చేయుటకు శుక్లపక్షము మంచిది.పూర్ణిమ తిధియందు అపరేషన్ చేయరాదు.మంగళ,శనివారములు,చవితి,నవమి,శుద్ద,చతుర్ధశి తిధులందు,ఆర్ధ్ర,జ్యేష్ఠ,అశ్రేష,మూల నక్షత్రములందు మంచిది.లగ్నమునకు అష్టమశుద్ధి కల్గిఉండవలయును.కుజుడు బలవంతుడై ఉండగా శస్త్ర చికిత్స చేయించ వలయును.చంద్రుడు జన్మరాశియందున్నప్పుడు,పాపగ్రహక్రాంత యున్నప్పుడు,చంద్రస్థిత నక్షత్రమునకు పాపగ్రహక్రాంత యున్నప్పుడు ప్రారంభించరాదు. *ఇంట మెుండిచెయ్యి మెులుచుట* :- ఇంటిలో పుట్టే ఒకరకమైన పుట్టలను మెుండిచెయ్యిపుట్టింది అటారు.వీటిలో రెండురకములు.నలుపురంగు కలది.రామహస్తము,ఎఱుపురందుకలది రావణహస్తము,రామహస్తము మేలు,రావణ హస్తము కీడుగా గుర్తించేది.ఈశాన్య ఉత్తర దిశలలో మెులచిన భార్యకు కీడు,వాయవ్యము పశుహని,పడమర మృత్యవు,నైరుతి సంతానహాని,ఆగ్నేయము అగ్నిభయము,దక్షిణము దురదృష్టము తూర్పు యజమానికి కీడుగా గుర్తంచి వెంటనే తొలగించుకోవాలి.శక్తిచాలనివారు పురోహితులతో శాంతులు చేసుకోవాలి.
*క్రొత్త వాహనములు వాడుట మెుదలిడుటకు*:- విదియ,తదియ,పంచమి,సత్తమి,ఉభయ పక్షములందును,శుక్లపక్ష ఏకాదశి,త్రయెాదశి తిధులు మంచివి.సోమ,బుధ,గురు,శుక్రవారములు మంచివి.రోహిణి,పునర్వసు,పుష్యమి,ఉత్తర,ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,జ్యేష్ఠ,శ్రవణ,రేవతి తారలు మంచివి.ముఖ్యముగా లగ్నమునకు అష్టమ శుద్ధికల్గి ఉండవలయును.
*యజ్ఞోపవీతధారణము* :- శ్రావణ పౌర్ణమినాడు,గ్రహణము విడిచిన తరువాత,పురిటిమైలకు శుద్ది అయిన తరువాత పాత యజ్ఞోపవీతమును త్యజించి క్రొత్త యజ్ఞోపవీతమును ధరించాలి.
*యజమాని సేవకులకు అచ్చుబాటు* :-యజమాని యెుక్కనామ నక్షత్రము లగాయితు సేవవకుని యెుక్క నామనక్షత్రము వరకు లెక్కించి ఆసంఖ్యను 4చే గుణించి దానిని 7చే భాగింపగా మిగిలిన సంఖ్య ధనమగును.సేవకుని నామనక్షత్రము నుండి యజమాని నామనక్షత్రము వరకు లెక్కించి 4చే గుణించి 7చే భాగింపగా మిగిలిన సంఖ్య ఋణమగును.ధనము హెచ్చుగా ఉన్నమేలు.ఋణము హెచ్చుగా ఉన్న కీడు కలుగును.
*సర్వకార్యములకు విడువ వలసినవి* :-సర్వకార్యములకు జన్మనక్షత్రములు,జన్మమాసము,జన్మతిధి,వ్యతీపాతయెాగములు,భద్రవకరణములు,వైధృతియెాగములు,అమావాస్య,మాతపిత మరణదనమునాటి తిధి,క్షయవృద్ధితిధి అధికమాసము,పాత,సూర్యచంద్రల సంక్రాంతి,విష్కంభము,వజ్రము,పరిఘాయెాగము,శాల,అతిగండ,వ్యాఘాతయెాగ దినములు.
*సకేశ విధవస్త్రీని పరామర్శ* :- వర్జ్యము,దుర్ముహూర్తములు,పంచపర్వములు,మంగళ,గురు,శుక్రవారములు వదలి మిగిలి కాలమందు కేశఖండన చేయని స్త్రీని తాను భుజించిన తరువాత వెళ్ళి పరామర్శించవచ్చును.ఇందు విషయములో ద్విపాద,త్రిపాద నక్షత్రములను విచక్షణ చేయవలయును.
*కేశఖండన చేసిన విధవస్త్రీని పరామర్శ* :- జుట్టు కత్తిరించిన విధవాస్త్రీని ద్విపాద,త్రిపాద,ధనిష్ఠాపంచక నక్షత్రములందు చూడరాదు.
అనుకొనని రీతిలో చూచిన పక్షములో వెంటనే సూర్యదర్శనము చేసుకోవాలి.మబ్బులు పట్టి కానరానిచో సూర్యభగవానుని స్మరించుకోవాలి.
రాత్రికాలములో అయిన అగ్న దర్శనము,దీపము చూడాలి,సాధ్యపడనిచో అట్టివానిని స్మరించాలి. 🙏🙏🙏🙏🙏