⛤ మూఢమి ⛤
ప్ర. మూఢమి అంటే ఏమిటి ? మూఢాలు ఎందుకు వస్తాయి ? మూఢాల వలన సమస్యలు ఏమిటి ?
జ . మూఢాలు అంటే అశుభ దినాలు , అశుభ రోజులు .చీకటి రోజులు , రోజులు చెడు దినాలు . శుభ కార్యాలు చేసు కోవడానికి వీలు కాని రోజులు . మంచి రోజులు కావు అని అర్థం . మూఢాలు అంటే ఖచ్చితంగా విడవదగిన కాలం అని అర్ధం .
మూఢాలు రెండు రకాలు . అవి ఒకటి గురు మూఢమి , రెండవది శుక్ర మూఢమి. మూఢాల ను మౌఢ్యములు అని కూడా అంటారు .
సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా చెప్పాలంటే , గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడే దానిని గురు మూఢమని . అలానే శుక్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చి నప్పుడు ఏర్పడే దానిని శుక్ర మూఢమని అంటారు .
దీనినే సాంగత్వ దోషమని అంటారు . శుభ గ్రహాలు అస్తాంగత్వంలో ఉన్నపుడు మూఢమి వస్తుంది . సూర్యునికి దగ్గరగా గురు , శుక్రులు వచ్చి నప్పుడు , గురు శుక్రుల శక్తులు తగ్గి పోతాయి . బలం తగ్గి పోతుంది . బలహీన మౌతాయి . నీరస పడుతాయి . సన్నగిల్లుతాయి . వేయి వాట్స్ బల్బు ముందు , ఒక చిన్న క్యాండిల్ పెడితే , ఆ క్యాండిల్ శక్తి ఎంత మాములుగా ఉంటుందో , అలానే సూర్యుడి ముందు గురు శుక్రుల శక్తి అంత తక్కువగా , బల హీనంగా ఉంటుంది . అందుకే శుభ కార్యాలు ఆ రోజులలో జరుప కూడదు అని అంటారు .
అందువలన , ఈ కాలంలో శుభ కార్యాలు , "ముఖ్యంగా వివాహాది శుభ కార్యాలు జరుప కూడదు , లగ్నపత్రిక రాసుకోకూడదు . వివాహాలకు సంబంధించిన మాటలు మాట్లాడుకోరాదు . పుట్టు వెంట్రుకలు తీయకూడదు . గృహ శంకుస్థాపనలు చేయ రాదు . ఇండ్లు మారకూడదు." ఎందుకంటే ఇవన్నీ జీవితంలో ఒకే సారి చేయడం జరుగుతుంది . ఎవరయినా మంచి జరుగాలనే కోరు కుంటారు . అందుకని మూఢాలలో శుభ కార్యక్రమాలు చేయ కూడదు.
మనందరికీ తెలుసు , ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని . దివ్యంగా ఉండాలని . శక్తి మంతంగా ఉండాలని . గురు శుక్రులు బాగుంటేనే శుభాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయి . పెండ్లిల్లకు గురు బలం బాగుండాలి .
అయితే , మూఢాల లో అన్న ప్రాసన చేసుకోవచ్చు . ప్రయాణాలు చేయ వచ్చు .
రిపేర్లు చేసుకోవచ్చు . తప్పవు అనుకున్న పనులు చేసు కోవచ్చు . భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం , ఉద్యోగాలలో చేరడం , విదేశాలకు వెళ్ళడం అబ్బాయిలను అమ్మాయిలను చూడటం , వ్యాపారాలు మొదలు పెట్టడం , వెహికిల్స్ కొనుక్కోవడం , బట్టలు కొనుక్కోవడం మొదలైనవి చేసు కోవచ్చు .
మూఢాల కాలంలో శుభ కార్యాలు చేస్తే ఏమవుతుంది ?
మహర్షులు , జ్యోతిష్య పండితులు, అనుభవస్తులు శుభ కార్యాలు చేయ కూడదని చెప్పారే గాని , ఏమవుతుందో చెప్ప లేదు .
కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం , ఏదయినా అశుభం వినవల్సి రావచ్చు . కష్టం కలుగ వచ్చు , నష్టం వాటిల్ల వచ్చు.